Pakistan vs USA
-
PAK Vs NAM: పాకిస్తాన్‌కు శుభవార్త!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఇప్పటికే ఏడు జట్లు సూపర్-8 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ సూపర్-8లో అడుగుపెట్టగా.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించాయి.పోటీలో అమెరికా, పాక్ ఇక గ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య భారత్ హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకోగా.. ఇదే గ్రూపు నుంచి రెండో బెర్తు కోసం అమెరికా, పాకిస్తాన్ పోటీలో ఉన్నాయి. గ్రూప్-ఎ టాపర్ టీమిండియా ఖాతాలో ఆరు పాయింట్లు ఉండగా.. నెట్‌రన్‌రేటు (+3.050).రెండో స్థానంలో ఉన్న అమెరికా నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని రెండు గెలిచి 4 పాయింట్లతో ఉంది. నెట్‌రన్‌రేటు (+0.787). ఇక నమీబియా ఆడిన మూడింటికి మూడు ఓడి ఎలిమినేట్ కాగా.. పాక్ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లు సాధించిది. అమెరికాతో సమానంగా పాయింట్లు ఉన్నా నెట్‌రన్‌రేటు (-0.403) పరంగా వెనుకబడి ప్రస్తుతానికి మూడో స్థానంలో నిలిచింది.వర్షం పడితే.. ఈ క్రమంలో గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా పాకిస్తాన్ బుధవారం నమీబియాతో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.పల్లెకెలెలో వాన వల్ల జింబాబ్వే- ఐర్లాండ్ మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైపోయింది. దీంతో జింబాబ్వే సూపర్-8కు చేరగా.. ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఇక పాక్- నమీబియా మ్యాచ్‌కు కూడా వాన ముప్పు పొంచి ఉంది.ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. కొలంబోలో బుధవారం వర్షం పడేందుకు 67 శాతం అవకాశాలు ఉన్నాయి. రాత్రికి 55 శాతం వాన పడే అవకాశాలు తగ్గినా.. పాక్- నమీబియా మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటలకే మొదలుకావాల్సి ఉంది.సంతోషంలో పాక్ జట్టు అభిమానులుఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ గనుక రద్దైతే పాకిస్తాన్‌కు పండుగే. వాన వల్ల మ్యాచ్ సాగకపోతే పాక్, నమీబియాలకు చెరో పాయింట్ వస్తుంది. తద్వారా పాక్ ఖాతాలోని పాయింట్ల సంఖ్య ఐదుకు చేరి.. సూపర్-8కు నేరుగా అర్హత సాధిస్తుంది. దీంతో అమెరికా నిష్క్రమించాల్సి ఉంటుంది.ఒకవేళ మ్యాచ్ జరిగినా పాక్ నమీబియాపై తప్పక గెలవాలి. నమీబియా పసికూనే అయినా పాక్ నిలకడలేమితనం ఆ జట్టు అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. అయితే, మ్యాచ్‌కు వాన ముప్పు ఉందని తెలిసి వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.చదవండి: కెప్టెన్ నిర్ణయం... జట్టు పాలిట శాపం! -
పటిష్ట స్థితిలో అమెరికా.. పాక్ సూపర్-8 చేరాలంటే?
టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్‌పై తమదే పైచేయి అని టీమిండియా మరోసారి నిరూపించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సల్మాన్ ఆఘా బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తాజా ఎడిషన్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసిన టీమిండియా.. గ్రూప్-ఎ నుంచి సూపర్-8కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.తదుపరి నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా తలపడుతుంది. మరోవైపు.. గ్రూప్-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్‌తో అమెరికా పోటీ పడుతోంది. కాగా లీగ్ దశలో అమెరికా నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.పటిష్ట స్థితిలో అమెరికాఇందులో భారత్, పాకిస్తాన్ చేతిలో ఓడిన అమెరికా జట్టు.. నెదర్లాండ్స్, నమీబియా జట్లపై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లు సాధించింది. నెట్‌రన్‌రేటు +0.787గా ఉంది. ఇక టీమిండియా చేతిలో భారీ తేడాతో పాక్ ఓడిపోవడంతో అమెరికా సూపర్-8 ఆశలు సజీవమయ్యాయి.ఈ నేపథ్యంలో అమెరికాను దాటి సూపర్-8కు చేరాలంటే పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. కొలంబో వేదికగా నమీబియాపై పాక్ గెలిస్తేనే సూపర్-8కు చేరుతుంది. అయితే, ఇరుజట్లలో పాక్ పటిష్టమైనదే అయినా.. అత్యంత నిలకడలేని జట్టుగా పాకిస్తాన్‌కు చెడ్డపేరు ఉంది.పాక్ సూపర్-8 చేరాలంటే?మరోవైపు.. ఈ టోర్నీలో అమెరికా, జింబాబ్వే, ఇటలీ, నేపాల్ వంటి పసికూన జట్లు పటిష్ట జట్లకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అమెరికా టీమిండియాకు గట్టి పోటీనివ్వగా.. జింబాబ్వే మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. నేపాల్.. రెండుసార్లు చాంపియన్ అయిన ఇంగ్లండ్‌ను వణికించగా.. తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్న ఇటలీ నేపాల్‌ను చిత్తు చేసింది.కాబట్టి నమీబియాతో మ్యాచ్‌లో పాక్ జాగ్రత్తగా ఆడితేనే సజావుగా సూపర్-8కు చేరుతుంది. లేదంటే.. గత ఎడిషన్ మాదిరే ఈసారి లీగ్ దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. కాగా పాక్ తమ తొలి రెండు మ్యాచ్‌లలో నెదర్లాండ్స్, అమెరికాలను ఓడించి నాలుగు పాయింట్లు సంపాదించింది. నెట్‌రన్‌రేటు -0.403.నెట్‌రన్‌రేటు పరంగాకాబట్టి నమీబియాతో మ్యాచ్‌లో నెగ్గితేనే ఆరు పాయింట్లతో పాక్ అమెరికాను దాటి సూపర్-8లో అడుగుపెట్టగలదు. ఒకవేళ నమీబియా చేతిలో ఓడితే గనుక అమెరికాతో సమానంగా నాలుగు పాయింట్లు ఉన్నా నెట్‌రన్‌రేటు పరంగా యూఎస్ మెరుగ్గా ఉంది. కాబట్టి అక్కడా పాకిస్తాన్‌కు ప్రమాదమే పొంచి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి వెస్టిండీస్, టీమిండియా మాత్రమే సూపర్-8 బెర్తులను అధికారికంగా ఖరారు చేసుకున్నాయి.చదవండి: అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు -
అది లీగల్: పాక్ స్పిన్నర్‌కు అశ్విన్ మద్దతు
పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌కు టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. అతడి బౌలింగ్ యాక్షన్‌ను పెద్దగా తప్పుబట్టాల్సిన పనిలేదన్నాడు. క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్ చేయడంలో తప్పులేదని.. అది అతడి సహజ శైలి అని మద్దతుగా నిలిచాడు.పాకిస్తాన్ తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ఉస్మాన్ తారిఖ్ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడే పాక్ జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. మంగళవారం అమెరికాతో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ తారిఖ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఉస్మాన్ ప్రదర్శన కన్నా అతడి బౌలింగ్ యాక్షన్ తీరే నెట్టింట వైరల్‌గా మారింది. సందేహాస్పద రీతిలో అతడు బౌలింగ్ చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఘాటుగా స్పందించాడు.ఇది కొనసాగకూడదు‘‘పెనాల్టీ రన్ అప్ సమయంలో ఫుట్‌బాల్‌లో కూడా ఇలాంటివి అనుమతించరు. అతడి బౌలింగ్ యాక్షన్ ఏవిధంగా సమంజసం? సరే సరిగ్గానే బౌలింగ్ చేశాడనుకుందాం. మరి పాజ్ (కాసేపు ఆగడం) ఎందుకు ఇచ్చినట్లు? అది కూడా బంతిని రిలీజ్ చేసే సమయంలో ఇలా ఎందుకు చేశాడు? ఇది కొనసాగకూడదు’’ అని శ్రీవత్స్.. ఉస్మాన్ బౌలింగ్ చేస్తున్న దృశ్యాన్ని పంచుకున్నాడు. బౌలర్ మీదే ఆంక్షలు ఎందుకు?ఇందుకు అశ్విన్ స్పందిస్తూ.. ‘‘నిజమే.. ఫుట్‌బాల్‌లో కూడా ఇలాంటివి అనుమతించరు. మరి ఓ బ్యాటర్ స్విట్ హిట్ లేదంటే రివర్స్ షాట్ ఆడుతున్నపుడు అంపైర్ లేదంటే బౌలర్‌కు సమాచారం ఇవ్వకుండానే షాట్లు ఆడతారు కదా.అలాంటపుడు బ్యాటర్ మీద లేని ఆంక్షలు బౌలర్ మీదే ఎందుకు? నిజం చెప్పాలంటే బౌలర్ తన చేతివాటాన్ని మార్చే ముందు కచ్చితంగా అంపైర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనను తొలుత మార్చాలి.ఏదేమైనా ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధమా? కాదా? అన్నది ఐసీసీ బౌలింగ్ యాక్షన్ టెస్టింగ్ సెంటర్లో మాత్రమే తేలుతుంది. అక్కడ మాత్రమే అతడిని పరీక్షించే అవకాశం ఉంటుంది.అతడి సహజశైలి కాబట్టి లీగలేనిబంధన ప్రకారం.. మోచేయిని నిటారుగా చేసి బంతిని రిలీజ్ చేయాలి. అయితే, అతడు బంతిని విసురుతున్నాడా? లేదంటే సరిగ్గానే బౌలింగ్ చేస్తున్నాడా అన్నది ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ధారించడం అసాధ్యం.ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మ్యాచ్ జరుగుతున్నపుడు రియల్‌టైమ్ టెస్టింగ్ టూల్‌ను వాడాలి. కానీ ఇక్కడ సరైన ఆధారం లేకుండా ఒకరిని నిందించడం తప్పు. ఏదేమైనా క్రీజులోకి వచ్చాక అలా పాజ్ ఇవ్వడం చట్టబద్ధమో కాదో చెప్పలేము. అయితే, అది అతడి సహజశైలి కాబట్టి లీగలే అని నేను నమ్ముతాను’’ అంటూ అశ్విన్ బదులిచ్చాడు.ఈ నేపథ్యంలో శ్రీవత్స్‌కు మద్దతుగా.. అశ్విన్‌ను వ్యతిరేకిస్తూ టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. ఉస్మాన్ బౌలింగ్ చేయకుండా బంతిని విసురుతున్న తీరు కనిపిస్తుంటే అశూ.. అతడికి మద్దతునివ్వడం ఏమాత్రం బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు.చదవండి: ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్Agree football doesn’t allow it!While the batter can be allowed to switch hit or reverse without informing the umpire or bowler, after him/her commits to start batting on one side, why are the restrictions only limited to the bowler?In fact the bowler isn’t allowed to change… https://t.co/AOV4OKhwcL— Ashwin 🇮🇳 (@ashwinravi99) February 11, 2026 -
PAK vs USA: అమెరికా పేసర్ అరుదైన ఘనత
అంతర్జాతీయ క్రికెట్లో సీనియర్ స్థాయిలో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో పేస్ బౌలర్ ఎహ్సాన్ ఆదిల్ కూడా చేరాడు. 32 ఏళ్ల ఆదిల్ 2013లో అరంగేట్రం చేసి పాకిస్తాన్ తరఫున 3 టెస్టులు, 6 వన్డేలు ఆడాడు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో కూడా అతడు రెండు మ్యాచ్‌లలో బరిలోకి దిగాడు. సొంత దేశంపైనే అరంగేట్రంఅయితే ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లిన అతను అక్కడ తన క్రికెట్‌ను కొనసాగించి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాదు అమెరికా టీ20 వరల్డ్ కప్-2026 జట్టులో చోటు దక్కించుకున్న ఆదిల్‌కు.. పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచే అమెరికా తరపున తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఇలా తన సొంత దేశం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనే అమెరికా తరఫున అతడు అరంగేట్రం చేయడం విశేషం. ప్రతీకారం తీర్చుకున్న పాక్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కొలంబోలో టాస్ గెలిచిన అమెరికా పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.అయితే, లక్ష్య ఛేదనలో యూఎస్ఏ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 158 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా 32 పరుగుల తేడాతో గెలిచిన పాక్.. గత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అమెరికా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆదిల్ 3 ఓవర్లలో 39 పరుగులిచ్చాడు. ప్రపంచకప్ నుంచి హసరంగ, బ్రేస్‌వెల్ అవుట్ తాజా టీ20 ప్రపంచకప్‌లో దాదాపు అన్ని జట్లను గాయాల బెడద వేధిస్తోంది. తాజాగా శ్రీలంక, న్యూజిలాండ్‌లకు చెందిన హసరంగ, మైకేల్ బ్రేస్‌వెల్ మెగా ఈవెంట్‌కు దూరమయ్యారు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో వరల్డ్‌కప్‌లో కొనసాగే అవకాశం లేకపోవడంతో అతని స్థానాన్ని లెగ్ స్పిన్నర్ హేమంతతో భర్తీ చేసుకునేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. బ్రేస్‌వెల్ భారత పర్యటనకు వచ్చినపుడే గాయపడ్డాడు. అయితే వార్మప్ మ్యాచ్ సమయంలో అతని గాయం తిరగబెట్టింది. దీంతో అతని స్థానంలో ఆల్‌రౌండర్ కోల్ మెక్కొంచిని తీసుకున్నారు. చదవండి: T20 WC 2026: సంజూ శాంసన్‌కు జాక్‌పాట్ -
