breaking news
rayalaseema water problem
-
‘చంద్రబాబుకి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు’
సాక్షి, నెల్లూరు : వ్యవసాయం దండగ అనే మైండ్ సెట్‌తో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాజెక్టుల మీద అవగాహనే లేదన్నారు. వైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తుందనే కుట్రతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపేశారని ఆరోపించారు.రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఎస్సార్సీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సీమతో పాటు జిల్లాకు వర ప్రదాయిని. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే అది ఆగిపోయింది. రాబోయే రోజుల్లో రైతులతో కలిసి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమించబోతున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీలు నీరు తెచ్చుకోగలిగితే చివరి ఆయకట్టుకు కూడా నీరు అందుతుంది.రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై భవిష్యత్‌లో చేయాల్సిన పోరాటాల గురించి జిల్లా నేతలతో చర్చించాం. మన నీటిని ఇతర రాష్ట్రాలు వాడుకుంటూ ఉంటే.. చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ప్రాజెక్ట్ అవసరం లేదని చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చర్యల వల్ల ఈ ప్రాంతం ఏడాదిగా మారుతుంది. లక్షల ఎకరాలు బీడుగా మారుతాయి. రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశమై, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ..‘వ్యవసాయం దండగ అనే మైండ్ సెట్‌తో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాకపోతే రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా కూడా ఏడారి అవ్వడం ఖాయం. కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోయి లిఫ్ట్ ఇరిగేషన్‌ను సాధిస్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మన గొంతులు, భూములు తడిపే ప్రాజెక్ట్. వైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తుందనే కుట్రతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపేశారు. మార్చి ఒకటో తేదీన కడపలో ఆరు నియోజకవర్గ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తాం. చంద్రబాబుకి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
‘లిఫ్ట్’ తాకట్టుపై ‘సీమ’ కన్నెర్ర
సాక్షి, ప్రతినిధి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన ఏలుబడిలో అప్పుడు, ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించానని స్వయంగా తెలంగాణ సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిపోయిన లిఫ్ట్ పనులను రెండు నెలల్లో తిరిగి ప్రారంభించాలని, లేదంటే ఉద్యమం మహోగ్ర రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో పుట్టి.. పుట్టిన గడ్డకే ద్రోహం చేయడం చంద్రబాబుకే చెల్లిందని ధ్వజమెత్తారు. లిఫ్ట్‌ను వెనువెంటనే పూర్తి చేయాల్సిందిపోయి.. ప్రాజెక్టు దండగంటూ తన టీడీపీ నేతలతో దుష్ప్రచారం చేయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే ప్రజలు తరిమికొడతారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని తీర్మానం చేశారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందంలో భాగంగా నిలిచిపోయిన ‘రాయలసీమ లిఫ్ట్’ పనులు పూర్తి చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడులో గురువారం ‘చలో పోతిరెడ్డిపాడు’ పేరుతో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షత బహిరంగ సభ నిర్వహించింది. ఆగిపోయిన లిఫ్ట్ పనులను పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేతలు పరిశీలించిన అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సభ ప్రారంభమైంది. సీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆవశ్యకత, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ద్రోహం.. ‘సీమ’లోని కూటమి నేతల నిర్లిప్తత, ప్రభుత్వంపై భవిష్యత్తులో ఉద్యమించే తీరుపై పార్టీ నేతలు ప్రసంగించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు, భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి రెండు నెలల్లో పనులకు పూనుకోకపోతే రైతులతో కలిసి కడపలో భారీ ఎత్తున మహా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాధాన్యతపై ఆరు జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామని హెచ్చరించారు. చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలి వచ్చిన రైతులు ‘సీమ’లో పారే ప్రతి నీటి బొట్టుపై వైఎస్సార్ పేరు 40 ఏళ్ల కిందట వైఎస్సార్ చేసిన పాదయాత్ర, నిరాహార దీక్షతోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు బీజం పడింది. ఆ రోజు వైఎస్సార్‌తో పాటు నడిచిన కాటసాని, చవ్వా రాజశేఖర్‌రెడ్డి ఈ రోజు ఈ వేదికపై కూడా ఉన్నారు. రాయలసీమ, నెల్లూరుకు వెళ్లే ప్రతీ నీటి చుక్కపై వైఎస్సార్ పేరు ఉంది. ఇది చరిత్ర, ఎవ్వరూ మార్చలేరు. రాయలసీమ లిఫ్ట్ పనులు 80 శాతం పూర్తి చేశాం. తక్కిన 20 శాతం పూర్తి చేస్తే కనీసం మంచి పని చేసిన పేరైనా చంద్రబాబుకు ఉండేది. అది కూడా లేకుండా ప్రాజెక్టును ఆపి ద్రోహం చేశారు. రేవంత్‌రెడ్డి మాటలతో వాస్తవాలు వెలుగు చూశాయి. రేవంత్‌రెడ్డి తన మాటలపై కావాలంటే నిజ నిర్ధారణ కమిటీకి సిద్ధమని ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పలేదు. ప్రాజెక్టు దండగని టీడీపీ నేతలతో ప్రచారం చేయిస్తున్నాడు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలు యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మనకు దక్కాల్సిన నీటిని తోడేస్తున్నాయి. నీళ్లు, రైతు, వ్యవసాయం బాగుంటే రాష్ట్రమంతా బాగుంటుంది. ఈ ఆలోచన వైఎస్‌కు ఉంది కాబట్టే పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేపట్టారు. 