తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం.. శంకర్ గౌడ్ మృతి | Telangana RTC Driver Shankar Goud Passes Away | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం.. శంకర్ గౌడ్ మృతి

Apr 23 2026 10:23 PM | Updated on Apr 24 2026 11:32 AM

Telangana RTC Driver Shankar Goud Passes Away

సాక్షి, వరంగల్‌: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న హామీ నెరవేరడం లేదన్న ఆవేదనతో వరంగల్ (D) నర్సంపేట ఆర్టీసీ డిపోలో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శంకర్ గౌడ్‌కు ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శంకర్ గౌడ్‌ను వరంగల్ MGM నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా కర్మాన్‌ఘాట్ దగ్గర కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్‌బాగ్ DRDO అపోలో ఆస్పత్రిలో ఆయన మృతదేహం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు.  ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్‌ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.   

ఇక శంకర్ గౌడ్ మరణవార్త తెలియడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్న తరుణంలో శంకర్ గౌడ్ ఇలా బలవన్మరణం చెందడం కార్మిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నిబద్ధత కలిగిన కార్మికుడిని కోల్పోయామంటూ తోటి ఉద్యోగులు భావోద్వేగానికి లోనైయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అయితే తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం మాత్రం ఆపేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

నేడు నర్సంపేట బంద్‌కు పిలుపు

  • నర్సంపేటలో ఉద్రిక్తత
  • ఆర్టీసీ డిపో ముందు మోహరించిన పోలీసులు
  • అర్ధరాత్రి అవుతున్న డిపో కి భారీగా చేరుకున్న ఆర్టీసీ కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement