Pakistan vs Netherlands
-
జస్ట్ మిస్.. పల్లీలు అమ్ముకుంటారా?: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్ల తీరుపై మాజీ క్రికెటర్ బసిత్ అలీ మండిపడ్డాడు. జట్టుకు ఉపయోగపడని అనుభవం ఉండి ఏం లాభమని ప్రశ్నించాడు. పసికూన చేతిలో తృటిలో పరాభవం తప్పిందని.. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా భారత్- శ్రీలంక వేదికగా శనివారం టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొదలైన విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో కొలంబో వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్ తలపడ్డాయి. అయితే, మాజీ చాంపియన్ పాకిస్తాన్ గెలుపు బోణీ కొట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మూడు బంతులు ఉండగా నెదర్లాండ్స్ విధించిన సాధారణ 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోవడంతోపాటు ఆఖరి ఓవర్లో మూడు బంతులు ఉండగా నెగ్గి ఊపిరి పీల్చుకుంది.తొలుత నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. బాస్ డీ లీడ్ (30; 4 ఫోర్లు), మిచెల్ లెవిట్ (24; 3 ఫోర్లు, 1 సిక్స్), అకెర్మన్ (20; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3 వికెట్లు పడగొట్టగా... సయీమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, నవాజ్ తలా రెండు వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (31 బంతుల్లో 47;4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. 18 ఓవర్లు ముగిసేసరికి పాక్ జట్టు 119/7తో ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా (12), బాబర్ ఆజమ్ (15), ఉస్మాన్ ఖాన్ (0), షాదాబ్ ఖాన్ (8), నవాజ్ (6) విఫలమయ్యారు.ఫహీమ్ ఆష్రఫ్ రాణించడంతోవిజయానికి చివరి 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫహీమ్ ఆష్రఫ్ (11 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ షాట్లతో విజృంభించాడు. ఇన్నింగ్స్ 19 ఓవర్లో అతడు 6, 2, 6, 6, 4తో 24 పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వ్యాన్ మీకెరెన్ చెరో 2 వికెట్లు తీశారు. నిజానికి ఆఖరి ఓవర్లో ఆష్రఫ్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడౌడ్ వదిలేయడంతో అతడికి లైఫ్ రాగా.. పాక్ గట్టెక్కింది. ఈ నేపథ్యంలో బసిత్ అలీ (Basit Ali) పాక్ ప్రదర్శనపై.. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజం (Babar Azam), నవాజ్, షాదాబ్ ఖాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.పాకిస్తాన్ బతికిపోయింది"పాకిస్తాన్ బతికిపోయింది. చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది. షాహిన్ ఆఫ్రిది బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడే అంతా అయిపోయిందనుకున్నాం. మిడిలార్డర్ చెత్తగా ఆడింది. ముఖ్యంగా బాబర్ ఆజం, నవాజ్, షాదాబ్ ఖాన్ అసలేం చేశారో వారికైనా తెలుసా?వీళ్లంతా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌లు ఆడుతున్నారు. కానీ ఈరోజు పాకిస్తాన్ తరఫున ఒక్కరూ హీరోగా నిలవలేకపోయారు. అందరూ జీరోలుగా మిగిలిపోయారు. బాబర్ ఆజం బ్యాటింగ్‌కు రాగానే అంతా సంతోషించారు. అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడని భావించారు.పల్లీలు అమ్ముకోవడానికి వెళ్లారా?కానీ ఇలా వచ్చి అలా వెళ్లడం అతడికి అలవాటైపోయింది. ఫహీమ్ ఆష్రఫ్ లేకుంటే ఈరోజు పాక్ పరువు పోయి ఉండేది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్టార్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా పల్లీలు అమ్ముకోవడానికి అక్కడికి వెళ్లారా?’’ అంటూ బసిత్ అలీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్! -
T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు శనివారం తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్- నెదర్లాండ్స్ తలపడ్డాయి. గ్రూప్-ఎ నుంచి ఇరుజట్ల మధ్య పోటీ జరుగగా.. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.147 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో మైకేల్ లెవిట్ (24) ఫర్వాలేదనిపించగా.. బాస్డీ లీడే (30), కొలిన్ అకెర్మాన్ (20), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37) రాణించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సయీబ్ ఆయుబ్ రెండేసి వికెట్లు కూల్చారు. మిగిలిన వారిలో షాహిన్ ఆఫ్రిది ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఓపెనర్ల శుభారంభంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (31 బంతుల్లో 47), సయీబ్ ఆయుబ్ (13 బంతుల్లో 24) శుభారంభం అందించారు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సల్మాన్ ఆఘా (12)తో పాటు బాబర్ ఆజం (15) తడబడగా.. ఉస్మాన్ ఖాన్ (0) డకౌట్ అయ్యాడు.The pressure is back on Pakistan! 😮💨Babar Azam is caught as half of the side is back into the hut!Will Netherlands pull off an upset here? 🤔ICC Men's #T20WorldCup | #PAKvNED | LIVE NOW 👉 https://t.co/GKcXaJHm9F pic.twitter.com/PK1NOGXYju— Star Sports (@StarSportsIndia) February 7, 2026మారిన సీన్.. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠషాబాద్ ఖాన్ (8), నవాజ్ (6) చేతులెత్తేయగా.. ఆఖర్లో ఫాహీమ్ అష్రఫ్ (11 బంతుల్లో 29 నాటౌట్) ధనాధన్ దంచికొట్టాడు. అతడి తోడు షాహిన్ ఆఫ్రిది (5) అజేయంగా నిలిచాడు. అయితే, ఆఖరి ఓవర్లో మూడో బంతికి ఆష్రఫ్ కష్టమ్మీద ఫోర్ బాదగా పాక్ గెలుపు ఖరారైంది. 19.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన పాక్.. మూడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచి ఊపిరి పీల్చుకుంది.కాగా నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్.. ఆయుబ్, ఆఘా రూపంలో రెండు కీలక వికెట్లు తీయగా.. పాల్ వాన్ మీకెరెన్ సాహిబ్జాదా, ఉస్మాన్ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. మిగిలిన వారిలో లోగాన్ వాన్ బీక్, కైలీ క్లెయిన్, వాన్ డెర్ మెర్వె తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ విజయంతో పాక్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.చదవండి: వైభవ్ సూర్యవంశీ అరెస్ట్‌కు డిమాండ్!.. మరీ ఆ షాట్లు అలా ఆడితే ఎలా? -
'పాక్‌కు చుక్కలు చూపిస్తాం'.. పసికూన బౌలర్ వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో కొలంబో వేదికగా పాకిస్తాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ జట్టుకు నెదర్లాండ్స్ సీనియర్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వాన్ మీకెరెన్ తాజాగా క్రిక్స్ అనే స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వాన్ మీకెరెన్‌కు పాక్‌తో మ్యాచ్ కోసం ఏమైనా ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నారా? అన్న ప్రశ్న ఎదురైంది."పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను మేము ప్రత్యేకంగా చూడడం లేదు. ఇది కూడా మిగిలిన మ్యాచ్‌ల్లాగే. మా గ్రూపులో భారత్ వంటి బలమైన జట్టుతో పాటు అమెరికా, నమీబియా వంటి టీమ్స్ కూడా ఉన్నాయి. మా దృష్టి కేవలం పాక్ మ్యాచ్‌పైనే లేదు. టోర్నీ తొలి మ్యాచ్‌లో పాక్ ఓడించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. 2009 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మేము సంచలన విజయం సాధించాము. ఇప్పుడే అదే ఫలితాన్ని పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉన్నాము" అని వాన్ మీకెరెన్ పేర్కొన్నాడు.అదేవిధంగా పాక్ పేస్ బౌలింగ్ చూసి భయపడుతున్నారా? అన్న ప్రశ్నకు వాన్ మీకెరెన్ బదులిస్తూ: ఒకప్పుడు పాక్ బౌలర్లను చూసి భయపడేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాక్ జట్టుతో మ్యాచ్‌లు ఆడాము. పాక్ బలాలు, బలహీనతలపై మాకు ఒక అవగహన ఉందని చెప్పుకొచ్చాడు.కాగా డచ్ జట్టుతో మ్యాచ్‌కు పాక్‌కు చాలా కీలకం. భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్‌తో మ్యాచ్ పాయింట్లు కోల్పోనుండటంతో.. పాక్ తదుపరి రౌండ్‌కు వెళ్లాలంటే నెదర్లాండ్స్, అమెరికా, నమీబియాలతో జరిగే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిందే. -
T20 WC: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్.. తాజాగా భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఓవరాక్షన్ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.భారత్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంటే..ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్.. టీమిండియాతో మ్యాచ్ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్ 8 చేరే అవకాశాలను కూడా పాక్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్ టోర్నీలో పాక్.. భారత్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్.. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.వాన పడే అవకాశంఅయితే, ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్ ఆ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.ఇక లీగ్ దశలో ఆఖరిగా పాక్.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్ ఆడకపోతే పాక్ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.నెట్‌రన్‌రేటుపై ప్రభావంమరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్, నమీబియాలతో మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే నెట్రన్ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్‌లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్ ఓడిపోయి సూపర్-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.తాజా ఎడిషన్‌లోనూ పాక్‌కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్ రద్దు.. రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్ సూపర్-8 చేరడం కష్టమే అనిపిస్తోంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు


