సర్పంచ్‌లకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లకు శిక్షణ

Jan 4 2026 10:49 AM | Updated on Jan 4 2026 10:49 AM

సర్పంచ్‌లకు శిక్షణ

సర్పంచ్‌లకు శిక్షణ

● ఈ నెల 21 నుంచి 28 వరకు.. ● పల్లె పాలనపై అవగాహన ● ఆదిలాబాద్‌, ఉట్నూర్‌లో ఏర్పాట్లు

కై లాస్‌నగర్‌: దాదాపు రెండేళ్ల తర్వాత పంచాయతీ నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇందులో భాగంగా ఎన్నికై న సర్పంచ్‌లకు పల్లెపాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీ ణాభివృద్ధి శాఖ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదనుగుణంగా ఆ శాఖ జిల్లా అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 50 మంది చొప్పున ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం వివిధ స్థాయిల్లోని 8 మంది అధికారులను మాస్టర్‌ ట్రైనర్లుగా ఎంపిక చేశారు. వీరు హైదరాబాద్‌లో శిక్షణ పొందిన అనంతరం జిల్లాలో ఈ నెల 21 నుంచి 28వరకు ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ వేదికల్లో సర్పంచ్‌లకు శిక్షణనివ్వనున్నా రు. శిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించేందు కోసం జిల్లాకు పత్యేకంగా ఓ లైజన్‌ అధికారిని నియమించారు. ఆయన జిల్లాకు చేరుకుని ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

8మంది టీవోటీల ఎంపిక

పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ఎనిమిది మంది జిల్లా అధికారులను ట్రైనర్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ (టీఓటీ) లుగా ఎంపికచేశారు.ఇందులో ఆదిలాబాద్‌, ఉట్నూ ర్‌ డీఎల్‌పీలు, ఉట్నూర్‌, బోథ్‌ ఎంపీడీవోలు, ఇంద్రవెల్లి, బేల ఎంపీవోలతో పాటు మరో ఇద్దరు ఏపీడీలు ఉన్నారు. వీరంతా ఈ నెల 5 నుంచి 9వరకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థకు చెందిన కేంద్రంలో రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందనున్నారు. ఐదు రోజుల శిక్షణ అనంతరం వారు జిల్లాకు చేరుకుని సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తారు.

రెండు వేదికల్లో శిక్షణ

జిల్లాలోని సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు రెండు వే దికలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్‌ రెవెన్యూ డివి జన్‌ పరిఽధిలోని సర్పంచ్‌లకు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో, ఉట్నూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని సర్పంచ్‌లతో పాటు సిరికొండ మండల సర్పంచ్‌లకు ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో గల యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (వైటీసీ)లో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 50 మందికి శిక్షణనిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో రోజు రెండు బ్యాచ్‌లు కొనసాగుతాయి. ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించే శిక్షణకు హాజరయ్యే సర్పంచ్‌లు ఆయా వేదికల్లోనే బస చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని గ్రా మీణాభివృద్ధి శాఖలో పనిచేసే డీఎల్‌పీవో శ్రీని వాస్‌ను జిల్లాకు లైజన్‌ అధికారిగా నియమించారు. ఆయన శుక్రవారం జిల్లాకు చేరుకుని పంచాయతీ అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు.

విధులు, బాధ్యతలపై శిక్షణ

నూతన సర్పంచ్‌లకు తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం పంచాయతీ అధికారాలు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే గ్రామ సభలు, పంచాయతీ సమావేశాల ని ర్వహణను వివరించనున్నారు. ప్రధానంగా గ్రామాల్లో కీలకమైన పారిశుద్ద్యం, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యంపై అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వా ల నుంచి వచ్చే నిధుల వినియోగం, చేపట్టనున్న పనులు, పన్నుల వసూళ్లు, జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం అమలు, ఉపాఽధి అవకాశాలు ఆర్థి కాభివృద్ధిలో పంచాయతీల పాత్ర, వ్యవసాయం, సేంద్రియ సాగు, ఈ అప్లికేషన్‌, జనన, మరణాల నమోదు వంటి 24 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

శిక్షణకు అన్ని ఏర్పాట్లు ..

కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో ఈ నెల 21 నుంచి 28వరకు ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ వేదికలుగా ఇవ్వనున్న శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. టీవోటీలు హైదరాబాద్‌లో శిక్షణ పొంది వచ్చాక జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులను నిర్వహిస్తాం. సర్పంచ్‌ల శిక్షణ పూర్తయ్యాక ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సైతం

ఉంటుంది.

– జి.రమేశ్‌, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement