ఆదిలాబాద్: జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 19న నేరడిగొండ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో అండర్–14, 17 బాలబాలికల జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్, నెట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కాంతారావు ప్రకటనలో తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తమ సొంత గ్లౌ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎంపిక పోటీలకు ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు చొప్పున క్రీడాకారులు హాజరయ్యేలా వ్యాయామ ఉపాధ్యాయులు చూడాలని కోరారు. అర్హత కలిగిన క్రీడాకారులు సంబంధిత వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 11గంటలకు పోటీల ఆర్గనైజర్ ఎన్.స్వామి, కవితకు రిపోర్ట్ చేయాలని సూచించారు.