breaking news
loty charge
-
శివభక్తులపై లాఠీచార్జ్ బాధాకరం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివ స్వాములపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొన్న పరిస్థితులను తెలుపుతూ ట్వీట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది.జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు.దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు.దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది2025లో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారిశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారుశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయిజాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందిభక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026 -
లాఠీతో సాధికారతా?
ఘనత వహించిన ఏలినవారూ! తెలుగు నేలపై నిరంతరం శ్రమిస్తున్న వారికంటే అందమైన ప్రజలెక్కడ ఉంటారు? తమర్ని కన్నతల్లికంటే బ్యూటీ క్వీన్ ఎవరు? ఈ దుర్మార్గాల్ని ఆపడానికి లాఠీ దెబ్బలు తిన్న వారికంటే సౌందర్యవంతులుంటారా? మళ్లీ ఒక్కసారి బాబుగారి లాఠీ స్త్రీల రక్తం చవిచూసింది. వాళ్లు అంగన్వాడీ ఆశా వర్కర్ల మాదిరిగా జీతం పెంచమని అడిగితే కదా గుర్రాలతో తొక్కించేంత కోపం రావడానికి! ప్రభువు ప్రపంచబ్యాంకు కినుక వహించకుండా ఉండటానికి విద్యుత్ చార్జీల గురించి ఉద్యమకారుల గుండెల్లో తూటాలు నాటేంత వీరావేశం తెచ్చుకునే సందర్భం అయినా లేదు కదా! అభివృద్ధి పేరిట గుంజుకుంటున్న భూముల గురించి కడుపుకాలిన రైతన్నలపై వీరంగాలు చేస్తున్నటువంటి సమయం కూడా కాదు. వాళ్లేమడిగారు? స్త్రీల శరీరాల్ని అమ్మకపు సరుకుగా అంగట్లో పెట్టడం ఆపమని కోరారు. వ్యాపారస్తుల ప్రయోజనం కోసం అందాల పోటీలు పెడుతుంటే ఆడపడచుల కన్నీరు తుడిచే పాలకులారా.. ఈ అఘాయిత్యం ఆపమని కోరారు. నిరసన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. మరెందుకు మహిళా నాయకుల చీరలు చించేసి, రక్తాలు కారేట్టు కొట్టి ఈడ్చి పడేశారు? ఏపీ విద్యాశాఖామాత్యులు ఫ్యూడల్ ప్రభువుల మాదిరిగా ఈ అందాల పోటీలు తిలకిస్తారట.. దీన్ని నిలదీశారనేనా మహిళా సంఘాలపై ఇంత ఆగ్రహం? స్త్రీల శరీరాల్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారాభివృద్ధి చేయాలనే మంత్రిగారి వ్యూహం వారి కార్పొరేట్ విధానాలకు సరిగ్గా సరిపోతుంది. స్త్రీల శరీరాలు ఎగుమతుల్లో కూడా చేర్చదలిచారా? అయితే ట్రాఫికింగ్ మాఫియాను చట్టబద్దం చేసేస్తే సరిపోతుందిగా! మహిళా సంఘాలు అందాలపోటీలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? నేటి మహిళలు అన్నిరంగాల్లో సామర్థ్యం చూపుతూ దూసుకుపోతున్నారు. కానీ తమ శరీరం విషయంలో అమ్మమ్మలకున్నపాటి విశ్వాసం నేటివారికి లేకుండా పోయింది. గత 30 ఏళ్లుగా జరుగుతున్న అధ్యయనాలు వెల్లడిస్తున్న వాస్తవాలు కలవరపెడుతున్నాయి. సామర్థ్యం, తెలివి, చురుకుదనం, ఆకర్షణ, చదువు, ఉద్యోగం గల స్త్రీలు స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదించకుండా అడ్డుపడుతున్నది అందానికి సంబంధించిన ఈ భావజాలమే. స్వంత శరీరాకృతిపై అసంతృప్తి, దానిపై అనారోగ్యకరమైన ఆసక్తి. వయస్సు పైబడుతున్నదనే ఆందోళన. అందం లేకపోతే ఆదరణ కోల్పోతామనే భయం వంటివి స్త్రీల సుప్తచేతనలో ఉగ్రవాదపు మందుపాతరల్లా నాటుకున్నాయనేది ఈ పరిశోధనల సారాంశం. రెండో ప్రపంచ యుద్ధానంతరం పెల్లుబుకుతున్న మహిళా చైతన్యానికి అడ్డుకట్ట వేసి సాధికారత స్థానంలో శారీరకతను ప్రవేశపెట్టి వారి లైంగికతను నియంత్రించేవే అందాలపోటీలు. స్త్రీలను అణిచిపెట్టడానికి పాతివ్రత్యం, మతం, కులగౌరవం, చివరికి మాతృత్వం కూడా ఇక పని చేయట్లేదని తేలాక శరీరాలనే కొలతలుగా కుదించుకున్న కొద్దిమంది అందాల రాణుల కొలబద్దలతో ప్రచారం హోరెత్తించి మిగిలిన స్త్రీల శరీరాలన్నీ అందవిహీనంగా లోపాలు గలవిగా ముద్రలేసి పారేశారు. అందానికి నిర్వచనం లేదనీ, అది చూసేవారి చూపును బట్టి ఉంటుందనీ, అందానికి ఒక్కోప్రాంతం ఒక్కో నిర్వచనం చెబుతుంటుం దనీ, కోట్లరకాల మానవ శరీరాకృతుల నిర్మితిని ఒక మూసలో చేరిస్తే భూమిపై ‘అందం’ అంతరిస్తుందని ఎంత చెప్పినా ఉపయోగం ఉండటం లేదు. ఇది స్త్రీలను అవయవాలుగా కుదించివేస్తున్నదనీ, స్త్రీల విముక్తిని పక్కదారి పట్టిస్తుందనీ, ఇది ఒక రాజకీయ అణచివేతకు అస్త్రమనీ చేస్తున్న వాదనలకు ఎవరూ ప్రాధాన్యతనివ్వటం లేదు. దానికి బదులుగా స్త్రీత్వం, సౌందర్యం, తెలివి, ఆరోగ్యానికి నీరాజనం అందాలపోటీలు అనే ప్రచారం హోరెత్తిపోతోంది. వాస్తవానికి ఇవే ఆ స్త్రీలను మిగిలిన వారినుంచి దూరం చేసి, ఒంటరిని చేసి తొక్కిపెడతాయి. ఏడాదికి ప్రపంచంలో 274 బిలియన్ డాలర్లు, భారత్‌లో 4.6 బిలి యన్ డాలర్ల విలువైన కాస్మొటిక్స్ పరిశ్రమకు, 20 బిలియన్ డాలర్ల కాస్మొటిక్ సర్జరీకి, 174.94 బిలియన్ డాలర్ల బరువుతగ్గే పరిశ్రమకు, 97 బిలియన్ డాలర్ల డయిట్ (ఆహార నియంత్రణ) పరిశ్రమకూ ఈ అందాల శరీరాలే సేంద్రియ ఎరువులు. సగానికి సగంమంది అమ్మాయిలు కిశోర ప్రాయం ముందే డైటింగ్ ప్రారంభించడం, కడుపులు మాడ్చుకుని ముప్పాతిక శాతంమంది అమ్మాయిలు రక్తహీనతతో ఉండటం, పిల్లల్ని కన్నాక లావుగా ఉన్నామనో, పొత్తికడుపు ఎత్తుగా ఉందనో, భర్త వదిలేస్తాడనో నిరంతరం భయంతో