విరాట్‌ కోహ్లీ, రాధిక శరత్‌కుమార్‌ సెల్ఫీ.. ఎక్కడో తెలుసా..? | Virat Kohli And Radhika Sarathkumar Selfie Viral | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లీ, రాధిక శరత్‌కుమార్‌ సెల్ఫీ.. ఎక్కడో తెలుసా..?

Sep 13 2024 6:06 PM | Updated on Sep 13 2024 7:03 PM

Virat Kohli And Radhika Sarathkumar Selfie Viral

సౌత్‌ ఇండియా స్టార్‌ యాక్టర్‌ రాధిక శరత్‌కుమార్‌ ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఉండటంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సౌత్‌ సినిమా ఇండస్ట్రీతో విరాట్‌కు పెద్దగా పరిచయం లేదు. అలాంటిది వీరిద్దరూ ఎక్కడ పోటో దిగి ఉంటారబ్బా అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. రాధిక షేర్‌ చేసిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఇదీ చదవండి: రావు రమేశ్ హీరోగా చేసిన మూవీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్

సెల్ఫీ ఫోటోను షేర్‌ చేసిన రాధికా  ఇలా చెప్పుకొచ్చారు. ' కొన్ని కోట్ల హృదయాలకు దగ్గరైన వ్యక్తి విరాట్‌ కోహ్లీ. తన ఆటతో మనల్ని గర్వపడేలా చేస్తాడు.  కొంత సమయం పాటు అతనితో కలిసి ప్రయాణం చేయడం ఆనందంగా ఉంది. సెల్ఫీ తీసుకున్నందుకు ధన్యవాదాలు.' అంటూ ఆమె తెలిపారు. సోషల్‌మీడియాలో ఈ ఫోటో భారీగా వైరల్‌ అవుతుంది.

చెన్నై వేదికగా సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో భారత్‌ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో ఇవాళ వేకువజామున 4 గంటలకు లండన్‌ నుంచి నేరుగా ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఈ క్రమంలో అదే విమానంలో రాధిక శరత్‌కుమార్‌ కూడా ప్రయాణం చేశారు. ఆ సమయంలో వారిద్దరూ సరదాగా కొంత సమయం పాటు ముచ్చటించి ఆపై సెల్ఫీ తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement