AP SSC 10th Class Exam Results Postponed, Check Details - Sakshi
Sakshi News home page

AP SSC Results 2022 Postponed: ఏపీలో పదో తరగతి ఫలితాలు వాయిదా

Jun 4 2022 11:25 AM | Updated on Jun 4 2022 3:33 PM

Andhra Pradesh SSC 2022 Results Postponed - Sakshi

ఆంధప్రదేశ్‌లో 2022 ఏడాదిగానూ టెన్త్‌ పరీక్షల ఫలితాలు వాయిదా పడ్డాయి.

సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు-2022 విడుదల వాయిదా పడింది. సోమవారం (జూన్‌ 6న)నాటికి ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

షెడ్యూల్‌ ప్రకారం.. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2021-22 ఏడాదికిగానూ ఏప్రిల్ 27నుంచి మే 9వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement