Shankar Goud
-
శంకర్ గౌడ్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
-
శంకర్ గౌడ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
సాక్షి,వరంగల్: నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల్ శంకర్‌గౌడ్ మృతదేహానికి నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున శంకర్ గౌడ్ కుటుంబానికి పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా,మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతిరెడ్డి మాధవరెడ్డి రూ.5లక్షలు సహాయం చేశారు.తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే మిగిలిన మూడు హామీల విషయంలో తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరుఫు అధికారులు ఆర్టీసీ జేఏసీని విజ్ఞప్తి చేశారు. మూడు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ పట్టుబడుతోంది.చర్చల్లో ఆర్టీసీ జేఏసీ మూడు డిమాండ్లు ఇవేఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి. గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలను పునరుద్ధరించాలి. 2021 వేతన సవరణ 30శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి.2025 వేతన సవరణ అమలు చేయాలి’అని డిమాండ్లు చేస్తున్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు యత్నించాడు. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపో వద్ద కార్మీకులు చేస్తున్న ఆందోళన వద్ద గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలని రెండు రోజులుగా రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడుపుతుండటాన్ని నిరసిస్తూ శంకర్‌గౌడ్ ఒంటికి నిప్పంటించుకున్నట్లు తోటి ఉద్యోగులు చెప్పారు.ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తతముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ భౌతికకాయాన్ని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకర్‌గౌడ్ భౌతికకాయాన్ని నర్సంపేట డిపో దగ్గరకు తీసుకెళ్తామని ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతుండగా.. అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో తన వాహనంలో భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు బండి సంజయ్ ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు బండిసంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బండి సంజయ్ పోలీసులే అంత్యక్రియలు చేయండంటూ ఫైర్ అయ్యారు. కుమార్తె ఇంటికి శంకర్ గౌడ్ మృతదేహం తరలించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి
-
అమ్మ, తమ్ముడు గుర్తుకు రాలేదా? శంకర్ గౌడ్ కూతురు విదారక రోదన
-
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటి వద్ద ఉద్రిక్తత
-
స్వస్థలానికి శంకర్ గౌడ్ భౌతికకాయం
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి.. శంకర్ గౌడ్ పిల్లల ఆవేదన
-
శంకర్‌గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని.. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దు:ఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.కాగా, వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపో వద్ద కార్మీకులు చేస్తున్న ఆందోళన వద్ద గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.గమనించిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతు మృతిచెందారు. -
శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: బండి సంజయ్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని చికిత్స పొందుతూ మరణించిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఆర్టీసీ కార్మికులు ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేయడం, వారిని బెదిరింపులకు గురిచేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రరావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) నర్సంపేటలో జరగనున్న శంకర్ గౌడ్ అంత్యక్రియలకు బండి సంజయ్ హాజరుకానున్నారని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని బీజేపీ నేతలు కార్మికులకు విజ్ఝప్తి చేశారు -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం.. శంకర్ గౌడ్ మృతి
సాక్షి, వరంగల్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న హామీ నెరవేరడం లేదన్న ఆవేదనతో వరంగల్ (D) నర్సంపేట ఆర్టీసీ డిపోలో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శంకర్ గౌడ్‌కు ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శంకర్ గౌడ్‌ను వరంగల్ MGM నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా కర్మాన్‌ఘాట్ దగ్గర కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్‌బాగ్ DRDO అపోలో ఆస్పత్రిలో ఆయన మృతదేహం ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇక శంకర్ గౌడ్ మరణవార్త తెలియడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్న తరుణంలో శంకర్ గౌడ్ ఇలా బలవన్మరణం చెందడం కార్మిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నిబద్ధత కలిగిన కార్మికుడిని కోల్పోయామంటూ తోటి ఉద్యోగులు భావోద్వేగానికి లోనైయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అయితే తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం మాత్రం ఆపేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు.నేడు నర్సంపేట బంద్‌కు పిలుపునర్సంపేటలో ఉద్రిక్తతఆర్టీసీ డిపో ముందు మోహరించిన పోలీసులుఅర్ధరాత్రి అవుతున్న డిపో కి భారీగా చేరుకున్న ఆర్టీసీ కార్మికులు -
సోషల్ మీడియా దన్నుగా...
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. 18వ లోక్ సభకు జరిగిన ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని చరిత్ర సృష్టించారు. సుదీర్ఘంగా 81 రోజులు సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ, కేంద్రంలో మళ్లీ కమల వికాసమా లేక హస్త ప్రభంజనమా అనే ఉత్కంఠకు తెర లేపింది. భారత ప్రజల చైతన్యస్ఫూర్తి ఈ ఎన్నికల్లో మరోసారి రుజువయ్యింది.‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో మూడోసారి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావాలనుకున్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో వారు ఊహించిన ఫలితాలు రాలేదు. గత పదేండ్ల కాలంలో మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలు ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం తగ్గేలా చేశాయి. కుల మతాలనూ, అయోధ్య రాముణ్ణీ ఎన్నికల్లో వాడుకొని లబ్ధి పొందాలని భావించినా ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరలేదు.ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మోదీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమం నడపడంలో కొంత వరకు సఫలం అయిందని చెప్పవచ్చు. ‘మోదీ 3.0 మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారు’ అనే అంశం ప్రజల్లోకి బాగా వెళ్ళి, బీజేపీ ఓటు బ్యాంక్‌కు గండి కొట్టింది. ఓటర్లు ప్రతిపక్షానికి కావలసినంత బలాన్ని ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.ఈ సారి ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం... ముఖ్యంగా యూట్యూబర్లు ధ్రువ్ రాఠీ, రవీష్ కుమార్ వంటి వారు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడంలో కీలకమైన పాత్ర పోషించారు. కేవలం ధ్రువ్ వీడియోలను 69 కోట్ల మంది ప్రజలు వీక్షించారంటే వారి ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.ఉత్తర భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రొజెక్టర్లు పెట్టి మరీ ఈ వీడియోలను ప్రజలు వీక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పాలకులు నిర్ణయాలు తీసుకుని, ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, కార్మిక– కర్షక సంక్షేమానికి పాటుపడుతూ, మహిళా సాధికారత సాధిస్తూ, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కృషి చేస్తారని ఆశిద్దాం. – పాకాల శంకర్ గౌడ్, ఉపాధ్యాయుడు -
పార్టీ బలోపేతంపై దృష్టి: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. 'ఇందులో భాగంగా బొంగునూరి మహేందర్ రెడ్డి, నేమూరి శంకర్ గౌడ్, పి.హరిప్రసాద్‌లకు కీలక బాధ్యతలు అప్పగించాము. పార్టీ ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షునిగా నియమితులైన మహేందర్ రెడ్డి తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. నేమూరి శంకర్ గౌడ్ పార్టీ తెలంగాణ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్‌ను పార్టీ మీడియా విభాగానికి హెడ్‌గా నియమించాము' అని ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. 'రంగారెడ్డి జిల్లా డి.పోచంపల్లిలో జన్మించిన మహేందర్ రెడ్డి, బోరబండ నివాసి అయిన నేమూరి శంకర్ గౌడ్ వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. నేను స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సీఎంపీఎఫ్)లో చురుకైన కార్యకర్తలుగా పనిచేసిన వీరిద్దరూ రాజకీయ, సేవ కార్యక్రమాల్లో పయనిస్తున్నారు. గత పద్నాలుగేళ్లుగా వీరి అకుంఠిత దీక్ష, సేవా కార్యక్రమాల పట్ల అపేక్ష, రాజకీయాలపై గౌరవాన్ని చూసిన తర్వాత, జనసేన పార్టీకి బాధ్యతాయుతమైన క్రీయాశీలక నేతలుగా ఎంపిక చేశాము. పాత్రికేయుడిగా గత మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న పి.హరిప్రసాద్ అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి జనసేన పార్టీ మీడియా విభాగానికి హెడ్ గా నియమించాము' అని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. -
నీ అంతు చూస్తా...
ఎమ్మెల్యేను బెదిరించిన టీఆర్ఎస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే చందానగర్: అధికారిక కార్యక్రమానికి పార్టీ నేతలను ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే అంతుచూస్తానని బెదిరించాడో టీఆర్ఎస్ నాయకుడు. రాష్ట్ర మంత్రి సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. దీంతో సదరు ఎమ్మెల్యే తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. చందానగర్ సీఐ వాసు కథనం ప్రకారం... చందానగర్‌లో ఆదివారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగానికి ముందు నాయకులందరి పేర్లూ సంభోదించారు. అయితే, వేదిక ముందు ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఇన్చార్జి కొమరగౌని శంకర్ గౌడ్ పేరు ప్రస్థావించలేదంటూ ఎంపీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జోక్యం చేసుకొని... ఇది అధికార కార్యక్రమం, ఆయన ను ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. శంకర్ గౌడ్ నీకెందుకూ... కూర్చో అంటూ... ఎమ్మెల్యేను వేదికపైనే అన్నాడు. మంత్రి జోక్యం చేసుకొని ఇద్దరినీ సముదాయించారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేసేందుకు వేదిక దిగి కిందకు వ చ్చారు. మంత్రి, ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేస్తుండగా ‘నీ సంగతి చూస్తా...అని దుర్భాషలాడుతూ బెదిరించినట్లు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోటాపోటీ నినాదాలు... కార్యక్రమం ముగించుకొని బయటకి వచ్చిన ఎమ్మెల్యే గాంధీని చూస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ.. ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు దీనికి ప్రతిగా నినాదాలు చేయడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఎమ్మెల్యేను అక్కడ నుంచి పంపివేయడంతో ఉద్రిక్తత సడలింది.


