
సీఎం దృష్టికి తీసుకెళ్లాను..
యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్ జిల్లావాసుల్లో సుదీర్ఘకాలం నుంచి వ్యక్తమవుతుంది. అది న్యాయబద్దమైంది కూడా. ఇదే అంశాన్ని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. జిల్లాలో విశ్వవిద్యాలయ ఆవశ్యకతను సీఎంకు వివరించాను. ప్రజల డిమాండ్, జిల్లా అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే. ఇందుకోసం నా వంతుగా అన్నివిధాలా కృషి చేస్తా. జిల్లాకు న్యాయం జరిగేలా చూస్తాను.
– వెడ్మ బొజ్జుపటేల్, ఎమ్మెల్యే, ఖానాపూర్