
No Headline
గాలివాన బీభత్సం
తాంసి మండలంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడగా, ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. కప్పర్లలో ఓ ఇంటిపై వేపచెట్టు విరిగిపడింది. హస్నాపూర్‌లో పలు ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. పొన్నా రి శివారులో 33కేవీ విద్యుత్ లైన్‌లో స్తంభం ఇన్సులేటర్ విరిగిపోగా కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. సిబ్బంది రాత్రిపూట వాటిని తొలగించి కరెంట్ సరఫరా పునరుద్ధరించారు. బోథ్ మండలంలోని హనుమాన్‌నగర్‌లో పలు ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయా యి. ఓ ఇంటి గోడ కూలిపోయింది. మండల కేంద్రంలో విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మ పడింది. – తాంసి/బోథ్

No Headline

No Headline