సువర్ణావకాశం.. పులి ఇంట్లో రెండ్రోజులు

Special Opprtunity To Spend With Tiger Two Days In Kanha National Park - Sakshi

కథల్లో విన్న పులిని చూడాలని ఉంటుంది. పులి కోసం కాన్హా నేషనల్‌ పార్కుకు వెళ్లాలని కూడా ఉంటుంది. దట్టమైన అడవిలో బస చేసి రాత్రిళ్లు పులి సంచారాన్ని స్వయంగా వీక్షించాలని సరదా పడితే... అది గొంతెమ్మ కోరిక ఏమీ కాదు. ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తున్న కాన్హా జంగిల్‌ స్టే ఎక్స్‌ రాయ్‌పూర్‌ (Sఏఏ069) టూర్‌ ప్యాకేజ్‌లో రెండు రోజులు కాన్హా అడవుల్లో బస చేయవచ్చు.

పులులు సంచరించే జోన్‌లో విహరిస్తూ గంభీరమైన పులి నడకను, పాదముద్రలను చూడవచ్చు. మూడు రోజుల ఈ టూర్‌ ప్యాకేజ్‌లో రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో రిసీవ్‌ చేసుకుని కాన్హా ఫారెస్ట్‌ టూర్‌ (రెండు రాత్రుల బస) పూర్తయిన తర్వాత మూడవరోజు రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్టు లో దించే వరకు ఐఆర్‌సీటీసీదే బాధ్యత. కాన్హా మధ్యప్రదేశ్‌లోని రెండు వేల చదరపు కిలోమీటర ్లకు పైగా విస్తరించిన దట్టమైన అటవీ ప్రదేశం.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top