SSC Exam Results
-
గత ప్రభుత్వ సంస్కరణల వల్లే ‘పది’లో ప్రభంజనం
సాక్షి, నెట్వర్క్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరిశారు. వైఎస్ జగన్ పాలనలో చేపట్టిన విద్యా సంస్కరణలు నేడు మంచి ఫలితాలనిస్తున్నాయి. నాడు–నేడు కార్యక్రమం వల్ల సమకూరిన మౌలిక వసతుల వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. పేదింటి బిడ్డలు వెలుగులు విరజిమ్మారు. 2014–19 మధ్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలంటే అందరికీ చిన్నచూపే. చిన్నపాటి వర్షానికే కారే భవనాలు.. కుక్కలు, పందులతో పాఠశాల ప్రాంగణాలు.. తెల్లగా మారిపోయిన బ్లాక్ బోర్డులు.. చివరకు చాక్‌పీస్‌లకూ కొరతే.. పిల్లలకు బెంచీలుండవు.. అయ్యవార్లకు కుర్చీలుండవు.. పిల్లలకు కనీసం తాగడానికి మంచినీరు దొరికేది కాదు.అలాంటి దుస్థితిలో ఉన్న పాఠశాలలను 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. ఇదివరకెన్నడూ లేనివిధంగా వేల కోట్ల రూపాయలతో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. సీబీఎస్ఈ స్కూళ్లు, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ఐబీ సిలబస్, విద్యార్థులకు ట్యాబ్‌లు, పిల్లలకు మధ్యాహ్నం గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనం, జగనన్న విద్యాకానుక కింద యూనిఫాం, పుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాగ్ తదితరాలన్నీ సమకూర్చింది.వీటిన్నింటితో పాటు సకల సౌకర్యాలతో పాఠశాలలను తీర్చిదిద్దింది. అత్యాధునిక ల్యాబ్, లైబ్రరీ, ఫర్నిచర్, డెస్‌్కలు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్, వాటర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు క్యూ కట్టారు. ఓ దశలో పలు పాఠశాలల్లో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టారు. వీటన్నింటికీ తోడు పిల్లలను బడులకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు అమ్మ ఒడి పేరిట తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దశ తిరిగింది.. దిశ మారింది వైఎస్ జగన్ ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా 2022 నుంచి ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు పదో తరగతి ఫలితాల్లో గుత్తాధిపత్యం గల కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫలితాలు రావడం మొదలైంది. దిగువ మధ్యతరగతి, పేదింటి పిల్లలు సైతం అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ప్రతి పాఠశాలలోనూ పిల్లలు మంచి మార్కులు సాధించారు. పలువురు విద్యార్థులు 596 మార్కులు సాధించారంటే ఇందుకు కారణం గత ప్రభుత్వ సంస్కరణలే అని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. ట్యాబుల వల్లే మంచి మార్కులు సాధించా.. నాన్న శ్రీనివాసరావు గ్యాస్ డెలివరీ చేస్తారు. అమ్మ వెంకట అనంతలక్ష్మి గృహిణి. అమ్మ బీకామ్ చదివింది. క్లాస్‌లో టాప్‌లో ఉండాలని చెబుతుంటారు. జగన్ ప్రభుత్వంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్‌పీ)లు వచ్చిన తరువాత మాకు ల్యాబ్ లేదన్న కొరత తీరింది. పాఠాలు చెప్పడం, వెంటనే వీడియోలో ప్లే చేయడం, ట్యాబ్‌లలో స్లిప్ టెస్టులు, స్పెషల్ టెస్టులు పెట్టేవారు. ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌ల వల్ల మాకు క్విక్ రివిజన్ అయ్యేది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన నాడు–నేడు, నూతన విద్యావిధానం మాకెంతో ఉపయోగపడింది. మంచి బోధనా వసతులే కారణంనాన్న కోలా కులశేఖర్. అమ్మ సరోజమ్మ. మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు భారం కాకూడదని నాగలగుట్టపల్లె జెడ్పీ హైసూ్కల్లో చదివా. పదో తరగతిలో 595 మార్కులు సాధించా. ఉన్నత చదువులకు పేదరికం, ఆరి్థక సమçస్య అడ్డు గోడగా ఉంటోంది. కష్టపడి చదివి తొలుత డాక్టర్ వృత్తి చేపడతా. సివిల్స్‌కు ప్రిపేర్ అయి కలెక్టర్ అవుతా. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలో కల్పించిన మంచి బోధనా వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం బాగా చదవడానికి దోహదపడింది. నాడు–నేడు పథకంలో ప్రతి తరగతి గదికి ఇచ్చిన ఐఎఫ్‌పీ ప్యానల్ బోర్డు ద్వారా కల్పించిన విద్యాబోదన కూడా విజయానికి దోహదపడింది. గత ప్రభుత్వం వల్లే అధిక మార్కులుటెన్త్లో 600 మార్కులకు 595 మార్కులతో టాపర్‌గా నిలిచాను. మా పాఠశాలను గత ప్రభుత్వం ‘నాడు–నేడు’లో అన్నివిధాలుగా అభివృద్ధి చేసింది. మా స్కూల్లో ప్రశాంత వాతావరణం కల్పించడంతో చదువుపై దృష్టి పెట్టాను. డిజిటల్ తరగతి గదులు, అత్యంత ఆధునికత ఉట్టిపడేలా టేబుళ్లు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ స్కూళ్లలో లక్షలు ఖర్చు చేస్తే కానీ చదవలేం. కానీ ప్రభుత్వ పాఠశాలలోనే కార్పొరేట్ వసతులు కల్పించారు. మా వంటి పేద విద్యార్థులకు ఇంతకంటే ఏం కావాలి. నాన్న రవికిశోర్ అకౌంటెంట్. అమ్మ ఉషారాణి గృహిణి. టీచర్ కావాలన్నదే నా ఆశయం. ‘సాక్షి’ మెటీరియల్ అద్భుతం మాది వ్యవసాయ ఆధారిత మధ్య తరగతి కుటుంబం. నాన్న కొర్రకూటి వెంకటేశ్వర్లు. అమ్మ లక్ష్మి గృహిణి. ఆరి్థక స్తోమత లేని కారణంగా ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో తెచ్చిన పటిష్టమైన విద్యా ప్రమాణాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. టెన్త్‌లో 600 మార్కులకు గాను 595 మార్కులొచ్చాయి. జగన్ ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ నా చదువుకు ఎంతో దోహదపడింది. ఉపాధ్యాయుల బోధనతో పాటు ‘సాక్షి’ మీడియా అందించిన స్టడీ మెటీరియల్ కూడా మంచి మార్కులు సాధించేందుకు సహకరించింది. సివిల్స్ సాధనే లక్ష్యంగా ఎంచుకున్నాను. వైఎస్ జగన్ ఉజ్వల భవితకు బాట వేశారునాన్న హరిప్రసాద్‌కు వ్యవసాయమే ప్రపంచం. సాధారణ గృహిణి అయిన అమ్మ రాజ్యలక్షి్మకి ఇల్లే ప్రపంచం. ఆకలి బాధతో చదువుకునే విద్యార్థులు మెరుగైన లక్ష్యాలను అందుకోలేరన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నో మార్పులు తెచ్చింది. ఎంతోమంది విద్యార్థుల ఆకలి బాధను పౌష్టికాహారంతో తీర్చి మంచి మార్కులతో ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేలా బాటలు వేసింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ర్యాంక్ సాధించడానికి గత ప్రభుత్వ విధానాలే బాటలు వేశాయి. 4వ తరగతి వరకు కొల్లూరులోని ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఐఐఐటీ పూర్తి చేసి సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నా. జగన్ ప్రభుత్వం ముందు చూపు వల్లే..నాన్న దూళ్ల శ్రీనివాస్ వ్యవసాయ పనులకు వెళ్తారు. అమ్మ వీరవేణి గృహిణి. మాది మధ్యతరగతి కుటుంబం. నేను టెన్త్ ఫలితాల్లో 600 మార్కులకు 596 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచాను. దీనికి ప్రధాన కారణం నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాఠశాలలను ‘నాడు–నేడు’లో అభివృద్ధి చేయడమే. చక్కటి అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు, ట్యాబ్‌లు, ఫుట్‌పాత్, చక్కటి మొక్కలు, సమావేశపు ప్రాంగణం, టేబుల్స్ వంటి మౌలిక వసతులతో సంపర జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. పాఠశాలను అత్యంత ఆధునిక వసతులతో తీర్చిదిద్దడంతో బాగా చదవుకోగలిగాను. పాఠశాలలో కల్పించిన ఆధునిక వసతులు ఎంతో ప్రేరణగా నిలిచాయి. మా చెల్లి కూడా ఇదే పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. భవిష్యత్‌లో సీఏ చదవాలనుకుంటున్నాను. నాడు–నేడు నా జీవితాన్నే మార్చింది నాన్న చక్రపాణి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. అమ్మ పద్మావతి గృహిణి. నేను పాణ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నా. టెన్త్‌లో 596 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలవడానికి కారణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం. ఇది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. ఐదో తరగతిలో చేరినప్పుడు పాఠశాలలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కిందనే కూర్చుని పాఠాలు వినేవాళ్లం. విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మంచి టేబుల్స్, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేసింది. డిజిటల్ విద్య అందుబాటులోకి వచ్చింది. ఐఎఫ్బీ ప్యానెల్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే ఉపాధ్యాయులు బోధన చేసేవారు. 8వ తరగతిలో ట్యాబులు ఇచ్చారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు సబ్జెక్టులలో వచ్చే అనుమానాలు నివృత్తి చేసుకునే దాన్ని. భవిష్యత్‌లో గైనకాలజిస్ట్ కావాలనుకుంటున్నాను. నాడు– నేడుతో బడి బాగుగత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అనుసరించిన విధానాలతో మా ఊరితోపాటు పాఠశాల బాగు పడింది. విద్యార్థులకు అమ్మ ఒడి, విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడంతోపాటు నాడు–నేడు పథకంలో మా పాఠశాలని కూడా బాగుచేయడం ఎంతో నచ్చింది. ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌ల వల్ల మాకు క్విక్ రివిజన్ అయ్యేది. దీనివల్ల ఒత్తిడి ఉండేది కాదు. దీనివల్ల మేం ముందుకు సాగాం. చదివింది, విన్నది, చూసినది అన్నీ చక్కగా గుర్తుపెట్టుకోగలిగాను. 10వ తరగతి పరీక్షల్లో కంగారు లేకుండా బాగా రాయటానికి ఇవన్నీ దోహదపడ్డాయి. మొత్తంగా టెన్త్‌లో 596 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలబడటానికి గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విధానాలే కారణం. నాన్న వెంకట దుర్గారావు పెయింటింగ్ వర్కర్. తల్లి నాగలక్ష్మి బీఏ, బీఈడీ చేసి గృహిణిగా స్థిరపడ్డారు. యూపీఎస్సీలో మంచి ర్యాంకు సాధించడమే నా గోల్. వైఎస్ జగన్ హయాంలోనే కొత్త భవనాలు మాది పీలేరు. నాన్న ఆర్డీ మునిరాజ్ కడపలోని జగదీశ్వర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో మేనేజర్. అమ్మ శైలజ గృహిణి. నేను 5వ తరగతి వరకు మదనపల్లె విజయభారతి ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదివా. తరువాత జెడ్పీ హైసూ్కల్లో చేరా. టెన్త్‌లో 595 మార్కులు సాధించా. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కొత్త భవనాలు వచ్చాయి. డిజిటల్ బోర్డులపై విద్యాబోధన కూడా చాలా బాగా అర్థమైంది.అప్పటి ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లు చాలా అద్భుతంగా ఉపయోగపడ్డాయి. పాఠశాల రూపురేఖలు కూడా మార్చేశారు. చూస్తే బిల్డింగ్‌లతోపాటు వివిధ రంగులలో ఉన్న బెంచీలు, ఇతర పరిసరాలు బాగా ఉన్నాయి. అప్పట్లో మాకు ఇచ్చిన అన్ని వస్తువులు బాగా ఉపయోగపడ్డాయి. మాకున్న లాంగ్వేజ్‌లతోపాటు మిగతా సబ్జెక్టులు ఏవీ కష్టంగా భావించలేదు. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఐఐటీ సాధన దిశగా ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నా. డిజిటల్ విద్యతో ఉత్తమ ఫలితాలు గత ప్రభుత్వం ‘నాడు–నేడు’ పథకంలో భాగంగా కాకినాడ శ్రీనగర్‌లో ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన డిజిటల్ విద్య పదో తరగతి పరీక్షల్లో 595 మార్కులు సాధించేందుకు ఎంతగానో దోహదపడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండగా 2023లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు కూడా ఇచ్చారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించాను. సుద్ద ముక్కలు, బ్లాక్ బోర్డులు అవసరం లేకుండా మా పాఠశాలలో జరిగిన డిజిటల్ బోధన, కార్పొరేట్ పాఠశాలల్లో లేనివిధంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలను ‘నాడు–నేడు’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం కలిసొచ్చింది. మా నాన్న రామలింగరాజు ప్రైవేట్ ఉద్యోగి. తల్లి శ్వేత గృహిణి. వారిద్దరూ నాకెంతో స్ఫూర్తిని కలిగించారు. ఇంటర్లో ఎంఈసీ గ్రూపు తీసుకుని చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలనేది నా ఆశయం. ప్యానల్స్ బాగా ఉపయోగపడ్డాయి టెన్త్‌లో 595 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. నాన్న బ్రహా్మనందం చిన్న షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అమ్మ సౌజన్య గృహిణి. వైఎస్ జగన్ హయాంలో నాడు–నేడు పథకాన్ని మా పాఠశాలలో బాగా అమలు చేశారు. తరగతి గదులలో టైల్స్ వేశారు. ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్‌పీ)ల ద్వారా విద్యాబోధన మరింత మేలు చేసింది. పాఠాలు వినడంతో పాటు వీడియోలు కూడా చూడటం వల్ల మాకు మరింతగా అర్థమయ్యాయి. ట్యాబ్‌లు అందుబాటులో ఉండటం వల్ల మాకు తరచూ స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఈ కారణంగానే మాకు మంచి మార్కులు వచ్చాయి. భవిష్యత్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేస్తాను. -
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9 శాతం ఉత్తీర్ణత,, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 👉పదో తరగతి పరీక్షా ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో https://education.sakshi.com/en తోపాటుగా https://results.bse.ap.gov.in/ ఈ వైబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్క క్లిక్‌తో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... 👉పది ఫలితాల్లో 96.07 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది.👉మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారానూ పొందొచ్చు. ఏపీలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు.ఒక్క క్లిక్‌తో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... -
