breaking news
Tour package
-
రాజస్థాన్ రాయల్ టూర్..!
ఇది రాజకోట రహస్యం చిత్రం కాదు. అచ్చంగా రాజపుత్రులు ఏలిన కోటలు. దుర్బేధ్యమైన కోటలు... చక్కని ప్యాలెస్‌లు. ఉదయ్ సింగ్ కట్టించిన సిటీ ప్యాలెస్. సజ్జన్‌సింగ్ మాన్సూన్ ప్యాలెస్. మహారాణా పోరుగడ్డ హల్దీఘాటీ. రాథోడ్ జోధా కట్టిన మెహరాన్‌గఢ్. యూరోపియన్ స్టైల్ ఉమేద్భవన్. బ్రహ్మకు ఆలయం కట్టిన పుష్కర్. జయ్‌పూర్ పాలకుల అమేర్ ఫోర్ట్. సిటీ ప్యాలెస్... హవామహల్... ఇవన్నీ రాజస్థాన్‌లో సాగే రాయల్ టూర్లో.1వ రోజు: హైదరాబాద్ నుంచి ఉదయ్‌పూర్‌కి ప్రయాణం. టూర్ నిర్వహకులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో పికప్ చేసుకుంటారు. హోటల్ గదికి వెళ్లి చెక్ ఇన్ కావడం, హోటల్లో లంచ్ తర్వాత సిటీ ΄్యాలెస్ సందర్శనం, పిచోలా లేక్‌లో విహారం, రాత్రి డిన్నర్, బస ఉదయ్‌పూర్‌లోనే.ఉదయ్‌పూర్ రాజమందిరంసిటీ ప్యాలెస్‌గా వ్యవహారంలో ఉన్న ఈ భవనం ఉదయ్‌పూర్ రాజుల పాలన, నివాస మందిరం. సిసోడియా రాజవంశం రాజులు అనేక మంది ఈ భవనం నుంచే పాలన సాగించారు. ప్రస్తుతం ప్యాలెస్‌లో కొంత భాగంలో సిసోడియా రాజకుటుంబ వారసుడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ నివసిస్తున్నాడు. కొంత భాగంలో పర్యాటకులను అనుమతిస్తారు. రాణి వంటగది, రాజు యుద్ధ సామగ్రి, యుద్ధం సమయంలో రాజు ధరించే కవచాన్ని పరిశీలనగా చూడాలి. రాజు కవచం సైజును బట్టి రాజు ఎత్తు అంచనాకు వస్తుంది. అలాగే రాణాప్రతాప్ గుర్రం చేతక్ యుద్ధం సమయంలో ధరించే కవచం కూడా ఉంది. చేతక్ నమూనా గుర్రాన్ని తయారు చేయించి ఆ కవచాన్ని ధరింపచేశారు. ఆ గుర్రం తెల్లగా ఎత్తుగా, పొడవుగా ఉంటుంది. ఇక రాణి మందిరం విషయానికి వస్తే మందిరం ముందు రాజు వేచి ఉండే పాలరాతి బల్లను చూడాలి. రాజు ఒక వేళ రాణి అలంకరణ పూర్తయ్యే లోపే వస్తే అలంకరణ పూర్తయ్యే వరకు ఆ పాలరాతి బల్ల మీద కూర్చుని ఎదురు చూసేవాడని చమత్కారంగా చెబుతారు గైడ్లు. ఏనుగుల బలప్రదర్శన గోడను చూడాలి. గోడకు అవతల ఒక ఏనుగు, ఇవతల ఒక ఏనుగు ఉంటాయి. తొండాలను మెలి వేసి వెనక్కు లాగుతాయి. తనను తాను ఆపుకోలేక ముందుకు వచ్చి గోడను తాకిన ఏనుగు ఓడిపోయినట్లు. పిచోలా సరస్సు ఒడ్డున ఉంది సిటీప్యాలెస్. సరస్సు మధ్యలో లేక్ ప్యాలెస్, ఒక వైపుగా జగ్మందిర్, జగ్మోహన్ ప్యాలెస్‌లను పడవలో విహరిస్తూ చుట్టిరావచ్చు. లేక్‌కు మరొక ఒడ్డున దర్బార్‌హాల్ ఉంటాయి. దర్బార్‌హాల్‌లో నాటి రాజకొలువు బొమ్మలతో కొలువు దీరి ఉంటుంది.2వ రోజు: బ్రేక్‌ఫాస్ట్ తరవాత హోటల్ నుంచి బయలుదేరి సజ్జన్‌గఢ్ ప్యాలెస్‌కు ప్రయాణం. ప్యాలెస్ సందర్శనం తర్వాత ప్రయాణం హల్దీఘాటికి. హల్దీఘాటిలో మహారాణా ప్రతాప్ మ్యూజియం చూసిన తర్వాత సాయంత్రం నథ్‌ద్వారా కోట సందర్శనం. రాత్రి బస ఉదయ్‌పూర్‌లోనే.ఎడారి మేఘంసజ్జన్గఢ్ ప్యాలెస్ నిర్మాణాన్ని మహారాణా సజ్జన్ సింగ్ ఓ గొప్ప ఆలోచనతో మొదలుపెట్టాడు. జయ్‌పూర్‌లో జంతర్మంతర్లాగా ఖగోళ పరిశోధన, అధ్యయన కేంద్రం నిర్మించాలనుకున్నాడు. అలాగే మేవార్ రాజధాని నగరం ఉదయ్‌పూర్ మొత్తం కనిపించే విధంగా ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండ మీద నిర్మించాడు. ఐదంతస్థుల ఈ ప్యాలెస్ పైనుంచి చూస్తే ఉదయ్‌పూర్‌లోని సరస్సులు కనిపిస్తాయి. వర్షాకాలంలో రాజు ఇక్కడ కొద్దిరోజులు విడిది చేసి రాజ్యంలో నీటి నిల్వలను గమనించేవాడని చెబుతారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేవార్ పాలకులు ఉదయ్‌పూర్‌ని రాజధాని చేసుకోక ముందు చిత్తోర్‌గఢ్ నుంచి పాలన సాగించేవారు. సజ్జన్ గఢ్ ప్యాలెస్ నుంచి చిత్తోర్‌గఢ్ కోట కూడా కనిపించే విధంగా డిజైన్ చేసుకున్నారు. కానీ సజ్జన్‌సింగ్ ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన పాలకులు ప్యాలెస్ నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు కానీ ఖగోళ అధ్యయనం దిశగా పనులు సాగలేదు. మూడు ప్రధాన ఉద్దేశాల్లో రెండు ఉద్దేశాలు మాత్రమే నెరవేరాయి. ఈ ప్యాలెస్‌లోకి పర్యాటకులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాహనాల్లో వెళ్లాలి. సజ్జన్గఢ్ను సూర్యాస్తమయం సమయంలో చూడగలిగితే బంగారు రంగులో మెరుస్తూ అందంగా ఉంటుంది.ఆత్మాభిమాన పోరుహల్దీఘాటీ అనే ప్రదేశం పేరుకు తగ్గట్లే పసుపు రంగులో ఉంటుంది. మట్టి, రాయి, రప్ప అంతా నేలకు పలుచగా పసుపు అద్దినట్లు, పసుపు నీటితో కళ్లాపి చల్లినట్లు ఉంటుంది. ఉదయ్‌పూర్ జిల్లా నుంచి రాజ్‌సమంద్ జిల్లా కేంద్రానికి వెళ్లే దారిలో వస్తుంది. ప్రధాన రహదారి నుంచి డైవర్షన్ తీసుకున్న తర్వాత దాదాపు 30 కిలోమీటర్ల దూరం అటవీ ప్రదేశంలో ప్రయాణించాలి. హల్దీఘాటీలో యుద్ధభూమిని చేరేలోపు చేతక్ స్మారకం కనిపిస్తుంది. రాణాప్రతాప్‌కు ఇష్టమైన గుర్రం చేతక్. యుద్ధంలో రాణా ప్రతాప్ గాయపడడంతో ఆ సంగతి తెలుసుకున్న చేతక్ యజమానిని కాపాడుకోవడానికి యుద్ధరంగం నుంచి పరుగులంఘించుకుంది. మధ్యలో ప్రహిస్తున్న బాణాస్ నదిని దాటడానికి ఒక్క ఉదుటున దుమికింది. అప్పుడది గాయపడి ఆ తర్వాత కొద్ది దూరం ప్రయాణించి నేలకొరిగింది. చేతక్ జ్ఞాపకార్థం రాణా ప్రతాప్ నిర్మించిన స్మారకం అది. ఇది కాకుండా ఉదయ్‌పూర్ నగరంలో తెల్లటి చేతక్ విగ్రహంతో చేతక్ సర్కిల్ కూడా ఉంది. ఇక హల్దీఘాటీలో మ్యూజియాన్ని చూస్తే రాణాప్రతాప్ జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. ఈ యుద్ధంలో మొఘల్ ప్రతినిధిగా మాన్సింగ్, మేవార్ పాలకుడిగా మహారాణా ప్రతాప్ తలపడ్డారు. భీకర యుద్ధం జరిగింది కానీ రాణాప్రతాప్ తన మేవార్ రాజ్యాన్ని మొఘలుల ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు.3వ రోజు: ఉదయ్‌పూర్ నుంచి జోద్‌పూర్‌కి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి జోద్పూర్ వైపు సాగిపోవాలి. జద్పూర్లో మెహరాన్‌గఢ్ కోట వీక్షణం తర్వాత హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస జో«ద్‌పూర్‌లో.సూర్యుడి కోటమెహరాన్గఢ్ అంత పెద్దది ఇంత విశాలమైనది అని చెప్పడం కంటే... పన్నెండు వందల ఎకరాల్లో విస్తరించిన నిర్మాణాల సముదాయం అని ఒక్క మాటలో చెప్పాలి. ఇంగ్లిష్ రచయిత రడ్యార్డ్ క్లిప్పింగ్ ఈ కోటను వర్ణిస్తూ ‘దిగ్గజ భవన నిర్మాత నిర్మించిన కోటకు ఉదయించే సూర్యుడు రంగులద్దినట్లు ఉంది’ అన్నాడు. ఈ భవనం పేరు కూడా సూర్యుడి పేరుతోనే వచ్చింది. మిహిర్‌ఘర్ అంటే సూర్యుని కోట అని, అదే పదాన్ని రాజస్థానీ భాషలో మెహరాన్‌గఢ్ అంటారు. రాథోర్ రాజవంశం నిర్మించిన కోట ఇది. రాథోర్లు సూర్యుడి ఆరాధకులు. దాంతో కోటను ఉదయించే సూర్యుని కిరణాలతో ప్రభవించేటట్లు డిజైన్ చేశారు. ఈ కోటను రావు జోధా అనే రాజు నిర్మించాడు. అతడి పేరుతోనే ఈ రాజ్యానికి జో«ద్‌పూర్ అనే పేరు వచ్చింది. ఇందులోని బంగారు పల్లకి దగ్గర ఫొటో తీసుకోవడం మరిచిపోవద్దు.4వ రోజు: జోద్పూర్ నుంచి పుష్కర్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ఉమేద్ భవన్ ΄్యాలెస్ సందర్శనం తర్వాత పుష్కర్‌కు ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్, రాత్రి బస పుష్కర్‌లో.ఇండో–యూరోపియన్ ప్యాలెస్రాజస్థాన్ రాష్ట్రం కోట తెలుగు వారికి సుపచిరితమైన ప్రదేశం. ఆ రాజ్యాన్ని పాలించిన రాజు మహారావ్ రెండవ ఉమేద్ సింగ్ నిర్మాణం మొదలుపెట్టాడు. అతడి పేరుతోనే ఉమేద్ భవన్ ప్యాలెస్‌గా వాడుకలోకి వచ్చింది. ఇతర రాజస్థాన్ నిర్మాణాలతో పోల్చి చూసినప్పుడు ఇందులో కొంత వైవిధ్యంగా యూరోపియన్ నిర్మాణశైలి కనిపిస్తుంది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సామ్యూల్ స్విన్టన్ చేత దీనిని డిజైన్ చేయించాడు ఉమేద్ సింగ్. నిర్మాణం ఇరవయ్యవ శతాబ్దం వరకు సాగింది. ఇందులో కోట రాజవంశం నివసిస్తోంది. కొంత భాగంలో పర్యాటకులను అనుమతిస్తారు. ఇది ఇప్పుడు హెరిటేజ్ హోటల్.ఆలయాల నిలయం పుష్కర్పుష్కర్ అనగానే పుష్కర్ సరస్సు గుర్తొస్తుంది. ఈ సరస్సు చుట్టూ విస్తరించిన పట్టణం ఇది. ఈ సరస్సులో స్నానం చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఆలయాలను లెక్క చెప్పడం సాధ్యం అయ్యే పని కాదు. నాలుగు వందల వరకు ఉంటాయని అంచనా. సిక్కులకు కూడా ఇది పవిత్రస్థలం. పుష్కర్ యాత్రికులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమిటంటే ఇక్కడ ధూమపానం, మద్యపానం, మాంసాహారాన్ని భుజించడం నిషిద్ధం. ఇక్కడ ఏటా కార్తీక మాసంలో జరిగే కామెల్ ఫెయిర్ ప్రసిద్ధి. ఈ వేడుక కోసం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, విదేశీయులు కూడా వస్తారు.5వ రోజు: పుష్కర్ నుంచి జయ్‌పూర్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్, బ్రహ్మ మందిర దర్శనం తర్వాత జయ్‌పూర్‌కి ప్రయాణం. జయ్‌పూర్‌లో సిటీ ప్యాలెస్ వీక్షణం, హవామహల్ మీదుగా హోటల్‌కు ప్రయాణం. గదిలో చెక్ ఇన్, రాత్రి బస జయ్‌పూర్‌లో.బ్రహ్మ మందిరంభూమ్మీద బ్రహ్మకు ఆలయం లేని లోటును తీరుస్తోంది పుష్కర్. ఇక్కడి బ్రహ్మమందిరాన్ని విశ్వామిత్రుడు నిర్మించాడని చెబుతారు. విశ్రామిత్రుడు బ్రహ్మ కోసం యజ్ఞం చేసిన తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించాడనేది స్థల పురాణం. ఆ తర్వాత ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుడు పునరుద్ధరించాడు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఆలయ రూపం 14వ శతాబ్దంలో మహారాజా జవత్రాజ్ నిర్మాణం.జయ్‌పూర్ సిటీ ప్యాలెస్మహారాజా సవాయ్ రెండవ జయ్సింగ్ నిర్మించిన ప్యాలెస్ ఇది. అమేర్ నుంచి రాజధానిని జయ్‌పూర్‌కు మారుస్తూ ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. అప్పటి నుంచి రాజకుటుంబం సిటీ ప్యాలెస్‌లో నివసించేది. రాజకుటుంబ పరివారం ఐదు వందల కుటుంబాలు ప్యాలెస్ కాంప్లెక్స్‌లో ఉన్న ఇతర భవనాల్లో నివసించేవి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజాస్థానాలు దేశంలో విలీనమయ్యే వరకు జయ్‌పూర్ అధికారిక రాజభవనం ఈ సిటీ ప్యాలెస్. ఇప్పుడిది గొప్ప పర్యాటక ప్రదేశం. ఇందులో సవాయ్ రెండవ మాన్సింగ్ మ్యూజియం ఉంది. రాణి పద్మిని ఆధ్వర్యంలో ఏర్పాటైన మహారాజా సవాయ్ మాన్సింగ్ మ్యూజియం ట్రస్ట్ ను ప్రస్తుతం యువరాణి దియాకుమారి నిర్వహిస్తోంది. శోభానివాస్లో గ్లాస్ వర్క్, ఛావీ నివాస్‌లో నీలిరంగు గదిలో ఉన్న కళాత్మకతకు నాటి ఆర్కిటెక్ట్‌ల నైపుణ్యానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. హవామహల్ మీదుగానే ప్రయాణం సాగుతుంది. శ్రీకృష్ణుడి కిరీటం ఆకారంలో ఉన్న హవామహల్ సౌందర్యాన్ని ఆస్వాదించాలి.6వ రోజు: జయ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసిన తర్వాత బిర్లా టెంపుల్ వీక్షణం, ఆమేర్ ఫోర్ట్సందర్శనం తర్వాత టూర్ నిర్వహకులు సాయంత్రం జయ్‌పూర్ ఎయిర్΄ోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. విమానం రాత్రి 8.50 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది.అమేర్... మాన్సింగ్ మందిరంజయ్పూర్ నగరానికి 11 కిలోమీటర్ల దూరాన ఉంది అమేర్ ఫోర్ట్. ఇది కొండ మీద ఉంది. ఆరావళి పర్వతశ్రేణుల్లో విస్తరించిన రాజపుత్రుల రాజ్యంలో కోటలు, ప్యాలెస్‌లన్నీ నిర్మాణ అద్భుతాలే. రాజధానిని సిటీ ప్యాలెస్‌కు మార్చకముందు ఈ కోట నుంచే పాలన సాగింది. సామాన్య ప్రజలు రాజును కలవడానికి దివానీ ఆమ్, మంత్రివర్గంతోపాటు ఇతర ప్రముఖులు రాజుతో సమావేశమయ్యే దివానీ ఖాస్లు నాటి పరిపాలనను చాటి చెప్పే నిదర్శనాలు. రాజా మాన్సింగ్ ఇందులోనే నివసించాడు. ఈ నిర్మాణంలో పై అంతస్తులో మాన్సింగ్ బెడ్రూమ్, అతడి గది నుంచి కింది అంతస్థులో పన్నెండు మంది రాణుల బెడ్రూమ్లకు వెళ్లే మెట్ల నిర్మాణాన్ని పరిశీలించడం మరిచిపోవద్దు.‘రాయల్ రాజస్థాన్’ టూర్ ప్యాకేజ్ కోడ్ ఎస్హెచ్ఏ12. ఈ ఆరు రోజుల పర్యటన హైదరాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి 14.9.2025న మొదలవుతుంది. ఈ టూర్లో ఉదయ్‌పూర్, జోద్పూర్, పుష్కర్, జయ్‌పూర్ కవర్ అవుతాయి. ఈ నెల 14వ తేదీ ఉదయం 7.40 గంటలకు ‘6 ఈ 6323’ విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. 9.25 గంటలకు ఉదయ్‌పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణం 19వ తేదీ రాత్రి 8.50 గంటలకు ‘6ఈ 816’ విమానం జయ్‌పూర్ నుంచి బయలుదేరి 10 .55 గంటలకు హైదరాబాద్‌కి చేరుతుంది.ప్యాకేజ్ ధరలిలాగ: కంఫర్ట్ కేటగిరీ సింగిల్ ఆక్యుపెన్సీలో 42, 450 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 33,900, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 32,450 రూపాయలు.తెలుసుకోవాల్సిన మరికొన్ని సంగతులు:విమాన ప్రయాణ సమయాల్లో అవసరాన్ని బట్టి కొద్ది మార్పులు జరిగే అవకాశం ఉంది. టూర్ ఐటెనరీ ΄్లానింగ్లో ఆలయ దర్శనానికి తగిన సమయం మాత్రమే కేటాయించడం జరుగుతుంది. పూజాదికాలు నిర్వహించాలంటే సదరు పర్యాటకులు పూజ తర్వాత తమకు తాముగా హోటల్ గదికి చేరాల్సి ఉంటుంది. టూరిస్ట్ ప్యాకేజ్ బస్ పూజ పూర్తయ్యే వరకు ఎదురు చూడడం సాధ్యం కాదు. ఆలయాలకు కొన్ని చోట్ల పెద్ద బస్సు వెళ్లే అవకాశం ఉండదు, అలాంటి చోట్ల పర్యాటకులు కొంత మేర నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నడవలేని వాళ్లు స్థానికంగా ఆటోలు తమకు తాముగానే పెట్టుకోవాలి.చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!పర్యాటకులు తమ ఆరోగ్య కారణాల రీత్యా పార్సిల్ ఫుడ్ వెంట పెట్టుకోవాలి. ఎనర్జీనిచ్చే చాక్లెట్లు, బిస్కట్, డ్రైఫ్రూట్స్, వేరుశనగ పప్పు వంటివైనా దగ్గర ఉంచుకోవడం మంచిది. ఈ టూర్ ఐటెనరీలో జయ్‌పూర్‌లో జంతర్‌మంతర్, హవామహల్ లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి.ప్యాకేజ్‌లో ఇవన్నీ ఉంటాయి:హైదరాబాద్ నుంచి ఉదయ్‌పూర్‌కి, జయ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కి విమానం టిక్కెట్లు. ఉదయ్‌పూర్‌లో 2 రాత్రులు, జో«ద్‌పూర్‌లో ఒక రాత్రి, పుష్కర్‌లో ఒక రాత్రి, జయ్‌పూర్‌లో ఒక రాత్రి హోటల్ బస. 5 రోజులు బ్రేక్‌ఫాస్ట్, ఒక లంచ్, 5 రోజులు రాత్రి భోజనం. సైట్ సీయింగ్‌కి ఏసీ 35 సీటర్ బస్ ప్రయాణం. ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్. – వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
మేఘాలయ టూర్..! అంబరాన్నంటే అద్భుతం!
మేఘాలయ టూర్ మేఘాల్లో విహరించినట్లే ఉంటుంది. సముద్ర మట్టానికి ఆరువేల ఐదువందల అడుగుల ఎత్తు. ఆకాశపుటంచులను తాకుతున్నట్లు సాగే ప్రయాణాలు. షిల్లాంగ్ బసలతో చిల్ అవుతూ సాగే పర్యటన ఇది.ఈశాన్య సంస్కృతి దర్పణం డాన్‌బాస్కో మ్యూజియం. వాన జల్లులతో పర్యాటకులను పలకరించే చిరపుంజి. జలధారలను కలిపి జడ అల్లినట్లు ఎలిఫెంట్ ఫాల్స్. ప్రకృతి అద్భుతాన్ని ఒట్టేసి చెప్పే మావ్ స్మాయ్ కేవ్స్. గాల్లో ఉన్నట్లు భ్రమ కల్పించే ఉమ్న్గోట్ పడవ విహారం. నన్ను చూసి నేర్చుకోండి అంటున్న మావ్ లిన్నాంగ్ గ్రామం. చెరగని చరిత్రకు శిలాజ్ఞాపకం నార్తియాంగ్ మోనోలిథ్పార్క్. బోనస్‌గా... కామాఖ్య సందర్శనం... బ్రహ్మపుత్ర విహారం. కంచె ఆవల ఉన్న బంగ్లాదేశ్‌లోకి తొంగిచూడవచ్చు కూడా. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ వీటిని చూపిస్తుంది. 1వ రోజుగువాహటి రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ నుంచి (ఈ ప్యాకేజ్‌లో టూర్ బుక్ చేసుకున్న పర్యాటకులు రైలు, విమాన మార్గాల్లో ఏ మార్గాన గువాహటికి చేరుతున్నారనే వివరాలను నిర్వహకులకు ముందుగా తెలియచేయాలి) రిసీవ్ చేసుకుని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత ఆ రోజు విశ్రాంతిగా గడపడం, రాత్రి భోజనం, బస అక్కడే. ఆసక్తిని బట్టి తమకు తాముగా సాయంత్రం నగర విహారానికి వెళ్లవచ్చు.అసోమ్ నుంచి టూర్ షురూ!గువాహటిలో పగలు చూడాల్సిన ప్రదేశాల్లో కామాఖ్య ఆలయం, పీకాక్ ఐలాండ్, ఉమానంద ఆలయం, నెహ్రూపార్క్, అస్సాం స్టేట్ జూ, స్టేట్ మ్యూజియం, పోబితోరా వైల్డ్‌లైఫ్ సాంక్చురీ ఉన్నాయి. సాయంత్రం బ్రహ్మపుత్ర రివర్‌ఫ్రంట్ షికార్ బాగుంటుంది. షాపింగ్‌కి ఫ్యానీ బజార్‌కు వెళ్లవచ్చు. రెండవ రోజు టూర్ షెడ్యూల్లో కామాఖ్య ఆలయం, ఆరవ రోజు బ్రహ్మపుత్ర నదిలో విహారం ఉన్నాయి. కాబట్టి మొదటి రోజు చేతిలో ఉన్న కొద్ది సమయంలో చూడగలిగినవి, సమీపంలో ఉన్న ప్రదేశాలను ఎంచుకోవాలి.2వ రోజుగువాహటి నుంచి షిల్లాంగ్‌కు ప్రయాణం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కామాఖ్య దర్శనానికి వెళ్లాలి. దర్శనం తర్వాత షిల్లాంగ్‌కు ప్రయాణం. షిల్లాంగ్‌లో హోటల్ చెక్ ఇన్, డాన్ బాస్కో మ్యూజియం వీక్షణం, లేడీ హైదరీపార్క్లో విహారం, సాయంత్రం విశ్రాంతి, రాత్రి భోజనం, బస షిల్లాంగ్ హోటల్లోనే. ఆసక్తి ఉన్న వాళ్లు సాయంత్రం విశ్రాంతి సమయంలో సొంతంగా నగర పర్యటన చేయవచ్చు.సాహిత్య కథనంకామాఖ్య ఆలయం గురించి జనబాహుళ్యంలో అనేక కథనాలు ఉన్నాయి. కామదేవ్ అనే రాజు దీనిని నిర్మించాడని చెబుతారు. అంతకంటే ముందు బిశ్వకర్మ శిల్పచాతుర్యంతో మహాగొప్ప నిర్మాణం చేశాడని పై భాగం విధ్వంసానికి గురైందని చెబుతారు. దేవీ భాగవతం, దేవీ పురాణం, కాళికా పురాణం, యోగిని తంత్ర, హేవజ్ర తంత్ర సాహిత్యాల్లో ఈ ఆలయం ప్రస్తావన ఉంది. శైవం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయం ప్రాభవం తగ్గింది. బ్రహ్మపుత్ర లోయలోని రాజ్యాన్ని పాలించిన నరక అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడనే కథనం కూడా ఉంది. చారిత్రక ఆధారాలు పెద్దగా లేకపోవడంతో సాహిత్యం, వ్యవహారికంలో ఉన్న కథనాలే ఆధారం.ఏడంతస్థుల మ్యూజియంషిల్లాంగ్లో నెలకొల్పిన మ్యూజియానికి మూలం రోమ్ నగరం. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలతోపాటు వారు అనుసరించే జీవనశైలిలో దాగిన శాస్త్రీయతను అధ్యయనం చేసిన మీదట వాటిని ప్రోది చేస్తూ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన బ్రిటిష్ పాలకులకు వచ్చింది. ఏడంతస్థుల భారీ నిర్మాణంతో మ్యూజియానికి ఏర్పాట్లు జరిగాయి. అందులో స్థానిక జాతుల భాషల వివరాలతో లైబ్రరీ కూడా ఉంది. ఆదివాసీ జీవితం కళ్లకు కట్టే విధంగా చిత్రాలు, శిల్పాల అమరిక ఉంది. మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న చర్చ్ కూడా ఉంది. పదేళ్ల కిందట ఈ మ్యూజియాన్ని ఏడాదికి 70 వేల మంది సందర్శించేవారు. ఆ నంబరు ఏడాదికేడాదికీ పెరుగుతూ ఇప్పుడు లక్ష దాటింది.3వరోజుషిల్లాంగ్ నుంచి చిరపుంజికి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చిరపుంజికి విహారయాత్ర. దారిలో ఎలిఫెంటా ఫాల్స్, ద్వాన్ సైయిమ్ వ్యూ పాయింట్, నోహ్ కలైకాల్ ఫాల్స్, మావ్ స్మాయ్ గుహలు, సెవెన్ సిస్టర్ జలపాతాల విహారం తర్వాత రాత్రికి తిరిగి షిల్లాంగ్ చేరాలి. రాత్రి భోజనం, బస షిల్లాంగ్‌లో.ఐదు వందల ఏళ్ల వంతెనచిరపుంజి అనగానే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశంగానే మనకు పరిచితం. కానీ ఈ ప్రదేశం లివింగ్ బ్రిడ్జిలు కూడా ప్రసిద్ధి. అంటే బతికున్న వంతెనలు. చెట్ల వేళ్లతో అల్లిన వంతెనలన్నమాట. చెట్ల నుంచి వేళ్లను వేరు చేయరు, అలాగే సాగదీసి తాడులా అల్లుతారు. ఆ వేరు అలాగే ముందుకు పెరుగుతూ ఉంటుంది. దానిని కూడా అల్లికలో కలుపుతూ ఉంటారు. ఒక వంతెన ఏర్పడాలంటే పది నుంచి పదిహేనేళ్లు పడుతుంది. ఇలాగ ఐదు వందల ఏళ్ల నాటి వంతెన నేటికీ ఉంది. ఈ వంతెనలు ఒక్కోచోట రెండంతస్థుల వంతెనలు కూడా ఉంటాయి. ఇంతకీ ఇక్కడ ఇంత స్థాయిలో వర్షం కుండపోతగా కురవడానికి కారణం ఏమిటంటే... బంగాళాఖాతం నుంచి ఆవిరైన నీటితో ఏర్పడిన మబ్బులు ప్రయాణించే దారిలో ఎత్తుగా ఉన్న ఖాశి పర్వత శ్రేణులను తాకుతాయి. మబ్బులను గాలి బలంగా తోస్తూ ఉంటుంది. ముందుకు వెళ్లడానికి వీల్లేకుండా పర్వత శ్రేణి అడ్డుకుంటుంది. దాంతో మబ్బులు ఒక్కసారిగా కుండపోతగా కురుస్తాయి.