breaking news
Radikaa Sarathkumar
-
వరలక్ష్మీ శరత్‌కుమార్ ‘సరస్వతి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వరలక్ష్మి నటించడం శరత్‌కు ఇష్టం లేదు.. నిర్మాతకు వార్నింగ్ ఇచ్చేవాడు: రాధిక
ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి,తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా..విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి..మెప్పించింది. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇలా తనదైన నటనతో తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించింది. అయితే కూతురు సినిమాల్లోకి రావడం మొదట్లో శరత్‌కుమార్‌కి ఏమాత్రం నచ్చలేదట. యాక్టింగ్ వదంటూ ఆమెపై సీరియస్ కూడా అయ్యాడట. ఒకానొక దశలో ఆమెకు చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఈ విషయాలన్నీ శరత్ కుమార్ సతీమణి రాధికా చెప్పారు. వరలక్ష్మీ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘సరస్వతి’.ఈ నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాధికా మాట్లాడుతూ.. ‘వరలక్ష్మి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు శరత్ వ్యతిరేకించారు. ‘ఎలా నటిస్తావ్? నువ్వు యాక్ట్ చేయకూడదు’ అంటూ సీరియస్ అయ్యేవారు. ‘మా కుమార్తెను నటిగా ఎంపిక చేయొద్దు’ అంటూ నిర్మాతలకూ ముందే చెప్పేవారు. ఈ విషయాలన్నింటినీ తన తల్లితో కలిసి వరలక్ష్మి ఓ రోజు నాతో పంచుకుంది. దీనిపై నిర్ణయం తీసుకోలేనని చెప్పి.. సినిమా సెట్స్‌లో ఉన్న శరత్ వద్దకు వారిని తీసుకెళ్లా. అప్పుడు ఆయన.. నమితతో కలిసి ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్నారు. నమితతో సినిమా పాట అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి(నవ్వుతూ..). మమ్మల్ని చూడగానే ఆయన కారవాన్‌లోకి వెళ్లిపోయారు. తర్వాత వరలక్ష్మి నటించేందుకు అంగీకరించారు. వరలక్ష్మి తొలి సినిమా (పోడా పోడి)ని చూడగానే.. తను గొప్ప నటి అవుతుందని చెప్పా. తెలుగు సినిమాపై దృష్టి పెట్టమని వరలక్ష్మికి సలహా ఇచ్చా. ఆమె అదే ఫాలో అయింది. ఇప్పుడు వరలక్ష్మీని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని రాధిక అన్నారు. -
రాధిక, శివకార్తికేయన్ కోసం వచ్చిన కమల్ హాసన్ (ఫోటోలు)
-
75 ఏళ్ల బామ్మగా ఒకప్పటి స్టార్ హీరోయిన్
వైవిధ్య భరిత కథ చిత్రాలను నిర్మించడంలోనూ, టాలెంటెడ్ కళాకారులను ప్రోత్సహించడంలోనూ ముందుండే నటుడు శివ కార్తికేయన్.. తన ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రం తాయ్ కిళవి. ఈ చిత్రం ద్వారా శివ కుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన రాధికా శరత్‌కుమార్.. ఈ మూవీలో ఉసిలంపట్టి గ్రామం కట్టుబాటులో నివసించే 75 ఏళ్ల బామ్మగా ఆమె కనిపించనున్నారు. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, సమస్యలు తదితర అంశాలకు వినోదాన్ని జోడించి తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పార్టీ ఇచ్చిన ఖుష్బూ.. హాజరైన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
విరాట్ కోహ్లీ, రాధిక శరత్‌కుమార్ సెల్ఫీ.. ఎక్కడో తెలుసా..?
సౌత్ ఇండియా స్టార్ యాక్టర్ రాధిక శరత్‌కుమార్ ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉండటంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సౌత్ సినిమా ఇండస్ట్రీతో విరాట్‌కు పెద్దగా పరిచయం లేదు. అలాంటిది వీరిద్దరూ ఎక్కడ పోటో దిగి ఉంటారబ్బా అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. రాధిక షేర్ చేసిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇదీ చదవండి: రావు రమేశ్ హీరోగా చేసిన మూవీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్సెల్ఫీ ఫోటోను షేర్ చేసిన రాధికా ఇలా చెప్పుకొచ్చారు. ' కొన్ని కోట్ల హృదయాలకు దగ్గరైన వ్యక్తి విరాట్ కోహ్లీ. తన ఆటతో మనల్ని గర్వపడేలా చేస్తాడు. కొంత సమయం పాటు అతనితో కలిసి ప్రయాణం చేయడం ఆనందంగా ఉంది. సెల్ఫీ తీసుకున్నందుకు ధన్యవాదాలు.' అంటూ ఆమె తెలిపారు. సోషల్‌మీడియాలో ఈ ఫోటో భారీగా వైరల్ అవుతుంది.చెన్నై వేదికగా సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో ఇవాళ వేకువజామున 4 గంటలకు లండన్ నుంచి నేరుగా ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఈ క్రమంలో అదే విమానంలో రాధిక శరత్‌కుమార్ కూడా ప్రయాణం చేశారు. ఆ సమయంలో వారిద్దరూ సరదాగా కొంత సమయం పాటు ముచ్చటించి ఆపై సెల్ఫీ తీసుకున్నారు. View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
అప్పట్లో స్టార్ హీరోయిన్.. పాపులర్ హీరోని రెండో పెళ్లి చేసుకుని.. (ఫొటోలు)


