breaking news
venugopala swamy temple
-
ఆలయ గోపాలుడు : నమ్మితే.. పెళ్లి.. సంతానం!
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సాక్షాత్తూ ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడిగా ఈ భూమిపై ఉద్భవించిన పర్వదినం కృష్ణాష్టమి. ఈ శనివారం కృష్ణాష్టమి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్న కొన్ని వేణుగోపాల స్వామి ఆలయాల గురించి సంక్షిప్తంగా... ముందుగా హైదరాబాద్ పరిసరాలలోని ఆలయాల గురించి... శ్యాం మందిరం – కాచిగూడ, హైదరాబాద్హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్కి సమీపంలో గల శ్రీ కృష్ణమందిరానికే శ్యాం మందిర్ అని పేరు. ఈ మందిరం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నిత్యం స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.గోవర్ధనగిరి – కేపీహెచ్బీ కాలనీ, హైదరాబాద్హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో మలేసియాన్ టౌన్షిప్కి వ్యతిరేక దిశలో కొలువైన వేణుగో΄ాల స్వామి దేవాలయం ఒక గుట్ట పైన వెలసినది. గుట్టపైన స్వామి వారి విగ్రహం దొరకగా అక్కడే గుడి కట్టించారు. ఈ ప్రదేశాన్ని గోవర్ధనగిరి అని పిలుస్తారు.. ప్రతి నిత్యం స్వామి వారికి విశేషమైన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. పండుగలప్పుడు, కృష్ణాష్టమికి చాలా విశేషంగా ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గుట్ట పైన వెలసి ఉండడం వలన ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది.శ్రీ కృష్ణ దేవాలయం – బహుదూర్ పురా150 సంవత్సరాల పూర్వం ఈ దేవాలయాన్ని నిర్మించారు. నెహ్రు జంతు ప్రదర్శన శాలకు దగ్గరలో ఉన్న ఈ దేవాలయాన్ని కిషన్ బాగ్ దేవాలయం అని కూడా అంటారు. నిజాం దగ్గర వకీల్గా పని చేసిన రాజా రాం బహుదూర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఇక్కడ ఘనంగా పూజ కార్యక్రమాలు, రథ యాత్ర నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయంలో వెలసిన వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని కూడా పిలుస్తారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి సంతానం కోసం స్వామిని సేవించుకుంటారు. రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం – ఏదులాబాద్సికింద్రాబాద్కి సుమారు 30 కి.మీ. దూరంలో ఘటకేసర్ మండల కేంద్రానికి 5 కి.మీ. దూరంలో ఏదులాబాద్ గ్రామంలో వెలసిన క్షేత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం. శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం ఎంతో శక్తిమంతమైన ప్రాచీన క్షేత్రం. అందమైన రాజ గోపురం, ఆ గోపురం పైన రక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు, చక్కని శిల్పకళా సంపదతో ఎంతో రమణీయంగా ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రాకారం ఇక్కడ పూజాకార్యక్రమాలు జరుగుతాయి.శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దేవాలయం – రామడుగుకరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సుమారు 1200 వందల సంవత్సరాల పూర్వమే శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి 8 మంది భార్యలు మనకు దర్శనమిస్తారు. ఈ స్వామికి కూడా కల్యాణ వేణుగోపాలుడనీ, సంతాన వేణుగోపాలుడనీ పేరు. సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్ గ్రామం, కామారెడ్డి జిల్లాఈ దేవాలయంలో వెలసిన వేణుగోపాలస్వామి సంతాన వేణు గోపాల స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. ఎవరైతే ఈ క్షేత్రంలో స్వామి వారిని మనసా వాచా నమ్మి పూజిస్తారో వాళ్ళకి ఆ స్వామివారు మంచి సంతానాన్ని ప్రసాదిస్తారని ప్రతీతి. ఈ ఆలయంలో వెలసిన మరో సుందర విగ్రహం శ్రీ సుదర్శన పెరుమాళ్ వారిది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ స్వామికి అభిషేకం, హోమం వంటి దివ్యమైన పూజలు జరిపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్య అయిన తొలగి పోతుందనీ, శత్రునాశనం జరుగుతందనీ నమ్మకం!