ఏనుగు జలపాతంషిల్లాంగ్ నగరం దాటిన తర్వాత పది కిలోమీటర్ల దూరాన ఉందీ జలపాతం. షిల్లాంగ్ వాసులకు వీకెండ్ పిక్నిక్లాంటిదన్నమాట. ఈ జలపాతం విశాలంగా ఉంటుంది. కర్నాటకలోని హోగెనక్కల్ జలపాతం పాయలు పాయలుగా విడిపోయి ఊరంత విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. మేఘాలయలోని ఈ జల΄ాతం జలధారలన్నీ ఒకే చోట చేరినట్లు ఉంటుంది. ఒత్తైన జుత్తు వీపంతా పరుచుకున్నట్లు నల్లటి రాళ్ల మీద పరుచుకున్న తెల్లటి జలధారలివి. ఇక్కడ ఒక రాయి ఏనుగు ఆకారంలో ఉండడంతో దీనికి బ్రిటిష్ వాళ్లు ఎలిఫెంట్ ఫాల్స్ అని పేరు పెట్టారు. అంతకంటే ముందు స్థానికు ఖాసీ తెగ వాళ్లు తమ ఖాసీ భాషలో దీనికి పెట్టుకున్న పేరు ‘కా కై్షద్ లాయ్ పతెంగ్ ఖోసియో’.ఒట్టు బండఖాసీ భాషలో మావ్ స్మాయ్ అంటే ‘ఒట్టు బండ’ అని అర్థం. ఈ గుహలకు పేరు స్థిరపడింది. ఈ గుహలకు వెళ్లాలంటే చిరపుంజి నుంచి అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇవి మన కర్నూలులో ఉన్న బెలుం గుహలు, అరకులో ఉన్న బొర్రా గుహల్లాంటి స్టాలక్టైట్, స్టాలగ్మైట్ గుహలు. అయినప్పటికీ ఇలాంటి ప్రకృతి వింతలను ఎన్నిసార్లయినా చూడాల్సిందే.4వ రోజుషిల్లాంగ్ నుంచి డావ్కీ కి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పర్యటన డావ్కీ వైపు సాగుతుంది. ఆ తర్వాత మావ్లీన్నాంగ్ గ్రామ సందర్శనం. సాయంత్రానికి తిరిగి షిల్లాంగ్‌కి చేరాలి. రాత్రి భోజనం, బస షిల్లాంగ్ హోటల్లో.గాల్లో పడవఇక్కడున్న ఫొటో చూడండి. నీటి మీద ఉండాల్సిన పడవ గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. గూగుల్‌లో దొరికిన ఈ ఫొటో మీద ముచ్చటపడి పీసీ డెస్క్‌టాప్ పిక్ గా, ఫోన్లో స్క్రీన్ పిక్‌గా పెట్టుకుంటుంటాం. ఇది మేఘాలయలోని ఉమ్న్గోట్ నది. నీటి స్వచ్ఛతకు ప్రత్యక్ష నిదర్శనం ఈ ఫొటో. నీటి అడుగున నేల స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ నది డావ్కీ పట్టణంలో ఉంది. ఈ పట్టణం మనదేశ సరిహద్దు. పట్టణ శివారులో కంచె ఉంటుంది. కంచె ఆవల బంగ్లాదేశ్. ఇందులో పడవ ప్రయాణం చేసి, రెండంతస్థులుగా ఉన్న వేళ్ల వంతెన మీద నడిచి, ఇండో–బంగ్లా ట్రేడ్ రూట్ చూసి, బోర్డరులో కంచె దగ్గర నిలబడి ఫొటో తీసుకుంటే టూర్లో థ్రిల్ సగం సొంతమైనట్లే.స్వచ్ఛమైన గ్రామంమావ్ లిన్నాంగ్ గ్రామం మనదేశంలో మాత్రమే కాదు ఆసియా ఖండంలోనే రికార్డు సృష్టించిన గ్రామం. ‘డిస్కవర్ ఇండియా’ మ్యాగజైన్ నిర్వహించిన పోటీలో క్లీనెస్ట్ విలేజ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామంలో తొమ్మిది వందల మంది నివసిస్తున్నారు. 90 శాతం అక్షరాస్యత సాధించిన గ్రామం. వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్లే అందరూ. గ్రామం మొత్తం తిరిగి చూస్తే ఎక్కడా ఒక్క ఆకు నేల మీద కనిపించదు. రోడ్లు అద్దంలా మెరుస్తుంటాయి. ఇది కూడా ఇండో– బంగ్లా సరిహద్దులో ఉన్న గ్రామమే. 5వ రోజుషిల్లాంగ్ నుంచి జోవాయ్‌కి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ప్రయాణం జాంతియా హిల్స్ వైపు సాగుతుంది. తడ్లాస్కీన్ సరస్సు, తైరిషి ఫాల్స్, క్రాంగ్సురీ ఫాల్స్, దుర్గా మందిరం, నార్తియాంగ్ మోనోలిథ్ పార్క్ చూసుకుని సాయంత్రం షిల్లాంగ్‌కు తిరుగు ప్రయాణం. రాత్రి భోజనం, బస షిల్లాంగ్‌లోనే.స్మారక శిలలువ్యక్తులు, రాజుల జ్ఞాపకార్థం కానీ గౌరవార్థంగా కానీ సమాధులు నిర్మిస్తారు. స్మారక భవనాలను నిర్మిస్తారు. ఈజిప్టులో పిరమిడ్లు నిర్మిస్తారు. మేఘాలయలో కనిపించే మోనోలిథ్, మెగాలిథ్లు కూడా ఇలాంటి స్మారకాలే. జాంతియా రాజ్యాన్ని పాలించిన రాజుల స్మారకంగా ప్రతిష్టించిన ఏకశిల, బృహత్ శిలలివి. వీటిలో రాజులు తమ విజయాలకు చిహ్నంగా ప్రతిష్ఠించిన శిలలు కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రతి ఏకశిల, బృహత్ శిల వెనుక ఒక చరిత్ర ఉంటుంది. నార్తియాంగ్ అనే ప్రదేశంలో ఉన్న మోనోలిథ్, మెగాలిథ్లు అత్యంత ఎత్తైనవిగా గుర్తింపు పొందాయి.ముత్యాల జలపాతంక్రాంగ్షురి జలపాతం ఓ అద్భుతం. అద్భుతం అనడం ఎందుకంటే జలపాతపు నీరు మడుగులో కనిపించే టర్కోయిస్ నీలిరంగే ఆ అద్భుతం. నీరు నేలను తాకి తటాకంగా మారినప్పుడు కనిపించే నీలిరంగు ఇక్కడ కనిపించదు. ఏ జలపాతానికైనా జలధారలు ముత్యాల వానను తలపిస్తుంటాయి. నేలను తాకిన తర్వాత తటాకం చిక్కటి నీలవర్ణంలో లేదా ఆకుపచ్చటి రంగులో కనిపిస్తుంది. మేఘాలయలో కొండల నుంచి జాలువారిన నీరు అత్యంత స్వచ్ఛమైనది. 6వ రోజుషిల్లాంగ్ నుంచి గువాహటికి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. గువాహటికి చేరే మధ్యలో ఉమియుమ్ లేక్‌లో విహారం. గువాహటికి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్. మధ్యాహ్నం తర్వాత బ్రహ్మపుత్ర నదిలో క్రూయిజ్ విహారం (ఇది ప్యాకేజ్‌లో వర్తించదు). సాయంత్రం గువాహటి లోకల్ మార్కెట్లో షాపింగ్. హోటల్ గదికి చేరి రాత్రి భోజనం, బస.బ్రహ్మపుత్రలో విహారంబ్రహ్మపుత్ర నదిలో విహరించకుండా మేఘాలయ, అస్సామ్ టూర్ ముగిస్తే ఆ టూర్‌కి దక్కాల్సిన గౌరవం దక్కలేదనే చె΄్పాలి. బ్రహ్మపుత్ర నదికి దానికంటూ ఓ గొప్పదనం ఉంది. ప్రపంచంలోని పెద్ద నదుల్లో ఇదొకటి. హిమాలయ శ్రేణుల్లో టిబెట్ దగ్గర పుట్టి ఇండియాలో విస్తరించి బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడి సంస్కృతి వీక్షణానికి అన్ని సౌకర్యాలున్న క్రూయిజ్‌లో బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణించడం సులువైన మార్గం. వైవిధ్యమైన బౌద్ధ నిర్మాణాల ఆర్కిటెక్చర్, హిందూ ఆలయాల నిర్మాణశైలి, ఇస్లాం, క్రైస్తవ ప్రార్థనమందిరాలతోపాటు సామాన్యులు నివసించే ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రత్యేకంగా పరిశీలించాలి. సంప్రదాయ నిర్మాణాలతోపాటు ఆధునిక నిర్మాణాల్లో కూడా స్థానిక ప్రత్యేకతలు కనిపిస్తాయి. 7వ రోజుబ్రేక్ఫాస్ట్,గది చెక్ అవుట్ తర్వాత పర్యాటకులు తిరుగు ప్రయాణానికి చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం నిర్వహకులు రైల్వే స్టేషన్, ఎయిర్΄ోర్టులో డ్రాప్ చేయడంతో పర్యటన పూర్తవుతుంది.ఇది మేఘాలయ టూర్. ఏడు రోజుల పర్యటన. ప్యాకేజ్ పేరు ‘ఎసెన్స్ ఆఫ్ మేఘాలయ గ్రూప్ ప్యాకేజ్ ఎక్స్ గువాహటి’. ఈ ప్యాకేజ్‌లో గువాహటి, షిల్లాంగ్, చిరపుంజి, డావ్కీ కవర్ అవుతాయి. ఇది వీక్లీ టూర్. శనివారం మొదలై శుక్రవారంతో పూర్తవుతుంది. ప్యాకేజ్ కోడ్ : https://irctctourism.com/ pacakage_ description? packageCode= EGH05టికెట్ ధరలిలాగ: సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 35 వేల రూపాయలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో దాదాపుగా 28 వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 26 వేలవుతుంది. ఇది గువాహటి నుంచి మొదలై గువాహటికి చేరడంతో పూర్తవుతుంది. పర్యాటకులు తాము ఉన్న ప్రదేశం నుంచి గువాహటికి చేరడం, గువాహటి నుంచి తిరిగి తమ ప్రదేశానికి చేరే ప్రయాణ ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు.గమనిక: కామాఖ్య దర్శనం కోసం వీఐపీ పాస్‌లు కావాలనుకునే వాళ్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీఐపీ టికెట్ ధర 501 రూపాయి. లింక్ https://mkdonline.in– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ‘రాక్‌స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం) -
బంగారు భారతం..! తప్పక సందర్శించాల్సిన యాత్ర..
ఇండిపెండెన్స్‌డే రోజు గాంధీజీ హృదయ్‌కుంజ్...ఆ తర్వాత... రోజుకొకటిగా అనేక ప్రదేశాలు. దేశఐక్యత ప్రతీక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ... గాంధీజీ కారాగారం అగాఖాన్ ప్యాలెస్.మరాఠాల శౌర్యానికి ప్రతీక శనివార్వాడా... వావ్ అనిపించే గుజరాత్ మెట్ల బావులు...అదాలజ్ కా వావ్... పఠాన్‌లోని రాణీ కీ వావ్... దక్కన్ కోసం శంభాజీ నగర్ మినీ తాజ్‌మహల్. బౌద్ధ చిత్రాల అజంత గుహలు... శిల్పాల ఎల్లోరా... ఝాన్సీలో వీరాంగణ లక్ష్మీబాయ్ కోట.సంక్రాంతి వేడుకల రామ్‌రాజా టెంపుల్. మొధేరాలో సూర్యుడి మెత్తని కిరణాలు.ఈ టూర్లో మినిమమ్ గ్యారంటీలివి. మన భారతం బంగారు భారతం. అందుకే... ఇది స్వర్ణ భారత్ యాత్ర.1వ రోజురాత్రి ఏడు గంటలకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌కు చేరాలి. ఎనిమిది గంటలకు రైలు అహ్మదాబాద్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.2వ రోజుఉదయం రైల్లోనే టీ, రిఫ్రెష్మెంట్, బ్రేక్‌ఫాస్ట్ పూర్తయిన తర్వాత పదకొండు గంటలకు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ అవ్వాలి. మధ్యాహ్న భోజనం తర్వాత సబర్మతి ఆశ్రమం, అదాలజ్ కా వావ్, సాయంత్రం సబర్మతి రివర్‌ఫ్రంట్ విహారం తర్వాత హోటల్‌కు చేరాలి. భోజనం, బస అక్కడే.సబర్మతి తీరాన హృదయ్‌కుంజ్ అహ్మదాబాద్‌లో గాంధీజీ నివసించిన ఆశ్రమం సబర్మతి నది తీరాన ఉండడంతో సబర్మతి ఆశ్రమం అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. కానీ గాంధీజీ తన ఇంటికి పెట్టుకున్న పేరు ‘హృదయ్ కుంజ్’. ఐదెకరాల్లో విస్తరించిన ఆశ్రమంలో గాంధీజీ నివసించడానికి ఒక భవనం, వంట కోసం, భోజనాల కోసం, స్వాతంత్య్ర సమరయోధుల సమావేశాల కోసం అనేక భవనాలను నిర్మించారు. ఇప్పుడు కొన్ని భవనాలను మ్యూజియంగా మార్చారు. ఇక రివర్ ఫ్రంట్ అంటే సబర్మతి తీరాన సూర్యోదయం, సూర్యాస్తమయాల వీక్షణను, వాకింగ్‌కి అనువుగా డెవలప్ చేసిన కారిడార్. మన స్వాతంత్య్రదినోత్సవం నాడు దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ ఆశ్రమాన్ని, స్వాతంత్య్ర పథక రచనలు జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన అనుభూతి అనిర్వచనీయమైనది.వావ్... ఇది బావిఅదాలజ్ కా వావ్. ఇది మెట్ల బావి. ఐదంతస్థుల నిర్మాణం. వర్షాకాలంలో మూడు అంతస్థులు దిగితే నీటిని అందుకోవచ్చు. వేసవిలో ఐదంతస్థుల కిందికి దిగితే కానీ నీరందదు. బయట ఎంత వేడి ఉన్నప్పటికీ ఈ బావి దగ్గర చల్లగా ఉంటుంది. మంచి గాలి వీస్తూ ఆహ్లాదంగా గడపవచ్చు. ఇది గుజరాత్ రాజధాని నగరం గాంధీనగర్‌కు సమీపంలో ఉంది. మధ్యయుగంలో విదేశాలతో వర్తక వాణిజ్యాలు నిర్వహించే వ్యాపారులు, పర్యాటకులు ఈ ప్రదేశం నుంచి రాకపోకలు సాగించేవారు. వారి సౌకర్యార్థం రాణి రుడాబాయి క్రీ.శ 1498లో దీనిని నిర్మించారు. ఇక్కడ పండుగలకు సంప్రదాయ వేడుకలు నిర్వహిస్తారు.ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఎనిమిదిన్నరకు రోడ్డు మార్గాన మొధేరాకు ప్రయాణం. మొధేరా సూర్యదేవాలయ వీక్షణం. లంచ్ తర్వాత పఠాన్‌కు ప్రయాణం. రాణీ కీ వావ్ విహారం తర్వాత అహ్మదాబాద్‌కు వచ్చి హోటల్లో భోజనం, బస.పుష్పవతి తీరాన సూర్యదేవాలయంమొధేరాలోని సూర్యదేవాలయం అద్భుతమైన నిర్మాణం. దీని ఆర్కిటెక్చర్ గొప్పతనాన్ని వివరించాలంటే ఒక గ్రంథమే అవుతుంది. గుర్జర శైలి నిర్మాణం ఇది. దీనిని క్రీ.శ 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశానికి చెందిన మొదటి భీమదేవుడు నిర్మించాడు. ఆలయం ఎదురుగా పెద్ద నీటి కొలను, దాని చుట్టూ జామెట్రికల్ డిజైన్‌తో నిర్మించిన మెట్లు మనదేశ నిర్మాణ కౌశలానికి నిదర్శనాలు.సరస్వతి తీరాన రాణీ కీ వావ్రాణీ కీ వావ్ చూస్తే నోరెళ్ల బెట్టి వావ్ అనాల్సిందే. ఇది పఠాన్ నగరంలో సరస్వతి నది తీరాన ఉంది. పఠాన్ నగరం మొధేరాకి 35 కిమీల దూరాన ఉంది. స్టెప్ వెల్ నిర్మాణాల్లో పతాకస్థాయి నిర్మాణం ఇది. ఈ గోడలకున్న శిల్పాలు, రాతిలో చెక్కిన డిజైన్లు చూపుతిప్పుకోనివ్వవు. ఈ గోడల మీదున్న డిజైన్లను చేనేతకారులు చీరల మీద నేస్తారు. యునెస్కో ఈ నిర్మాణాన్ని పదేళ్ల కిందట హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.]4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత అహ్మదాబాద్‌లోని హోటల్ గదిని చెక్ అవుట్ చేసి రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. తొమ్మిదిన్నరకు రైలు ఏక్తానగర్‌కు బయలుదేరుతుంది. లంచ్ రైల్లోనే. ఒంటిగంటకు రైలు దిగి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వీక్షణానికి వెళ్లాలి. అక్కడ షో చూసి, వెనక్కి వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి పది గంటలకు రైలు ఖాద్కీ (పూనే) స్టేషన్‌కు బయలుదేరుతుంది.నర్మద తీరాన ఐక్యత నిర్మాణంసర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మన దేశానికి భౌగోళిక రూపాన్నిచ్చిన ఆర్కిటెక్ట్. నర్మద నది తీరాన ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దాదాపు ఆరువందల అడుగుల విగ్రహం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఇది పటేల్ నూటయాభైవ జయంతి ఏడాది. పటేల్ విగ్రహం తయారీకి శిల్పికి ఒక డిజైన్ ఇవ్వడానికి చరిత్రకారులు, కళాకారులు, విద్యావేత్తల బృందం పని చేసింది. ఈ విగ్రహం ఉన్న ప్రదేశం పేరు కెవాడియా. ఇక్కడి రైల్వేస్టేషన్‌కి అదే పేరు. ఇప్పుడు దీనిని ఏక్తానగర్‌గా మార్చారు.5వ రోజుఉదయం ట్రీ, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తొమ్మిది గంటలకు రైలు ఖాద్కీ స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి ఆగాఖాన్ ప్యాలెస్ సందర్శనానికి వెళ్లాలి. హోటల్లో చెక్ ఇన్ అయ్యి, మధ్యాహ్న భోజనం తర్వాత కాస్బా గణపతి, లాల్ మహల్, శనివార్ వాడాల్లో పర్యటించి హోటల్‌కు చేరాలి. రాత్రి భోజనం, బస అక్కడే.మూలనది తీరం గాంధీజీ కారాగారంఅగాఖాన్ ప్యాలెస్ పూనేలో ఉంది. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడుతో΄ాటు అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ కారాగార శిక్షను అనుభవించారు. కస్తూర్బా గాంధీ ఇక్కడే తుదిశ్వాస వదిలారు. ప్యాలెస్ ప్రాంగణంలో కస్తూర్బా సమాధి, గాంధీజీ చితాభస్మ సమాధి ఉన్నాయి. ప్యాలెస్‌లో క్విట్ ఇండియా ఉద్యమ చిహ్నంగా విగ్రహం ఉంది.ఛత్రపతుల కోట శనివార్ వాడాశనివార్ వాడా మరీ ప్రాచీనమైనదేమీ కాదు, 18వ శతాబ్దపు నిర్మాణం. సరైన నిర్వహణ లేక కొంతకాలం కళ తప్పింది. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలోకి వచ్చిన తరవాత కళను సంతరించుకుంటోంది. ఇది ఏడంతస్థుల నిర్మాణం. మరాఠా వీరుల శౌర్యానికి ప్రతీకగా పీష్వా మొదటి బాజీరావ్ విగ్రహం ఉంది. ఢిల్లీలోని మొఘల్ పాలకులకు ఎదురు నిలబడి దీటుగా బదులిస్తున్నట్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ కోటను ఉత్తరాభిముఖంగా నిర్మించాడు ఛత్రపతి షాహు.6వ రోజుఆరవ రోజు: ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని హోటల్ గది చెక్ అవుట్ చేసి ఎనిమిది గంటలకంతా భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరాలి. దారిలో లంచ్ చేసుకుని, ఆ తర్వాత ఆలయ దర్శనం చేసుకుని ఖాద్కీ రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. భోజనం, బస రైల్లోనే. రైలు రాత్రి పది గంటలకు ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్)కు బయలుదేరుతుంది.ప్రకృతి ఒడిలో భీమశంకరుడుద్వాదశ జ్యోతిర్లింగాల్లో భీమశంకర్ ఒకటి. ఇది పూనేకి 50 కిలోమీటర్ల దూరాన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవిలో ఉంది.7వ రోజుఉదయం టీ, రిఫ్రెష్మెంట్, బ్రేక్‌ఫాస్ట్ పూర్తయిన తర్వాత రైలు ఛత్రపతి శంభాజీ నగర్‌కు చేరుతుంది. రైలు దిగి బీబీ కా మఖ్బారా వీక్షణానికి వెళ్లాలి. ఆ తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, లంచ్. ఆ తర్వాత ఎల్లోరా గుహలు చూసుకుని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లాలి. రాత్రి భోజనం, బస హోటల్లో.శంభాజీ నగర్ మినీ తాజ్మహల్మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన రెండవ ఛత్రపతి శంభాజీ భోసాలే పేరుతో ఔరంగాబాద్ నగరానికి శంభాజీ నగర్ అని పేరు పెట్టారు. ఇక్కడ ఔరంగజేబు మనుమడు అజమ్ షా తన తల్లి దిల్రాస్ బాను బేగం కోసం తాజ్ మహల్ నమూనాలో నిర్మించిన బీబీ కా మఖ్బారా (మినీ తాజ్‌మహల్) పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ పాన్ ఫేమస్. స్టార్ పాన్ షాప్ నుంచి అరబిక్ దేశాలకు పాన్లు ఎగుమతి అవుతాయి. అత్యంత ఖరీదైన ఎక్స్΄ోర్ట్ క్వాలిటీపాన్ ధరలు వేలల్లో ఉంటాయి. ఈ టూర్ గుర్తుగా తక్కువలో తక్కువగా వచ్చే పాతిక రూపాయల పాన్ అయినా రుచి చూడాలి.8వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గాన అజంతా గుహలకు వెళ్లాలి. అజంతా గుహల సందర్శన తర్వాత మధ్యాహ్న భోజనం, ఆ తర్వాత భుసావల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. రైలు సాయంత్రం ఆరు గంటలకు ఝాన్సీకి బయలుదేరుతుంది. రాత్రి భోజనం, బస రైల్లోనే. బౌద్ధ చిత్రాల అజంతఎల్లోరా– అజంతా గుహలు మనదేశంలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పడానికి మనకున్న గొప్ప చారిత్రక ఆధారాలు. యునెస్కో ఈ గుహలను వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఇందులో కొన్ని గుహలు చైత్యాలు. అంటే ప్రార్థన మందిరాలు. కొన్ని విహారాలు... అంటే నివాస ప్రదేశాలు. రంగురంగుల పెయింటింగ్స్ కోసమే ఈ గుహలకు వెళ్లాలి. ఎల్లోరా గుహల్లో శిల్పాలుంటాయి. అజంతాగుహలు చిత్రాలకు ప్రసిద్ధి.9వ రోజుఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఏడుగంటలకు రైలు వీరాంగణ లక్ష్మీబాయ్ ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి ఓర్చాలో హోటల్ గదికి వెళ్లి రిఫ్రెష్మెంట్ తర్వాత చెక్ అవుట్ చేయాలి. ఓర్చాలో ఉన్న రామ్ రాజా టెంపుల్, చతుర్భుజ టెంపుల్, జహంగీర్ మహల్ చూసుకుని లంచ్ తర్వాత ఝాన్సీ వైపు సాగి΄ోవాలి. ఝాన్సీ కోట, మ్యూజియం సందర్శన తర్వాత ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలెక్కాలి. రైలు రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ, సఫ్దర్‌జంగ్ స్టేషన్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం, బస రైల్లోనే.ఉత్తరాదిలో సంక్రాంతి వేడుకరామ్ రాజా మందిర్... ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఓర్చా పట్టణంలో ఉంది. ఓర్చా టెంపుల్‌గా వ్యవహారంలోకి వచ్చింది. ఈ ఆలయంలో ఏటా శైవ, వైష్ణవ పర్వదినాలతోపాటు మకర సంక్రాంతి వేడుకలు కూడా నిర్వహిస్తారు, రాముడి ఆలయం. రాముడి ఆలయం అంటే ధనుర్ధారిౖయె సీతాలక్ష్మణ సమేతంగా అడవుల బాట పట్టిన కోదండ రాముడి రూపమే ఉంటుంది. ఇక్కడ మాత్రం రాముడు రాజు హోదాలో పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న శిల్పాల సముదాయాన్ని చూస్తే అరణ్యవాసం, రామరావణ యుద్ధం పూర్తయిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రాముడిని తలపిస్తుంది. ఆలయ నిర్మాణం కూడా అంతఃపురాన్ని ΄ోలి ఉంటుంది.ఝాన్సీ కోటలో రాణిమహల్ఝాన్సీ కోట శత్రుదుర్భేద్యంగా ఉంటుంది. కానీ ప్యాలెస్‌లు నిరాడంబరంగా ఉంటాయి. చతుర్భుజి ఆకారంలో రెండతస్థుల భవనం, మధ్యలో బావి, ఫౌంటెయిన్, లాన్, గదుల్లోపల గోడలకు చక్కటి పెయింటింగులతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ ప్యాలెస్ అందంగా ఉంటుంది. బ్రిటిష్ సైన్యంతో ΄ోరాడిన ధీర మహిళ లక్ష్మీబాయ్. ఆమె యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమై, బిడ్డను వీపుకు కట్టుకుని కోట గోడ మీద నుంచి అమాంతం గుర్రం మీదకు దూకిన ప్రదేశాన్ని చూపిస్తారు. ఝాన్సీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మ్యూజియంలో టెర్రకోట బొమ్మలు, లోహపు బొమ్మలు, ఆయుధాలు, శిల్పాలు, చేతి రాత ప్రతులు, చిత్రలేఖనాలు, బంగారు, వెండి, రాగి నాణేలు, లోహపు విగ్రహాలు, దుస్తులను చూడవచ్చు. 10వ రోజుఉదయం ఆరు గంటలకు రైలు ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ స్టేషన్‌కు చేరుతుంది. టీ తర్వాత రైలు దిగడంతో పర్యటన పూర్తవుతుంది.స్వర్ణిమ్ భారత్ యాత్ర (సీడీబీజీ 30), ఇది పది రోజుల టూర్. ఆగస్ట్ 14న మొదలై 23వ తేదీతో పూర్తవుతుంది. ఇందులో అహ్మదాబాద్, మొథేరా, పూనే, ఔరంగాబాద్, ఓర్చా, ఝాన్సీ ప్రదేశాలు కవర్ అవుతాయి. టూర్ కోడ్... SWARNIM BHARAT YATRA (CDBG30) -
ఛత్రపతి విజయ విహారం..! ఆరో రోజుల టూర్..
ఈ టూర్లో గిరిదుర్గాలే ప్రధానం. ఛత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతీకలు. తిరుమల కొండలంత ఎత్తులో ఉన్నాయి. ఇక... ఓ వనాలయం... మరో నగరాలయం. అవి... దట్టమైన వనాల్లో విస్తరించిన జ్యోతిర్లింగం.మరోటి... ప్రాచీన నగరంలో విలసిల్లిన లక్ష్మీదేవి ఆలయం.1వ రోజుఉదయం ఆరున్నరకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాదర్, థానేలలో ఎక్కడైనా రైలెక్కవచ్చు. రైలు రాయగఢ్ వైపు సాగుతుంది. రైల్లో బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. పదిన్నరకు రైలు మాన్‌గోవ్ స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన రాయగఢ్ కోటకు చేరాలి. మధ్యాహ్న భోజనం ఎక్కడ అనేది సమయాన్ని బట్టి నిర్ధారిస్తారు. రాయగఢ్ పర్యటన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు మాన్‌గోవ్ స్టేషన్‌కు వచ్చి రైలెక్కాలి. రైలు ఆరు గంటలకు పూనే వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే. పది గంటలకు రైలు పూనేకు చేరుతుంది. హోటల్‌కు చేరడం, పూనేలో రాత్రి బస.పట్టాభిషేక దుర్గంరాయిగఢ్ కోట ఉన్న పట్టణం పేరు మహద్. మహారాష్ట్ర, రాయగఢ్ జిల్లాలో ఉంది. ఇది మహాదుర్గం. సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని ఈ కొండమీదకు చేరడానికి రోప్‌వే, ఏరియల్ ట్రామ్వే ఉన్నాయి. కోట లోపల శివాజీ సింహాసనం, పట్టాభిషేకం జరిగిన ప్రదేశం, చెక్కతో నిర్మించిన రాణి ప్యాలెస్, శివాజీ తల్లి జిజాబాయి సమాధి, శివాజీ సమాధి ఉన్నాయి. కోటగోడలు, దర్వాజాల మీదకు అల్లుకున్న పిచ్చి చెట్లుతీగలనుచూస్తే ఈ కోట పరిరక్షణ పట్ల ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని తెలుస్తుంది. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి బాధ్యత అప్పగించడంతో పునరుద్ధరణ చర్యలు జరుగుతున్నాయి. ఈ కోట మీద నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి సౌందర్యం అంతా దండగా అల్లి అమర్చినట్లుంటుంది. ఇది ఒక ఫీల్‌గుడ్ టూరిస్ట్ డెస్టినేషన్.2వ రోజుహోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పూనాలోని లాల్ మహల్, కాస్బా గణపతి ఆలయాల సందర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత శివ్శ్రుతి వీక్షణం. రాత్రి భోజనం తర్వాత హోటల్ గదికి చేరడం. ఆ రాత్రి బస కూడా పూనేలోనే.లాల్ మహల్ అంటే శివాజీ బాల్యం గడిచిన ΄్యాలెస్. శివాజీ తండ్రి షాహాజీ భోసాలే తన కొడుకు, భార్య కోసం కట్టించిన ప్యాలెస్ ఇది. నిజానికి షాహాజీ కట్టించిన నిర్మాణం నిర్వహణ సరిలేక శిథిలమైంది. ఇప్పుడు కనిపిస్తున్న ప్యాలెస్ అదే నమూనాలో చేసిన పునర్నిర్మాణం. ఇక నగరంలో చూడాల్సిన మరో ప్రదేశం కాస్బా గణపతి. ఇది శివాజీ తల్లి రాజమాత జిజాబాయి ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం. పూనే వాసులు గ్రామదేవతగా కొలుస్తారు. ఈఈ గణపతికి ఉన్న చారిత్రక ప్రత్యేకత ఏమిటంటే జాతీయోద్యమంలో భాగంగా బాలగంగాధర తిలక్ సామూహిక గణపతి ఉత్సవాలు మొదలు పెట్టింది ఈ ఆలయంలోనే. ప్రజలను ఒక చోటకు చేర్చడానికి, వారిని జాతీయోద్యమ బాట పట్టించడానికి ఈ ధార్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు తిలక్. 3వ రోజుశివనేరి కోట సందర్శనకు ఉదయాన్నే ఆరు గంటలకు టీ తాగిన తర్వాత హోటల్ నుంచి బయలుదేరాలి. బ్రేక్‌ఫాస్ట్ ΄్యాక్ చేసి ఇస్తారు. పూనే నుంచి శివనేరి కోటకు రెండు గంటల ప్రయాణం. మధ్యాహ్న భోజనం తర్వాత భీమశంకర్ దర్శనానికి వెళ్లాలి. ఈ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత పూనేకి వచ్చి రాత్రికి హోటల్లో బస చేయాలి.మరాఠా రాజ్యం పుట్టింది!శివ్నేరి కోట ఛత్రపతి శివాజీ పుట్టిన ప్రదేశం. మరాఠా రాజ్య నిర్మాత పుట్టిన నేల అంటే మరాఠా రాజ్యం పుట్టిన నేల కూడా. శివాజీ తాత మాలోజీ భోసాలే నివసించిన కోట ఇది. బహమనీ సుల్తానులు, మొఘలులు, బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధాలకు కేంద్ర బిందువు కూడా. ఈ కోట లోపల గంగ, యమున పేరుతో రెండు నీటి గుండాలున్నాయి. ఏడాది పొడవునా వీటిలో నీరు ఉంటుంది. ఈ కోట పై అంతస్థు నుంచి చూస్తే నారాయణగఢ్, హద్సార్, చావాంద్, నీమ్గిరి కోటలు కనిపిస్తాయి. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉండడంతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఈ కోటను వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. శివ్నేరి కోట నుంచి 70 కిమీల దూరంలో ఉంది భీమశంకర్. చిక్కటి పచ్చదనంతో విస్తరించిన సహ్యాద్రి శ్రేణుల్లో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవ జ్యోతిర్లింగ క్షేత్రం. మహారాష్ట్రలో భీమనది తీరాన ఉంది. 4వ రోజుఉదయం పూనేలో హోటల్ గది చెక్ అవుట్ చేసి రైలెక్కాలి. ఏడు గంటలకు రైలు బయలు దేరుతుంది. బ్రేక్‌ఫాస్ట్ రైల్లో ఇస్తారు. రైలు పది గంటలకు సతారా స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన ప్రతాప్‌గఢ్ కోటకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం, కోట సందర్శనం, రాత్రి భోజనం తర్వాత పదిన్నరకు రైలెక్కాలి. పదకొండున్నరకు రైలు కొల్హాపూర్ వైపు బయలుదేరుతుంది.మరాఠ విజయంమరాఠా సామ్రాజ్య స్థాపనలో కీలకమైన కోట ప్రజాప్గఢ్. మరాఠా సామ్రాజ్యాధినేత శివాజీకి బహమనీ సుల్తాన్ అజమ్ఖాన్కు మధ్య జరిగిన భీకర యుద్ధంలో శివాజీ గెలిచాడు. శివాజీ కొలిచిన తుల్జా భవానీ మాత ఆలయం ఈ కోటలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోట అందమైన ప్రకృతి సౌందర్యవీక్షణానికి వేదిక కూడా. 5వ రోజుతెల్లవారు జామున ఐదు గంలకు రైలు కొల్హాపూర్‌లోని షాహూ మహారాజ్ టెర్మినస్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్‌కు వెళ్లి రిఫ్రెష్ అయిన తర్వాత కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయ దర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత పన్హాల ఫోర్ట్ సందర్శనం. ఆ తర్వాత కొల్హాపూర్‌లోని రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి ముంబయి వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే.కొల్హాపూర్ మహారాష్ట్ర కాశీభారతీయులు జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలని కోరుకునే ప్రదేశం కొల్హాపూర్. ఇక్కడి లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి ఉత్తర– దక్షిణ భారతాల వాళ్లు వస్తారు. ఈ ఆలయ నిర్మాణం గురించి కూడా విశేషంగా చెప్పుకోవాలి. దక్షిణాది ఆలయాల్లాగ విగ్రహాల సుమహారంగా ఉండదు. ఉత్తరాది నిర్మాణాల్లాగానూ ఉండదు. స్థూలంగా నిర్మాణం రెండింటి కలయికగా ఉంటుంది. సునిశితంగా శిల్పనైపుణ్యాన్ని గమనిస్తే జామెట్రికల్ డిజైన్స్‌తో ఆచ్చెరువు కలిగిస్తుంది. దక్షిణ కాశిగా చెప్పుకుంటారు. పెద్ద పట్టణం, మరాఠీ సినిమా పరిశ్రమ కేంద్రం. ఈ పర్యటనలో కొల్హాపూర్ లక్ష్మీదేవి దర్శనం తర్వాత న్యూ ప్యాలెస్ వీక్షణం. ఆ తర్వాత కొల్హాపురి చెప్పులు ఒక జత కొనుక్కోవడం మర్చి΄ోవద్దు. ఎందుకంటే పనితనం రీత్యా వీటికి జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ కూడా వచ్చింది.పన్హల ఫోర్ట్శివాజీ ఈ కోటను బీజాపూర్ సుల్తానులతో యుద్ధం చేసి సాధించాడు. ఆ తర్వాత మరికొన్ని నిర్మాణాలు చేశాడు. శివాజీ వారసులు ఈ కోట నుంచి మొఘల్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధాలు చేశారు. ఈ కోట నిర్మాణపరంగా పెద్దది కాదు, కానీ మరాఠాల పాలన ముందుచూపుకు నిదర్శనం. కోట లోపల ధాన్యాగారం ఉంది. అందులో నిల్వ చేసిన ధాన్యం కోట లోపల ఉన్న వారికి మాత్రమే కాదు, రాజ్యంలో కరువు సంభవిస్తే ప్రజల ఆకలి తీర్చడానికి ఒక ఏడాదికి సరిపడినంత ధాన్యాన్ని నిల్వ చేసేవారు. కోట లోపల ఒక దిగుడు బావి ఉంది. స్టెప్‌వెల్‌లు గుజరాత్లో ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీలోనూ ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ ఉంది. తెలంగాణ జిల్లాల్లో కూడా ఉండేవి. ఆర్కియలాజికల్ సర్వే విభాగం తవ్వకాల్లో ఇటీవల కొన్ని స్టెప్‌వెల్‌లు బయటపడ్డాయి. భారతీయ శాస్త్రీయత నిర్మాణాలకు ఇవి తార్కాణాలు. 6వ రోజుఉదయం ఆరు గంటలకు రైలు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది. దాదర్, థానేల్లో కూడా దిగవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్క్యూట్ ప్రతాప్‌గఢ్... ఇది ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న ఆరు రోజుల టూర్ ప్యాకేజ్. జూన్ 9వ తేదీన మొదలవుతుంది. ముంబయిలో మొదలయ్యే ఈ టూర్లో రాయగఢ్ ఫోర్ట్, పూనే, శివనేరీ ఫోర్ట్, భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం, ప్రతాప్‌గఢ్ ఫోర్ట్, కొల్హాపూర్, పన్హలా ఫోర్ట్ కవర్ అవుతాయి.కొంకణ్ రైల్వేస్ ట్రైన్ ముంబయిలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి టూర్ మొదలవుతుంది. మాన్‌గోవ్, పూనే, సతారా, ఛత్రపతి షాహూ మహారాజ్ టెర్మినస్ కొల్హాపూర్ మీదుగా తిరిగి ముంబయికి చేరుతుంది.టికెట్ ధరలు స్లీపర్ క్లాస్ (ఎకానమీ)లో ఒకరికి 13,155 రూపాయలు, ధర్డ్ ఏసీ (కంఫర్ట్)లో దాదాపుగా 20వేలు, సెకండ్ ఏసీ (సుపీరియర్)లో 27 వేలకు పైగా అవుతుంది. రాత్రి బసకు ఎకానమీ క్లాస్‌కు నాన్ ఏసీ గదులు డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్‌లో ఇస్తారు. రైలు దిగిన తరవాత రోడ్డు ప్రయాణానికి నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం. కంఫర్ట్, సుపీరియర్ ΄్యాకేజ్లో బస ఏసీ గదుల్లో. ఒక్కరుగా బుక్ చేసుకున్న వారు ఇతర ప్రయాణికులతో రూమ్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఏసీ వాహనాలు. ప్యాకేజ్‌లో చెప్పిన టికెట్ ధరలకు ట్యాక్స్ అదనం. ప్యాకేజ్‌లో ట్రావెల్ ఇన్సూ్యరెన్స్, సెక్యూరిటీ ఉంటుంది. భోజనం శాకాహారం ఇస్తారు. పర్యాటక ప్రదేశాల్లో బోటింగ్ వంటి ఎంటర్టైన్మెంట్ ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్‌కే అందని మిస్టరీ..!) -
అంబేద్కర్ యాత్ర... త్రినేత్రుడి దర్శనం
ఈ టూర్ మిగతా టూర్లకంటే ప్రత్యేకం...ఎందుకు ప్రత్యేకం అంటారా! వినండి!మహాకాళేశ్వర్... ఓంకారేశ్వర్... త్రయంబకేశ్వర్... భీమ్శంకర్... ఘృష్ణేశ్వర్... మొత్తం ఐదు జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. ఓ మహోన్నత వ్యక్తి పుట్టిన ఊరిని కూడా. అది... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మభూమి... బౌద్ధం తీసుకున్న దీక్షభూమిని చూడవచ్చు.అందుకే ఈ యాత్ర పేరు ‘అంబేద్కర్ యాత్ర విత్ పంచ్ జ్యోతిర్లింగ దర్శన్’. 1వ రోజురైలు మధ్యాహ్నం రెండు గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ స్టేషన్లలో కూడా రైలెక్కవచ్చు. 2వ రోజుఉదయం ఎనిమిది గంటలకు రైలు నాగపూర్ స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్‌కెళ్లి రిఫ్రెష్మెంట్ తర్వాత చెక్ అవుట్ చేయాలి. దీక్షాభూమి స్థూప విజిట్, స్వామి నారాయణ మందిర్ దర్శనం తర్వాత తిరిగి రైల్వేస్టేషన్‌కు రావాలి. ట్రైన్ జర్నీ రాత్రి ఎనిమిది గంటలకు నాగపూర్ నుంచి ప్రయాణం ఉజ్జయినికి సాగుతుంది.బౌద్ధదీక్ష బూనిన నేలనాగపూర్లో ఉన్న దీక్షభూమికి అంబేద్కర్ జీవితంలో మాత్రమే కాదు బౌద్ధంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఇది హిందూ మతం నుంచి బౌద్ధమతంలోకి మారిన ప్రదేశం. అంబేద్కర్‌తోపాటు నాలుగు లక్షల మంది మతం మారి బౌద్ధ దీక్ష తీసుకున్నారు. ఈ చారిత్రక సంఘటన 1956, అక్టోబర్ 14 తేదీన విజయదశమి రోజున జరిగింది. బౌద్ధమత పునరుజ్జీవనం కోసం అంబేద్కర్ తన మార్కు మార్పులతో బౌద్ధానికి నవయాన బౌద్ధాన్ని ఆవిష్కరించారు. అందుకు ప్రతీకగా ఇక్కడ నిర్మించిన స్థూపానికి దీక్షభూమి స్థూపం అనే పేరు పెట్టారు. ఇది నిర్మాణంలో సాంచిలోని బౌద్ధ స్థూపాన్ని పోలి ఉంది. దీక్ష బూనిన సందర్భంగా చేసిన ప్రతిజ్ఞలతో ఇక్కడ ఒక ఫలకం ఉంది. అబద్ధం చెప్పను, దొంగతనం చేయను వంటి 22 ప్రతిజ్ఞలు ఈ ఫలకం మీద ఇంగ్లిష్‌లో ఉంటాయి.నాగపూర్ నారాయణుడునాగపూర్లోని స్వామినారాయణ్ మందిర్ కొత్త నిర్మాణం. పదకొండు ఎకరాల్లో విస్తరించి ఉంది. నిర్మాణంలో లాలిత్యం చూపుతిప్పుకోనివ్వదు. ఈ ఆలయాన్ని 2010– 17 వరకు ఏడేళ్ల ΄ాటు నిర్మించారు. గుజరాత్ నిర్మాణశైలి నిర్మాణం ఇది. ‘బోచసాంవాశి శ్రీ అక్షర పురుషోత్తమ్ స్వామి నారాయణ సంస్థ’ నిర్వహణలో ఉంది. ఇందులోని నారాయణుని విగ్రహం, అలంకరణ కూడా గుజరాత్ స్వామి నారాయణుని రూపాన్ని పోలి ఉంటుంది..3వ రోజుఉదయం పది గంటలకు రైలు ఉజ్జయిని స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్లో చెక్ ఇన్ కావాలి. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత తిరిగి హోటల్‌కు చేరాలి. రాత్రి బస ఉజ్జయిని లోనే.