
● యూనివర్సిటీ సాధనకు అన్ని విధాలా ప్రయత్నిస్తాం ● జిల్ల
జిల్లాలో విశ్వవిద్యాలయ సాధన కోసం ఈ ప్రాంతవాసులు గొంతెత్తి నినదిస్తున్నారు. ‘సాక్షి’ డిబెట్‌తో ఏర్పడిన యూనివర్సిటీ సాధన సమితి ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణతో ముందడుగు వేసింది. ఉద్యమబాట పట్టింది. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఇప్పటి వరకు జరిగిన నష్టంపై విద్యార్థులు, నిరుద్యోగులకు అవగా హన కల్పిస్తోంది. వర్సిటీ ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతోంది. విద్యావంతులు, మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతుండగా.. ప్రజాప్రతినిధులు సైతం అండగా ఉంటామంటున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో తాము భాగస్వాములమవుతామని పేర్కొంటున్నారు. వర్సిటీ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు.
– కై లాస్‌నగర్/బజార్‌హత్నూర్