షాపింగ్‌మాల్‌ వద్ద మాటువేసి.. లక్కీ డ్రా అంటూ..

Five Members Of A Gang Cheated Tourist Couple of Rs 1.4 Lakh With 10 Year Holiday Package Scheme: Simla - Sakshi

సిమ్లా: సార్‌ మీరు కారు గెలుచుకున్నారు, లక్ష రూపాయల గిఫ్ట్‌ వోచర్‌ గెలుచుకున్నారు అంటూ.... రకరకాల ఫ్రాడ్‌ కాల్స్‌ గురించి మనం నిత్యం వింటూనే ఉన్నాం. ఇదే తరహా కొంతమంది కేటుగాళ్లు హాలీడే ప్యాకేజీలు.. కళ్లు చెదిరిపోయి గిఫ్ట్‌లు గెలుచుకోవచ్చు అంటూ మాయమాటలు చెప్పి సిమ్లాలోని ఒక జంటను దారుణంగా మోసం చేశారు.

వివరాల్లోకెళ్లితే... ఓ జంట ఆగస్టు 27న సిమ్లాలో షాపింగ్‌ చేసి వస్తుంటే అక్కడే మాటువేసిన కొంతమంది తమ ట్రావెలింగ్‌ సంస్థలో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయని.. లక్కీ డ్రా కూడా ఉందని నమ్మించారు. మీరు లక్కీ డ్రాలో ఆకర్షణీయమైన టూర్‌ ప్యాకేజీలు, గిఫ్ట్‌లు గెలుచుకొవచ్చు అని చెప్పి కొన్ని కూపన్లను కొనుగొలు చేయమన్నారు.  ఈ క్రమంలో ఆ జంట కూపన్‌ తీసుకుని స్క్రాచ్‌ చేసి చూస్తే 10 సంవత్సరాల టూర్‌ ప్యాకేజ్‌ గెలుపొందినట్లు నమ్మించారు. (చదవండితాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవంలో మేము పాల్గొనం।):

ప్యాకేజీ  ప్రకారం ప్రతి ఏడాది భారతదేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో పర్యటించే భారీ ప్యాకేజ్‌  గెలుచుకున్నారంటూ చెప్పడంతో తాము ఆనందంగా సభ్యత్వ రుసుము కింద వారికి రూ.1.40 లక్షలు చెల్లించినట్లు ఆ బాధిత జంట పేర్కొంది. ఆ తర్వాత ఆ సంస్థ గురించి విచారిస్తే తాము మోసపోయినట్లు గుర్తించామని చెప్పారు. 

దీంతో వారు సిమ్లాలోని స్థానిక సదర్‌ పోలీస్టేసన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు ఆ గ్యాంగ్‌లో ఒక మహిళతో సహా ఐదుగురు సభ్యులు ఉన్నారని, వారిని చీటింగ్‌  కేసు కింద అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.(చదవండి: పరువు హత్య: చెల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top