మహాకాలుడి ఆలయంఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రానికి, మహాకాళేశ్వర్ ఆలయానికి ప్రాచీన కాలం నుంచి ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న నిర్మాణం 18వ శతాబ్దం నాటిది. నిర్మాణపరంగా బాగా నిశితంగా పరిశీలించి ఆస్వాదించాల్సిన ఆలయం. ఇక్కడ శివుడు దక్షిణామూర్తి పేరుతో దక్షిణముఖంగా ఉంటాడు. ఈ ఆలయంలో భస్మహారతి ప్రసిద్ధి. ఈ ఆలయంలో డ్రెస్‌కోడ్ ఉంది. భారతీయ సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. చీరకొంగు, దుపట్టా లేదా స్కార్ఫ్‌తో తలను కప్పుకోవాలి. ఫొటోగ్రఫీ కి అనుమతి ఉండదు. కాబట్టి ఆలయం రూపం, దేవుని విగ్రహం రూపం మదిలో ముద్రించుకునే వరకు కంటినిండుగా చూడాలి.4వ రోజుఉదయం ఉజ్జయినిలో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రోడ్డు మార్గాన జన్మభూమికి వెళ్లాలి. ఇది బీఆర్ అంబేద్కర్ జన్మభూమి. మధ్యాహ్న భోజనం తర్వాత ఓంకారేశ్వర్ దర్శనం. ఆ తర్వాత ఎమ్‌హౌ (మిలటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ఫేర్, ఎమ్హెచ్ఓడబ్ల్యూ) రైల్వే స్టేషన్‌కి చేరి రైలెక్కాలి. ఈ రైల్వేస్టేషన్‌కి అంబేద్కర్ నగర్ రైల్వేస్టేషన్ అనే పేరు. రైలు నాసిక్ వైపు సాగి΄ోతుంది.భీమ్ రావ్ జన్మభూమిడాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుట్టిన ప్రదేశంలో ఆయన స్మారక భవనం నిర్మించారు. దీనిని భీమ్ జన్మభూమి అంటారు. ఇది మధ్యప్రదేశ్‌లోని ఎంహౌ (మిలటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ఫేర్) ప్రదేశంలో ఉంది. ఈ స్మారకానికి అంబేద్కర్ శతజయంతి సందర్భంగా 1991, ఏప్రిల్ 14వ తేదీన సంకల్పం జరిగింది. నిర్మాణం పూర్తయిన తర్వాత 2008, ఏప్రిల్ 14వ తేదీన 117వ జయంతి నాడు ప్రారంభం అయింది. భీమ్ జన్మభూమి తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వరుడి దర్శనం. ఈ జ్యోతిర్లింగం నర్మద నదిలోని మాందాత దీవిలో ఉంది. ఓంకారేశ్వరుడి దర్శనంతోపాటు నర్మద నది దక్షిణ తీరాన ఒడ్డు మీద ఉన్న మామలేశ్వర్ ఆలయ దర్శనం కూడా చేసుకోవచ్చు.5వ రోజుపగలంతా నాసిక్‌కు చేరడంలోనే పూర్తవుతుంది. ట్రైన్ సాయంత్రం ఆరు గంటలకు నాసిక్ రోడ్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. హోటల్లో చెక్ఇన్ అయిన తర్వాత రాత్రి భోజనం చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఈ రోజు పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం కుదరదు.6వ రోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్, ప్రయాణం రోడ్డు మార్గాన త్రయంబకేశ్వర్ వైపు సాగుతుంది. త్రయంబకేశ్వర్ దర్శనం తర్వాత నాసిక్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. రాత్రి ఎనిమిది గంటలకు ప్రయాణం పూనా వైపు సాగుతుంది.ముక్కంటికి గోదారమ్మ అభిషేకంత్రయంబకేశ్వర్ క్షేత్రం ఒక జ్యోతిర్లింగం. ఇక్కడ గర్భాలయంలో పానవట్టం ఒక పళ్లెంలాగ ఉంటుంది. అందులో మూడు చిన్న చిన్న శివలింగాలుంటాయి. ఆ పానవట్టం రాయి నుంచి నీరు ఉబుకుతూ శివలింగాలను అభిషేకిస్తూ ఉంటుంది. పూజారులు ఆ నీటిని చేత్తో తీసి పక్కన పోస్తుంటారు. ఆ నీరు గోదావరి నది నుంచి జాలువారుతున్న జల. ఆలయం పక్కనే బ్రహ్మగిరి కొండల నుంచి జాలువారే నీటిపాయ త్రయంబకం దగ్గర శివలింగాలను అభిషేకిస్తూ ముందుకు సాగుతూ క్రమంగా విస్తరిస్తుంది. గోదావరి పుట్టిన ప్రదేశాన్ని చూడాలంటేయువత బ్రహ్మగిరి కొండల్లోకి ట్రెకింగ్ చేయవచ్చు. కానీ ఈ టూర్లో అంత సమయం ఉండదు. ఈ ప్రాచీన ఆలయం సమీపంలో అన్నపూర్ణమాత ఆలయం ఉంది. ఇది పాలరాతి ఆలయం. దశాబ్దకాలం నాడు నిర్మించినది. ఆలయ ప్రాంగణం నుంచి గ్రానైట్ స్టోన్‌తో నిర్మించిన త్రయంబకేశ్వర ఆలయం, బ్రహ్మగిరి కొండల వ్యూ అద్భుతంగా ఉంటుంది.7వ రోజుతెల్లవారు జామున నాలుగన్నరకు రైలు పూనాలోని ఖడ్కీ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. పూనాలోని హోటల్లో చెక్ ఇన్ అయ్యి రిఫ్రెష్మెంట్ తర్వాత భీమశంకర్ జ్యోతిర్లింగ ఆలయానికి వెళ్లాలి. భీమశంకర దర్శన దర్శనం తర్వాత తిరిగి ఖడ్కీ రైల్వేస్టేషన్‌కి చేరి రైలెక్కాలి. రైలు రాత్రి పదకొండు గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణం ఔరంగాబాద్ వైపు సాగిపోతుంది.ప్రకృతి దర్శనంభీమశంకర జ్యోతిర్లింగం దర్శనానికి పూనా నుంచి నూట΄ాతిక కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. మందిరం ఉన్న నివాస ప్రదేశం పేరు కూడా భీమశంకరే. ఈ గ్రామం అటవీ ప్రదేశంలో భీమ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా ఉత్తర భారత రాష్ట్రాల నిర్మాణశైలి. నగర శైలి అంటారు. దక్షిణాది ఆలయాల శిల్పచాతుర్యం కనిపించదు. దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కూర్చుని ప్రకృతి ఒడిలో ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.8వ రోజుఉదయం ఏడు గంటలకు రైలు ఔరంగాబాద్‌కు చేరుతుంది. హోటల్‌కి వెళ్లి రిఫ్రెష్ అయిన తర్వాత ఘృష్ణేశ్వర్ దర్శనానికి వెళ్లాలి. ఈ దర్శనంతో టూర్లో చూడాల్సిన ప్రదేశాలన్నీ పూర్తవుతాయి. షాపింగ్ తర్వాత రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలెక్కాలి. ట్రైన్ సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌కి చేరేలోపు ఎవరికి అనువైన ప్రదేశాల్లో వాళ్లు డీబోర్డ్ కావచ్చు. సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరేటప్పటకి తొమ్మిదవ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలవుతుంది.చారిత్రక శివుడుఘృష్ణేశ్వర్ మందిరాన్ని ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ చూసి తీరాలి. లేత గులాబీరంగు గ్రానైట్ స్టోన్‌తో అందంగా ఉంటుంది. కంప్యూటర్లో రంగుల పాళ్లను మారుస్తూ కొత్త షేడ్లను తెచ్చినట్లు చాలా లాలిత్యంగా ఉంటాయి. షిరిడీలో సాయి దర్శనం తర్వాత ఎల్లోరా టూర్ ప్యాకేజ్‌లో ఈ జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. ఎల్లోరా నుంచి రెండు కిలోమీటర్లకు మించదు. ఈ ఆలయం ప్రస్తావన స్కందపురాణం, శివపురాణం, రామాయణం, మహాభారతాల్లో కూడా ఉండడంతో హిందువులు ఘృష్ణేశ్వర్ దర్శనాన్ని మిక్కిలిగా కోరుకుంటారు. ఈ శివుడు రాజకీయ వివాదాలకు కేంద్రబిందువయ్యి చరిత్రలో ప్రాధాన్యం సంతరించుకున్నాడు. మొఘల్– మరాఠా ఆదిపత్య΄ోరులో ఢిల్లీ సుల్తానుల విధ్వంసానికి గురైంది. ఇప్పుడు చూస్తున్న మందిరాన్ని 18వ శతాబ్దంలో ఇందోర్ రాణి గౌతమి బాయ్ హోల్కర్ నిర్మించారు. ఇక్కడ శివలింగానికి భక్తులు స్వయంగా పూజ చేయవచ్చు.ప్యాకేజ్ వివరాలివి!‘అంబేద్కర్యాత్ర విత్ పంచ్ జ్యోతిర్లింగ దర్శన్’... తొమ్మిది రోజుల టూర్. ఐఆర్సీటీసీలో జూలై ఐదవ తేదీ నుంచి మొదలవుతుంది. ఇందులో దీక్షాభూమి, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమ్శంకర్, ఘృష్ణేశ్వర్, జన్మభూమి అనే ప్రదేశాలు కవర్ అవుతాయి. నాగ్‌పూర్‌లో దీక్షాభూమి, ఉజ్జయిన్‌లోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంతోపాటు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, ఎమ్‌హౌ (ఎమ్ హెచ్ఓడబ్లు్య)లో జన్మభూమి, నాసిక్‌లో త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, పూనేలో భీమశంకర్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌లో ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.టికెట్ ధరలిలా!ఇందులో సింగిల్ ఆక్యుపెన్సీ సదు΄ాయం లేదు. ఒక్కరుగా ప్రయాణిస్తున్న వారికి మరొక ఒంటరి ట్రావెలర్‌తో కలిపి రూమ్ కేటాయిస్తారు. టికెట్ ధరలు ఎకానమీ కేటగిరీలో దాదాపుగా 15 వేల రూపాయలు, స్టాండర్డ్ కేటగిరీలో 23 వేలు, కంఫర్ట్ కేటగిరీలో 30 వేల రూపాయలవుతుంది. పిల్లలకు సుమారు పదిహేను వందల వరకు తగ్గుతుంది.భోజనం ఇలాగ!టూర్లో ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తారు. శాకాహార భోజనం మాత్రమే.ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్, సెక్యూరిటీ సౌకర్యాలు కల్పిస్తారు.పర్యాటకుల సహాయం కోసం ఐఆర్సీటీసీ అధికారులు కూడా ప్రయాణంలో ఉంటారు.పర్యాటక ప్రదేశాల ఎంట్రీ ఫీజులు, బోటింగ్ రైడ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ టికెట్లు ప్యాకేజ్‌లో వర్తించవు.ఆహారం విషయంలో నిర్దేశించిన మెనూలో లేని పదార్థాలను తినాలంటే ఎవరికి వారు కొనుక్కోవాలి.https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG43– వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: శృంగేశ్వర్‌పూర్..రాముని వనపథం..) -
సుందర సౌరాష్ట్ర.. సమైక్య యాత్ర
వడోదరలో పూల గడియారం... అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమం. గాంధీనగర్‌లో అక్షరధామ్... పోర్బందర్లో కీర్తిమందిర్. ద్వారకలో కృష్ణుడి జగత్మందిర్... కేలాడియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. జామ్‌నగర్ లఖోటా కోట... సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం. 1 రోజుసికింద్రాబాద్– పోర్బందర్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఇది ఎనిమిది రోజుల టూర్. ఇందులో వడోదర, అహ్మదాబాద్, ద్వారక, సోమనాథ్, పోర్బందర్ కవర్ అవుతాయి. 2వ రోజుఉదయం పదకొండు గంటలకు రైలు వడోదర (Vadodara) స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్ అవాలి. మధ్యాహ్నం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని చూడడానికి తీసుకెళ్తారు (ఎంట్రీ టికెట్ ప్యాకేజ్‌లో వర్తించదు, పర్యాటకులు కొనుక్కోవాలి). రాత్రికి వడోదర హోటల్ గదిలో బస. రాజ్యాలన్నింటికీ ఒకటే జెండా: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ... స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం. దీని ఎత్తు 597 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. గుజరాత్ రాష్ట్రం, కెవాడియా ప్రదేశంలో ఉంది. నర్మదానది మీద నిలబడి సర్దార్ సరోవర్ డ్యామ్‌ను చూస్తున్నట్లు ఉంటుంది. వడోదరకు వందకిలోమీటర్ల దూరం. దేశంలోని రాజ్యాల మధ్య ఐక్యత కోసం, జమీందారాలన్నింటినీ భారత్ రిపబ్లిక్లో విలీనం చేసి ఒక పతాకం కిందకు తీసుకురావడానికి పటేల్ చేసిన కృషిని గౌరవిస్తూ ఆయన విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరు పెట్టారు.3వరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వడోదరలో హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. నగరంలో లక్ష్మీవిలాస్ ప్యాలెస్ తదితరాలను చూసిన తర్వాత అహ్మదాబాద్‌కు ప్రయాణం. అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమం, అక్షరధామ్ టెంపుల్ (akshardham temple) చూసిన తర్వాత హోటల్ చెక్ ఇన్. రాత్రి బస.ప్యాలెస్‌లో స్టెప్‌వెల్: వడోదర... చారిత్రక ప్రాధాన్యత ఉన్న నగరం. ఈ నగరం విశ్వమిత్రి నది తీరాన ఉంది. నగరంలో మహరాజా షాయాజీరావు యూనివర్శిటీ... సిటీ హాల్... ఇలా ప్రముఖమైన కట్టడాలన్నీ రాజా పేరుతోనే ఉంటాయి. ప్యాలెస్‌ల ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది. గైక్వాడ్ రాజకుటుంబం నివసించిన మహారాజా ప్యాలెస్‌లో సర్కార్వాడా, లక్ష్మీవిలాస్ ప్యాలెస్, ప్రతాప్ ప్యాలెస్, మోతీబాగ్ ప్యాలెస్, మోతీబాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం, జూ, నవలాక్షి స్టెప్ వెల్ ఉన్నాయి. ఇది తొమ్మిది మిలియన్ల గ్యాలన్ల నీటిని స్టోర్ చేయగలిగిన బావి. ఇక లక్ష్మీ ప్యాలెస్ అయితే ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, గోడలకు మొజాయిక్ డెకరేషన్, టెర్రకోట శిల్పాలు... ఇలా ప్రతిదీ ఒక కళాఖండమే. ఫతే సింగ్ మ్యూజియం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇందులో గ్రీకు, రోమన్, యూరప్ శిల్పాలు, ఫ్రెంచ్ ఫర్నిచర్ ఉంది. రాజారవివర్మ చిత్రలేఖనాలు కూడా ఉన్నాయి. షాయాజీ రావు గైక్వాడ్ ఆధునిక వాది. నగరాన్ని శాస్త్రసాంకేతికంగా వృద్ధి చేశాడు. అంబేద్కర్ విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందించాడు.4వరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి ద్వారక వైపు సాగి΄ోవాలి. దారిలో జామ్ నగర్‌లోని లఖోటా ప్యాలెస్, మ్యూజియం విజిట్. సాయంత్రానికి ద్వారక చేరి హోటల్ చెక్ ఇన్, రాత్రి బస.సరస్సులో కోట: కోటల చుట్టూ కందకాలుంటాయి. కానీ ఇక్కడ నీటి మధ్యలో దీవి మీద కోట ఉంటుంది. లఖోటా సరస్సు మధ్యలో ఉన్న కోట కావడంతో దీనిని లఖోటా కోట అనే పిలుస్తారు. జామ్‌నగర్ పాలకులు ఉపయోగించిన వస్తువులతోపాటు నాటి కళాకృతులతో కోటలోపల మ్యూజియం ఉంది.ఐదవ రోజుఉదయం ద్వారకాధీశుని దర్శనం, బేట్ ద్వారక, నాగేశ్వర్ టెంపుల్ దర్శనం. ఆ తర్వాత ద్వారకకు తిరుగు ప్రయాణం. రాత్రి బస ద్వారకలోనే.బీసీ కాలపు జగత్మందిర్: కృష్ణుడు పూజలందుకునే ఈ ఆలయాన్ని ద్వారకాధీశ్ మందిర్ అంటారు. ఐదంతస్థుల ఆలయం మనకు విచిత్రంగా అనిపిస్తుంది. క్రీ.పూ రెండు వందల ఏళ్ల నాటిదని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. మనకు ఇప్పుడు కనిపిస్తున్నది క్రీ.శ 15–16 శతాబ్దాల నాటి పునర్నిర్మాణం. ఆలయాలు పశ్చిమముఖంగా ఉండడం కూడా అరుదైన విషయం. ఆలయంఅరేబియా సముద్రాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. తెలుగు రాష్ట్రం చిత్తూరు జిల్లా, నాగులాపురంలోని వేదనారాయణస్వామి ఆలయంలో విష్ణుమూర్తి పశ్చిమముఖంగా ఉంటాడు.6వరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి సోమనాథ్ వైపు సాగిపోవాలి. దారిలో పోర్బందర్లోని కీర్తిమందిర్, సుధామ టెంపుల్ విజిట్. సోమనాథ్ చేరిన తర్వాత సోమనాథ జ్యోతిర్లింగ దర్శనంతోపాటు ఆలయం చుట్టు పక్కల ఉన్నవాటిని తిరిగి చూడడం, సాయంత్రం తర్వాత పోర్బందర్కు ప్రయాణం. రాత్రికి పోర్ బందర్ రైల్వే స్టేషన్‌కి చేరడంతో యాత్ర పూర్తవుతుంది. 145 ఏళ్లుగా ఆగని గడియారం: ఫ్లోరల్ క్లాక్... వడోదర సిటీసెంటర్లోని షాయాజీ బాగ్‌లో ఉంది. క్రీ.శ 1879లో మూడవ మహారాజా షాయాజీరావు నిర్మించాడు. 13 ఎకరాల ఉద్యానవనంలో బరోడా మ్యూజియం అండ్ పిక్చర్ గ్యాలరీ, ఒక జూ, సర్దార్‌పటేల్ ప్లానిటోరియం... గార్డెన్ మొత్తం చూడడానికి టాయ్‌ట్రైన్ ఉన్నాయి. ప్లానిటోరియం పక్కనే ఆస్ట్రానమీ పార్క్ ఉంది. పురాతన కాలంలో వాడిన ఆస్ట్రనామికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. బరోడా మ్యూజియంలో పిక్చర్ గ్యాలరీలో మినియేచర్ కళాఖండాల నిలయం. హజీరా మఖ్బారా, న్యాయమందిర్, దభోయి ఫోర్ట్, మకాయ్ కోట, జమామసీదు, కీర్తి మందిర్, అరబిందో సొసైటీ చూడవచ్చు. స్థానికులు గుజరాతీతోపాటు సింధీ భాష కూడా మాట్లాడతారు.అహ్మదాబాద్: అహ్మదాబాద్ గురించి మాట్లాడాలంటే సబర్మతి నది గురించి మాట్లాడాలి. నదికి రెండువైపులా విస్తరించిన నగరం ఇది. ఒక వైపు వాళ్లు మరో వైపుకు రావడానికి నగరంలో ఈ నది మీద పదకొండు వంతెనలున్నాయి. ఎల్లిస్, గాంధీ, నెహ్రూ, సుభాష్, వాదాజ్ దూధేశ్వర్, సర్దార్, చంద్రభాగా, అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, ఫెర్నాండెజ్, దండి బ్రిడ్జిలు. బ్రిటిష్ పాలకుల తోపాటు జాతీయనాయకులను గౌరవిస్తూ నామకరణం చేయడం గొప్పగా అనిపిస్తుంది. మీరు నగరంలో ఏ వంతెన మీద ప్రయాణించారో సరదాగా గమనించండి. సబర్మతి రివర్ ఫ్రంట్ సూర్యోదయాలు, సాయంత్రాలను ఆస్వాదించడానికి మంచి ప్రదేశం. ఇక మనకు చిన్నప్పటి నుంచి చిరపరిచితమైన సబర్మతి ఆశ్రమం గాంధీజీ నివసించిన ప్రదేశం. ఇక్కడ జాతీయోద్యమ చర్చలు జరిగేవి. గాంధీజీ దండి సత్యాగ్రహాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇప్పుడు ఆశ్రమంలో గాంధీజీ ఉపయోగించిన వస్తువులను చూడవచ్చు. నగరంలో సయ్యద్ సిద్ధిఖీ జాలీలో రాతిలో సునిశితంగా చెక్కిన డిజైన్ని తప్పకుండా చూడాలి. జైన్ మందిరం, కాలికో మ్యూజియం, సర్దార్ పటేల్ మ్యూజియం కూడా చూడాల్సిన ప్రదేశాలు.ప్రశాంత ధామం: అక్షరధామ్ టెంపుల్ గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉంది. అహ్మదాబాద్‌కు 40 కిమీల దూరం. నగరంలో రాజధాని హడావుడి, ట్రాఫిక్ జామ్‌లు ఉండవు. అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రభుత్వ ఆఫీసులు, వాటి అనుబంధ భవనాలు తప్ప ఇతర వర్తక వాణిజ్యాలు ఉండవు. నగరం ప్రశాంతంగా ఉంటుంది.గాంధీజీ ఇక్కడే పుట్టాడు: పోర్బందర్.... గాంధీజీ పుట్టిన నేల. ఇక్కడ గాంధీజీ పుట్టిన ఇల్లు బాపూ మహల్ ఉంది. దాని పక్కనే స్మారక మందిరం కీర్తిమందిర్, బాపూ మహల్ వెనుకగా కస్తూర్బా గాంధీ ఇల్లు ఉన్నాయి. గాంధీజీ ఇంటిలో అటకల నిర్మాణాన్ని గమనించాలి. పోర్బందర్లో శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడికి మందిరం, వాళ్ల గురువు సాందీపుడి మందిరం ఉన్నాయి. సుధాముడి మందిరం విశాలంగా ఉంటుంది. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా అటుకుల ప్యాకెట్ ఇస్తారు. ఈ ఐటెనరీ ప్రకారం సోమనాథ్ నుంచి తిరుగు ప్రయాణంలో పోర్బందర్కు చేరే ప్రయాణం అరేబియా తీరం వెంబడే సాగుతుంది. కాబట్టి జర్నీలో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు. సోమనాథ జ్యోతిర్లింగం: సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఓ గొప్ప ఆధ్యాత్మిక అనుబూతి. సోమనాథుడిని దర్శనం తర్వాత ఆలయం ఆవరణలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలను చూడవచ్చు. ఆలయం బేస్ మెంట్ ఎత్తుగా ఉంటుంది. ఆలయం వెనుక సముద్రపు అలలు ఆలయాన్ని అలవోకగా తాకుతూ ఉంటాయి. ఆయలం ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం నమూనాలోనే ఉంటుంది. నర్మద (Narmada) తీరాన పెద్ద విగ్రహస్థాపనకు ముందు నుంచే సోమనాథ్ ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహం ఉంది.7వ రోజు00.50 నిమిషాలకు (అర్ధరాత్రి 12.50 నిమిషాలు) ట్రైన్ నంబరు 20968 పోర్ బందర్– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ పోర్బందర్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. 8వ రోజు... ట్రైన్ ఉదయం 8.20 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుతుంది. బుధవారం మొదలైన పర్యటన బుధవారంతో పూర్తవుతుంది. ఈ ట్రైన్ అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఇదే రైలు తిరిగి సికింద్రాబాద్ నుంచి పోర్బందర్కు బయలుదేరుతుంది. ఇది వీక్లీ ట్రైన్. ప్యాకేజ్ ధరల వివరాలు..సుందర సౌరాష్ట్ర (ఎస్హెచ్ఆర్066) టూర్లో భాగంగా... ట్రైన్ నంబర్ 20967 సికింద్రాబాద్– పోర్బందర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. కంఫర్ట్ కేటగిరీ అంటే థర్డ్ ఏసీలో ప్రయాణం. ఇందులో ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 30 వేలు, ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 29 వేలవుతాయి. స్టాండర్డ్ కేటగిరీలో ట్విన్ షేరింగ్‌కి దాదాపు 27 వేలు, ట్రిపుల్ షేరింగ్‌కి దాదాపు 26 వేలవుతుంది. ఇందులో సింగిల్ ఆక్యుపెన్సీకి అవకాశం లేదు. ప్యాకేజ్‌లో నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, నాలుగు రాత్రి భోజనాలు ఇస్తారు. -
కాశీ నుంచి అయోధ్యకు... ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ
ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, అయోధ్యలను సందర్శించాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వారణాసి, అయోధ్యలను సందర్శించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ సదుపాయం, వసతి, ఆహారం మొదలైనవి అందజేయనున్నారు.ఈ ప్యాకేజీ ఆరు పగళ్లు, ఐదు రాత్రులు ఉండనుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం సాగించేందుకు రూ.15,750(ఒక్కరు) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల తమకు అందుబాటులో ఉండే ప్యాకేజీని కూడా ఎన్నుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి ‘రామ్ మందిర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ ప్యాకేజీ వారణాసి నుంచి అయోధ్య వరకూ కొనసాగనుంది. ఈ టూర్ ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది.ఐఆర్సీసీటీ వెబ్సైట్ www.irctctourism.comని సందర్శించడం ద్వారా ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. Embark on a divine journey to the land of spiritual awakening! Join IRCTC Tourism’s Ram Mandir Darshan and seek blessings at the revered destinations - Ayodhya & Varanasi!To experience the essence of Hinduism and rejuvenate your soul, book your journey at… pic.twitter.com/hMPlPIbTsN— IRCTC (@IRCTCofficial) August 18, 2024 -
వైష్ణోదేవి దర్శనానికి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!
వేసవి సెలవుల్లో మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించాలనుకునేవారికి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మూడు రాత్రులతో పాటు మొత్తం నాలుగు రోజులు ఉండనుంది. ఈ ప్యాకేజీ న్యూఢిల్లీ నుండి ప్రారంభంకానుంది. ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీలో మాతా వైష్ణో దేవి ఆలయంతో పాటు, కంద్ కండోలి ఆలయం, రఘునాథ్ ఆలయం, బేగ్ బహు గార్డెన్లను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఐఆర్సీటీసీ అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ పేరు ‘మాతారాణి- రాజధాని’ ఈ యాత్రలో ప్రయాణికులు థర్డ్ ఏసీలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రయాణికులకు ప్రయాణ సమయంలో ఆహారపానీయాలను ఐఆర్సీటీసీ అందిస్తుంది. ఈ ప్యాకేజీ కింద రెండు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఒక లంచ్, ఒక డిన్నర్ అందజేస్తారు. అలాగే బస ఏర్పాట్లను కూడా ఐఆర్సీటీసీ కల్పిస్తుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునేవారు రూ.6,390 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వివిధ టారిఫ్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో ప్రయాణానికి గరిష్ట ఛార్జీ రూ.8,300. మరిన్ని వివరాల కోసం irctctourism.comని సందర్శించవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. -
లంక వరకు రామాయణ యాత్ర చేస్తారా.. ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!
రైల్లో రామాయణ యాత్ర చేయాలనుకుంటున్నారా..? శ్రీరామునికి సంబంధించిన ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం ఐఆర్సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ‘శ్రీ రామాయణ యాత్ర’ను ఏప్రిల్ 7న ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా ప్రారంభించనుంది. శ్రీ రామాయణ యాత్ర అనేది రామాయణ సర్క్యూట్‌లోని భరత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు థీమ్ ఆధారిత తీర్థయాత్ర. రామాయణానికి సంబంధించి భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలతో పాటు శ్రీలంకను కూడా సందర్శించాలనుకునే వారికి కూడా ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. ఈ రైలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ నుంచి బయలుదేరి అయోధ్య, జనక్‌పూర్, సీతామధి, బక్సర్, వారణాసి, మాణిక్పూర్ జంక్షన్, నాసిక్ రోడ్ హోస్పేట్, రామేశ్వరం, భద్రాచలం రోడ్, నాగ్‌పూర్ స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేసి తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. ఢిల్లీ సఫ్దర్‌జంగ్, ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా, ఇటావా, కాన్పూర్, లక్నో స్టేషన్ల నుంచి ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. విరంగని లక్ష్మీ బాయి, గ్వాలియర్, ఆగ్రా, మధుర స్టేషన్లలో దిగిపోవచ్చు. ఫస్ట్ ఏసీ కపుల్ సీట్ల ధర (ఇద్దరికి) రూ.1,68,950. ఫస్ట్ ఏసీ క్యాబిన్ సీట్ల ధర రూ. 1,03,020 నుంచి రూ. 1,61,645 ఉంటుంది. చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి ఇక అటు నుంచి అటే శ్రీలంకను కూడా సందర్శించాలనుకునేవారు నాగ్‌పూర్ నుంచి నేరుగా శ్రీలంక వెళ్లవచ్చు. ఏప్రిల్ 23న దేశంలో రామాయణ యాత్ర నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లో ముగుస్తుంది. అక్కడి నుంచి రైలు ఢిల్లీకి బయలుదేరుతుంది. శ్రీలంక పర్యటనకు వెళ్లేవారు కొలంబోకు వెళ్లడానికి నాగ్‌పూర్ విమానాశ్రయానికి వెళతారు. ఈ ప్యాకేజీ ధర ఒక్కరికి రూ. 82,880, ఇద్దరికయితే రూ.69,620 (ఒక్కొక్కరికి) , అదే ముగ్గురుంటే ఒక్కొక్కరికీ రూ.67,360 చొప్పున ఉంటుంది. -
చలో నల్లమల.. 17 నుంచి టూర్ ప్రారంభం
సాక్షి, నాగర్‌కర్నూల్: అడవి గురించి తెలుసుకునేందుకు, వన్యప్రాణులను ప్రత్య క్షంగా వీక్షేందుకు, ఇక్కడ స్థానికంగా ఉన్న చెంచులతో మాట్లాడి వారి స్థితిగతులను అర్థం చేసుకునేందుకు నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అవకాశం కల్పిస్తోంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తోంది. నల్లమలలోని అరుదైన, ప్రత్యేకమైన వన్యప్రాణులు, పక్షులు, జీవ, వృక్షజాతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అటవీ సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించేలా ప్రత్యేక జంగిల్ స్టే ప్యాకేజీలను అమలుపర్చబోతోంది. జంగిల్ స్టే, సఫారీ, ట్రెక్కింగ్‌తో పాటు స్థానిక గిరిజనులతో మమేకమయ్యేలా ప్యాకేజీలను రూపొందించింది. ఈనెల 17 నుంచి ఆన్లైన్ ద్వారా బుకింగ్ ప్రారంభంకానుంది. 24 కి.మీ. మేర జంగిల్ సఫారీ.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలు గా సఫారీ వాహనంలో అడవిలోకి తీసుకెళ్తారు. అమ్రాబాద్ మండలంలో హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై ఉన్న గుండం చెక్‌పోస్టు నుంచి ఫర్హాబాద్ వ్యూపాయింట్ వరకు తీసుకెళ్తారు. నల్లమలలో జంగిల్‌సఫారీ ఇక్కడ నుంచి నల్లమల అటవీప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. అక్కడి నుంచి ఫర్హాబాద్ పెంట మీదుగా ఫర్హాబాద్ చెక్‌పోస్టు వరకు సఫారీ ప్రయాణం కొనసాగుతుంది. సుమారు 24 కి.మీ.మేర సాగే ఈ సఫారీలో పులులతో పాటు వివిధ వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూసే అవకాశముంది. స్థానికంగా ఉండే చెంచులే టూరిస్టు గైడ్లు.. నల్లమలలో స్థానికంగా నివసించే చెంచులతో మమేకమై వారితో ముచ్చటించేందుకు ఏటీఆర్ అవకాశం కల్పిస్తోంది. చెంచుల స్థితిగతులు, జీవనవిధానంపై నాటిక రూపంలో ప్రదర్శనలు, పాటలను ఆలపిస్తారు. వారు తినే ఆహారం, స్థానికంగా ఉన్న వెరైటీలను సందర్శకులకు కూడా రుచి చూపిస్తారు. మన్ననూరు నుంచి ఉమామహేశ్వర ఆలయం వరకు అడవిలోని కొండల మధ్య ట్రెక్కింగ్‌కు సైతం చెంచులే తీసుకెళ్తారు. నల్లమల అందాలను మనసారా ఆస్వాదించేలా ఫారెస్ట్ స్టే, సఫారీ, ట్రెక్కింగ్‌లను ఏటీఆర్ అధికారులు రూపొందించారు. రెండు రోజుల పాటు అడవిలో గడిపేలా ఈ ప్యాకేజీ ఉంటుంది. -
షాపింగ్‌మాల్ వద్ద మాటువేసి.. లక్కీ డ్రా అంటూ..
సిమ్లా: సార్ మీరు కారు గెలుచుకున్నారు, లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారు అంటూ.... రకరకాల ఫ్రాడ్ కాల్స్ గురించి మనం నిత్యం వింటూనే ఉన్నాం. ఇదే తరహా కొంతమంది కేటుగాళ్లు హాలీడే ప్యాకేజీలు.. కళ్లు చెదిరిపోయి గిఫ్ట్‌లు గెలుచుకోవచ్చు అంటూ మాయమాటలు చెప్పి సిమ్లాలోని ఒక జంటను దారుణంగా మోసం చేశారు. వివరాల్లోకెళ్లితే... ఓ జంట ఆగస్టు 27న సిమ్లాలో షాపింగ్ చేసి వస్తుంటే అక్కడే మాటువేసిన కొంతమంది తమ ట్రావెలింగ్ సంస్థలో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయని.. లక్కీ డ్రా కూడా ఉందని నమ్మించారు. మీరు లక్కీ డ్రాలో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలు, గిఫ్ట్‌లు గెలుచుకొవచ్చు అని చెప్పి కొన్ని కూపన్లను కొనుగొలు చేయమన్నారు. ఈ క్రమంలో ఆ జంట కూపన్ తీసుకుని స్క్రాచ్ చేసి చూస్తే 10 సంవత్సరాల టూర్ ప్యాకేజ్ గెలుపొందినట్లు నమ్మించారు. (చదవండి: తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవంలో మేము పాల్గొనం।): ప్యాకేజీ ప్రకారం ప్రతి ఏడాది భారతదేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో పర్యటించే భారీ ప్యాకేజ్ గెలుచుకున్నారంటూ చెప్పడంతో తాము ఆనందంగా సభ్యత్వ రుసుము కింద వారికి రూ.1.40 లక్షలు చెల్లించినట్లు ఆ బాధిత జంట పేర్కొంది. ఆ తర్వాత ఆ సంస్థ గురించి విచారిస్తే తాము మోసపోయినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో వారు సిమ్లాలోని స్థానిక సదర్ పోలీస్టేసన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు ఆ గ్యాంగ్‌లో ఒక మహిళతో సహా ఐదుగురు సభ్యులు ఉన్నారని, వారిని చీటింగ్ కేసు కింద అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.(చదవండి: పరువు హత్య: చెల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు!) -
సువర్ణావకాశం.. పులి ఇంట్లో రెండ్రోజులు
కథల్లో విన్న పులిని చూడాలని ఉంటుంది. పులి కోసం కాన్హా నేషనల్ పార్కుకు వెళ్లాలని కూడా ఉంటుంది. దట్టమైన అడవిలో బస చేసి రాత్రిళ్లు పులి సంచారాన్ని స్వయంగా వీక్షించాలని సరదా పడితే... అది గొంతెమ్మ కోరిక ఏమీ కాదు. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న కాన్హా జంగిల్ స్టే ఎక్స్ రాయ్‌పూర్ (Sఏఏ069) టూర్ ప్యాకేజ్‌లో రెండు రోజులు కాన్హా అడవుల్లో బస చేయవచ్చు. పులులు సంచరించే జోన్లో విహరిస్తూ గంభీరమైన పులి నడకను, పాదముద్రలను చూడవచ్చు. మూడు రోజుల ఈ టూర్ ప్యాకేజ్‌లో రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని కాన్హా ఫారెస్ట్ టూర్ (రెండు రాత్రుల బస) పూర్తయిన తర్వాత మూడవరోజు రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టు లో దించే వరకు ఐఆర్‌సీటీసీదే బాధ్యత. కాన్హా మధ్యప్రదేశ్‌లోని రెండు వేల చదరపు కిలోమీటర ్లకు పైగా విస్తరించిన దట్టమైన అటవీ ప్రదేశం. -
కాళేశ్వరానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం సచివాలయంలో పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ ఆవిష్కరించారు. కాళేశ్వరం టూర్లో భాగంగా రంగనాయకుల సాగర్ ప్రాజెక్టు, సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్ హౌస్ ప్రాంతాలను చూపిస్తారు. సాధారణ సమయంలో ఇక్కడికి అనుమతించరు. ప్రత్యేక ప్యాకేజీ నేపథ్యంలో పర్యాటక శాఖ ఈ యాత్రను అందుబాటులోకి తెచ్చింది. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున టిక్కెట్ ధర నిర్ణయించింది. ఉదయం 7.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్ఓ కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్‌కు చేరుకుంటుంది. తర్వాత అక్కడ్నుంచి కాళేశ్వరం చేరుకుంటుంది. ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు గైడ్ కూడా ఉంటాడు. -
ఐఆర్సీటీసీ మరో ఆఫర్
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) మరో ఆఫర్ ప్రకటించింది. తిరుమల తిరుపతి వెంకటేశుని దర్శించుకోవడం కోసం రెండు రోజుల క్రితమే ‘వెంకటాద్రి’ టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్సీటీసీ, తాజాగా రెండు రోజుల ‘ఢిల్లీ-షిరిడీ’ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ స్పెషల్ లిమిటెడ్ ఆఫర్ కింద ప్రారంభ ధర రూ.11,900కు ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ టూర్ ప్యాకేజీ పేరు ‘ఢిల్లీ-షిరిడీ ఫ్లైట్ ప్యాకేజీ’గా పేర్కొంది. ఈ ప్యాకేజీ ఢిల్లీ, పుణే, శని శింగనాపూర్, షిరిడీ ప్రాంతాలను కవర్ చేయనుందని ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. ఈ కొత్త టూర్ ప్యాకేజీ 1నైట్, రెండు రోజులు అందుబాటులో ఉండనుంది. ఏప్రిల్ 28, మే 5, మే 12, మే 19, మే 26 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవచ్చు. ‘ఢిల్లీ-షిరిడీ ఫ్లైట్ ప్యాకేజీ’ వివరాలు... ఈ ప్యాకేజీ కింద కేవలం విమానంలోనే ప్రయాణించాలి. క్లాస్ డీలక్స్ ఈ ప్యాకేజీలో రోజులో ఒక బ్రేక్‌ఫాస్ట్, ఒక డిన్నర్ అందించనున్నారు. ఢిల్లీ నుంచి విమానం ఉదయం 7.55 సమయానికి ప్రారంభం కానుంది. పుణేకు ఉదయం 10.15కు చేరుకుంటుంది. విమాన నెంబర్ జీ8 173. తిరుగు ప్రయాణ విమానం పుణే నుంచి రాత్రి 8.55 సమయానికి ప్రారంభం అవుతుంది. ఢిల్లీకి రాత్రి 11.05కు చేరుకుంటుంది. విమాన నెంబర్ జీ8 278. ఈ టూర్ ప్యాకేజీలోనే హోటల్ కూడా ఉంటుంది. గోరడియా లార్డ్స్, గణపతి ప్యాలెస్ వంటి హోటల్స్‌లో స్టే చేసే అవకాశం కల్పిస్తుంది ‘సింగిల్ అక్యుపెన్షీ’ ఆప్షన్ కింద ఈ టూర్ ఖర్చు ఒక్కరికి రూ.12,900. ‘డబుల్ అక్యుపెన్షీ’ కింద ఖర్చు రూ.11,900. డబుల్ అక్యుపెన్షీ’ కి 11,900 రూపాయలు. పిల్లలకు ఈ ప్యాకేజీ 11,600 రూపాయలు. బెడ్ లేకుండా పిల్లల ప్యాకేజీ ఖర్చు 11వేల రూపాయలు. ఐఆర్సీటీసీ ప్రకారం ఎయిర్‌ఫేర్‌ను కస్టమర్లు విమానశ్రయాల వద్దనే చెల్లించాల్సి ఉంటుంది. -
పర్యాటక శాఖ కార్తీకమాసం టూర్ ప్యాకేజీలు
సాక్షి, హైదరాబాద్: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ పలు కొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి వెళ్లి వచ్చేలా ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి వెళ్లే శాతవాహన రీజియన్ టూర్ టికెట్ ధర పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800గా పేర్కొంది. కాకతీయ రీజియన్ టూర్లో కాళేశ్వరం, వేయి స్తంభాల గుడి, రామప్ప, యాదగిరిగుట్ట, కీసరగుట్ట పర్యటనకు పెద్దలకు రూ.1,350, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించింది. ఇక పంచారామం టూర్లో భాగంగా అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట పర్యటనకుగాను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.2,160... హైదరాబాద్-అనంతగిరి పర్యటన పెద్దలకు రూ.699, పిల్లలకు రూ.560గా తెలిపింది. హైదరాబాద్-కీసరగుట్ట-శామీర్‌పేట టూర్‌కుగాను పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.400 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 29 వరకు ఈ ప్యాకేజీ టూర్లు అందుబాటులో ఉంటాయని.. బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి నిర్దేశిత సమయాల్లో ప్రారంభమవుతాయని పేర్కొంది. -
పచ్చ ప్రలోభాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా నిలబడి పరువు నిలుపుకునేందుకు అధికార పార్టీ నానా యాతన పడుతోంది. ఓటుకు నోట్లు ఇస్తూ ప్రలోభ పెట్టడంతో పాటు విహారయాత్రల పేరిట క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. తమకు పనులున్నాయని పలువురు ఎంపీటీసీ సభ్యులు పేర్కొంటున్నా...క్యాంపునకు రావాల్సిందేనని ఒత్తిళ్లు చే స్తోంది. ఇంతటితో ఆగకుండా..ఎన్నికల రోజు ముఖ్యమంత్రి పర్యటన జిల్లాలో జరిగే విధంగా ప్రణాళిక రచించడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం మీద బలం లేకపోయినా ఎన్నికల్లో నిలబడి...గెలిచేందుకుఅధికార పార్టీ చేస్తున్న ఫీట్లు కాస్తా సర్కస్ తీరును కనబరుస్తోందన్న అభిప్రాయం జిల్లాలో వ్యక్తమవుతోంది. ఓటుకు నోటు ఇవ్వడం ఫలితం లేదని భావించిన అధికార పార్టీ.. విహారయాత్రల పేరుతో ఫ్యామిలీకి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలకు పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఎలాగైనా క్యాంపుకు తరలించేందుకు భారీ ఏర్పాట్లను చేసింది. పనులున్నాయి.. మహాప్రభో మేం రాలేమని పలువురు ఎంపీటీసీలు తేల్చిచెప్పినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం వదలటం లేదు. కచ్చితంగా క్యాంపుకు రావాల్సిందేనని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇంటి వద్దకు వాహనాన్ని తీసుకెళ్లి ఇంట్లో వారందరినీ తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. తమ పిల్లలకు చదువులున్నాయి.. రాలేమని అన్నప్పటికీ పిల్లాజల్లాలతో కలిపి క్యాంపునకు తరలించే ప్రయత్నం చేశారు. తమతో పాటు రాకపోతే తమకు ఓటు వేయరనే ఆందోళన, భయంతోనే అధికార పార్టీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తారాస్థాయికి ప్రలోభాలు.. బలం లేకపోయినప్పటికీ బరిలోకి నిలిచి గెలిచేందుకు నానాకష్టాలు పడుతున్న అధికార పార్టీ...ప్రలోభాల పర్వాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. ఒకవైపు ఈ నెల 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఇదే సందర్భంలో జిల్లాలో మల్యాల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించే పేరిట ముఖ్యమంత్రి పర్యటనను అధికార పార్టీ ఖరారు చేసింది. తద్వారా జిల్లాలో జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపే ప్రయత్నం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తనకు సహకరించడం లేదని కూడా అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో ఒకరిద్దరిని కూడా తమవైపు తిప్పుకోలేకపోయారని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని కలవరపడుతున్న సదరు నేత.. సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోయిన తర్వాత చేసిన వ్యాఖ్యలు కాస్తా ఆయన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోందన్న చర్చ నడుస్తోంది. శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు, నేతలు తనను మోసం చేశారంటూ.. ఓడిపోయిన తర్వాత ఆయన దూషించారన్న వార్త కూడా జిల్లాల్లో గుప్పుమంటోంది. ఈ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన పలువురు ఓటర్లు ఇప్పుడు తమ ప్రతాపం చూయించేందుకు సిద్ధమవుతున్నారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద బలం లేకపోయినా నిలిచి భంగపాటుకు గురి అవుతామనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. -
ఆర్టీసీ ధనుర్మాస టూర్ ప్యాకేజీలు
విజయవాడ, న్యూస్‌లైన్ : ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వైష్ణవాలయాల దర్శనానికి ఆర్టీసీ కృష్ణా రీజియన్ శ్రీకారం చుట్టింది. మంగళగిరిలోని పానకాల స్వామి దేవస్థానం, జగ్గయ్యపేట దగ్గరలోని వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి, తిరమలగిరి, జమలాపురంలోని వెంకటేశ్వరస్వామి, మధిరకు సమీపంలోని నెమలి వేణుగోపాల్‌స్వామి ఆలయూలను ఒక్కరోజులోనే దర్శించుకునే అవకాశం కల్పించింది. ప్రతి ఆదివారం, నెలలోని ముఖ్య రోజుల్లో వేకువజామున ఆరు గంటలకు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బయల్దేరి తిరిగి అదేరోజు రాత్రి 9 గంటలకు బస్టాండ్‌కు చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందుకు పెద్దలకు రూ.325 (డీలక్స్), రూ.290 (ఎక్స్‌ప్రెస్), పిల్లలకు రూ.245 (డీలక్స్), రూ.220 (ఎక్స్‌ప్రెస్) టికెట్‌గా నిర్ణయించారు. 24 గంటల్లో పారిజాతత్రయం ప్రతి ఆదివారం ఒక్కరోజులో మూడు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కల్పించారు. ఏలూరులోని ద్వారకా తిరుమల (చినతిరుపతి), తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, విశాఖ జిల్లా సింహాచలంను ఒకేరోజు దర్శించుకోవచ్చు. ఉదయం 4 గంటల సమయంలో బయల్దేరి మరుసటి రోజు 4 గంటలకు బస్టాండ్‌కు తిరిగి వచ్చే విధంగా ఏర్పాటుచేశారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయూణించే పెద్దలకు రూ.940, పిల్లలకు రూ.715 టికెట్ ధర నిర్ణయించారని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. పట్టిసీమకు టూర్ ప్యాకేజీ గోదావరి పరవళ్లు, పట్టిసీమ ప్రకృతి సోయగాలను కనులారా వీక్షించేందుకు రీజియన్‌లో జనవరి 15వ తేదీ వరకు ప్రతి ఆదివారం టూర్ ప్యాకేజీని నిర్ణయించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి వేకువజామున మూడు గంటల సమయంలో ప్రారంభమై రాత్రికి విజయవాడకు చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.375 టికెట్‌గా వసూలు చేస్తారు. గోదావరిలో బోటు షికారుకు పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.350 చెల్లించాలి. వివరాలకు సెంట్రల్ మార్కెంటింగ్ సెల్ నంబర్ 9959225475లో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.