అత్యున్నత ఫలితాలే లక్ష్యం కావాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గుణాత్మక మార్పు తేవాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. టెన్త్, ఇంటర్మిడియెట్ పరీక్షలు స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. అత్యున్నత స్థాయి ఫలితాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తొలిసారిగా మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మిడియెట్ బోర్డు కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హాజరయ్యారు. ఇంటర్, టెన్త్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, రాబోయే ఫలితాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఏడాది పేపర్ లీకేజీ ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. కాగా ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని ఇంటర్ అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల అతి తక్కువ సమయంలో ఫలితాల వెల్లడికి ఆస్కారం ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ దిశగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులు, వాటి సాధ్యాసాధ్యాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేటుతో సమానంగా ఫలితాలు రావాలి ప్రైవేటు విద్యా సంస్థలతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. దీంతో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చా రు. ఈ క్రమంలోనే గురుకులాల్లో మాదిరిగా ప్రభు త్వ స్కూళ్లల్లోనూ ఫలితాలు పెంచాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెళకువలు మెరుగు పర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఇంటర్ తర్వాత జరిగే పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సూచించారు. మండలానికో కాలేజీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విద్యార్థులకు కాలేజీలు అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ప్రతి మండలానికి ఓ కాలేజీ ఏర్పాటు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అవసరాన్ని బట్టి అధ్యాపకులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుండటంపై ఆయన ఆరా తీశారు. పదోన్నతులు చేపడితే ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, పరీక్షలు, ఫలితాల గురించి దేవసేన సీఎంకు వివరించారు. వివిధ సబ్జెక్టు టీచర్ల కొరత, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో జరిగిన కసరత్తు చర్చకు వచ్చినట్టు తెలిసింది. 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ఎన్నికల ముందు చేపట్టిన ప్రక్రియ ఆగి పోయిందని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 18 వేలకు పైగా ఖాళీలున్నాయని, పదోన్నతులు చేపడితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టమైన సమాచారం వస్తుందని వివరించారు. టెట్ ఉత్తీర్ణులకే పదోన్నతులు ఇవ్వాలన్న కోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని చెప్పగా, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం. -
AP SSC Results 2023: నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది..బాలురు 3,09,245 మంది ఉన్నారు. https://www.sakshieducation.comలో ఫలితాలను చూడవచ్చు. -
ఏపీలో పదో తరగతి ఫలితాలు వాయిదా
సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు-2022 విడుదల వాయిదా పడింది. సోమవారం (జూన్ 6న)నాటికి ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2021-22 ఏడాదికిగానూ ఏప్రిల్ 27నుంచి మే 9వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. -
పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ కూడా
ఛండీగఢ్: ఆయన ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన ఆ నాయకుడు 86 ఏళ్ల వయసులో పదో తరగతి పాసయ్యాడు. ఒక్క సబ్జెక్ట్‌తో ఆయన పదో తరగతి అర్ధంతరంగా ఆపేసిన ఆయన ఇప్పుడు ఆ సబ్జెక్ట్‌లో ఇప్పుడు పాసయ్యాడు. దీంతో ఆయన పదో తరగతి గండాన్ని గట్టెక్కాడు. ఆయనే హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతలా. తాజాగా శనివారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఆయన ఉత్తీర్ణత సాధించాడు. చౌతలా ఇటీవల 12వ తరగతి పాసయ్యాడు. అయితే ఆయన పదో తరగతి పాస్ కాకపోవడంతో ఆ ఉత్తీర్ణతను నిలిపివేశారు. ఆయన ఇంగ్లీశ్ సబ్జెక్ట్‌తో పదో తరగతి చదువు ఆగిపోయింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో చౌతలా ఇంగ్లీశ్ పరీక్ష రాశాడు. తాజాగా హరియాణా విద్యా బోర్డు విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఆయన ఇంగ్లీశ్ 100కు 88 మార్కులు సాధించి పదో తరగతి గండాన్ని దాటేశాడు. కరోనా తొలి దశలో ఓపెన్ స్కూల్లో చౌతలా ఇంటర్మీడియట్లో చేరారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే ఓపెన్ విద్యార్థులంతా పాసయ్యారు. ఆ క్రమంలో చౌతలా కూడా పాసయ్యాడు. అయితే పది పూర్తి చేయకుండానే ఇంటర్‌కు ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఓం ప్రకాశ్ చౌతలా పదో తరగతి పాసవడంతో ఇంటర్ కూడా ఉత్తీర్ణత సాధించాడు. లేటు వయసులో లేటెస్ట్గా పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించడం విశేషం. -
ఏ పీ లో పదో తరగతీలో గ్రేడ్ తో పాటు మార్కులు
-
ఏపీ: నేడే పదవ తరగతి ఫలితాలు
-
33 సార్లు ఫెయిల్.. కరోనాతో పాస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని భోలక్ పూర్‌కి చెందిన మహ్మద్ నూరుద్దీన్(51)కి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కల. కానీ పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. అయితే గవర్నమెంట్ ఉద్యోగం మీద ఆశ మాత్రం చావలేదు. దాంతో 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాశాడు. ప్రతి సారి ఫెయిల్ అయ్యాడు. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు పాస్ అయ్యాడు. వైరస్ కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దయిన సంగతి తెల్సిందే. దీంతో పరీక్షలుకు హాజయిన అందరిని ప్రభుత్వం పాస్ చేసింది. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా పదోతరగతి పరీక్ష రాస్తున్న వాళ్ళు కూడా కరోనా పుణ్యమాని పాస్ అయ్యారు. వారిలో మహ్మద్ నూరుద్దీన్ కూడా ఉన్నారు. ('నాకు కరోనా వచ్చి మేలు చేసింది') అంజుమన్ బాయ్స్ హైస్కూల్లో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఇప్పటివరకు 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాసినా.. పాస్ కాలేదు. అతడు తొలిసారిగా 1987లో ప్రైవేట్‌గా టెన్త్ పరీక్షలు రాశాడు. కానీ ఇంగ్లీష్‌లో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 33 సార్లు ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. కానీ ఈ సారి పాస్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసు శాఖ, రక్షణ శాఖలో ఉద్యోగం చేయాలని నా కల. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతంతో పాటు ఇతర సదుపాయాలు ఉంటాయి. దాంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాశాను. కానీ ఫెయిల్ అయ్యాను. కరోనా వల్ల ఈ సారి పాస్ అయ్యాను. గ్రూప్-డీ జాబ్లకు వయసుతో నిమిత్తం ఉండదు. కాంట్రాక్ట్ బెస్ట్ ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. వాటి కోసం ప్రయత్నిస్తాను. ఉన్నత చదువులు చదివే ఆలోచన లేదు’ అన్నారు నూరుద్దీన్. ఆయనకు ఇంటర్ చదివిన ఇద్దరు కొడుకులతో పాటు బీకాం పాసైన ఓ కూతురు ఉన్నారు. -
13న పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 13వ తేదీన విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేస్తారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 3వ తేదీవరకూ జరిగాయి. కాగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఫలితాల విడుదలలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో 77.05 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు 79.24 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 76.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ స్కూల్స్ 82.48 శాతం ఉత్తీర్ణత సాధించగా, గురుకుల పాఠశాలలు 92.99 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలలు 87. 83 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ మొత్తం ఫలితాల్లో వరంగల్ జిల్లా 96.01శాతంతో అగ్రస్థానంలో నిలవగా, ఆదిలాబాద్ 54.06శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 1,491 స్కూల్స్ వంద శాతం ఫలితాలను సాధించగా, 28 స్కూల్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఖరారు చేసినట్లు కడియం పేర్కొన్నారు. టెన్త్ సప్లమెంటరీ పరీక్షల రాసే విద్యార్థులు మే 30వ తేదీలోగా రుసుము చెల్లించాల్సి ఉంది. టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి: -
నేడే టెన్త్ ఫలితాలు
-
నేడే టెన్త్ ఫలితాలు
హాజరైన విద్యార్థులు 5.65 లక్షలు ⇒ ఇంటర్నెట్లో ఫలితాలు ⇒ ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ రూపంలోనూ తెలుసుకోవచ్చు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజయ్యారు. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఇస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్ పాయింట్ల సగటును లెక్కించి సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్) పాయింట్లు ఇస్తారు. లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్ల నుంచే కాకుండా కొన్ని ప్రైవేటు వెబ్సైట్ల నుంచి కూడా పొందేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ రకాల మొబైల్ ఆపరేటర్ల నుంచి కూడా ఎస్ఎంఎస్ల రూపంలోనూ, ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డర్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం వెబ్సైట్లు www.sakshieducation.com www.aponline.gov.in www.bsetelangana.org www.results.cgg.gov.in ఎస్ఎంఎస్ల రూపంలో.. ఎయిర్‌సెల్/వొడాఫోన్/రిలయన్స్ 58888 ఐవీఆర్ఎస్ ద్వారా.. యూనినార్/ఎయిర్టెల్/ఎయిర్‌సెల్/వొడాఫోన్ 5333530 -
ఉత్తమ ఫలితాలు ఆశిస్తూ...
ఖమ్మం, న్యూస్‌లైన్: పదో తరగతిలో ఉత్తమఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మూడేళ్లుగా ఎస్సెస్సీ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో కింది నుంచి మూడు, నాలుగు స్థానాల్లో జిల్లా ఉంటుండటంతో మెరుగైనఫలితాల కోసం కలెక్టర్ ద్వారా లేఖాస్త్రాన్ని సంధించేందుకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి, ప్రతినిమిషాన్నీ సద్వినియోగం చేసుకొని జిల్లా కీర్తిని చాటాలని బోధకులకు ఒక లేఖ, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్టేనని, ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు అందుతాయని, కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు మరో లేఖ, పిల్లలు కీలకసమయంలో కష్టపడి చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, పిల్లల ప్రగతి రిపోర్టును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారిని మెరుగైన ఫలితాల దిశగా ప్రోత్సహించాలని పేరెంట్స్‌కు ఇంకోలేఖను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ లేఖ లు పాఠశాలలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వి ద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశిం చారు. లేఖ దిగువభాగంలో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌తో పాటు ఆర్జేడీ బాలయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి పేర్లను ముద్రించారు. 70వేల లేఖలు సిద్ధం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి తయారు చేసిన 70వేల లేఖలను విద్యాశాఖ సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా 430 ప్రభుత్వోన్నత పాఠశాలలు, 200కు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 35వేల మంది పైచిలుకు విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం పదో తరగతి చదువుతున్నారు. జిల్లా విద్యాశాఖ పనితీరుకు పదో తరగతి ఫలితాలే ప్రామాణికం కావడంతో రెండు నెలలుగా విద్యాశాఖాధికారులు ఎస్సెస్సీ ఫలితాలపై వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక బుక్లెట్లు తయారు చేయడం, వందరోజుల కాార్యక్రమంలో భాగంగా స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించడం, సాంఘిక సంక్షేమశాఖ, ఇతర ఎస్సీ, ఎస్టీ, ఐటీడీఏ పరిధిలోని హాస్టల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. అయినా ఇప్పటి వరకు కొన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి కాకపోవడం, కనీస ఉత్తీర్ణత స్థాయి కూడా లేని విద్యార్థులు 20శాతం పైగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. వీరిని ఇలాగే వదిలేస్తే గత వైఫల్యాలనే మూటగట్టుకోవాల్సి వస్తుందని విద్యాశాఖ భావిస్తోంది. అందుకే ఉత్తరం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఓ ప్రయత్నం చేస్తోంది. అయితే ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే.


