breaking news
World Legends Pro T20 League
-
శిఖర్ ధవన్ మెరుపులు
వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ తొలి ఎడిషన్ టైటిల్‌ను దుబాయ్ రాయల్స్ ఎగరేసుకుపోయింది. గోవా వేదికగా నిన్న (ఫ్రిబవరి 5) జరిగిన ఫైనల్లో పూణే పాంథర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణే ఫాంథర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పాంథర్స్ ఇన్నింగ్స్‌లో ఉపుల్ తరంగ (55), మార్టిన్ గప్తిల్ (62), షేన్ వాట్సన్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ కీరన్ పోలార్డ్ 1, రాబిన్ ఉతప్ప 15, సమీవుల్లా షిన్వారి (4 నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో పియుశ్ చావ్లా 2, క్రిస్ మోఫు, పర్వేజ్ రసూల్ తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన రాయల్స్ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు మన్విందర్ బిస్లా (67), శిఖర్ ధవన్ (64) మెరుపు అర్ద సెంచరీలు చేసి రాయల్స్ గెలుపును ఖరారు చేశారు. మిగతా పనిని సమిత్ పటేల్ (2 నాటౌట్), అంబటి రాయుడు (29 నాటౌట్) పూర్తి చేశారు. పాంథర్స్ బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్, డ్వేన్ బ్రావోకు తలో వికెట్ దక్కింది. రాయల్స్ గెలుపుతో కీలకపాత్ర పోషించిన శిఖర్ ధవన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.కాగా, వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ ఈ ఎడిషన్‌తోనే అరంగేట్రం చేసింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొన్నాయి.గోవా వేదికగా జనవరి 26న మొదలైన ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరిగాయి. ఈ లీగ్‌లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్, ఇయాన్ మోర్గాన్, మార్టిన్ గప్తిల్, కీరన్ పోలార్డ్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొన్నారు. -
మొన్న పుజారా.. నిన్న శిఖర్ ధవన్
టీమిండియా తాజా మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, ఛతేశ్వర్ పుజారా లేటు వయసులోనూ చెలరేగిపోతున్నారు. అంతర్జాతీయ కెరీర్లు ముగిసాక కూడా వీరిద్దరూ సత్తా చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్టార్ క్రికెటర్లతో కలిసి వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో ఆడుతున్న ధవన్, పుజారా.. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లో తృటిలో సెంచరీలను కోల్పోయారు. ఈ టోర్నీలో గుర్‌గ్రామ్ థండర్‌కు ఆడుతున్న పుజారా దుబాయ్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. నిన్న మహారాష్ట్ర టైకూన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుయాబ్ రాయల్స్ తరఫున శిఖర్ ధవన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్, పుజారా ఈ టోర్నీలో సత్తా చాటడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు వేర్వేరు మ్యాచ్‌ల్లోనూ ఈ ఇద్దరూ చెలరేగిపోయారు. తలో హాఫ్ సెంచరీ సాధించి, తమతమ జట్ల విజయాలకు దోహదపడ్డారు.కాగా, వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ ఈ ఎడిషన్‌తోనే అరంగేట్రం చేసింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి.జనవరి 26న మొదలై పది రోజుల పాటు సాగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్, ఇయాన్ మోర్గాన్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.గోవా వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని రాజస్థాన్ లయన్స్, కీరన్ పోలార్డ్ నేతృత్వంలోని పూణే పాంథర్స్, గుర్కీరత్ సింగ్ మాన్ కెప్టెన్సీలోని ఢిల్లీ వారియర్స్, శిఖర్ ధనవ్ నేతృత్వంలోని దుబాయ్ రాయల్స్ సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇవాళే (ఫిబ్రవరి 3) ఈ సెమీస్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి సెమీస్‌లో రాజస్థాన్, పూణే.. రెండో సెమీస్‌లో ఢిల్లీ, దుబాయ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి సెమీస్ మధ్యాహ్నం 2:30 గంటలకు.. రెండో సెమీస్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
పుజారా ఉగ్రరూపం
టీమిండియా మాజీ క్రికెటర్, నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారా అంతర్జాతీయ కెరీర్ ముగిసాక తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. సహజంగా నిదానంగా ఆడే అతను.. శైలికి భిన్నంగా వేగంగా పరుగులు సాధించాడు. వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ ఇనాగురల్ ఎడిషన్‌లో గుర్‌గ్రామ్ థండర్స్‌కు ఆడుతున్న పుజారా.. నిన్న (జనవరి 28) దుబాయ్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తనలోని విధ్వంసకర యాంగిల్‌ను అభిమానులకు పరిచయం చేశాడు.201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి 14 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. అయితే దురదృష్టవశాత్తు 99 పరుగుల వద్ద (60 బంతుల్లో) మరో భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. మరో దురదృష్టమేమిటంటే.. పుజారా శైలికి భిన్నంగా చెలరేగినా, ఈ మ్యాచ్‌లో తన జట్టు గెలవలేకపోయింది. అతనితో పాటు కెప్టెన్ తిసారా పెరీరా (56 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించినా థండర్స్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. పియూశ్ చావ్లా (4-0-35-3) వికట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి థండర్స్‌ను దెబ్బకొట్టాడు. అంతకుముందు అంబటి రాయుడు (45), సమిత్ పటేల్ (65 నాటౌట్) రాణించడంతో దుబాయ్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.కాగా, వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ గోవా వేదికగా జనవరి 26న మొదలైంది. ఈ లీగ్‌లో ఇదే తొలి ఎడిషన్. ఇందులో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి.పది రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు. -
విండీస్ వీరుడి విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే శతకం
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ పేరిట భారత్‌లో అరంగేట్రం చేసిన ఈ లీగ్.. నిన్ననే (జనవరి 26) మొదలైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి.పది రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్ తలపడ్డాయి. ప్రారంభ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదైంది. ఢిల్లీ వారియర్స్‌కు ఆడుతున్న విండీస్ ఆటగాడు చాడ్విక్ వాల్టన్ కేవలం 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఫలితంగా అతని జట్టు దుబాయ్ రాయల్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. పీటర్ ట్రెగో (60), కిర్క్ ఎడ్వర్డ్స్ (41), అంబటి రాయుడు (36), కెప్టెన్ శిఖర్ ధవన్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూసఫ్ పఠాన్ (2), రిషి ధవన్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వారియర్స్ బౌలర్లలో సుభోత్ భాటి 3, హర్భజన్ సింగ్ 2, ఇసురు ఉడాన ఓ వికెట్ తీశారు.అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ సునాయాసంగా ఛేదించింది. చాడ్విక్ వాల్టన్ (62 బంతుల్లో 128; 14 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో వారియర్స్‌ను కేవలం 16.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఓపెనర్ శ్రీవట్స్ గోస్వామి (56) సహకరించాడు. వారియర్స్ కోల్పోయిన ఏకైక వికెట్ పియుశ్ చావ్లాకు దక్కింది.


