breaking news
los angeles olympics 2028
-
‘ఇక స్వర్ణంపై గురి’
లక్నో: గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకం తన జీవితాన్ని సమూలంగా మార్చివేసిందని భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ అన్నాడు. అదే సమయంలో నిలకడగా రాణించాలనే బాధ్యతను పెంచిందని వెల్లడించాడు. ఒకప్పుడు ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అమన్... ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన అనంతరం డబ్బుకు కొదవ లేకుండా పోయిందని అన్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో విజయం సాధించిన అనంతరం అమన్ తన సాధన తీరును వివరించాడు. విశ్వక్రీడల్లో కాంస్య పతకం గెలిచిన విషయాన్ని మరిచి ప్రపంచ చాంపియన్‌షిప్, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పారిస్ పతకంతో అమన్ జీవితంలో వచ్చిన మార్పుల వివరాలు అతడి మాటల్లోనే... విదేశీ టోర్నీల్లో పాల్గొంటా... ఒలింపిక్స్ తర్వాత విదేశాల్లో శిక్షణ పొందాలని అనుకున్నా... కానీ మనం కోరుకున్నవన్నీ జరగవు కదా. అదే సమయంలో గాయం కావడంతో ఇక ఆ ప్రయత్నాలు విరమించుకున్నా. పారిస్ ఒలింపిక్స్ పతకం నా భుజాలపై అదనపు భారాన్ని మోపింది. ఒకవేళ నేను పరాజయం పాలైతే... పారిస్ పతకంతో వచ్చిన కీర్తి నన్ను చెడగొట్టిందనే విమర్శలు వస్తాయనే ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇటీవల పాల్గొన్న రెండు టోర్నీలో ఒక దాంట్లో పతకం సాధించా మరో దాంట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయా. దాదాపు ఏడాది తర్వాత బరిలోకి దిగడం కూడా అందుకు ఒక కారణం. అయినా నా కోచ్‌లు నమ్మకాన్ని కోల్పోవద్దని సూచించారు. మరింత కఠోర సాధన చేస్తున్నా. విదేశీ రెజ్లర్లను పడగొట్టడం అంత తేలికైన పనేం కాదు. ఆ అంశంపై దృష్టి సారించా. వచ్చే నెలలో క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు సన్నద్ధమవుతున్నా. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నా. అయితే బలమైన ప్రత్యర్థులతో తలపడాలంటే... విదేశాలకు వెళ్లక తప్పదు. రష్యా, అమెరికాలో జరిగే టోర్నమెంట్లలో పాల్గొని మరింత రాటుదేలాలని భావిస్తున్నా. శ్రమకు దక్కిన ఫలితమిది విశ్వక్రీడల్లో పతకం సాధించిన తర్వాత నా జీవితం 90 శాతం మారిపోయింది. అంతకుముందు నన్ను ఎవరూ గుర్తించేవారు కాదు. కనీసం మా పక్క వీధిలో వారికి కూడా నేనెవరో తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పారిస్ ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ నన్ను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అవన్నీ చూస్తుంటే... నేను దేశం కోసం ఏదో సాధించాననే సంతృప్తి కలుగుతోంది. అయితే అది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. ఏళ్ల తరబడి పడ్డ కష్టానికి దక్కిన ఫలితమది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు పతకం సాధిస్తానని అసలు ఊహించలేదు. ఆ సమయంలో భారత మహిళా రెజ్లర్లపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. భగవంతుడి దయతో నేను పతకం సాధించగలిగా. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు నాపై అంచనాలు ఎక్కువయ్యాయి. ఎలాంటి ఒత్తిడి లేని సమయంలో కాంస్యం గెలిచిన నేను... ఇప్పుడు స్వర్ణం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. పారిస్‌లో సాధించిన కాంస్య పతకాన్ని నా మనసులో నుంచి తీసేసి తిరిగి కఠోర సాధనపై దృష్టి పెట్టాను. కష్టనష్టాలకు ఓర్చి... ఒకప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎవరూ లేరు అనుకున్న సమయంలో బంధువుల అండతో సాధన కొనసాగించా. సోదరి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని... ఒక అన్నగా తన బాగోగులు ఎలా చూసుకోవాలని మదన పడుతుండే వాడిని. ఇప్పుడా చింత లేదు. ఆమె బంగారు భవిష్యత్తుకు కావాల్సినంత సాధించా. ఇప్పుడిక ప్రశాంతంగా ప్రాక్టీస్‌పై దృష్టి సారించొచ్చు. అయితే విజయాన్ని తలకెక్కించుకొని గతాన్ని మర్చిపోయే వ్యక్తిని కాదు నేను. అప్పటికి ఇప్పటికీ నాలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. కాకపోతే నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా. ఎందుకంటే ఒలింపిక్ పతక విజేతగా ఇప్పుడు అందరి దృష్టి నాపై ఉంటుంది కాబట్టి జాగరుకత అవసరం. ఒలింపిక్స్ అనంతరం చాన్నాళ్ల వరకు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దానికి గాయంతో పాటు అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా. -
