మొదటి విడతలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ జిల్లాకు 2లక్షల 9వేల జవాబు పత్రాలు మూడు విడతల్లో స్పాట్ వాల్యూయేషన్
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో స్పాట్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇదివరకు పది పరీక్షలు ముగిసిన తర్వాత మూల్యాంకనం జరిగేది. ఈ ఏడాది మార్చి 14 నుంచి మొదలై ఏప్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. నెల రోజుల పాటు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చదువుకునేందుకు ప్రతీ పరీక్షకు మూడు, నాలుగు రోజుల పాటు సమయం ఉంచారు. పరీక్షలు అయ్యేవరకు ఆలస్యం కానుండడంతో ప్రస్తుతం ముగిసిన పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకన కేంద్రానికి వచ్చాయి. మూడు విడతల్లో నిర్వహించనున్నారు.
జిల్లాకు 2లక్షల 9వేల పేపర్లు..
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కో సం 15 జిల్లాలకు సంబంధించిన జవాబు పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని కోడింగ్ చేసి అధికా రులు వాల్యూయేషన్‌కు ఇస్తున్నారు. తెలుగుకు సంబంధించి పేపర్లు 34,056, ఉర్దూ 4946, హిందీ 36,089, ఇంగ్లీష్ 15,321 పేపర్లు వచ్చాయి. వీటితో పాటు గణితం జవాబు పత్రాలు కూడా వచ్చి నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటి రోజు బుధవారం తెలుగు, ఇంగ్లిష్, హిందీ మూల్యాంకనం జరిగింది. గురువారం నుంచి గణితం షురూ కానుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
టీచర్ల నియామకం..
మూల్యాంకనం కోసం 42 మంది సీఈలను, 253 మంది ఏఈలను, 86 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. మొత్తం 381 మంది స్పాట్‌కు హాజరు కావాల్సి ఉండగా 295 మంది హాజరయ్యారు. వీరిలో 37 మంది సీఈలు, 221 మంది ఏఈలు, 37 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఐదుగురు సీఈలు, 32 మంది ఏఈలు, 49 మంది స్పెషల్ అసిస్టెంట్లు మొత్తం 86 మంది ఉపాధ్యాయులు స్పాట్‌కు హాజరు కావాల్సి ఉంది. కాగా మొదటి విడతలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 9 వరకు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, రెండో విడత ఈనెల 10 నుంచి 17 వరకు భౌతిక, రసాయన, జీవశాస్త్రం, మూడో విడత ఈనెల 17 నుంచి 23 వరకు సాంఘిక శాస్త్రం మూల్యాంకనం జరగనుంది. ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా స్పాట్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించామని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్ తెలిపారు. స్పాట్‌ను పకడ్బందీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.


