Public sector oil firms
-
దేశీ ఎయిర్‌లైన్స్‌కి ఊరట
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగిసినప్పటికీ విమాన ఇంధనం రేట్లను భారీగా పెంచకుండా దేశీ విమానయాన సంస్థలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొంత ఊరటనిచ్చాయి. వాస్తవానికి రెట్టింపు స్థాయిలో పెంచాల్సినప్పటికీ పెంపును 8.5%కి పరిమితం చేశాయి. అయితే, వాణిజ్య గ్యాస్ సిలిండర్ (ఎల్పీజీ), ప్రీమియం పెట్రోల్ రేట్లను మాత్రం పెంచాయి. తాజా పరిమాణంతో దేశీ ఎయిర్‌లైన్స్‌కి ఏటీఎఫ్ ధర ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 8,289 (8.56%) పెరిగి రూ. 1,04,927కి చేరింది. కానీ విదేశీ ఎయిర్‌లైన్స్, నాన్–శెడ్యూల్డ్, చార్టర్ ఫ్లయిట్స్‌కి మాత్రం 114.5% ఎగిసింది. రూ.1,10,703 పెరిగి రూ. 2,07,341కి చేరింది. ఇది రూ. 2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. ‘విమాన టికెట్ చార్జీలు భారీగా పెరగకుండా ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు, దేశీ ఎయిర్‌లైన్స్‌పై భారాన్ని తగ్గించేందుకు, కీలక తరుణంలో పరిశ్రమలో స్థిరత్వాన్ని తెచ్చేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఎయిర్ కనెక్టివిటీకి ఆటంకాలు ఏర్పడకుండా చూడటం ద్వారా ఎకానమీకి కూడా ప్రయోజనం చేకూర్చగలదు’ అని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏవియేషన్ పరిశ్రమకు, విమాన ప్రయాణికులపై పెను భారం పడకుండా ఈ చర్యలు తోడ్పడతాయని ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ పేర్కొన్నాయి. సాధారణ పెట్రోల్, వంట గ్యాస్ ధర యథాతథం.. 19 కేజీల వాణిజ్య సిలిండర్ రేటు ఢిల్లీలో రూ. 195.50 మేర పెరిగి రూ. 2,078.50కి చేరింది. ప్రీమియం డీజిల్ రేటు లీటరుకు రూ. 1.50 మేర పెరిగి రూ. 92.99కి చేరగా, 100 ఆక్టేన్ పెట్రోల్ ధర రూ. 11 పెరిగి రూ. 160కి చేరింది. సాధారణ, అన్‌బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ వంట గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పుల్లేవు. వంట గ్యాస్ రేట్లను పెంచకపోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రతి సిలిండర్‌పై రూ. 380 మేర ఆదాయ నష్టం వాటిల్లుతోంది’ అని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ పేర్కొంది.ఇండిగో ఇంధన చార్జీల పెంపు..ఏటీఎఫ్ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఇంధన చార్జీలను రూ. 275–10,000 వరకు పెంచుతున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాగా ప్రయాణ దూరాన్ని బట్టి దేశీ రూట్లలో ఫ్లయిట్లకు సంబంధించి ఈ పెంపు రూ. 275–950 శ్రేణిలో, ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌లో రూ. 900 – 10,000 శ్రేణిలో ఉంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో మార్చి 14 నుంచి ఇండిగో రూ. 425 నుంచి రూ. 2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తోంది. -
చమురు షేర్ల విలువ సరికాదు
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాల(ఓఎంసీలు) షేర్ల విలువలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మార్కెట్లో వీటికి ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న విలువపట్ల ప్రభుత్వం నిరాశకు లోనైనట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్(ఐవోసీ), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ఉమ్మడిగా గత ఆరేళ్లలో రూ. 2.5 లక్షల కోట్ల నికర లాభం ఆర్జించినట్లు తెలియజేశారు. అయితే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ స్విగ్గీ, జొమాటో సంయుక్తంగా రూ. 24,000 కోట్ల నష్టాలు ప్రకటించినట్లు ప్రస్తావించారు. అయితే మూడు ఓఎంసీల విలువతో ఈ రెండు కంపెనీల విలువ అటూఇటుగా సమానంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. గతేడాది మూడు ఓఎంసీలు ఉమ్మడిగా ఆర్జించిన లాభాలు దేశీ కార్పొరేట్ లాభాల్లో 3.3 శాతం వాటాకు సమానమని పేర్కొన్నారు. అయితే వీటి విలువ 1 శాతానికంటే తక్కువేనని వెల్లడించారు. వెరసి చమురు మార్కెటింగ్ పీఎస్‌యూ షేర్లకు తగిన విలువ లభించడంలేదని అభిప్రాయపడ్డారు. వాటా విక్రయ యోచన ఇంధన విక్రయ దిగ్గజాలలో ప్రభుత్వం కొంతమేర వాటా విక్రయించేందుకు చూస్తున్నట్లు పురి తెలియజేశారు. అయితే వీటిలో పూర్తి వాటాను అమ్మివేసే యోచనలేదని స్పష్టం చేశారు. కంపెనీల సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశలో స్వల్ప వాటాను విక్రయించనున్నట్లు తెలియజేశారు. అయితే బీపీసీఎల్ ఈ జాబితాలో లేనట్లు స్పష్టం చేశారు. -
