
ఆదివాసీ మహిళకు ప్రశంస
బోథ్: మండలంలోని బాబెర గ్రామానికి చెంది న స్వచ్ఛగృహి అవార్డుగ్రహీత ఆదివాసీ మ హి ళ ఆత్రం సుశీల ఉత్తమ ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో అవార్డులు పొందిన వా రిని సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా నుంచి సుశీలకు ఆహ్వానం అందింది. శనివారం భోపాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గతంలో ఈమె గవర్నర్ చేతుల మీదుగా స్వచ్ఛగృహి అవార్డు అందుకున్నారు.