రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ గణిత ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శనివారం ప్రతిభాపాటవ పరీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ నంబర్–1 ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరీక్షకు తెలుగు మీడియంలో 54మంది, ఆంగ్ల మాధ్యమంలో 56 మంది, ఉర్దూ మీడియంలో 34 మంది హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 12, మందిని రాష్ట్రస్థాయి పరీక్షకు ఎంపిక చేశారు. వీరిలో ఎ.వర్షిణి, సాయిచరణ్, నక్షత్ర, గోవింద్, తృప్తి, వంశీకృష్ణ, ప్రనుష్, రితీష్, మనీష్, ఆఫ్రా ఖానమ్, అంజూమ్, నింసా ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 6న గజ్వేల్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు జిల్లా సైన్స్ అధికారి భాస్కర్ తెలిపారు. ఇందులో టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, హెచ్‌ఎం నీలాదేమి, స్వప్న, శశిధర్‌రెడ్డి, సుదర్శన్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.


