సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం
ఆదిలాబాద్‌టౌన్: సావిత్రిబాయి పూలే సేవలు చి రస్మరణీయం అని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో ఎస్. రాజేశ్వర్ అన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి పురస్కరించుకుని పలువురు మహిళా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధి కారి కార్యాలయంలో శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు విద్యావంతులైనప్పుడే ఆ కుటుంబంతో పాటు సమజాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అణగారిన, పేద, బడుగు, బలహీన వర్గాల ప్ర యోజనాలు, వారిని చదివించేందుకు తొలి ఉపాధ్యాయినిగా సావిత్రీబాయి పూలే చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో ఓపెన్ స్కూ ల్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ కుమార్, డీసీ ఈబీ సెక్రెటరీ గజేందర్, విద్యాశాఖ ఏడీ వేణుగోపాల్ గౌడ్, పాఠ్యపుస్తకాల మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


