breaking news
Protest rallies
-
నేపాల్‌కు నిప్పు పెట్టిందెవరు?
కాఠ్మండు: చేతికి ఆరో వేలుగా అతుక్కుపోయిన స్మార్ట్‌ఫోన్‌లో సోషల్‌మీడియా యాప్స్ అనేవి ఓ రకంగా ఆత్మ వంటివి. అలాంటి ఆత్మను చంపేస్తామంటూ ఊరుకోబోమని తెలియజేప్పేందుకే శాంతియుత నిరనస ర్యాలీలు చేపట్టామని నేపాల్‌లోని జెన్ జెడ్ యువత చెబుతోంది. దేశాన్ని చీడపీడలా తొలిచేస్తున్న అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవనాన్ని ప్రశ్నించేందుకు కదం తొక్కామని, మూడ్రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జెన్ జెడ్ విద్యార్థులు, యువజన సంఘాలు స్పష్టంచేశాయి. రాజకీయ అవకాశవాదులు ఉద్యమకారుల మాటున నిరసనకార్యక్రమాల్లో దూరిపోయి నేపాల్‌ను అగి్నగుండంలా మార్చేశారని విద్యార్థులు ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి చివరకు ప్రభుత్వాన్ని పడగొట్టాయని, నేపాల్లోనూ అదే కుట్ర జరుగుతోందని విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. లూటీలు, దోపిడీలకు తాము ఆమడదూరంలో ఉండిపోయామని, పోలీసులపై రాళ్లదాడి ఘటనలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ విధ్వంసం వెనుక బయటి శక్తుల హస్తముందని విద్యార్థులు ఆరోపించారు. ఏకపక్షంగా సామాజిక మాధ్యమాలపై ఆకస్మిక నిషేధం వల్ల కలిగే అనర్థాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలియజేప్పేందుకే వీధుల్లోకి వచ్చామని, విధ్వంసం చేయడం తమ ఉద్దేశ్యంకాదని స్పష్టంచేశారు. మద్దతు పలికిన మాజీ ప్రధాని విద్యార్థుల వాదనలకు పరోక్షంగా మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ మద్దతు పలికారు. ‘‘నాకు తెల్సిన విద్యార్థులు ఇలాంటి విధ్వంసాలకు అస్సలు దిగరు. వారసత్వ రాజకీయాలు, రాజకీయనేతలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవితం, అవినీతిపై విద్యార్థుల తిరుగుబాటు మొదలైంది. తీరాచూస్తే ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా మరో ‘తిరుగుబాటు’ఆరంభమైనట్లు తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. మేకవన్నె పులులు మీ ఉద్యమ మందల్లో దూరిపోయాయి. వారితో జాగ్రత్త అని మొదట్నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నా’’అని విద్యార్థులను భట్టారాయ్ హెచ్చరించారు. ఉద్యమంలో బయటిశక్తులనుద్దేశిస్తూ.. ‘నేపాల్ ప్రజాస్వామ్య పునాదులనే పెకళించే దుస్సాహసానికి వాళ్లు దిగారు. వాళ్ల తదుపరి దారుణ లక్ష్యం ఏమిటో’’అని ఆందోళన వ్యక్తంచేశారు. సొంత దేశాన్ని తగలబెడుతున్న విద్యార్థులు అంటూ వస్తున్న వార్తలను భట్టారాయ్ తప్పుబట్టారు. ‘‘మొసలికన్నీరు కార్చడానికి విద్యార్థులేమీ రాజకీయనేతలు కాదు. అల్లర్లు, ఘర్షణలు చూసి విద్యార్థులే అవాక్కవుతున్నారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని బయటి శక్తులు దురుద్దేశ్యంతో ఉగ్రరూపంలోకి మార్చేశారని విద్యార్థులు బాధపడుతున్నారు. తాజా వినాశనానికి బయటిశక్తులే కారణం’’అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్రంగా ఖండించిన యువజన, ఎన్జీవో సంఘాలు హింసాత్మక ఘటనలను యువజన, విద్యార్థి, లాభాపేక్షలేని ప్రభుత్వేతర ఎన్జీవోలు ఖండించాయి. ముఖ్యంగా తొలుత శాంతియుత నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించిన జెన్ జెడ్ నేపాల్, హమీ నేపాల్ సంస్థలు ఈ విధ్వంసకాండపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశాయి. ‘‘మొదట్నుంచీ విధ్వంసాన్ని మేం అడ్డుకునేందుకే ప్రయతి్నంచాం. వినాశనానికి మాకు వీసమెత్తయినా సంబంధం లేదు. విద్యార్తులెవరూ ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసంచేయలేదు. ప్రధాని, మాజీ ప్రధానులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులతో మాకు ఎలాంటి సంబంధం లేదు’’అని బుధవారం ప్రకటనలో స్పష్టంచేశాయి. ‘‘ఘటనాస్థలికి మేం తర్వాత వచ్చాం. బాధితులను కాపాడాం. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. ప్రజల ఆస్తుల పరిరక్షణకు పాటుపడ్డాం’’అని జెన్‌జెడ్ నేపాల్ మరో ప్రకటనలో పేర్కొంది. ‘‘సహేతుకమైన, ప్రజాస్వామ్యయుత ఉద్యమపంథాలో సాగుతున్న మమ్మల్ని విధ్వంసకపర్వంలో భాగస్వాములుగా చిత్రించకండి. అధికారమే పరమావధిగా కుట్రలు చేసే రాజకీయ శక్తులు, అవకాశవాదులే ఈ వినాశనానికి సృష్టికర్తలు. మా ఉద్యమానికి తప్పుడు మరకలు అంటించే కుట్రలు జరుగుతున్నాయి. మంచి కోసం పోరాడుతున్న మమ్మల్ని దేశవినాశకారులుగా చిత్రించే కుట్రలు జరుగుతున్నాయి’’అని జెన్‌జెడ్ ఆరోపించింది. ‘‘మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదు. కూల్చడం మా పనికాదు. దేశ పునర్నిర్మాణమే మా ధ్యేయం. దేశవ్యతిరేక యుద్ధం మేం చేయట్లేము. చెడుకు వ్యతిరేకంగా సాగుతున్న సంఘర్షణలో మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటున్నాం. నఖూ జైలును మేం బద్దలుకొట్టలేదు. మాజీ ఉప ప్రధానమంత్రి రవి లమీచ్ఛానేను మేం జైలు నుంచి విడిపించలేదు ’’అని హమీ నేపాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఈ నెల 22న ‘దశాబ్ది దగా’
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం పదో ఏట అడుగుపెట్టిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ సొంత వ్యవహారం చేస్తోంది. ఈ తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం ఈ నెల 22న ‘దశాబ్ది దగా’పేరిట రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలి. రావణాసురుడి రూపంలో కేసీఆర్ దిష్టిబొ లను తయారు చేసి, పది వైఫల్యాల తలలు పెట్టి ఆ దిష్టిబొ లను దహనం చేయాలి. తర్వాత ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించాలి..’’అని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నిర్ణయించింది. శనివారం గాం«దీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అంశాలపై చర్చించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, విష్ణునాథ్, మన్సూర్‌అలీ ఖాన్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీఏసీ సభ్యులు వీహెచ్, షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో, ఏయే సీట్లు ఇస్తారో వెంటనే గుర్తించాలని పీఏసీ భేటీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ కోరినట్టు తెలిసింది. 2018లో చాలా సీట్లు చివరి నిమిషంలో ప్రకటించడంతో నష్టం జరిగిందని పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఇతర పా ర్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న వారికి పనితీరు, ప్రభావం ఆధారంగానే టికెట్లు ఇవ్వాలని, పార్టీని నమ్ముకుని ఉన్న వారికి అన్యాయం జరగకుండా చూడాలని వీహెచ్, రేణుకా చౌదరి సూచించినట్టు తెలిసింది. పది రోజుల్లో మండల కమిటీలు పీఏసీ భేటీ తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. పార్టీ మండల కమిటీల ఏర్పాటుపై చాలా ప్రతిపాదనలు వచ్చాయని, వీటిపై చర్చించి 10 రోజుల్లోగా ప్రకటిస్తామని చెప్పారు. ‘దశాబ్ది దగా’పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. బీసీ డిక్లరేషన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్లలో ఏయే అంశాలను చేర్చాలన్న చర్చ జరుగుతోందని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో జాతీయస్థాయి నేతలతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటై ఇన్నేళ్లయినా 600 మంది అమరుల కుటుంబాలను గుర్తించలేకపోయారని, బాధ్యత లేని మంత్రుల వ్యవహార శైలితో అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని బీజేపీ, తెలంగాణలోని బీఆర్ఎస్కు దగ్గరి పోలిక ఉందని.. అక్కడ బీజేపీ 40 శాతం కమీషన్ సర్కార్ అయితే, ఇక్కడ బీఆర్ఎస్ది 30 శాతం కమీషన్ సర్కార్ అని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. అనుబంధ సంఘాల బాధ్యతలు కేటాయింపు కాంగ్రెస్ అనుబంధ సంఘాల పర్యవేక్షణ బాధ్యతలను పలువురు టీపీసీసీ నేతలకు కేటాయిస్తూ రేవంత్ ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్‌కుమార్ గౌడ్ (సేవాదళ్, ఐఎన్టీయూసీ), గీతారెడ్డి (మహిళా కాంగ్రెస్), వినోద్‌రెడ్డి (యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ), మద్దుల గాల్‌రెడ్డి (ఎన్ఆర్ఐసెల్, ఓవర్సీస్)లకు బాధ్యతలను అప్పగించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, చావా రవి, మాణిక్‌రెడ్డి (యూటీఎఫ్), పోచయ్య (ఎస్టీఎఫ్), లింగారెడ్డి (డీటీఎఫ్), మురళీ (టీటీఎఫ్), గోపాల్, రఘునందన్, వెంకటయ్య, రవిశంకర్‌రెడ్డి తదితరులు గాం«దీభవన్‌లో రేవంత్‌ను కలసి ఉపాధ్యాయుల సమస్యలను వివరించారు. సీపీఎస్ రద్దు, ఏటా పదోన్నతులు, బదిలీల అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు చెరో 45 సీట్లు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజల అభిప్రాయంలో భారీ మార్పు వచ్చిందని, కాంగ్రెస్ నిర్వహిస్తోన్న సర్వేల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పా ర్టీలకు సమాన అవకాశాలు కనిపిస్తున్నాయని రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు చెరో 45 సీట్లలో గెలిచే అవకాశాలున్నాయని, 15 చోట్ల రెండు పా ర్టీల మధ్య గట్టి పోటీ ఉందని చెప్పారు. బీఆర్ఎస్కు 37 శాతం ఓట్‌షేర్ వస్తే తమకు 35 శాతం వస్తోందని, బీజేపీ బలం 22 శాతం నుంచి 14 శాతానికి పడిపోయిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎం, బీజేపీ చెరో ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉందన్నారు. పౌరహక్కుల నేత హరగోపాల్‌పై కేసును వెనక్కి తీసుకుంటామన్న ప్రకటనను తాను నమ్మడం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. మోసం చేసేందుకే కేసీఆర్ కొన్ని ప్రకటనలు చేస్తుంటారన్నారు. -
శ్రీలంకలో మళ్లీ ఆందోళనలు.. విక్రమ సింఘేకూ ‘గొటబయ’ పరిస్థితే!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలాకనిపించటం లేదు. ఇటీవలే ఏర్పడిన కొత్త ప్రభుత్వంపైనా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని కొలంబోలో బుధవారం వందల మంది ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ‘రణీల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స పరిస్థితి ప్రస్తుత ప్రెసిడెంట్‌కూ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనలను విపక్ష పార్టీలు, వాణిజ్య సంఘాలు, పౌర హక్కుల గ్రూప్‌లు సంయుక్తంగా నిర్వహించాయి. నగరంలోని అధ్యక్ష నివాసం, ఇతర మంత్రుల నివాసలు ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ‘ప్రజలు మూడుపూటల కడుపునిండా తినలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు సాయం చేయకపోగా.. భారీగా పన్నులు విధిస్తోంది. దీనికి పరిష్కారం కావాలి. అందుకోసం పోరాడుతూనే ఉంటాం.’అని టీచర్స్ యూనియన్ సెక్రెటరీ జోసేఫ్ స్టాలిన్ తెలిపారు. ఈ ఏడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి చమురు, ఆహార పదార్థాలు, కుకింగ్ గ్యాస్, ఔషధాల వంటి నిత్యావసరాల దిగుమతులకు సైతం డబ్బులు చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుని గత జూలైలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత రణీల్ విక్రమ సింఘే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన నవంబర్ 14న తొలి బడ్జెన్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు పన్నుల పెంపు సహా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు మళ్లీ ఆందోళనబాట పడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం వందల మంది కొలంబోలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా పట్టుకుని ‘రణీల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అణచివేసేందుకు తీవ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఇదీ చదవండి: GOA New Rules: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా -
రగులుతున్న ఓయూ
ఉస్మానియాలో కొనసాగిన నిరసన ర్యాలీలు.. రాస్తారోకోలు లాఠీచార్జీలు, అరెస్టులతో అట్టుడికిన విశ్వవిద్యాలయం సిటీబ్యూరో/ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ ఉద్యమ కేంద్రం ఉస్మానియా వర్సిటీ యుద్ధభూమిగా మారుతోంది. వరుసగా మూడోరోజు నిరసన ర్యాలీలు, అరెస్టులు, లాఠీచార్జీలతో క్యాంపస్ అట్టుడుకింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను స్వాగతిస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు.. దానిని వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ శుక్రవారం పోటాపోటీగా ర్యా లీలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెల కొంది. రెండు ర్యాలీలు ఒకే సమయంలో మొదలు కావడంతో ఆర్ట్స్ కళాశాల వద్ద పరిస్థితి అదుపుతప్పింది. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి, పది మంది విద్యార్థులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఐక్య పోరాటాల నుంచి ఆధిపత్య పోరు.. తెలంగాణ ఉద్యమంలో ఐక్యంగా ఉద్యమించిన వివిధ విద్యార్థిసంఘాలు ఇప్పుడు ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం క్రమంగా విద్యార్థి సంఘాల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. కొన్ని సంఘాలు క్రమబద్ధీకరణను సమర్థిస్తుండగా మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మూడు రోజులుగా విద్యార్థి సంఘాల మధ్య ఈ విషయమై ఘర్షణలు, పరస్పర దాడులు జరుగుతుండడంతో ఓయూ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోవైపు ఇప్పటి వరకు వర్సిటీకి వీసీ లేకపోవడంతో పాలన స్తంభించింది. ఐఏఎస్ అధికారిని తాత్కాలిక వీసీగా నియమించినా పరిపాలనాపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఒకవైపు విద్యార్థి సంఘాల ఘర్షణ, మరోవైపు పాలన స్తంభించడంతో విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో తరగతులు జరగడం లేదు. దీంతో తమ భవిష్యత్తుపై ఓయూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మంత్రుల వెనుకడుగు... ఒకప్పుడు తెలంగాణ విద్యార్ధి జేఏసీ, ఓయూ జేఏసీలు చేపట్టిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన టీఆర్ఎస్ పార్టీ తాజా పరిణామాలకు మాత్రం దూరంగా ఉంటోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అనుకూలంగా సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో విద్యార్థులు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సీఎం కేసీఆర్ వర్సిటీకి వెళ్లాలనుకున్నప్పటికీ ఆ సాహసం చేయలేకపోతున్నారు. గత నెలలో జయశంకర్ జయంతి సందర్భంగా వర్సిటీలో నాన్‌టీచింగ్ స్టాఫ్ జయశంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, ఈటెల, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిఉన్నా.. విద్యార్థుల ఆందోళనతో వారూ ముఖం చాటేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు ఆందోళనను విరమించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ప్రతిపక్షపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు కొన్ని సంఘాలకు మద్ధతుగా నిలుస్తుండడంతో ఉద్రిక్తత పెరిగింది. అశాంతికి ప్రభుత్వానిదే బాధ్యత... ఇలా ఉండగా, ఉస్మానియా యూనివర్సిటీలో అశాంతికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని టి. విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్, అధ్యక్షులు మానవతరాయ్, అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఓయూలో ప్రభుత్వ దమనకాండను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి సంఘం తన ఆధిపత్యం కోసమే విద్యార్థులపై దాడులకు తెగబడుతోందని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టీఎస్ జేఏసీ చెర్మైన్ పిడమర్తి రవి పేర్కొన్నారు.