నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి

Legislation Should Be Made For Water Allocations - Sakshi

సాక్షి, వైఎస్సార్ జిల్లా:  వెలిగొండ, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పెంచాలని రాయలసీమ ఉద్యమ నేత, కార్మిక కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఆయన మాట్లాడుతూ ‘నిత్యం కరువు కాటకాలను ఎదుర్కొనే రాయలసీమ జిల్లాలకు గోదావరి జలాలను ఎక్కడి నుంచి తరలించినా మాకు సమ్మతమే. దీనిపై అనవసర రాజకీయాలు తగదు.

ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ముందు రాయలసీమ అవసరాలు తీరాక కింది ప్రాంతాలకు వదలాలి. ఇప్పటికే రాజధాని, హైకోర్ట్, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కోస్తాకే తరలించారు. కనీసం కరువు సీమకు నీళ్లిచ్చే విషయంలో అయినా రాజకీయాలు కాకుండా మానవతా కోణంలో ఆలోచించండి. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్దత కల్పించాలి. తెలంగాణాతో మాట్లాడి 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top