ఏర్పాట్లు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లు వేగవంతం చేయాలి

Apr 2 2026 7:35 AM | Updated on Apr 2 2026 7:35 AM

● కలెక్టర్‌ రాజర్షిషా ● పిప్రి వద్ద సీఎం సభాస్థలి పరిశీలన

బజార్‌హత్నూర్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న పిప్రి గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఉంటుంద ని, ఈమేరకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని కలెక్ట ర్‌ రాజర్షిషా అన్నారు. ఎస్పీ అఖిల్‌ మహజన్‌తో కలి సి సభాస్థలిని, హెలీప్యాడ్‌ను బుధవారం పరిశీలించారు. అనంతరం రైతువేదికలో జిల్లా, మండలస్థాయి అధికారులతో సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు. సభకు సుమారు 30వేల నుంచి 50వేల మంది హజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్‌ జాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌, మండల అధ్యక్షులు జల్కే పాండురంగ్‌, అశ్విన్‌రెడ్డి, జంగుబాబు, భూమన్న, సర్పంచ్‌ కృష్ణకాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ విశాల్‌, లక్ష్మారెడ్డి, పోతన్న, సత్యనారాయణ, విఠల్‌, కిషన్‌, స్వామి, గణేశ్‌ పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ఇచ్చోడ: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. మండలంలోని కామగిరిలో ఇందిరమ్మ ఇంటిని బుఽ దవారం ప్రారంభించి గ్రామస్తులతో మాట్లాడారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, తహసీల్దార్‌ ఇమ్రాన్‌, ఎంపీడీవో రవీందర్‌, జీపీవో కరుణకర్‌రెడ్డి, హౌసింగ్‌ ఏఈ హర్ష, సర్పంచ్‌ సుప్రియ, గ్రామస్తులు పాల్గొన్నారు.

జనగణనకు సంసిద్ధులు కావాలి

కై లాస్‌నగర్‌: జనగణన–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధులు కావాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. జిల్లాలోని తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో బుధవారం గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. జనగణన ప్రతీ దశను కచ్చితంగా సమయపాలనతో పూర్తి చేయాలన్నారు. గృహ సముదాయాల గుర్తింపు, బ్లాకుల విభజన, డేటా నమోదు వంటి అంశాలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలని సూచించారు. ఫీల్డ్‌స్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ, అవగాహన కల్పించాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్‌ ఎస్‌. రాజేశ్వర్‌, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులున్నారు.

దివ్యాంగులకు మెరుగైన వైద్యసేవలు

ఆదిలాబాద్‌టౌన్‌: దివ్యాంగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామ ని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. రిమ్స్‌లో దివ్యాంగులు తమ వైకల్యాన్ని నిర్ధారించుకునేందుకు ఏర్పాటుచేసిన వైకల్య మూల్యాంకన కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఇప్పటివరకు వైక ల్య నిర్ధారణ పత్రాల కోసం దివ్యాంగులు అనే క ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలి పారు. ఇకపై ఆ ఇక్కట్లు తలెత్తకుండా రిమ్స్‌లోని క్రిటికల్‌ కేర్‌లో సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మెడికల్‌ సూపరింటెండెంట్‌ దీపక్‌ పుష్కర్‌, వికలాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement