ఇచ్చోడ: మండలంలోని ముఖరా(కె)ను ఐఎస్ వో ఆడిటర్ శివయ్య బుధవారం సందర్శించా రు. గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయాల ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఇంకుడుగుంతలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈనెల 6నబజార్‌హత్నూ ర్ మండలంలోని పిప్రి గ్రామానికి సీఎం వస్తు న్న సందర్భంగా ఐఎస్‌వో సర్టిఫికెట్ జారీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీవో అతుల్ కుమార్, సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.