ఈసారి కూడా ఓడిస్తాం: పాకిస్తాన్‌కు అమెరికా వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-‘ఎ’ నుంచి పాకిస్తాన్- అమెరికా జట్లు మంగళవారం ముఖాముఖి తలపడనున్నాయి. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.షెడ్యూల్ ప్రకారం పాక్- అమెరికా మధ్య రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆటగాడు మొహమ్మద్ మొహ్సిన్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ప్రపంచకప్ టోర్నీలో పాక్‌ను తాము ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈసారి కూడా ఓడిస్తాంపాక్తో మ్యాచ్‌కు ముందు మొహమ్మద్ మొహ్సిన్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో గత మ్యాచ్‌లోని సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. ఇక పాకిస్తాన్‌ను ఇప్పటికే ఒకసారి మేము ఓడించాము. కాబట్టి మాకంటే కూడా వారి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే ఈ ప్రపంచకప్ టోర్నీలో మేము పెద్దగా కోల్పోయేదీ ఏమీ ఉండదు. ప్రస్తుతం మా ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాము. టోర్నీని మేము మెరుగ్గానే ఆరంభించాము. పాకిస్తాన్‌పై మరోసారి గెలుస్తామనే అనుకుంటున్నాం.మా జట్టు నైపుణ్యాలు గల ఆటగాళ్లతో కూడి ఉంది. గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా ఉంది. అందుకే పాక్‌ను ఓడిస్తామనే నమ్మకం పెరిగింది. గత వరల్డ్‌కప్‌లో వారిపై గెలిచినందుకే ఈ ఆత్మవిశ్వాసం. గత మ్యాచ్ కంటే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతాము’’ అని మొహ్సిన్ పేర్కొన్నాడు. కాగా మొహ్సిన్ పాక్‌లో పుట్టి పెరిగిన ఆటగాడు కావడం విశేషం.సంచలన విజయం కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ లీగ్ దశలో అమెరికా పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించింది. నాడు డల్లాస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా.. అమెరికా కేవలం మూడు వికెట్లే నష్టపోయి 159 పరుగులు సాధించింది.ఫలితంగా మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్ నిర్వహించగా.. పాక్‌పై అమెరికా గెలుపొందింది. దీంతో అమెరికా తొలిసారి సూపర్-8కు చేరగా.. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న మొదలైన టీ20 వరల్డ్‌కప్-2026లో సల్మాన్ ఆఘా సారథ్యంలోని పాక్ నెదర్లాండ్స్‌ను ఓడించి బోణీ కొట్టగా.. మొనాంక్ పటేల్ కెప్టెన్సీలోని అమెరికా టీమిండియాకు గట్టిపోటీనిచ్చి ఓటమిపాలైంది. చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం -
T20 WC: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్.. తాజాగా భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఓవరాక్షన్ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.భారత్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంటే..ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్.. టీమిండియాతో మ్యాచ్ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్ 8 చేరే అవకాశాలను కూడా పాక్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్ టోర్నీలో పాక్.. భారత్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్.. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.వాన పడే అవకాశంఅయితే, ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్ ఆ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.ఇక లీగ్ దశలో ఆఖరిగా పాక్.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్ ఆడకపోతే పాక్ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.నెట్‌రన్‌రేటుపై ప్రభావంమరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్, నమీబియాలతో మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే నెట్రన్ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్‌లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్ ఓడిపోయి సూపర్-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.తాజా ఎడిషన్‌లోనూ పాక్‌కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్ రద్దు.. రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్ సూపర్-8 చేరడం కష్టమే అనిపిస్తోంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు