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆ పనులు పూర్తి చేయలేదు. 2019లోజగన్ అధికారంలోకి వచ్చాక ఆర్అండ్ఆర్ పూర్తి చేసి ప్రాజెక్టును వాడకంలోకి తెచ్చారు. రాయలసీమ లిఫ్ట్‌తో జగన్ చేసిన మేలు ప్రతీ ఇంటికీ తెలియాలి. పూర్తయ్యే దశలోని ప్రాజెక్టును చంద్రబాబు ఆపి మహాపాపం చేశారు. మూల్యం చెల్లించుకోక తప్పదు – సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప బాబుకు ఏమీ పట్టదు కరోనా సంక్షోభాన్ని లెక్క చేయకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చివరి దశకు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. రెండేళ్లలోనే 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోతే కేసీ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఎస్సార్బీసీకి నీళ్లుండవు. అనంతపురం రైతులకు మేలు చేయాలని హంద్రీ–నీవా కాలువను 3,800 నుంచి 6,500 క్యూసెక్కులకు జగన్ పెంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పనులు నిలిపేశారు. అంతేకాదు రూ.2 వేల కోట్లతో కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పానికి నీరిచ్చిన ఘనత కూడా జగన్‌దే. గాలేరు–నగరి ద్వారా చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు నీళ్లిచ్చే పనులను 50 శాతం పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని కూడా పక్కన పెట్టేసింది. ‘సీమ’లోని ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కానీయకుండా చంద్రబాబు అమరావతి జపం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాట్లు పడుతున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నాడు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ ఏకతాటిపై పోరాడుదాం 1986లో లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు వైఎస్సార్‌తో కలిసి నేను పాదయాత్ర చేశాను. వైఎస్ కృషితోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఎనీ్టఆర్ 4 వేల నుంచి 11 వేల క్యూసెక్కులకు పెంచారు. దీన్ని 44 వేల క్యూసెక్కులకు వైఎస్సార్ పెంచారు. అలాగే హంద్రీ–నీవా, గాలేరు–నగరి లాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసి భగీరథుడిగా నిలిచారు. జగన్ 80 శాతం పూర్తి చేసిన రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు నిలిపేశారు. రాయలసీమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు సర్కారుపై పోరాడాలి. – కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్కరికీ వివరించాలి తిరుమల లడ్డూ విషయంలోనే భక్తుల మనోభావాలతో ఆడుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై ప్రజలను మాయ చేయడం చిన్న విషయం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు.. జగన్‌కు మంచి పేరొస్తుందని రాయలసీమ ప్రాజెక్టును ఆపేశాడు. ఆంధ్రాకు సీఎంగా ఉండి, చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశాడని రుజువైనా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ లేదని 40 ఏళ్లుగా ఆయన్ను చూసిన వారికి ఎవరికైనా తెలిసిపోతుంది. ఇలాంటి చంద్రబాబు మెడలు వంచి ఆపేసిన ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా ఒత్తిడి తీసుకొద్దాం. చంద్రబాబు మోసాలను గ్రేటర్ రాయలసీమ పరిధిలో ప్రతి పౌరుడికీ తెలిసేలా వివరిద్దాం. – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు రాయలసీమకు చంద్రబాబు చేసిన మోసం బహిర్గతం అయ్యాక ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు దండగ అన్నట్లు తప్పుడు ప్రచారం ప్రారంభించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న చంద్రబాబు.. ఇతర సీఎంలు ప్రారంభించిన ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేయడం, పూర్తయిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు చేసుకోవడం తప్పించి, ఆయన ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. అంటే చంద్రబాబుకు సాగు నీటి రంగమన్నా, రైతులన్నా, వ్యవసాయమన్నా చిన్నచూపు. అన్ని ప్రాజెక్టులకు నీరివ్వాలన్నా నందికొట్కూరు నుంచే పోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతులు త్యాగాలు చేసి భూములు కోల్పోయారు. సర్వస్వం కోల్పోయి వలసలు పోతున్న రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. – బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దాం వైఎస్సార్ సీఎం అయిన వెంటనే దుర్భిక్ష పరిస్థితుల మధ్య వ్యవసాయం చేసే రాయలసీమ ప్రాంత రైతుల కష్టాలను తీర్చేసి దేవుడయ్యాడు. గాలేరు–నగరి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులతో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలను తీర్చారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసినా వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాయలసీమ రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ మనకు దక్కాల్సిన నీటిని వాడుకుంటే చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కలగడడం లేదు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించాలి. రాయలసీమ ప్రాంత ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాలి. – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి ప్రాజెక్టును చంద్రబాబు ఆపించాడు: నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి, ఇక్కడ నుంచే గెలిచి ముఖ్యమంత్రి అవుతున్నా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే వృథాగా పోతున్న నీటిని రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని ఆలోచన చేస్తే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి చంద్రబాబు ఆపించాడు. అయినా నిర్మాణం ఆపకుండా 80 శాతం పూర్తి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరగలేరు. – దారా సుదీర్, నందికొట్కూరు పార్టీ ఇన్చార్జి రాయలసీమకు చంద్రబాబు ద్రోహం రాయలసీమ నుంచి కరువులు ఆగిపోయాయంటే ఆ ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ 44 వేల క్యూసెక్కులకు పెంచితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక మరింతగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించి రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేసి 80 శాతం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో తట్టమట్టి కూడా తీయలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం ఆయనతో కుమ్మక్కై రాయలసీమ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశాడని అర్థమైపోయింది. – అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుంది ‘సీమ’ అంటే చంద్రబాబుకు ఎప్పుడూ ఇష్టం లేదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపి ద్రోహం చేశాడు. కర్నూలుకు రావల్సిన హైకోర్టును, నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తీసుకెళ్లారు. ‘అనంత’కు మంజూరైన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారు. ఆఖరుకు కడపలో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకును కూడా తరలించుకుపోయాడు. ఆనాడు వైఎస్సార్ సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే ప్రకాశం బ్యారేజీ మీద దేవినేని ఉమాతో ధర్నాలు చేయించి అడ్డుకునే ప్రయత్నం చేసిన రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ఇక్కడి రైతులు, ప్రజల భవిష్యత్తును చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఉద్యమానికి ఇప్పుడు మళ్లీ బీజం పడింది. ఉద్యమం మొదలయ్యాక తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుందే కానీ ఉద్యమం మాత్రం ఆగదు. – సాకె శైలజానాథ్, మాజీ మంత్రి ఓటుకు కోట్లు కేసుకు భయపడే.. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, మనకు హక్కుగా దక్కాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా సీఎంగా ఉన్న చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాడు కేసీఆర్‌కు, నేడు రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తలూపుతున్నాడు. రాయలసీమ ప్రాజెక్టును తిరిగి ప్రారంభింపజేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాయలసీమ ప్రాజెక్టు కోసం రాయలసీమ పౌరుషం చూపించాలి. – ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు గోదావరి–బనకచర్ల పేరుతో కాలయాపన శ్రీశైలం డ్యాంకు ఎక్కువ శాతం భూములు కోల్పోయింది రాయలసీమ ప్రాంతమే. కృష్ణా జలాలపై అత్యధిక క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమలోనే ఉంది. చంద్రబాబు ఏనాడూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచించ లేదు. దివంగత వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు ఎవరూ ఈ ప్రాంతం గురించి ఆలోచించలేదు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని తరలిస్తుంటే ఎగువ రాష్ట్రాలు అంగీకరించవు అని తెలిసే సాధ్యం కాని ప్రాజెక్టుతో చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు. కృష్ణా, తుంగభద్ర నదులపై నిరి్మంచాల్సిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ గెలిచి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయేది కాదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు లిఫ్ట్‌తోనే రాయలసీమ రైతుల భవిష్యత్తు ఈ ప్రాంతానికి సంజీవని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రాజకీయాలకు అతీతంగా రాయలసీమ వాసులంతా ఒక్కటై ఉద్యమించాలి. రాయలసీమను ఎడారిగా మార్చే చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. మళ్లీ కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు వలసలు వెళ్లకుండా నిరోధించాలంటే రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావాలి. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలనే డిమాండ్‌తో త్వరలో కడపలో రెండో మహాసభ నిర్వహిస్తాం. – రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుందాం రాష్ట్రంలో సాగు నీటి రంగానికి మేలు చేసిన ఘనత నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిదైతే, ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ పూర్తవుతుంది. ఈ లిప్్టతో ఉమ్మడి ప్రకాశం, నెలూర్లు, రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఉద్యమంలో ఎంత వరకైనా ముందుకు నడుస్తాం. ప్రాజెక్టు పూర్తి చేస్తాం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాబు కుట్రలను అంతం చేద్దాం రాయలసీమ దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం. నీళ్లు లేక వ్యవసాయం చేయలేక ఏడాదిలో రెండు నెలలు మినహా 10 నెలలు వలసోయి బతికే పరిస్థితి. పిల్లలు, వృద్ధులు మాత్రమే ఇళ్ల వద్ద ఉంటారు. అలాంటి ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు మా నాయకుడు సిద్ధమైతే దాన్ని అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు కంటే ద్రోహం చేసేవారు బహుశా ఎవ్వరూ ఉండరు. చంద్రబాబు కుట్రలను అంతం చేసి రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తాం. – గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసింది. ఎంత నిర్బంధిస్తే అంతగా తిరగబడతాం. ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తాం. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చిన లిఫ్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశాడు. రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశాడు. కూటమి నాయకుల వికృత రాజకీయ క్రీడను గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం. నందికొట్కూరులో మొదలు పెట్టింది ప్రారంభ సభ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం. – భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం రాష్ట్ర సాగు నీటి రంగం గురించి చర్చించాల్సి వస్తే వైఎస్సార్‌కు ముందు.. వైఎస్సార్ తర్వాత అని చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల ప్రాజెక్టులను పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిలిపిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే నెల్లూరు జిల్లాకు మరింత మేలు చేకూరుతుంది. తాను కోరిన మీదటే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును ఆపేశాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జగన్ సీఎం కావడం ఖాయం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు -
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
సీమ సమాజం నీళ్లను కలవరిస్తోంది, పలవరిస్తోంది. నీళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. నీళ్లలో సుఖ సంతోషాలున్నాయి. నీళ్లలో నాగరికత ఉంది. నీళ్లలో సృష్టి రహస్యం దాగివుంది. నీళ్లలో బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే మహాద్భుత శక్తి ఉంది. నీళ్లలో పవర్ ఉంది. నీళ్లలో అమ్మ ప్రేమ, తండ్రి సాంత్వన ఉన్నాయి. అసలు సమస్త ప్రపంచం మనుగడే నీళ్లలో ఉంది. అలాంటి నీళ్లకు రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి నోచుకోలేదు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని అనే సామెత చందంగా రాయలసీమ వాసుల పరిస్థితి తయారైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా, వాడుకోలేని దయనీయ స్థితి. సీమకూ, కృష్ణా జలాలకూ అడ్డంకిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సీమకు పట్టిన ‘చంద్ర’గ్రహణం బాబు అని మా కరవు సమాజం భావిస్తోంది.మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం. రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు, బాబు పీడిత ప్రాంతమని గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాబు పీడన పాలన నుంచి రాయల సీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఔను, రాయలసీమ ప్రజలు నీళ్ల కోసం అలమ టిస్తున్నారు. ఇక్కడి బీడు భూములు నీళ్ల కోసం నోళ్లు బార్లా తెరుచు కున్నాయి. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారింది. రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు తన మాతృభూమికి చేసింది శూన్యం. కరవు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను చంద్రబాబు పాలించినా, ఏనాడూ కరవు ప్రాంతానికి గుక్కెడు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచన చేసిన పాపాన పోలేదు. ‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినాఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనినపొగడరా నీతల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు జన్మనిచ్చిన గడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చంద్రబాబు సీఎం పీఠమెక్కినా, తానొచ్చిన ప్రాంతాన్ని విస్మరించడం, ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నాయకుడి విజన్ అంటే... సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం. తాను పాలిస్తున్న ప్రాంత జీవనోపాధి ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సమృద్ధిగా సౌకర్యాలు కల్పించడం.రాయలసీమ కరవు కాటకాలతో అల్లాడుతోందని అక్కడ పుట్టి పెరిగిన చిన్నపిల్లలకు కూడా తెలుసు. తొమ్మిదేళ్లుగా సీఎంగా ప్రజలు అవకాశం కల్పిస్తే, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న చెడ్డపేరు తప్ప, ప్రజలు గుర్తించుకునేలా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. అధికారంలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశామన్నదే ప్రధానం.మంచి పాలకులంటే, ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. భౌతికంగా మన నుంచి దూరమైనా, మానసికంగా సంబంధం కలిగి ఉండేలా పాలించాలి. అలాంటి ఘనతను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కించుకున్నారు. రాయలసీమ సమాజం ఆయనను అపర భగీరథుడిగా ఆరాధిస్తోంది. ఈ ప్రజాభిమానం ఊరకే రాలేదు. రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన కృషిని కరవు (బాబు) పీడిత సమాజం గుర్తించింది. సాగు, తాగునీటికి గేట్ వే! సాగు, తాగునీళ్ల విలువ బాగా తెలిసిన రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామ ర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఈ పెంపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వివా దానికి దారి తీసింది. ఇటు కాంగ్రెస్‌లోని స్వపక్షం, అటు చంద్రబాబు నాయకత్వంలోని విపక్షం కలిసి రాజశేఖరరెడ్డిపై దండెత్తాయి. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా, రాయలసీమకు సాగు, తాగునీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన భీష్మించారు. అదీ మాతృగడ్డపై ప్రేమ అంటే! కరవు ప్రాంతానికి నీళ్లు అందించి, పీడన నుంచి విముక్తి కల్పించాలనే నిజమైన సంకల్పం ఉన్న నాయకులు చేయాల్సిన పని. అందుకే రాయలసీమ గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరారు.తండ్రి ఆశయ సాధనలో భాగంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పది అడుగులు ముందు కేశారు. రాయలసీమను శాశ్వతంగా కరవు నుంచి విముక్తి చేసేందుకు రూ. 3,825 కోట్ల ఖర్చుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. 2023 ఆగస్టు 11న జగన్ ప్రభుత్వం మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన వెనుక ఎంతో దూరదృష్టి ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే 854 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం. అది కూడా రోజుకు 7 వేల క్యూసెక్కులు మాత్రమే. ఈ పద్ధతిలో ఎప్పటికీ రాయలసీమను సస్యశ్యామలం చేయలేమని జగన్ భావించారు. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరూ అందదు. ఈ ఇబ్బందిని గమనించి, రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతి రెడ్డిపాడు దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసే పనులు చేపట్టడం ఒక చరిత్ర. రాయలసీమ పాలిట సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహా నాయకుడిగా, తండ్రిని మించిన తనయు డిగా వైఎస్ జగన్ ను కరవు ప్రాంతం గుర్తుంచుకుంటుంది. అడుగడుగునా అడ్డంకులుశ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, 800 అడుగుల నుంచే హక్కుగా రావాల్సిన నీటిని దక్కించుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంపై కరవు ప్రాంతం ఆనందానికి అవధుల్లేవు. 2024 మే నెల నాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.990 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలోనే చంద్రబాబు నేతృత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించి, రాక్షసుల్లా అడ్డంకులు సృష్టించడం జగమెరిగిన సత్యం. ఈ అడ్డంకుల్ని లెక్క చేయకుండా మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడంలో అడుగులు ముందుకే వేసింది. అందుకే ఆ మాత్రం పనులు పూర్తయ్యాయి.ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగు రాష్ట్రంలో శిష్యుడైన రేవంత్‌రెడ్డి ప్రలోభాలకు తలొగ్గి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని అర్ధంతరంగా నిలుపుదల చేసింది. తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. సీమకు కృష్ణా జలాలు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు జగన్ పెంచడమే ఒక అద్భుతం. రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఒక సంజీవనిగా జగన్ భావించారు. సాగు, తాగునీళ్లకు నోచుకోని రాయలసీమ ప్రాంతా నికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఇక ఇన్సూరెన్స్ పాలసీగా భావించి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, దాని గొంతుకోసిన పాల కుడిగా చంద్రబాబు చరిత్రలో చీకటి అధ్యాయాన్ని రాసుకున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు!రాయలసీమకు తాగు, సాగునీటితో పాటు నెల్లూరు సాగునీటికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఫిబ్రవరి 5న ‘చలో పోతిరెడ్డిపాడు’ తలపెట్టింది. ఇది రాయలసీమ సమాజం చేపట్టిన నీటి స్వాతంత్య్ర పోరాటంగా చూడాలి. తమ ప్రాంతానికి చంద్ర బాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి రాయలసీమ, అలాగే నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాతో పాటు ప్రజానీకాన్ని అక్కడికి వెళ్ల కుండా నిలువరించాలని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. యావత్ బాబు పీడిత సమాజానికి వాస్తవాలు తెలియకూడ దనేదే ప్రభుత్వ దురుద్దేశంగా కనిపిస్తోంది. బాబు సీమ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే పోయేదేమీ లేదు... సాగు, తాగునీళ్లను సాధించుకోవడం తప్ప! తద్వారా గొంతుల్ని తడుపు కోవచ్చు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. పచ్చని పంటలతో కోనసీమను తలపించేలా రాయలసీమను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వస్తే, తిరుపతి పూర్తి దాహార్తి కూడా తీరుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 9.6 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి కరవు నుంచి విముక్తి చేయాలన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కలిసి పోరాడుదాం. ఆశయ సాధనలో పిడికిలి బిగిద్దాం.రాయలసీమ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అయితే రాజకీయ విభేదాలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసిన విద్య. రాయలసీమ విడిపోవడమే చంద్రబాబుకు బలం. కావున రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు సాగు, తాగునీటి హక్కుల కోసం చేపట్టే నీటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వేడుకుంటున్నా. మన భవిష్యత్ తరాలకు తాగు సాగునీళ్ల కంటే మనమిచ్చే ఆస్తి మరొకటేదీ లేదు. ఎందుకంటే, ఈ ఆస్తికి వెలకట్టలేం! భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు(నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’) -
