
యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో యూనివర్సిటీ ఏ ర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ తెలిపినట్లు యూనివర్సిటీ సాధన సమితి కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. జిల్లాలో యూనివర్సిటీ ఆవశ్యకతను ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, వర్సిటీ సాధన పోరాటానికి మద్దతు తెలిపి పార్లమెంట్‌లో గళం వినిపించాలని కోరి నట్లు తెలిపారు. ఈ మేరకు ఎంపీ సానుకూలంగా స్పందించారని, పూర్తి మద్దతు ఉంటుందని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.