జగన్నాథ స్వామి దేవాలయం– చెన్నూర్చెన్నూర్లో పూజలందుకుంటున్న అతి పురాతన జగన్నాథ స్వామి దేవాలయం ఇది. ఇక్కడ ప్రవహించే గోదావరిని ఉత్తరవాహిని అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం. ఇది. గోదావరి నది పుట్టిన చోట నుంచి సముద్రంలో కలిసే వరకు ఎక్కడ లేని ప్రత్యేకత ఈ ్ర΄ాంతంలో ఉంటుంది.ఆంధ్రప్రదేశ్లో... మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయంకృష్ణాజిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది. ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు! ఆ స్వామి మహాత్మ్యమూ సామాన్యమైనది కాదు! వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. స్వామి వెనుక వున్న మకరతోరణంపై దశావతారాలు ఉన్నాయి. స్వామి పక్కన రుక్మిణీ సత్యభామలు దర్శనమిస్తారు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది. ఆ కారణంగా 2000 సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అయినా ఇప్పటికీపాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు.ఆలయ ప్రాంణంలో ఆంజనేయస్వామివారి ఉపాలయం కూడా ఉంది. మువ్వ పేరు వినగానే వేణుగోపాలస్వామి ఆలయమే కాదు, ఆ స్వామి మహత్తుతో అద్భుతమైన పదాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తుకు వస్తాడు. మొవ్వ వేణుగోపాలుడిని దర్శిస్తే ఎవరి జీవితమైనా తరించిపోతుందని చెప్పేందుకు క్షేత్రయ్య జీవితమే ఒక ఉదాహరణ. విజయవాడ నుంచి మొవ్వ కేవలం 50 కిలోమీటర్లే!హంసల దీవి శ్రీ వేణుగోపాల స్వామి వేయి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం కృష్ణా జిల్లాలోని హంసలదీవిలో ఉంది. అద్భుతమైన శిల్పకళ, చక్కటి కట్టడాలతో నిర్మించిన ఈ ఆలయం సముద్రపు అటుపోటులను తట్టుకునేలా ప్రాకారాన్ని నిర్మించారు. తూర్పు ముఖాన అద్భుతమైన రాజగోపురం ఉంటుంది. ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ వున్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై చెక్కిన రామాయణ ఘట్టాలు తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ఆలయం చుట్టూ ఎన్నో అందమైన శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఈశాన్యంలో పురాతన కళ్యాణమండపం కన్పిస్తుంది. ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తుల విశ్వాసం. ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘఛాయ లో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.మార్గం: కృష్ణాజిల్లా కోడూరు నుంచి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోనూ బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది.కుంతీ మాధవస్వామి ఆలయం, పిఠాపురంఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మహత్యా΄ాతకం నుంచి విముక్తి కోసం ఐదు ్ర΄ాంతాల్లో విష్ణ్వాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం. ఈ ఐదు క్షేత్రాల్లో మాధవ స్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం, ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం, పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి.మార్గం : పిఠాపురం రాజమండ్రికి 62 కిలో మీటర్లు, సామర్లకోటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధానమైన రైళ్లన్నీ పిఠాపురంలో ఆగుతాయి. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం ఉంది.