
కుమురంభీం స్ఫూర్తితో పని చేయాలి
ఆదిలాబాద్‌రూరల్: జల్, జంగల్, జమీన్ కోసం పో రాటం చేసిన కుమురంభీంను స్ఫూర్తిగా తీసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీలు పని చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను హీరా సుకా ఆది వాసీ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హీరా సుకా దేవస్థానం వద్ద శనివారం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నా రు. కుమురంభీం, రాంజీగోండ్, బీర్సాముండా వి గ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఆదివాసీలతో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేశారు. రక్షాబంధన్ సందర్భంగా ఆదివాసీ మహిళలు కలెక్టర్, ఎస్పీలకు రాఖీలు కట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు సి డాం రాంకిషన్, నాయకులు కుర్సేంగే తానాజీ, షె డ్మకి గోద్రు, గోడం లక్ష్మణ్, మెస్రం శంకర్, కుర్సేంగే యాదవ్‌రావ్, సుభాష్, మనోహర్, ప్రకాశ్, వనితబాయి, గీత, అనుసూయ, సంగీత పాల్గొన్నారు.
కలెక్టర్ రాజర్షి షా
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

కుమురంభీం స్ఫూర్తితో పని చేయాలి