బతకాల్సిన ఇల్లాళ్లు, చదువు.. కనీస అవసరాలపై వెచ్చించాల్సిన సొమ్మును సౌందర్యం కొనటానికి ఖర్చుచేస్తున్న కుటుంబాలు–తమ ముఖ కవళికలు, ఎత్తు, లావు, ఆకృతి గురించి అనేక అనుమానాలతో కుంగిపోతున్న కోట్లాది స్త్రీల కలతపైనేనా వ్యాపారం నడవాల్సింది? ధనం, అధికారం, హింస, కండలు ‘మగ’తనంగా, అందం, భయం, ఆధారపడటం స్త్రీత్వంగా రుద్దుతున్న ఈ మూసతనాలు మానవ సంబంధాల్ని ఛిద్రం చేస్తుంటే వ్యాపారాభివృద్ధి అని ప్రోత్సహించాలా? ఇదొక సామర్థ్య నిరూపణ అనుకుని తమ శరీరాల్ని మరుగుజ్జు వృక్షాల వేళ్లు కత్తిరించినట్టు ఫిట్నెస్ పేరిట ట్రిమ్మింగ్ చేసుకుంటూ, బిగుసుకుని కూర్చోవడం, కీ ఇచ్చిన బొమ్మల్లా కదలడం, ప్లాస్టిక్ నవ్వులు, మూస జవాబుల ట్రైనింగ్‌తో కొత్తగా ఆత్మ విశ్వాసం పొందే వెర్రి అమ్మాయిల వ్యక్తిగత ఎంపికగా దీన్ని వదిలేయాలా? జూదం వ్యక్తిగత స్వేచ్ఛ కాదు కనుకనే బాబుగారి 24 గంటల కేసినోల ప్రతిపాదన ఎదురు తన్నింది. తాగడం వ్యక్తిగత ఇష్టం అంటూ బాబుగారు మాల్స్‌కు సరఫరా చేస్తుంటే మహిళలంతా ప్రభుత్వంపై విరుచుకుపడే పనిలో ఉన్నారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే పోటీలు మహిళలకు హాని అంటే అంత ఉలుకెందుకు? ఈ వ్యాపారం బినామీయా లేక వ్యాపారస్తులంతా అసమదీయులా! ఎన్నికలు రాబోతున్నాయి ఓట్లేసేది ఈ మహిళలే అని గుర్తుకు రావడం లేదా? లేక సదరు వ్యాపారస్తులందించిన ఫండ్స్‌తో చీరలు, బిందెలు పంచితే ఇది వాళ్లు మరిచిపోతారనుకుంటున్నారా? రక్తం మరకలు అంత తొందరగా మాసిపోవని 2004 అనుభవపాఠం నేర్పలేదా? ఘనత వహించిన ఏలినవారూ! తెలుగు నేలపై నిరంతరం శ్రమిస్తున్న వారికంటే అందమైన ప్రజలెక్కడ ఉంటారు? తమర్ని కన్నతల్లికంటే బ్యూటీ క్వీన్ ఎవరు? ఈ దుర్మార్గాల్ని ఆపడానికి లాఠీ దెబ్బలు తిన్న వారికంటే సౌందర్యవంతులుంటారా? స్త్రీల జీవితాలూ, శరీరాలూ మీ వ్యాపారాలకు వేదికలు కావు. మీ కార్పొరేటు అభివృద్ధికి ఉత్ప్రేరకాలూ కానే కావు. కనీసపక్షం ఈ నేలపై మహిళా ఉద్యమం ఉనికిలో ఉన్నంతకాలం అది సాధ్యం కాదు. ఈ ఉద్యమాల ఉనికి లేకుండా చేయటం మీవల్ల కాదు. ప్రజల నైతిక న్యాయస్థానంలో, స్త్రీల శరీరాలపై తమరు ముద్రించిన గాయాల మచ్చలే చెరగని సాక్ష్యంగా నిలబడతాయి. వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త దేవి వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త ఈ–మెయిల్: pa-devi@rediffmail.com -
ఏబీవీపీ ఆందోళన: పోలీసుల లాఠీచార్జి
నెల్లూరు: ఏబీవీపీ విద్యార్థుల ఆందోళనతో జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీచార్జి చేశారు. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.