బాబూ.. ఓటుకు నోటు కేసు భయమా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొన్నదని కాకాణి చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం పట్టుకుంది అంటూ విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి కాకాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రహస్య ఒప్పందంతో చంద్రబాబు రైతు ప్రయోజనాలు తాక్కట్టు పెట్టి ద్రోహిగా మారాడు. కలత చెందిన రైతులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా..? కాదా?. రేవంత్ రెడ్డి అడగటంతో చంద్రబాబు ఈ చర్యలకు పాల్పడటం నిజం కాదా?. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తారు ఏమో అనుకుంటే సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. 20 టీఎంసీల నీళ్ళు పోతే ఏంటి అని రివర్స్ లో మాట్లాడటం విడ్డూరంగా వుంది.రాయలసీమ లిఫ్ట్ రైతులకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది అని ఆలోచించి వైఎస్ జగన్ ఆ ప్రాజెక్టు చేపట్టారు. నేడు సంజీవనీ లాంటి రాయలసీమ లిఫ్ట్ ను స్వప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టు పెట్టాడు. పోతిరెడ్డిపాడు నుండి పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించున్న పరిస్థితి లేదు. రైతులు చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఉమ్మేస్తున్నా పట్టించుకోవడం లేదు. కల్వకుర్తి సామర్థ్యం పెంచుకుంటే నోరు మెదపలేదు. తెలంగాణ ప్రభుత్వం 8 టీఎంసీలు అధికంగా వినియోగించుకుంటున్నా నోరు మెదపటం లేదు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం.చంద్రబాబు సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతులకు ద్రోహం తలపెట్టడం ప్రారంభించారు. అడ్డదారుల్లో నీటి ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తరలించుకుంటున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదలతో రాయలసీమతో పాటు నెల్లూరు, కొంత ఒంగోలు రైతాంగం కూడా నష్టపోతున్నారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు మూడు సార్లు అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదు. రాయలసీమ, మిట్ట ప్రాంతాల రైతాంగం కోసం ఆలోచన చేసిన నాయకులు వైఎస్సార్, జగన్ మాత్రమే’ అని చెప్పుకొచ్చారు. -
‘హుజురాబాద్ ఎన్నిక కోసమే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు’
సాక్షి, వైఎస్సార్ కడప: జలయజ్ఞం ద్వారా సాగు నీటి ప్రాజెక్ట్‌లు నిర్మించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని, రాష్ట్రానికి కేటాయించిన నీటినే తాము వాడుకుంటున్నాని అన్నారు. హుజురాబాద్ ఎన్నిక కోసమే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చాలా సున్నితమైన అంశమని, దాన్ని తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కేటాయించిన జలాలనే వాడుకుంటున్నామని, అంతకు మించి వాడుకోవడంగాని, కొత్త ప్రాజెక్టును నిర్మించడం గాని చేయడంలేదని స్పష్టం చేశారు. లేని సమస్యను ఉన్నట్లుగా సృష్టిస్తూ ప్రజలను తెలంగాణ మంత్రులు రెచ్చగొడుతున్నారని, సీఎం కేసీఆర్ మంత్రులను కంట్రోల్ చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల్లో సంపూర్ణ సాగు ప్రాజెక్టులకు జలయజ్ఞం ద్వారా లక్షల కోట్ల రూపాయల కేటాయించి నిర్మించిన మహానేత దివంగత వైఎస్సార్ అని గుర్తుచేశారు. ఆయన్ను నిందిస్తూ ఆరోపణలు చేయడం దారుణమని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వైఎస్ ఎనలేని కృషి, పోరాటం చేశారని తెలిపారు. గతంలో తెలంగాణలోని చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించారని, ఆ ప్రాంత నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. అన్ని ప్రాంతాలకు వైఎస్సార్ సాగునీరు అందించారని గుర్తుచేశారు. వైఎస్సార్‌పై విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రులు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. రైతాంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందని కృషి చేసిన వ్యక్తి వైఎస్సార్ అని తెలిపారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని గతంలో కేసీఆర్ కూడా అన్నారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య గుర్తుచేశారు. చదవండి: భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదు -
సీమ కరువుకు ‘రాయలసీమ’తో చెక్
సాక్షి, అమరావతి: ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 854 అడుగుల కంటే ఎక్కువ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సామర్థ్యం మేరకు నీటిని రాయలసీమకు తరలించవచ్చు. అంతకంటే నీటిమట్టం తగ్గితే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడానికి వీలుండదు. దీనివల్ల రాయలసీమలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు.. తాగు, సాగునీటి సమస్యలను అధిగమించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకంటే దిగువకు చేరుకున్నా.. రాయలసీమలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉత్పన్నమైన సందర్భాల్లో తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీశైలంలో 797 అడుగుల స్థాయి నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్)లోకి ఎత్తిపోసి.. అక్కడినుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ద్వారా సాగు, తాగునీటి కష్టాలను అధిగమించే పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఎత్తిపోతలకు రాయలసీమ ఎత్తిపోతలుగా నామకరణం చేసింది. దీనికి డీపీఆర్ తయారుచేయాలని జలవనరులశాఖను ప్రభుత్వం ఆదేశించింది. సీమను సుభిక్షం చేసేలా.. కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గిపోతోంది. వరదను ఒడిసిపట్టి.. శ్రీశైలంపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపే స్థాయిలో కాలువల సామర్థ్యాన్ని పెంచే పనులను గత సర్కారు చేపట్టలేదు. దీనివల్ల ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి 1,782 టీఎంసీల వరద వచ్చినా ఒడిసి పట్టలేకపోయాం. ప్రకాశం బ్యారేజీ నుంచి 801 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నదికి వరదొచ్చే 40 రోజుల్లోనే సీమ ప్రాజెక్టులను నింపడానికి రూ.33,869 కోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రణాళికను అమలు చేసేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు శ్రీశైలంలో 797 అడుగుల స్థాయి నుంచి రోజుకు 3 టీఎంసీలను తరలించేలా ముచ్చుమర్రి నుంచి ఎత్తిపోసి.. 42 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్ ద్వారా బీసీఆర్‌లోకి నీటిని తరలిస్తారు. అక్కడినుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు సరఫరా చేస్తారు. కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు తాగు, సాగునీటిని ఈ ఎత్తిపోతల ద్వారా అందిస్తారు. దీనికి రూ.3,890 కోట్లు వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. ఆయకట్టుకు భరోసా.. ప్రస్తుతం రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తెలుగుగంగ కింద 5.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ఎస్సార్బీసీ కింద వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలు, కేసీ కెనాల్ కింద 2.65 లక్షల ఎకరాలు వెరసి ఈ మూడు ప్రాజెక్టుల కింద 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. గాలేరు–నగరి కింద మరో 2.60 లక్షల ఎకరాలకు నీళ్లందించాల్సి ఉంది. రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు తాగునీళ్ల కోసం కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో శ్రీశైలం నుంచి కనీస నీటిమట్టానికి దిగువనున్న జలాలను తరలించి.. సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి వీలవుతుంది. -
నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వెలిగొండ, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పెంచాలని రాయలసీమ ఉద్యమ నేత, కార్మిక కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ ‘నిత్యం కరువు కాటకాలను ఎదుర్కొనే రాయలసీమ జిల్లాలకు గోదావరి జలాలను ఎక్కడి నుంచి తరలించినా మాకు సమ్మతమే. దీనిపై అనవసర రాజకీయాలు తగదు. ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ముందు రాయలసీమ అవసరాలు తీరాక కింది ప్రాంతాలకు వదలాలి. ఇప్పటికే రాజధాని, హైకోర్ట్, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కోస్తాకే తరలించారు. కనీసం కరువు సీమకు నీళ్లిచ్చే విషయంలో అయినా రాజకీయాలు కాకుండా మానవతా కోణంలో ఆలోచించండి. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్దత కల్పించాలి. తెలంగాణాతో మాట్లాడి 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలని కోరారు. -
సీమకు కన్నీరే!
‘దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనత మాదే. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సమృద్ధిగా సాగునీరు ఇచ్చి, సాగర్ ద్వారా డెల్టాకు ఇవ్వాల్సిన కృష్ణా జలాలను శ్రీశైలం డ్యాం నుంచి రాయలసీమ జిల్లాలకు తరలిస్తాం. అందులో చుక్కనీరు కూడా కిందకు తీసుకెళ్లం.’ – ఇవీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు రెండేళ్లుగా చెబుతున్న మాటలు. అయితే.. వారి మాటల్లో చిత్తశుద్ధి లేదని తేలిపోతోంది. శ్రీశైలం డ్యాం నుంచి నీటిని యథేచ్ఛగా దిగువకు తీసుకెళ్తున్నారు. నాలుగేళ్ల నుంచి కనీస నీటి మట్టం అనే నిబంధనను సైతం ఉల్లంఘించి మరీ నాగార్జున సాగర్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి అధికార పార్టీ నేతలకు ఈ వాస్తవం తెలిసినా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మాట రావడం లేదు. కర్నూలు సిటీ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ జిల్లాలకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అయినా సీమకు చెందిన టీడీపీ నేతలు ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. ఈ ఏడాది జిల్లాతో పాటు వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా, తుంగభద్ర బేసిన్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా నదులకు వరద జలాలు పోటెత్తాయి. ఫలితంగా శ్రీశైలం డ్యాంకు సుమారు 151 టీఎంసీల నీరు చేరింది. ఈ నీటిని సైతం దిగువకు తీసుకెళుతున్నారు. కృష్ణా డెల్టా ప్రాంతాలైన గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో తాగునీటి అవసరాల పేరుతో గత నెలలో 52 టీఎంసీలకు, తాజాగా మరో 12 టీఎంసీల నీటికి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డు నుంచి అనుమతులు తీసుకుంది. అదే రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందని, 21 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇంజినీర్లు ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రతిపాదనలకు కృష్ణాబోర్డు నుంచి అనుమతులు ఇప్పించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఇదే తరుణంలో ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా నెల్లూరు జిల్లాకు 9 టీఎంసీల నీటిని తరలించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల నీరు వస్తుందన్న భావనతో గత నెల 28న ఎలాంటి ముందస్తూ ప్రణాళికలు లేకుండా నీరుపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌లో స్థిరీకరించిన ఆయకట్టుకు మొత్తం నీరు ఇస్తామని మంత్రులు ప్రకటించారు. దీంతో రైతులు వరి సాగుకు నారు పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీశైలం డ్యాంలో నీరు తక్కువగా ఉందని, ఆయకట్టుకు ఇవ్వలేమని ఇంజినీర్లు తాజాగా ప్రకటించడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. కరువు జిల్లాలకు కృష్ణా జలాలేవీ? రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర, కృష్ణా జలాలే ఆధారం. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగు,తాగునీరు, చెన్నై తాగునీటి అవసరాలకు కలిపి వంద టీఎంసీలకు పైగా నీరు కావాలి. గత నెల 28న ఐఏబీ సమావేశంలో కర్నూలు జిల్లాలో తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, సిద్దాపురం స్కీమ్ కింద 2.51 లక్షల ఎకరాలకు, వైఎస్సార్ జిల్లాలో 1,67,000 ఎకరాలకు కృష్ణా జలాలు అందిస్తామని తీర్మానాలు చేశారు. అలాగే తుంగభద్ర జలాలను కేసీ కాలువ కింద కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు 29.9 టీఎంసీల మేర ఇస్తామన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన నీటిని మొదటి ప్రాధాన్యత కింద కరువు ప్రాంతమైన సీమకు ఇవ్వాల్సి పోయి.. ప్రభుత్వం తాగు నీటి పేరుతో శ్రీశైలం నుంచి సాగర్‌కు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 871.30 అడుగుల నీటి మట్టం, 147 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇందులో సాగర్‌కు ఇంకా 41 టీఎంసీలు (ముందు అనుమతించిన 52 టీఎంసీలలో 23, ప్రస్తుతం అనుమతించిన 12 టీఎంసీలు కలిపి) విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం అనుమతించిన 12 టీఎంసీల నీటిని ఈ నెల 18లోపు విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులిచ్చింది. అలాగే గతంలో అనుమతించిన 52 టీఎంసీల నీటిని సైతం ఈ నెల 23లోపు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 147 టీఎంసీలలో 41 టీఎంసీల నీటిని విడుదల చేస్తే మిగిలేది 106 టీఎంసీలు మాత్రమే. అలాగే నీటిమట్టం 856.8 అడుగులకు తగ్గిపోతుంది. 854 అడుగులకు పైగా నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమకు నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. ఈ స్థాయికి తగ్గితే చుక్క నీరు కూడా రాదు. 21 టీఎంసీలు అడిగాం జూలైలో 9 టీఎంసీలు, ఆగస్టు నెలకు 21 టీఎంసీల నీరు కావాలని ప్రభుత్వాన్ని అడిగాం. అయితే జూలైకు అనుమతిచ్చారు. ఆగస్టు అవసరాల కోసం అనుమతి రావాల్సి ఉంది. నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగకు కొంత నీటిని వెలుగోడు నుంచి విడుదల చేయనున్నాం. వర్షాలు వస్తేనే సాగునీటి విడుదల సాధ్యమవుతుంది. – నారాయణరెడ్డి, సీఈ, జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు ఆ నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలి చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇస్తామని జల హారతులు పట్టిన నేతలు ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో సమాధానం చెప్పాలి. గత మూడు ఐఏబీ సమావేశాల్లో సీఎం వల్లే రాయలసీమకు సాగునీరు వచ్చిందని అభినందన తీర్మానాలు చేయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నీటిని విడుదల చేయించాలి. మాయమాటలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. తీర్మానాలపై ఉన్న ధ్యాస రైతులపై జిల్లా నేతలకు లేకుండా పోయింది. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నా ..ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది – బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ పట్టిసీమ పేరుతో నిలువునా ముంచుతున్నారు. కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా నీటిని ఇస్తామని, డెల్టాకు ఇచ్చే నీటిని రాయలసీమకు మళ్లిస్తామని చెప్పుకుంటూ టీడీపీ నేతలు ఆయకట్టుదారులను నిలువునా మోసం చేస్తున్నారు. దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం వైఎస్సార్ జిల్లాలో (60 శాతం), ఆ తరువాత కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నమోదైంది. అయినా రాయలసీమకు నీళ్లివ్వడం లేదు. ఈ రోజు శ్రీశైలంలో నీరున్నా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పూర్తి స్థాయిలో తగ్గించారు. తాగునీటి అవసరాల పేరిట సాగర్‌కు నీటిని తీసుకెళుతున్నా.. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. – వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
పట్టిసీమపై చర్చకు బాబు సిద్ధమా: బొత్స
పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ జిల్లాలకు ఒక్క చుక్క నీరు కూడా రాదని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురంలో ఆయన మరో మాజీ మంత్రి శైలజానాథ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టిసీమపై బహిరంగ చర్చకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమా అని బొత్స ప్రశ్నించారు. సమన్యాయం పేరుతో చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించారని మరో కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు చెబుతున్న బాబు.. మరి కేంద్రంలోని మంత్రివర్గంలో ఎలా కొనసాగుతున్నారని ఆయన ప్రశ్నించారు.