కేజీ బ్లాక్ నుంచి ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: సుదీర్ఘ జాప్యం తర్వాత కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీప్ సీ బ్లాక్ నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీతో పాటు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ విషయం తెలిపారు. అయితే, ఉత్పత్తి చేస్తున్న పరిమాణాన్ని మాత్రం వెల్లడించలేదు. కేజీ–డీడబ్ల్యూఎన్–98/2 (కేజీ–డీ5) ప్రాజెక్టుతో తమ చమురు ఉత్పత్తి సామర్ధ్యం 11 శాతం, గ్యాస్ ఉత్పత్తి సామర్ధ్యం 15 శాతం పెరుగుతుందని ఓఎన్జీసీ తెలిపింది. 2022–23లో ఓఎన్జీసీ 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్, రోజుకు 20 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేసింది. తాజాగా అందుబాటులోకి వచి్చన బ్లాక్‌లో చమురు ఉత్పత్తి గరిష్టంగా రోజుకు 45,000 బ్యారెళ్లు, గ్యాస్ ఉత్పత్తి 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల స్థాయికి చేరగలదని మంత్రి తెలిపారు. అయితే, ఎప్పటికి ఆ స్థాయిని చేరవచ్చనేది వెల్లడించలేదు. కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–6 బ్లాక్ పక్కనే కేజీ–డీ5 బ్లాక్ ఉంది. దీన్ని మూడు క్లస్టర్లుగా విడగొట్టి ముందుగా రెండో క్లస్టర్‌పై పనులు ప్రారంభించారు. వాస్తవ ప్రణాళికల ప్రకారం 2021 నవంబర్లోనే ఇందులో ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ పరిణామాలతో 2023 మే నెలకు, అటుపైన ఆగస్టుకు, తర్వాత డిసెంబర్‌కు వాయిదా పడుతూ వచి్చంది. -
బీపీసీఎల్ కొత్త యజమాని ఓపెన్ ఆఫర్ ఇస్తే?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ బీపీసీఎల్ ప్రైవేటీకరణలో ఓ అంశం కీలకంగా మారింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్)లో 22.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీలో 12.5 శాతం చొప్పున బీపీసీఎల్‌కు వాటాలున్నాయి. బీపీసీఎల్‌లో ప్రభుత్వం తనకున్న 52.98 శాతం వాటాను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రైవేటీకరించే కసరత్తులో ఉన్న విషయం తెలిసిందే. బీపీసీఎల్‌ను కొనుగోలు చేసిన కొత్త యజమాని.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్‌లో వాటాదారులకు 26 శాతం వాటాలను అదనంగా కొనుగోలు చేసేందుకు నిబంధనల మేరకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది విజయవంతం అయితే అప్పుడు ఐజీఎల్‌లో బీపీసీఎల్‌కు 48.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీలో 38.5 శాతానికి వాటాలు పెరుగుతాయి. దీంతో ఈ కంపెనీల్లో ఇప్పటికే వాటాలు కలిగిన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), ఓఎన్జీసీ, గెయిల్ కంటే కూడా బీపీసీఎల్ పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా ఐజీఎల్, పెట్రోనెట్ రెండూ కూడా ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలన్నది కేంద్రం యోచన. కనుక ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెబీని కోరింది. ఈ అభ్యర్థన బీపీసీఎల్ నుంచి రావాలని సెబీ సూచించడంతో.. బీపీసీఎల్ ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది. ఒకవేళ సెబీ నుంచి మినహాయింపు రాని పక్షంలో.. అప్పుడు పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్ వాటాదారులకు ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా పాల్గొని అదనపు వాటాలను కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పెట్రెనెట్, ఐజీఎల్‌కు ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా ప్రమోటర్లుగానే ఉండడంతో ఓపెన్ ఆఫర్లో పాల్గొనే అర్హత వాటికి కూడా ఉంటుంది. దీంతో బీపీసీఎల్ ప్రైవేటు పరం అయినా.. ఐజీఎల్, పెట్రోనెట్పై పీఎస్‌యూల ఆధిపత్యం కొనసాగే వీలుంటుంది. -
రూ.2 పెరిగిన వంటగ్యాస్
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధరను రూ.2 పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతోపాటు విమాన ఇంధనం, కిరోసిన్ ధరలూ పెరిగాయి. సబ్సిడీ సిలిండర్‌పై నెలకు రూ.2 పెంచాలని గత జూలైలో కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారమే సిలిండర్ ధర పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా, సబ్సిడీయేతర సిలిండర్‌కు రూ.1, కిరోసిన్‌పై 26పైసలు పెరిగింది.


