ఐఆర్‌సీటీసీ మరో ఆఫర్‌

IRCTC Offers 2 Days/1 Night Flight Tour Package Under Rs 12000 - Sakshi

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) మరో ఆఫర్‌ ప్రకటించింది. తిరుమల తిరుపతి వెంకటేశుని దర్శించుకోవడం కోసం రెండు రోజుల క్రితమే ‘వెంకటాద్రి’ టూర్‌ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ, తాజాగా రెండు రోజుల ‘ఢిల్లీ-షిరిడీ’ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ స్పెషల్‌ లిమిటెడ్‌ ఆఫర్‌ కింద ప్రారంభ ధర రూ.11,900కు ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ టూర్‌ ప్యాకేజీ పేరు ‘ఢిల్లీ-షిరిడీ ఫ్లైట్‌ ప్యాకేజీ’గా పేర్కొంది. ఈ ప్యాకేజీ ఢిల్లీ, పుణే, శని శింగనాపూర్, షిరిడీ ప్రాంతాలను కవర్‌ చేయనుందని ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ కొత్త టూర్‌ ప్యాకేజీ 1నైట్‌, రెండు రోజులు అందుబాటులో ఉండనుంది. ఏప్రిల్‌ 28, మే 5, మే 12, మే 19, మే 26 తేదీల్లో ఈ టూర్‌ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవచ్చు. 
 

‘ఢిల్లీ-షిరిడీ ఫ్లైట్‌ ప్యాకేజీ’ వివరాలు...

  • ఈ ప్యాకేజీ కింద కేవలం విమానంలోనే ప్రయాణించాలి. క్లాస్‌ డీలక్స్‌
  • ఈ ప్యాకేజీలో రోజులో ఒక బ్రేక్‌ఫాస్ట్‌, ఒక డిన్నర్‌ అందించనున్నారు.
  • ఢిల్లీ నుంచి విమానం ఉదయం 7.55 సమయానికి ప్రారంభం కానుంది. పుణేకు ఉదయం 10.15కు చేరుకుంటుంది. విమాన నెంబర్‌ జీ8 173. 
  • తిరుగు ప్రయాణ విమానం పుణే నుంచి  రాత్రి 8.55 సమయానికి ప్రారంభం అవుతుంది. ఢిల్లీకి రాత్రి 11.05కు చేరుకుంటుంది. విమాన నెంబర్‌ జీ8 278.
  • ఈ టూర్‌ ప్యాకేజీలోనే హోటల్‌ కూడా ఉంటుంది. గోరడియా లార్డ్స్, గణపతి ప్యాలెస్ వంటి హోటల్స్‌లో స్టే చేసే అవకాశం కల్పిస్తుంది
  • ‘సింగిల్‌ అక్యుపెన్షీ’ ఆప్షన్‌ కింద ఈ టూర్‌ ఖర్చు ఒక్కరికి రూ.12,900. ‘డబుల్‌ అక్యుపెన్షీ’ కింద ఖర్చు రూ.11,900. డబుల్‌ అక్యుపెన్షీ’ కి 11,900 రూపాయలు. పిల్లలకు ఈ ప్యాకేజీ 11,600 రూపాయలు. బెడ్‌ లేకుండా పిల్లల ప్యాకేజీ ఖర్చు 11వేల రూపాయలు.
  • ఐఆర్‌సీటీసీ ప్రకారం ఎయిర్‌ఫేర్‌ను కస్టమర్లు విమానశ్రయాల వద్దనే చెల్లించాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top