breaking news
T20 World Cup 2028
-
T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్‌గా SRH మాజీ ప్లేయర్
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్ పోర్చుగల్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్-2028 యూరోప్ సబ్ రీజినల్ క్వాలిఫయర్ ‘సి’లో భాగంగా నాయకుడిగా జట్టును ముందుకు నడిపించనున్నాడు. పోర్చుగల్ క్రికెట్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది.కాగా పోర్చుగల్‌లో జన్మించిన మోజెస్ హెన్రిక్స్ చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అక్కడే క్రికెటర్‌గా ఓనమాలు నేర్చుకుని.. దేశవాళీ క్రికెట్లో న్యూ సౌత్‌వేల్స్ తరఫున 2006లో అరంగేట్రం చేశాడు.వేల పరుగులు.. వందల వికెట్లుమొత్తంగా 131 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 141 లిస్ట్-ఎ మ్యాచ్‌లు. 301 టీ20 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్ ఆయా ఫార్మాట్లలో 6830, 3812, 5747 పరుగులు సాధించాడు. ఈ మీడియం పేసర్ మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 333 వికెట్లు పడగొట్టాడు. బిగ్‌బాష్ లీగ్‌లో 3324 రన్స్ చేశాడు హెన్రిక్స్. కెప్టెన్‌గా సిడ్నీ సిక్సర్స్‌కు 2019, 2020 సీజన్లలో వరుస టైటిళ్లు అందించాడు.ఇక అంతర్జాతీయ క్రికెట్లో 2009లో అడుగుపెట్టిన మోజెస్ హెన్రిక్స్.. మొత్తంగా ఆసీస్ తరఫున నాలుగు టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 164, వన్డేల్లో 117, టీ20 ఫార్మాట్లో 355 పరుగులు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో రెండు, వన్డేల్లో ఎనిమిది, టీ20లలో ఏడు వికెట్లు పడగొట్టాడు.షెడ్యూల్ ఇదేఇక 2021లో ఆస్ట్రేలియా తరఫున చివరి మ్యాచ్ ఆడిన మోజెస్ హెన్రిక్స్ ఇటీవలే ఆసీస్ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. తాజాగా పుట్టిన దేశం పోర్చుగల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఆగష్టు 14న ఇజ్రాయెల్, ఆగష్టు 15న జర్మనీ, ఆగష్టు 17న గ్రీస్, ఆగష్టు 20న చెజియాతో పోర్చుగల్ తలపడుతుంది. ఇదిలా ఉంటే.. హెన్రిక్స్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2028 క్వాలిఫయర్స్‌కు పోర్చుగల్ జట్టుమోజెస్ హెన్రిక్స్ (కెప్టెన్), క్రెయిగ్ కచోపా, ఎడ్వర్డ్ ఫ్లెమింగ్, క్రిస్టోఫర్ డే ఫ్రెయిటాస్, రాహుల్‌కుమార్ హషూ, సిరాజ్ ఉల్లా ఖదీం, హర్దీప్ ఖట్టాన్, జెరెమీ మార్టిన్స, ధవళ్కుమార్ నొరోటామ్ (వికెట్ కీపర్), జోర్డాన్ నెట్టో, కార్లోస్ నూన్స్, సెబాస్టియన్ డి ఒలివెరా, ఉపేన్ శాంతూ, కామెరాన్ షెక్లెటన్.చదవండి: సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్!.. యాన్సెన్ కవల సోదరుడికి ఛాన్స్ -
ఆసీస్ క్రికెటర్ రిటైర్మెంట్.. ఇకపై ‘నా’ దేశానికి ఆడతా!
ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ మోజెస్ హెన్రిక్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. బిగ్ బాష్ లీగ్‌తో పాటు ఆసీస్ దేశవాళీ క్రికెట్‌కూ వీడ్కోలు పలికాడు. కాగా 2009 -2021 మధ్య హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా నాలుగు టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 164, వన్డేల్లో 117, టీ20లలో 355 పరుగులు సాధించిన మోజెస్ హెన్రిక్స్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా రెండు, ఎనిమిది, ఏడు వికెట్లు కూల్చాడు.ఐపీఎల్‌లోనూ..ఇక ఐపీఎల్లో 62 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్.. 1000 పరుగులు చేయడంతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా 2021లో ఆసీస్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన హెన్రిక్స్.. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), దేశీ క్రికెట్లో యాక్టివ్‌గా ఉన్నాడు. బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున కీలకంగా వ్యవహరించిన ఈ ఆల్‌రౌండర్.. దేశవాళీ క్రికెట్లో న్యూ సౌత్ వేల్స్‌కు ఆడుతున్నాడు.పోర్చుగల్‌లో జన్మించి..అయితే, టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త ఫార్మాట్ రూపొందించిన తరుణంలో మోజెస్ హెన్రిక్స్ ఆసీస్ క్రికెట్ నుంచి పూర్తిస్థాయిలో తప్పుకోవడం గమనార్హం. కాగా మోజెస్ హెన్రిక్స్ పోర్చుగల్‌లో జన్మించాడు. ఆ తర్వాత క్రికెట్ కెరీర్ కోసం ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు.ఇక ఇప్పుడు తన సొంత దేశం పోర్చుగల్ తరఫున క్రికెట్ ఆడాలని మోజెస్ హెన్రిక్స్ నిర్ణయించుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2028లో భాగంగా యూరోపియన్ క్వాలిఫయింగ్ పోటీల్లో పోర్చుగల్ తరఫున అతడు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఈ టోర్నీపై దృష్టి సారించేందుకు 39 ఏళ్ల హెన్రిక్స్ ఆసీస్ క్రికెట్‌కు దూరమైనట్లు తెలుస్తోంది.పరుగుల వరద.. వికెట్ల వీరుడుఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో న్యూ సౌత్‌వేల్స్ జట్టు తరఫున 2006లో అరంగేట్రం చేశాడు మోజెస్ హెన్రిక్స్. అదే ఏడాది లిస్ట్-ఎ క్రికెట్లోనూ అడుగుపెట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.మొత్తంగా 131 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 141 లిస్-ఎ మ్యాచ్‌లు, 301 టీ20 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్.. 6830, 3812, 5747 పరుగులు సాధించాడు. మీడియం పేసర్ అయిన అతడు మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 333 వికెట్లు కూల్చాడు. ఇక బీబీఎల్‌లో 3324 పరుగులు సాధించడంతో పాటు.. సిడ్నీ సిక్సర్స్ కెప్టెన్‌గా 2019, 2020లో టైటిల్ అందించాడు.చదవండి: ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా అశ్విన్? -
‘అందుకే హార్దిక్‌ను కాదని నితీశ్ రెడ్డిని ఎంపిక చేశాం’
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ భారత టీ20 జట్టు సారథిగా వ్యవహరించడమే ఇందుకు కారణం.అప్పుడు కెప్టెన్సీ చేజారిందిఅయితే, అనూహ్యంగా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నైపుణ్యాలున్న హార్దిక్‌ను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాడు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.కాలం గిర్రున తిరిగింది.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లలో ఎదురులేని శక్తిగా ఎదిగిన టీమిండియా.. ఈ ఏడాది స్వదేశంలో టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. సొంతగడ్డపై పొట్టి వరల్డ్‌కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.సూర్యపై తప్పని వేటుకానీ ఊహించని రీతిలో బీసీసీఐ సూర్యపై వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టులోనూ స్థానం లేకుండా చేసింది. ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.పిల్లాడికి అవకాశంఐర్లాండ్తో పాటు.. ఇంగ్లండ్ టూర్.