
కారు బైక్ ఢీ.. ఒకరి దుర్మరణం
లోకేశ్వరం: మండలంలోని మొ హళ ఎక్స్ రోడ్డు వద్ద కారు బైక్ ఢీకొన్న ఘటనలో భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కత్తి సంతోష్ (45) మృతి చెందాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. భై ంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కత్తి సంతోష్ శుక్రవారం సాయంత్రం తన బైక్‌పై లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలోని బంధువు ల ఇంటికి బయలుదేరాడు. ఇతడి బైక్.. నందిపేట్ మండలం బద్గుణ నుంచి ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు మండలంలోని మొహళ ఎక్స్ రోడ్డు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సంతోష్ తలకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే అంబులెన్స్‌లో నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. సంతోష్‌కు భార్య నర్సవ్వ, కుమారుడు అఖిలేశ్, కుమార్తె అపర్ణ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై తెలిపారు.