వేణుగోపాల స్వామి దేవాలయం – మెళియాపుట్టిశ్రీకాకుళం జిల్లాలో వెలసిన పురాతన వేణుగోపాల స్వామి దేవాలయం మెళియాపుట్టి గ్రామంలో కొలువై ఉంది. టెక్కలికి 24 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలో గల ఆలయాన్ని గజపతిమహారాజు 1810 లో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆలయ నిర్మాణం, ఆలయంలో కొలువైన వేణుగో΄ాల స్వామి ఎంతో సుందరంగా దర్శనమిస్తారు. డోల పౌర్ణమి ఉత్సవాలు 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్ర ఖజురాహో అని కూడా పిలిచేవారట.. అక్కడ ఉన్న నిర్మాణ శైలి, గోడల పైన ఉన్న శిల్పాలు అలా ఉంటాయట.శ్రీ రాజగోపాల స్వామి దేవాలయం నరసపూర్నరసపూర్లో కొలువైన రాజగోపాలస్వామి దేవాలయం 18 వ శతాబ్దానికి చెందినదిగా శాసనాల ద్వారా తెలుస్తుంది. గోదావరి నదిలో విగ్రహం లభించగా దానిని తీసుకొని వచ్చి ప్రతిష్టించి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఆలయంలో కొలువైన కృష్ణుడిని కల్యాణ కృష్ణుడిగా పిలుస్తారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ రాజగోపాల స్వామిగా కొలువైనారు. ఈ దేవాలయంలో స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే పెళ్లిళ్లు త్వరగా అవుతాయని నమ్మకం. స్వామి అనుగ్రహంతో పెళ్లి కుదిరిన వారు దేవాలయ ఆవరణలోనే పెళ్లి చేసుకుంటారు. సమ్మోహన వేణుగోపాల స్వామి దేవాలయ–జూనం చుండూరు, గుంటూరుగుంటూరు జిల్లా జూనంచుండూరు గ్రామంలో వెలసిన సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో నల్లనిరూపుడైన స్వామి విగ్రహం సుమారు ఆరు అడుగులు పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో సుందర, సుమనోహరంగా దర్శమిస్తోంది. దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణమైనట్లు కథనం. దేవాలయంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంది. స్వామి వారి మూలవిరాట్ ప్రణవ స్వరూపంలో ఉండి ఆపై వేణుగోపాలునిగా స్వామి దర్శనమిస్తారు. దేశంలో మరెక్కడా ఇటువంటి భంగిమ ఉన్నటువంటి విగ్రహం ఉండదంటారు. ఆది ప్రణవ స్వరూపంలో చుట్టూ దశావతారాలు, సప్త్తరుషులు, వేణుగోపాలునికి ఇరుపక్కల రుక్మిణి, సత్యభామలు గోవులతో కొలువుదీరి ఉంటారు.ఈ స్వామిని సేవిస్తే కల్యాణం అవుతుందని, సంతాన, సౌభాగ్య సంపదలకు లోటుండదనీ ప్రతీతి.– డి.వి.ఆర్.భాస్కర్ -
వింత పక్షి
-
కళ్లు చెదిరే బంగారం, వెండి లెక్కలు.. కళ్లకు కానరావే!
వేలాది ఎకరాల భూములు, కేజీల కొద్దీ బంగారు, వెండి ఆభరణాలు.. వజ్ర వైఢూర్యాలు బొబ్బిలి వేణుగోపాల స్వామివారి సొంతం. ‘అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని’ అన్న చందంగా స్వామివారి ధూపదీప నైవేద్యాలకు దాతలు, భక్తులు సమర్పించే కానుకులపై ఆధారపడాల్సిన దుస్థితి. స్వామివారి ఆస్తుల లెక్కల గుట్టు విప్పేందుకు.. ఆలయానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. విచారణ కమిటీ వేసింది. ఆస్తులపై ఆరా తీయిస్తోంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: అపర కుబేరుడైన బొబ్బిలి వేణుగోపాల స్వామి వారికి అలంకరించే ఆభరణాలు ఎన్నో ఉండేవని పూర్వీకులు చెబుతుండే వారు. ఎంతో డబ్బు, వేల కోట్ల రూపాయల విలువైన భూములు, వందల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, కెంపులు, వైఢూర్యాలు, పచ్చలహారాలు ఉన్న స్వామివారికి అంతే స్థాయిలో మర్యాదలు జరిగేవి. ఆనాడు అనుభవించిన స్థాయిలో కనీసం ఒకటో వంతు కూడా ఇప్పుడు లేదంటే స్వామివారి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో స్వామికి 4011.16 ఎకరాల భూములుంటే.. కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా దాతలపై ఆధారపడాల్సి వస్తోందంటే దానికి ఆలయ ధర్మకర్తలే సమాధానం చెప్పాలి. ఈ లెక్కలే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తేలుస్తోంది. (చదవండి: క్లీనర్ లేని లారీ.. నడిపేవారేరీ!) ధూళి పట్టి ఉన్న దస్త్రాల మూటలు సిబ్బంది, అర్చకుల వేతనాల ఖర్చు సంవత్సరం ఆదాయం (రూపాయలలో) వేతనాలకు చేసిన ఖర్చు శాతం 2019–20 7,22,733 15.5 2020–21 6,86,659 73.6 2021–22 3,63,695 15.8 ఇక కోటలోని భాండాగారంలో ఉన్న బంగారం విషయానికి వస్తే.. 28 ప్రాపర్టీ రిజిస్టర్ ప్రకారం.. 28 బంగారు ఆభరణాలున్నాయి. అవి 45 తులాల, 82 చిన్నాల, 65 వీసాలు. (548 గ్రాముల 208 మిల్లీ గ్రాములు). 1957 అప్రై జ్మెంట్ రిజిస్టర్ ప్రకారం చూస్తే.. 22 తులాల, 103 చిన్నాల,77 వీసాలు (291 గ్రాముల, 600 మిల్లీ గ్రాములు). ఇవన్నీ రికార్డుల ప్రకారం చెబుతున్న లెక్కలు. బోలెడు బంగారం.. వేణుగోపాలస్వామి, రుక్మిణీ, సత్యభామ అమ్మవార్లకు బోలెడంత బంగారం ఉంది. ఎస్బీఐ (బాక్స్ నంబర్ 42/74–2013లో) బ్యాంకు లాకర్లో వేసిన ఆభరణాల సంఖ్య 114. ప్రాపర్టీ రిజిస్టర్ 28 ప్రకారం.. వివిధ ఆభరణాల్లో ఉన్న బంగారం 1094 తులాల 1392 చిన్నాల 621 వీసాలు (అంటే 13 కిలోల 308 గ్రాముల 624 మిల్లీ గ్రాములు). 1957 జనవరి 18న ఆమోదించిన అప్రైజ్మెంట్ రిజిస్టర్ ప్రకారం.. వివిధ ఆభరణాల్లో ఉన్న బంగారం 865 తులాల, 633 చిన్నాల, 291 వీసాలు (10 కిలోల 334 గ్రాముల 304 మిల్లీ గ్రాములు). కొండంత వెండి... కోటలోని భాండాగారంలో 107 వెండి ఆభరణాలున్నాయి. వీటిని 1998 అక్టోబర్ 12న భద్రపరచినట్టు రికార్డుల్లో ఉంది. 28 ప్రాపర్టీ రిజిస్టర్ ప్రకారం.. 21,332 తులాల 1102 చిన్నాల, 307 వీసాలు (249 కిలోల 248 గ్రాముల 20 మిల్లీ గ్రాములు) వెండి ఉన్నట్టు లెక్కల్లో ఉంది. 1957 అప్రైజ్మెంట్ రిజిస్టర్ ప్రకారం.. 21,549 తులాల, 563 చిన్నాల 9 వీసాలు (251 కిలోల 557 గ్రాముల 490 మిల్లీ గ్రాములు) వెండి ఉన్నట్టు చూపిస్తోంది. బ్యాంకు లాకర్లో భక్తుల కానుకలు.. ఈ ఆభరణాలే కాకుండా భక్తులు సమర్పించిన 328 గ్రాముల 130 మిల్లీ గ్రాముల బంగారం, 826 గ్రాముల 320 మిల్లీ గ్రాముల వెండి బొబ్బిలి ఆంధ్రా బ్యాంకులోని ఏ–52 లాకర్లో ఉన్నట్టు రికార్డులు ఉన్నాయి. రథాల శాలలో నిర్వహిస్తున్న దేవాదాయశాఖ కార్యాలయం ధూపదీపనైవేద్యాలకు దాతలే దిక్కు... ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు ఉన్న తరువాత ఎవరైనా ఎలా ఉంటారు. ధూం..ధాంగా ఉంటారు. కానీ వేణుగోపాల స్వామికి ఆ భాగ్యం లేదు. ఈ ఆలయంలో 8 మంది సిబ్బంది, అర్చకులు ఉన్నారు. వీరిలో ముగ్గురు అర్చకులు కాగా ఒకరు జూనియర్ అసిస్టెంట్. మరొకరు టికెట్ సెల్లర్. ఇద్దరు వంట మనుషులు, ఒక స్వీపర్ పనిచేస్తున్నారు. వీరి జీతభత్యాల కోసం ఆలయానికి వచ్చిన ఆదాయంలో నుంచి కొంత శాతాన్ని ఖర్చు చేస్తున్నారు. ఆ ఆదాయం కూడా దాతల నుంచే వస్తోంది. వచ్చిన ఆదాయం వీరి జీతాలకే సరిపెడుతున్నారు. 2020–21లో ఏకంగా ఆదాయంలో 73.6 శాతం జీతాలకు వెచ్చించామని రికార్డుల్లో రాశారు. ఇక స్వామి వారికి ధూపదీప నైవేద్యాలకు డబ్బులెక్కడివి. ఉన్నదానితోనే సరిపెడుతున్నారు. కనీసం ఆలయాన్ని కూడా అనువంశిక ధర్మకర్తలు అభివృద్ధి చేసింది లేదు. ఆలయాన్ని చూస్తేనే ఆ విషయం అర్ధమవుతుంది. గతమెంతో వైభవం... ఆలయ భూములన్నీ స్వామి వారి అధీనంలో ఉన్నప్పుడు ఎంతో వైభవంగా ఉండేది. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామి దేవాలయంలో వలే బోగభాగ్యాలు, పూజాధికాలు జరిగేవి. అదంతా ఇప్పుడో కల. ప్రస్తుతం దాతల సహాయంతోనే నెట్టుకొస్తున్నాం. – భద్రం అప్పలాచార్యులు, ప్రధానార్చకులు, వేణుగోపాలస్వామి దేవస్థానం, బొబ్బిలి స్వామి ఆస్తులు స్వామికే దక్కాలి బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూములు, ఆభరణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో బయట పడాలి. దోషులెవరయినా శిక్షింపబడాలి. వేల కోట్ల రూపాయలు ఆస్తులున్న స్వామివారు చివరకు ధూప దీప నైవేద్యాలకు చేయిచాచే పరిస్థితి నుంచి బయట పడాలి. దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, భక్తుల మనోభావాల రక్షణకు ప్రాధాన్యమిస్తూ విచారణకు సీఎం జగన్మోహన్రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలు ఆదేశించడం అభినందించదగ్గ విషయం. ఇక్కడి ట్రస్టీ సభ్యులు కొన్నాళ్ల పాటు అధికారంలో ఉన్నారు. కానీ ఈ వ్యవహారాలన్నీ బయటకు పొక్కలేదు. పైగా చీకటిలో ఉంచారంటే ఏదో జరుగుతోందనేది ప్రజల అనుమానం. వీటిని నివృత్తి చేసి దేవాలయాల ఆస్తులను కాపాడాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్యే, బొబ్బిలి -
రియల్.. ఫేక్ న్యూస్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ/నార్కట్పల్లి: ఓ భక్తి చానల్లో ప్రసారమైన ఒక ఫేక్ వార్త నాలుగు రాష్ట్రాల్లోని భక్తులకు చిక్కులు తెచ్చిపెట్టింది. అమావాస్య రోజైన బుధవారం నల్లగొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం గోపలాయపల్లి గుట్ట మీద ఉన్న శ్రీవారిజాల వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పడంతో ఆ ఆలయానికి భక్తులు పోటెత్తారు. 89 ఏళ్లకొకసారి ఇలాంటి ముహూర్తం ఉంటుందని ఈ సమయంలో స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఆ చానల్లో జ్యోతిష్యుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ చెప్పడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచే ఆ ఆలయానికి లక్షల్లో భక్తులు చేరుకున్నారు. దేవస్థానానికి పోటెత్తిన భక్తులు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలిరావడంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 4 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని సమాచారం. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయాన్ని మూసివేసినా ఆలయ గోడలు దూకి భక్తులు లోనికి ప్రవేశించారు. దేవాలయం చుట్టుపక్కల భూములను అధిక ధరలకు అమ్ముకునేందుకే ఇలాంటి ప్రచారం చేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై నల్లగొండ జన విజ్ఞాన వేదిక, మరికొందరు భక్తులు ఫిర్యాదు చేయడంతో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. గుర్తించే పనిలో ఉన్నాం: నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ ఒక్కసారిగా దాదాపు 4 లక్షల మంది భక్తులు ఆలయానికి రావడం అనుమానంగా ఉంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో కేసులు నమోదు చేశాం. -
స్వామీజీతో ప్రచారం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
స్వామీజీతో ప్రచారం.. కి.మీ మేర ట్రాఫిక్ జామ్..!
సాక్షి, నల్లగొండ : నార్కెట్ పల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో హైదరాబాద్, విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నార్కెట్ పల్లి-చిట్యాల మధ్య కిలోమీటర్ల పొడవున వాహనాలు జామ్ కావడంతో కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ సిబ్బంది చేతులెత్తేశారు. బుధవారం రోజున వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే సర్వ రోగాలు నయమవుతాయని ఓ స్వామీజీ చెప్పడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు భారీగా తరలి వచ్చారు. హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో వేణుగోపాలస్వామి దర్శనం కోసం వచ్చిన వేలాదిమంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులను తప్పుదోవ పట్టించేందుకు కావాలనే స్వామీజీ చేత ప్రచారం చేయించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ ఘటనపై నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
అక్రమాలు పట్టావా!
బుక్కపట్నం: మండల కేంద్రమైన కొత్తచెరువులో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెనుకొండ రోడ్డు వైపు, ఆర్డీటీ కార్యాలయం ఎదురుగా ఉన్న 14 ఎకరాల వేణుగోపాల స్వామి మాన్యం భూమిని ఇందిరమ్మ గృహాల కోసం కేటాయించారు. అక్కడ సుమారు 700 మందికి పట్టాలిచ్చారు. అయితే 2014లో టీడీపీఅధికారంలోకి రాగానే తెలుగుతమ్ముళ్లు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి లబ్ధిదారులకు ఒకటిన్నర సెంటు మాత్రమే ఇచ్చారనీ, అంత తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు కట్టడం సాధ్యంకాదంటూ మొత్తం పట్టాలు రద్దు చేయించారు. అనంతరం అర్హతతో సంబంధం లేకుండా టీడీపీకి అనుకూలంగా ఉన్న 534 మందికి తాజాగా పట్టాలిచ్చారు. దీంతో అన్ని అర్హతలు ఉండి గుడిసెల్లో బతుకుతున్న వందల మందికి అన్యాయం జరిగింది. మరోవైపు టీడీపీ నేతల నుంచి పట్టాలు పొందిన అనేక మంది సెంటు స్థలాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదించారు. పలుకుబడి కలిగిన మరికొంతమంది టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక్కొక్కరు 3, 4 పట్టాలు పొంది అక్కడ ఎన్టీఆర్ సౌదాలు నిర్మించుకున్నారు. పంచాయతీకి కేటాయించిన స్థలాలను కూడా ఆక్రమించుకుని అమ్ముకుంటున్నారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.2 కోట్లు చేతులు మారిన ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ టీడీపీ నేత, ఓ మాజీ విలేకరి పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు. సదరు మాజీ విలేకరి ఏకంగా 8 సెంట్లలో ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకుంటున్నాడు. ఫేస్బుక్లో హల్చల్ స్థానిక టీడీపీ నాయకుల అవినీతిని అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ నారాయణ, ఆయన కుమారుడు విజయ్ ఫేస్బుక్ వేదికగా పోస్టులు పెడుతూ ఎండగట్టారు. నిరుపేదలను రోడ్డుపాలు చేయడం తగదంటూ టీడీపీ నేతలకు హితవు పలికారు. కలెక్టర్కు ఫిర్యాదు మరోవైపు ఇళ్లల çపట్టాల మంజూరులో భారీ అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని టీడీపీ జిల్లా నాయకుడు దాల్మాల్ సూరి, మాజీ సర్పంచ్ శివ, మాజీ ఎంపీపీ నారాయణ, విజయ్కుమార్ తదితరులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముందే హెచ్చరించిన ‘సాక్షి’ పట్టాల పంపిణీలో జరుగుతున్న అక్రమాల గురించి 2017 సెప్టెంబర్లోనే ‘సాక్షి’ ఓ కథనం ప్రచురించింది. టీడీపీ నేతలు చేస్తున్న అవినీతిని ఎండగట్టింది. ఇప్పుడు అదే విషయాన్ని టీడీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. -
కూతురి మూగవేదన చూడలేక...
నార్కట్పల్లి : పోలియో, మూగవేదనతో కన్న కూతురు పడుతున్న బాధను చూడలేక కూతురిని చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ తల్లి. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. మునుగోడు మండల కేంద్రానికి చెందిన నాగరోని వెంకటేశ్వర్లు, కల్పన (అలియాస్) పారిజాత దంపతులకు కుమార్తె సుమశ్రీ (9), ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. సుమశ్రీ పుట్టుకతోనే పోలియో బారిన పడడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అంతే కాకుండా పుట్టు మూగ. ఐదేళ్ల క్రితమే వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కల్పననే వారి ఆలనాపాలన చూస్తోంది. కల్పన మూడేళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. సుమశ్రీని బాగు చేయించేందుకు ఆమె ఎన్నో ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు. ఇటీవల తిరుపతిలో ఆయుర్వేదిక్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా నయం కాదని చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి కల్పన సోమవారం సాయంత్రం కూతురిని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి నార్కట్పల్లి మండలం వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న రైలు పట్టాల వద్దకు చేరుకుంది. రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక్క రైలు కూడా రాకపోవడంతో బ్లేడుతో కూతురు గొంతు గోసి, ఆపై తాను కూడా చేయి, గొంతు కోసుకుంది. విషయాన్ని తన మామ బక్కయ్యకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. వారు 108 కు సమాచారం ఇవ్వగా వారిద్దరిని కామినేని ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఉన్న సుమశ్రీని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి కల్పన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.