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల సూర్యవంశీని తొలిసారి టీమిండియాకు ఎంపిక చేసింది. అయితే, ఈ మూడు జట్లలోనూ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు.హార్దిక్‌కు దక్కని చోటుకాగా ఐపీఎల్-2026లో హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా.. ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఇక హార్దిక్ పది మ్యాచ్‌లు ఆడి కేవలం 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.ఇక వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినా.. అతడు ఆడే విషయంపై బీసీసీఐ ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.మూడు జట్లలోనూ నితీశ్ రెడ్డితాజాగా టీ20 జట్టు నుంచి పూర్తిగా పక్కనపెట్టేస్తూ టీమిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్, ఆంధ్రా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్.. ఆసియా క్రీడల జట్టులో అతడికి చోటు ఇచ్చారు.అందుకే అతడిని ఎంపిక చేశాంఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘వన్డేల్లో అతడు ముఖ్యమైన ఆటగాడు. అతడితో పాటుగా అరుదైన నైపుణ్యాలున్న నితీశ్ రెడ్డి మాకు దొరికాడు.రొటేషన్ పద్ధతిలో ఇద్దరి సేవలు వాడుకుంటాము. అందుకే హార్దిక్‌కు విశ్రాంతినిచ్చాము. వన్డే వరల్డ్‌కప్ నాటికి అతడు ఫిట్‌గా ఉంటాడో లేదో చూడాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. తద్వారా హార్దిక్ ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం సందేహం ఉన్నా.. వన్డే వరల్డ్‌కప్ టోర్నీలోనూ నితీశ్ రెడ్డినే ఆడిస్తామని అగార్కర్ పరోక్షంగా స్పష్టం చేశాడు. అదే జరిగి.. నితీశ్ రెడ్డి అద్భుతంగా ఆడితే.. హార్దిక్ మున్ముందు జట్టులో కొనసాగడం కూడా కష్టమే అవుతుంది. చదవండి: ‘మేము సెలక్ట్ చేయలేదు.. తనంతన తానే ఎంపికయ్యాడు’ -
వైభవ్‌కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లు వీరే?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత సీనియర్ జట్ట వైపు దూసుకొస్తున్నాడు. ఇప్పటికే ఆసియా క్రీడలకు బీసీసీఐ ఎంపిక చేసిన 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబుబుల్స్ జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు.అంతకంటే ముందు ఐర్లాండ్ లేదా జింబాబ్వేలతో టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టుకు వైభవ్ ఎంపికయ్యే అవకాశముంది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సంచనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్‌గా అభివర్ణిస్తున్నారు.ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2028లో భారత జట్టుకు వైభవ్ కీలకం కానున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నీలో వైభవ్.. అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్‌లతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడని మాజీలు ఇప్పటి నుంచే జోస్యం చెబుతున్నారు.కానీ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం పొట్టి ప్రపంచకప్ కోసం కొత్త భారత ఓపెనింగ్ జోడీని ఎంచుకున్నాడు. శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్‌లు భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించాలని అతడు సూచించాడు. "ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ జోడీ(సాయిసుదర్శన్-శుభ్‌మన్ గిల్)ని ఇప్పుడు మనం ఐపీఎల్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా పిచ్‌లు ఆస్ట్రేలియా మాదిరిగానే అంతే వేగం, బౌన్స్‌ను కలిగి ఉన్నాయి. అలాంటి పిచ్‌లపై కూడా గిల్-సుదర్శన్ జోడీ అద్భుతంగా రాణిస్తోంది. వీరిద్దరూ 2028 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపిక కాకపోతే కచ్చితంగా నేను ఆశ్చర్యపోతాను. ఈ మెగా టోర్నీలో గిల్-సుదర్శన్‌లు టీమిండియా ఓపెనర్లగా బరిలోకి దిగాలి. ఎందుకంటే ఒకరి ఆట తీరుపై మరొకరికి చాలా మంచి అవగాహన ఉంది. విభిన్నమైన విదేశీ పరిస్థితుల్లో జట్టు రాణించాలనుకుంటే, వీరిద్దరూ కలిసి ఉండటం అనేది జట్టుకు చాలా పెద్ద సానుకూలాంశం" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు. కాగా శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం భారత టీ20 సెటాప్లోనే లేడు. అతడు చివరగా సౌతాఫ్రికాపై టీ20 మ్యాచ్ ఆడాడు. వరుస మ్యాచ్‌లలో విఫలం కావడంతో టీ20 ప్రపంచకప్-2026 జట్టును అతడిని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పించింది. ఇప్పుడు మళ్లీ గిల్‌ను టీ20లకు ఎంపిక చేయమని రాయుడు సూచించడం గమనార్హం.చదవండి: IPL 2026: తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్‌మన్ గిల్ -
T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2028 టోర్నమెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక ప్రకటన చేసింది. ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నేరుగా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించినట్లు తెలిపింది.అదే విధంగా.. బంగ్లాదేశ్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటుందని ఐసీసీ పరోక్షంగా స్పష్టం చేసింది. కాగా ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్‌కప్ 2026 ఎడిషన్ మొదలైన సంగతి తెలిసిందే. మొత్తంగా ఇరవై జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో నాలుగు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి.సూపర్-8 చేరిన జట్లు ఇవేగ్రూప్-ఎ నుంచి టీమిండియా, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే... గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్... గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8లో అడుగుపెట్టాయి. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే అనూహ్య రీతిలో అర్హత సాధించింది.ఈ నేపథ్యంలో.. నిబంధనల ప్రకారం టీ20 ప్రపంచకప్-2026 ఎడిషన్‌లో సూపర్-8 చేరిన జట్లన్నీ ఆటోమేటిక్‌గా 2028 టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా ఈసారి విఫలమైనా.. 2028 టోర్నీకి ఆతిథ్య దేశంగా ఉన్నందున ఆ జట్టు కూడా క్వాలిఫై అయింది.బంగ్లాదేశ్, అఫ్గన్, ఐర్లాండ్ కూడా నేరుగాతద్వారా మొత్తంగా ఇప్పటికే తొమ్మిది జట్లు 2028 టోర్నీకి అర్హత సాధించగా.. ర్యాంకింగ్స్ ఆధారంగా మిగిలిన జట్లను చేర్చే క్రమంలో టాప్-12లో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఐర్లాండ్ కూడా తమ బెర్తును ఖరారు చేసుకున్నాయి. తదుపరి పెద్దగా టీ20 సిరీస్‌లు లేనందున ఈ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పు ఉండదు కాబట్టి.. ఈ మూడు జట్లు అర్హత సాధించినట్లు ఐసీసీ పేర్కొంది. ఇక ఈ పన్నెండు పోను మిగిలిన ఎనిమిది బెర్తులను రీజినల్ క్వాలిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, యూఎస్ఏ, యూఏఈ, నేపాల్, కెనడా, ఒమన్ టాప్-20లో కొనసాగుతున్నాయి.ఈసారి వేటు పడిందిలా!టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-సి నుంచి బంగ్లాదేశ్ పోటీపడాల్సింది. అయితే, టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్‌లో తమకు భద్రత లేదని.. తమకు కూడా పాక్ మాదిరి శ్రీలంకనే తటస్థ వేదికగా ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే, ఐసీసీ బంగ్లా వాదనలో నిజం లేదని కొట్టిపారేసింది. టోర్నీలో కొనసాగాలనుకుంటే షెడ్యూల్ ప్రకారం భారత్‌లో ఆడాలని సూచించింది.అయితే, తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం టోర్నీ నుంచి తప్పుకునేందుకైనా సిద్ధమే కానీ.. భారత్‌లో ఆడమని బంగ్లా బోర్డు ఐసీసీకి తెలిపింది. దీంతో బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలవగా.. బంగ్లాదేశ్‌పై ఎటువంటి కఠిన చర్యలు చేపట్టమని ఐసీసీ హామీ ఇచ్చింది. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను తప్పించగా.. బంగ్లా వరల్డ్‌కప్ టోర్నీ ఆడేందుకు భారత్ రాకూడదని నిర్ణయించుకుంది.చదవండి: విధ్వంసకర ఓపెనర్ కాదు!.. ‘డకౌట్ల’ అభిషేక్.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు


