Telangana News: వెంకూర్‌లో తోడేలు కలకలం..! ఒక్కసారిగా షాక్‌..!!
Sakshi News home page

వెంకూర్‌లో తోడేలు కలకలం..! ఒక్కసారిగా షాక్‌..!!

Sep 6 2023 12:50 AM | Updated on Sep 6 2023 7:34 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: మండలంలోని పాత వెంకూర్‌ శివారులోని వాగు సమీపంలో మంగళవారం యువకుడినూ, ఎద్దుపై దాడి చేసింది. స్థానికుల వివరాల మేరకు... వెంకూర్‌ గ్రామానికి చెందిన రేకుల బద్రి, అతడి బావమర్ది శివతో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని పశువులను మేపుతున్నాడు. ఒకసారిగా తోడేలు బద్రిపై దాడిచేసింది. దీంతో అతడు చేతులతో పక్కకు పడేశాడు. దీంతో అక్కడే ఉన్న ఎద్దుపై దాడికి పాల్పడింది.

దీంతో బద్రి, శివ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు బద్రిని స్థానిక వైద్యశాలకు తరలించగా.. అవసరమైన మందులు లేకపోవడంతో నిర్మల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఆర్వో రేష్మ, ఎఫ్‌బీవో స్రవంతి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తోడేలు పాదముద్రలుగా అధికారులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement