నేడే టెన్త్ ఫలితాలు | Today Tenth Results | Sakshi
Sakshi News home page

నేడే టెన్త్ ఫలితాలు

May 17 2015 2:19 AM | Updated on Oct 22 2018 2:17 PM

నేడే టెన్త్ ఫలితాలు - Sakshi

నేడే టెన్త్ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి.

హాజరైన విద్యార్థులు 5.65 లక్షలు
ఇంటర్‌నెట్‌లో ఫలితాలు
ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్ రూపంలోనూ తెలుసుకోవచ్చు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజయ్యారు.

పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఇస్తున్నారు.

ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్ పాయింట్ల సగటును లెక్కించి సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్) పాయింట్లు ఇస్తారు. లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచే కాకుండా కొన్ని ప్రైవేటు వెబ్‌సైట్ల నుంచి కూడా పొందేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ రకాల మొబైల్ ఆపరేటర్ల నుంచి కూడా ఎస్‌ఎంఎస్‌ల రూపంలోనూ, ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డర్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
 
ఫలితాల కోసం వెబ్‌సైట్లు
www.sakshieducation.com
www.aponline.gov.in
www.bsetelangana.org
www.results.cgg.gov.in

 
ఎస్‌ఎంఎస్‌ల రూపంలో..
ఎయిర్‌సెల్/వొడాఫోన్/రిలయన్స్  58888

ఐవీఆర్‌ఎస్ ద్వారా..
యూనినార్/ఎయిర్‌టెల్/ఎయిర్‌సెల్/వొడాఫోన్    5333530

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement