లంక వరకు రామాయణ యాత్ర చేస్తారా.. ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ!

Irctc Ramayana Yatra From Ayodhya To Srilanka - Sakshi

రైల్లో రామాయణ యాత్ర చేయాలనుకుంటున్నారా..? శ్రీరామునికి సంబంధించిన ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. ‘శ్రీ రామాయణ యాత్ర’ను ఏప్రిల్ 7న ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా ప్రారంభించనుంది. శ్రీ రామాయణ యాత్ర అనేది రామాయణ సర్క్యూట్‌లోని భరత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు థీమ్ ఆధారిత తీర్థయాత్ర. రామాయణానికి సంబంధించి భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలతో పాటు శ్రీలంకను కూడా సందర్శించాలనుకునే వారికి కూడా ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ.

ఈ రైలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ నుంచి బయలుదేరి అయోధ్య, జనక్‌పూర్, సీతామధి, బక్సర్, వారణాసి, మాణిక్‌పూర్ జంక్షన్, నాసిక్ రోడ్ హోస్పేట్, రామేశ్వరం, భద్రాచలం రోడ్, నాగ్‌పూర్‌ స్టేషన్‌ల చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేసి తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. 

ఢిల్లీ సఫ్దర్‌జంగ్, ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా, ఇటావా, కాన్పూర్, లక్నో స్టేషన్ల నుంచి ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు​. విరంగని లక్ష్మీ బాయి, గ్వాలియర్, ఆగ్రా, మధుర స్టేషన్లలో దిగిపోవచ్చు. ఫస్ట్‌ ఏసీ కపుల్‌ సీట్ల ధర (ఇద్దరికి) రూ.1,68,950. ఫస్ట్‌ ఏసీ క్యాబిన్ సీట్ల ధర రూ. 1,03,020 నుంచి రూ. 1,61,645 ఉంటుంది.

చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి

ఇక అటు నుంచి అటే  శ్రీలంకను కూడా సందర్శించాలనుకునేవారు నాగ్‌పూర్ నుంచి నేరుగా శ్రీలంక వెళ్లవచ్చు. ఏప్రిల్ 23న దేశంలో రామాయణ యాత్ర నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ముగుస్తుంది. అక్కడి నుంచి రైలు ఢిల్లీకి బయలుదేరుతుంది. శ్రీలంక పర్యటనకు వెళ్లేవారు కొలంబోకు వెళ్లడానికి నాగ్‌పూర్ విమానాశ్రయానికి వెళతారు. ఈ ప్యాకేజీ ధర ఒక్కరికి రూ. 82,880, ఇద్దరికయితే రూ.69,620 (ఒక్కొక్కరికి) , అదే ముగ్గురుంటే ఒక్కొక్కరికీ రూ.67,360 చొప్పున ఉంటుంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top