
రాఖీ కట్టి.. శుభాకాంక్షలు చెప్పి
ఎమ్మెల్యే శంకర్‌కు రాఖీ కడుతూ..
తమ్ముడికి రాఖీ కడుతున్న అక్క
ఎంపీ గొడం నగేశ్‌కు రాఖీ కడుతున్న సోదరీమణి..
సోదర, సోదరీమణుల మధ్య ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ వేడుకలను జిల్లా వాసులు శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. రాఖీలు కట్టిన అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటామని సోదరులు అభయమిచ్చారు. ఎంపీ గోడం నగేశ్‌కు స్వగ్రామమైన జాతర్లలోని నివాసంలో ఆయన సోదరీమణులు కృష్ణకళ, కమలబాయిలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఆయన సోదరీమణులు రాఖీలు కట్టారు. నేరడిగొండలో ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ నివాసంలో ఆయన సోదరీమణులు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. – ఆదిలాబాద్/బజార్‌హత్నూర్

రాఖీ కట్టి.. శుభాకాంక్షలు చెప్పి

రాఖీ కట్టి.. శుభాకాంక్షలు చెప్పి

రాఖీ కట్టి.. శుభాకాంక్షలు చెప్పి