rtc driver dead
-
శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: బండి సంజయ్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని చికిత్స పొందుతూ మరణించిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఆర్టీసీ కార్మికులు ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేయడం, వారిని బెదిరింపులకు గురిచేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రరావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) నర్సంపేటలో జరగనున్న శంకర్ గౌడ్ అంత్యక్రియలకు బండి సంజయ్ హాజరుకానున్నారని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని బీజేపీ నేతలు కార్మికులకు విజ్ఝప్తి చేశారు -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం.. శంకర్ గౌడ్ మృతి
సాక్షి, వరంగల్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న హామీ నెరవేరడం లేదన్న ఆవేదనతో వరంగల్ (D) నర్సంపేట ఆర్టీసీ డిపోలో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శంకర్ గౌడ్‌కు ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శంకర్ గౌడ్‌ను వరంగల్ MGM నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా కర్మాన్‌ఘాట్ దగ్గర కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్‌బాగ్ DRDO అపోలో ఆస్పత్రిలో ఆయన మృతదేహం ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇక శంకర్ గౌడ్ మరణవార్త తెలియడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్న తరుణంలో శంకర్ గౌడ్ ఇలా బలవన్మరణం చెందడం కార్మిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నిబద్ధత కలిగిన కార్మికుడిని కోల్పోయామంటూ తోటి ఉద్యోగులు భావోద్వేగానికి లోనైయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అయితే తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం మాత్రం ఆపేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు.నేడు నర్సంపేట బంద్‌కు పిలుపునర్సంపేటలో ఉద్రిక్తతఆర్టీసీ డిపో ముందు మోహరించిన పోలీసులుఅర్ధరాత్రి అవుతున్న డిపో కి భారీగా చేరుకున్న ఆర్టీసీ కార్మికులు -
బస్సు- లారీ ఢీ: ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం
ప్రకాశం జిల్లా దోర్నాలకు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తోన్న ఆర్టీసీ బస్సు.. ఆగిఉన్న లారీని ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అయితే ప్రయాణికులు మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు.


