
ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించాలి
● టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్
కైలాస్‌నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆది వాసీల కు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేస్తూ ఏజెన్సీలో గిరిజన యువతకు ఉపాధి అవకా శాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని టీఏజీఎస్, టీఏవీఎస్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను వనవాసీలుగా చిత్రీ కరించేందుకు చూస్తుందన్నారు. ఆదివాసీలు వనవాసీలు కాదని, ఈ దేశ మూలవాసులు అనే విషయాన్ని గ్రహించాలన్నారు. అలాగే ఆదివాసీ లను అడవికి దూరం చేసే విధానాలు మానుకోవాలన్నా రు.ఏజెన్సీలో జీవో3ను పునరుద్ధరించాలని, 1/70, పిసా, చట్టాలను పక్కాగా అమలు చేయాలని డి మాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.కార్యక్రమంలో జన విజ్ఞాన వేది క రాష్ట్ర కార్యదర్శి నూతల రవీందర్ రెడ్డి, వ్యవసా య కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, టీఏవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం తనుష్, నాయకులు ఉయిక విష్ణు, మడవి నాగోరా వ్, కొట్నాక్ పుష్పలత, కొట్నాక్ సక్కు, కుమ్ర భీంరావు, నర్మద, మానిక్‌రావు పాల్గొన్నారు.