breaking news
uninterrupted time
-
నిరాటంకంగా ఇంధనం, ఎరువులు
మాస్కో: చిరకాల మిత్రదేశమైన భారత్‌కు నిరాటంకంగా ఇంధనం, ఎరువులను సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్ జలసంధి దిగ్బంధం కారణంగా ఇంధనం, ఎరువుల సరఫరాల్లో అవరోధాలను ఎదుర్కొంటున్న భారత్‌కు తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పుతిన్ భారత్‌కు భరోసా ఇచ్చారు. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై ఇండో–రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్(ఐఆర్ఐజీసీ) సమావేశంలో పాల్గొనేందుకు రష్యాకు విచ్చేసిన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ‘‘భారత రైతన్నల కోసం, భారతీయ వ్యవసాయ రంగం కోసం శక్తిమేరకు మేం సాయపడతాం. ఇకమీదటా మా సహాయసహకారాలు కొనసాగుతాయి’’అని జైశంకర్‌కు పుతిన్ హామీ ఇచ్చినట్లు రష్యా ప్రభుత్వరంగ టాస్ వార్తాసంస్థ పేర్కొంది. ఈ భేటీలో పుతిన్‌తోపాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సైతం పాల్గొన్నారు. అంతకుముందు జైశంకర్ సహసారథి హోదాలో ఐఆర్ఐజీసీ సమావేశంలో పాల్గొన్నారు. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ (డీపీఎం) డెనిస్ మంటురోవ్‌తో కలిసి సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది 12–13 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ ఢిల్లీలో పర్యటించనున్న వేళ జైశంకర్ రష్యాలో పర్యటిస్తుండటంతో ఈ కీలక సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోదీజీ ఎదురుచూపులు.. పుతిన్‌తో భేటీలో మోదీ తరఫున జైశంకర్ శుభాకాంక్షలు తెలిపి కొద్దిసేపు సంభాషించారు. ‘‘షాంఘై సహకార సంఘం భేటీలో మీతో చర్చించేందుకు ప్రధాని మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ భేటీలోనే మిమ్మల్ని బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానించాలని మోదీ సిద్ధపడుతున్నారు. వాణిజ్యం, ఇంధనం, ఎరువులు, పౌర అణు ఇంధనంసహా పలు రంగాల్లో మన ఇరుదేశాల పరస్పర సహకారం కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాం. ఐఆర్ఐజీసీ భేటీ అద్భుతంగా సాగింది’’అని పుతిన్‌తో జైశంకర్ చెప్పారు. 4 రెట్లు పెరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం 27వ ఐఆర్ఐజీసీ సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు. ‘‘భారత్, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 2021–22లో 13 బిలియన్ డాలర్లు ఉండగా 2025–26లో అది ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతోపాటు ఎగుమతులతో పోలిస్తే దిగుమతులు పెరిగి వాణిజ్యలోటు 6.6 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 50 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ప్రతికూల ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయతి్నస్తాం. రష్యా విపణిలోకి భారతీయ ఉత్పత్తులకు మరింత అవకాశాలు దక్కేలా చేయడం, టారిఫ్‌ల తొలగింపు, వ్యాపార సంస్థల మధ్య మరింత బలమైన వ్యాపార సంబంధాలతో ఈ వాణిజ్యలోటుకు భారత్ చెక్ పెట్టాలనుకుంటోంది. తద్వారా 2030 ఏడాదికల్లా మా వాటా వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’అని జైశంకర్ తెలిపారు. -
అడ్డంకులు లేకుండా సమయం ఇవ్వండి
-
అడ్డంకులు లేకుండా సమయం ఇవ్వండి
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రతిపక్షం తరఫున ఒకే ఒక్క సభ్యుడు.. అది కూడా ప్రతిపక్ష నాయకుడు మాత్రమే మాట్లాడతారని, అందువల్ల ప్రసంగానికి అడ్డంకులు కల్పించకుండా గంటన్నర పాటు ఏకధాటిగా సమయం కేటాయించాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరారు. వాయిదా అనంతరం సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ఆయన మాట్లాడారు. ఇదే విషయమై తమ పార్టీ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్‌తో మాట్లాడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాము కోరిన గంటన్నర సమయం కూడా ఇవ్వకపోతే అన్యాయమన్నారు. గత చరిత్ర చూస్తే చంద్రబాబు నాయుడు రెండు, రెండున్నర గంటల పాటు మాట్లాడారని, ఈ మూడేళ్లలో ఆయన చెప్పిన సమాధానాలు కూడా ఎక్కడా రెండు గంటలకు తక్కువ లేవని గుర్తు చేశారు. అయితే.. దానికి స్పీకర్ కోడెల స్పందిస్తూ, అందుబాటులో ఉన్నదాన్ని బట్టి అనుగుణంగా సమయం కేటాయిస్తామని తెలిపారు. కానీ దానికి తాము అంగీకరించడం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మాట్లాడితే వినాలని, విన్నదాన్ని అమలుచేయాలని అధికార పక్షం ఆరాటపడాలని, అసలు ప్రతిపక్షాన్ని మాట్లాడకూడదని భావించే అధికార పక్షాన్ని ఇక్కడే చూస్తున్నామని విమర్శించారు. దానికి సభావ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు లేచి నిబంధనలు ప్రస్తావించారు. దాంతో.. మంత్రిగారు రూల్స్ మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడేది కూడా అందులోనే కలపాలి తప్ప, ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఇస్తామన్న ఆలోచన సరికాదని జగన్ అన్నారు. అలా అయితే ప్రతిపక్ష నాయకుడిని కూడా పక్కన పెట్టి, ప్రతిపక్షానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాలన్నారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఎంత సమయం ఇస్తున్నారో, ప్రతిపక్షానికి కూడా నిష్పత్తి ప్రకారం అలాగే సమయం ఇవ్వాలని అన్నారు. కానీ.. రూల్స్ ప్రకారం సమాధానానికి ఎక్కడా ఇంత సమయం అని ఇవ్వలేదని, ప్రభుత్వం తన సమాధానంతో సంతృప్తి పరచాలి కాబట్టి దానికి సమయ పరిమితి ఉండబోదని యనమల ఈ సందర్భంలో అన్నారు.


