వ్యసనంతో భవిష్యత్తు ప్రశ్నార్థకం ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు ఐపీఎల్ ప్రారంభంతో జిల్లాలో మరింత జోరుగా.. ఇటీవల ఇచ్చోడలో పది మందిపై కేసు
గుడిహత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడి కుటుంబం వ్యవసాయ భూమిని విక్రయించడంతో లక్షల్లో డబ్బులు వచ్చాయి. తల్లిదండ్రులు కొన్ని కుమారుడి అకౌంట్లో జమ చేశారు. అతడు ఆన్‌లైన్ గేమ్స్‌తో పాటు క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టడం మొదలుపెట్టాడు. దాదాపు రూ.15లక్షల వరకు పోగొట్టుకున్నాడు. వాహనాలు సైతం తాకట్టు పెట్టాడు. ప్రస్తుతం ఆ యువకుడి ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది.
ఆదిలాబాద్‌టౌన్: బెట్టింగ్‌తో కొందరి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. గెలిచిన వారు అత్యాశతో మళ్లీ డబ్బులు పెడుతూ పొగొట్టుకుంటున్నారు. ఓడిన వారు అప్పుల్లో కూరుకుపోతున్నా రు. ముఖ్యంగా యువత ఈ మాయలో పడి జీవి తాలు నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు సైతం జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఆన్‌లైన్‌లో గేమ్ నుంచి మొదలైన వ్యసనం తర్వాత బెట్టింగ్స్‌కు దారి తీస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమి తం కాగా ఇప్పుడు పల్లెలకు సైతం పాకింది. ప్రస్తు తం ఐపీఎల్ షురూ కావడంతో క్రేజ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది దందాగా మార్చుకున్నారు. యువతతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు బెట్టింగ్‌కు ఆకర్షితులవుతున్నారు. తెలి సీ తెలియని వయస్సులో ఉచ్చులో పడి ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నారు. కూలీనాలి చేసుకునే వారు, ప్రైవేట్ ఉద్యోగులు సైతం బాధితులుగా మారుతుండడం గమనార్హం.
పోలీసుల ఫోకస్..
ఆన్‌లైన్ బెట్టింగ్స్‌పై పోలీసులు ఫోకస్ పెట్టారు. సీసీఎస్ సిబ్బంది కన్నేసి ఉంచారు. ఎక్కడైనా ఆన్‌లైన్ బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం అందిస్తే వెంటనే అప్రమత్తమవుతున్నారు. వారిపై కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధం ఉంది. ఇటీవల ప్రభుత్వం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు జిల్లాలో అవగాహన కార్యక్రమాలతో పాటు అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధం ఉన్నప్పటికీ యాప్‌ల ద్వారా లొకేషన్ చేంజ్ చేస్తూ వీటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని యువత ఈ నిషేధిత యాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్స్ కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యల్లో వెబ్‌సైట్లు, యాప్‌లలో ఇది నడుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జట్టులో ఆటగాళ్ల తీరు, మ్యాచ్ గెలిచేదెవరు.. ఫోర్, సిక్స్.. ఇలా అన్నింటికి వేల రూపాయల్లో బెట్టింగ్ పెడుతున్నారు. యువకులతో పాటు పలు వ్యాపారులు సైతం ఈ మోజులో పడి అప్పుల పాలవుతున్నారు. ఈ క్రేజ్‌ను దందాగా మలుచుకొని కొంత మంది బెట్టింగ్ యాప్‌ల ద్వారా తమ జేబులు
నింపుకుంటున్నారు.