2028 ఒలింపిక్స్.. పాక్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునఃప్రవేశించనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌తో జెంటిల్మెన్ గేమ్ విశ్వక్రీడల్లోకి పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చివరి మరియు ఏకైక ప్రాతినిథ్యం 1900 పారిస్ ఒలింపిక్స్‌లో దక్కింది. నాడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. అప్పుడు ఇరు జట్ల మధ్య ఓ అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరగగా.. అందులో గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్‌ను కేవలం రెండు రోజుల్లోనే ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.కాగా, రాబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లపై ఐసీసీ తాజాగా ఓ కంక్లూజన్‌కు వచ్చినట్లు తెలుస్తుంది. రీజియన్ల వారీగా టాప్ ర్యాంక్ జట్లను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ లెక్కన ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆతిథ్య దేశంగా అమెరికా క్వాలిఫై అయ్యే అవకాశముంది. ఆరో జట్టు ఎంపికపై క్లారిటీ లేదు. ఇదే జరిగితే పాకిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల ఒలింపిక్స్ కల కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు 2028 జులై 12 (ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందు) నుంచి 29 వరకు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు లాస్ ఏంజెలెస్‌కు 50 కిమీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్‌ప్లెక్స్‌లో ప్రత్యేకంగా నిర్మించబడే 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి.రాబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు విశ్వవేదికపై పోటీ పడతాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ జరుగుతుంది. మెడల్స్ మ్యాచ్‌లు (సెమీఫైనల్స్ మరియు బ్రాంజ్, గోల్డ్ మెడల్స్ మ్యాచ్‌లు) జులై 20 (మహిళలు), 29 (పురుషులు) తేదీల్లో జరుగుతాయి.జులై 14, 21 తేదీల్లో ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు లేవు.మ్యాచ్ జరిగిన ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి. -
ICC: ర్యాంకింగ్‌తో ఖరారు చేస్తారా?.. క్వాలిఫయింగ్ టోర్నీ ఉంటుందా?
లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్ (LA28 Olympics)లో క్రికెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, నిబంధనలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉన్నతస్థాయి సమావేశం శుక్రవారం సింగపూర్‌లో జరిగింది. విశ్వక్రీడల్లో క్రికెట్ కోసం ఐసీసీ వర్కింగ్ గ్రూప్ (ICC Working Group)ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. ఈ గ్రూప్ సిఫార్సులతోనే ఒలింపిక్స్‌లో క్రికెట్ క్రీడ నియమావళిని ఖరారు చేయాలని ఐసీసీ భావిస్తోంది. శుక్రవారం జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ (సీఈసీ) సమావేశంలో ప్రధానంగా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుపైనే చర్చ జరిగింది. ఒలింపిక్స్ కోసం ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పటికీ చాన్నాళ్లుగా ఇది పెండింగ్‌లో పడింది. ఇక ఇప్పుడు వేగవంతం చేయాల్సిన అవసరం వచ్చిందని పలువురు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఈసీ, క్రికెట్ బోర్డులు... ఈ రెండింటి నుంచి సభ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్ బృందానికి పలు బాధ్యతలు అప్పగిస్తారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత పద్ధతిని ఖరారు చేయడం, ఐసీసీ వర్గాలు, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వర్కింగ్ గ్రూప్ పని చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. విశ్వక్రీడల కోసం ర్యాంకింగ్‌తో జట్లను ఖరారు చేయాలా లేదంటే క్వాలిఫయింగ్ టోర్నీని నిర్వహించడం ద్వారా జట్లను ఒలింపిక్స్‌కు పంపించాలా అన్న అంశాన్ని వర్కింగ్ గ్రూప్‌కే వదిలేయాలని ఐసీసీ చైర్మన్ జై షా సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడే ఆటగాళ్ల కనీస వయస్సును 15 ఏళ్లుగా ఉంటేనే మంచిదని ఐసీసీ కమిటీ ఇదివరకే సిఫార్సు చేసింది. ఐసీసీ నూతన సీఈఓ సంజోగ్ గుప్తాకూడా 15 ఏళ్ల వయసు ప్రామాణికమేనని బలపరిచారు. ఐసీసీ ఉన్నతస్థాయి సమావేశంలో జై షా, సంజోగ్ సహా పలువురు ఐసీసీ బోర్డు కమిటీల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్.. షెడ్యూల్ విడుదల
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునఃప్రవేశించనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌తో క్రికెట్ విశ్వక్రీడల్లోకి పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జులై 14న ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ను మూడేళ్లు ముందే ప్రకటించడం విశేషం.ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు 2028 జులై 12 (ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందు) నుంచి 29 వరకు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు లాస్ ఏంజెలెస్‌కు 50 కిమీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్‌ప్లెక్స్‌లో ప్రత్యేకంగా నిర్మించబడే 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి.రాబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు విశ్వవేదికపై పోటీ పడతాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ జరుగుతుంది. మెడల్స్ మ్యాచ్‌లు (సెమీఫైనల్స్ మరియు బ్రాంజ్, గోల్డ్ మెడల్స్ మ్యాచ్‌లు) జులై 20 (మహిళలు), 29 (పురుషులు) తేదీల్లో జరుగుతాయి.జులై 14, 21 తేదీల్లో ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు లేవు.మ్యాచ్ జరిగిన ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి.ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చివరి మరియు ఏకైక ప్రాతినిథ్యం 1900 పారిస్ ఒలింపిక్స్‌లో దక్కింది. నాడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. అప్పుడు ఇరు జట్ల మధ్య ఓ అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరగగా.. అందులో గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్‌ను కేవలం రెండు రోజుల్లోనే ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.కాగా, 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్సస్), స్క్వాష్ జోడించబడ్డాయి. -
ఎయిర్ ట్యాక్సీల్లో వేదికలకు రవాణా.. ఇలా ఇదే తొలిసారి
లాస్ ఏంజెలిస్: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటి వరకు ఆటగాళ్లు, ప్రేక్షకులు, వీఐపీలు కార్లు, బస్సుల్లోనే వేదికలకు చేరేవారు. కానీ లాస్ ఏంజెలిస్‌లో 2028లో జరిగే విశ్వక్రీడలు ‘విహంగ విహారానికి’ సిద్ధమవుతున్నాయి. మరో మూడేళ్లలో అమెరికాలోని ప్రఖ్యాత నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో ‘ఎయిర్ ట్యాక్సీ’లను వినియోగిస్తామని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.ఆటగాళ్లు, వీఐపీలే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం విహంగ విహారం చేస్తూ ఆయా వేదికలకు చేరుకుంటారు. విశ్వక్రీడల్లో ఈ తరహా ఎయిర్ ట్యాక్సీలు నిర్వహించనుండటం చరిత్రలోనే తొలిసారి కానుంది. తద్వారా ఎవరికీ ప్రయాణ బడలిక లేకుండా కేవలం పది నుంచి 20 నిమిషాల్లోపే వేదికలకు చేరవేయవచ్చని నిర్వాహకులు ప్రణాళికలతో ఉన్నారు. సోఫీ స్టేడియం, లాస్ ఏంజెలిస్ మెమోరియల్ కొలిజియం, శాంటా మోనికా, ఆరెంజ్ కౌంటీ, హాలీవుడ్ వేదికలకు ఎయిర్ ట్యాక్సీలను వినియోగించే ఆలోచనతో ఉన్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ ఆడమ్ గోల్డ్‌స్టెయిన్ తెలిపారు. అమెరికా భవిష్య ప్రయాణ ముఖచిత్రాన్నే లాస్ ఏంజెలిస్ విశ్వక్రీడలు మార్చబోతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఫైనల్లో అల్కరాజ్రోమ్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ తన కెరీర్లో 25వ టోరీ్నలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అల్కరాజ్ 6–3, 7–6 (7/4)తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఒక ఏస్ సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఏడాది నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన అల్కరాజ్ రెండు టోర్నీల్లో (మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్; రోటర్‌డామ్ ఓపెన్) విజేతగా నిలిచి, బార్సిలోనా ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. యానిక్ సినెర్ (ఇటలీ), టామీ పాల్ (అమెరికా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. -
పొమోనాలో 2028 ఒలింపిక్స్ క్రికెట్ పోటీలు
దుబాయ్: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీల వేదిక ఖరారైంది. 128 సంవత్సరాల విరామం అనంతరం విశ్వక్రీడల్లో క్రికెట్ పునరాగమనం చేస్తుండగా... ఈ పోటీలను దక్షిణ కాలిఫోర్నియాలోని పొమోనా నగరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు జై షా వివరాలు వెల్లడించారు. టి20 ఫార్మాట్లో పురుషుల విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ భారత్... మహిళల విభాగంలో ప్రస్తుత చాంపియన్ న్యూజిలాండ్ జట్లతో కూడిన పోస్టర్‌ను ఐసీసీ తమ సామాజిక మాధ్యమాల్లో జత చేసింది.1900 పారిస్ ఒలింపిక్స్‌లో చివరిసారిగా క్రికెట్ పోటీలు నిర్వహించగా... ఈసారి లాస్ ఏంజెలిస్ వేదికగా జరగనున్న విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో టి20 ఫార్మాట్లో టోర్నీ నిర్వహించనున్నారు. రెండు విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొంటాయి. ఒలింపిక్స్ ప్రధాన వేదిక లాస్ ఏంజెలిస్‌కు పొమోనా 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘పొమోనాలో జరగనున్న పోటీలతో ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేయనుంది. విశ్వక్రీడల్లో క్రికెట్‌ను భాగం చేయడంతో ఆటకు మరింత ఆదరణ దక్కనుంది. టి20 ఫార్మాట్ ద్వారా ఇది విశ్వవ్యాప్తమై మరింత మంది అభిమానుల ఆదరణ దక్కించుకుంటుంది’ అని జై షా పేర్కొన్నాడు. 2023లో ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 141వ సమావేశంలో... విశ్వక్రీడల్లో క్రికెట్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 2010, 2014, 2023 ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల టి20 క్రికెట్ పోటీలు నిర్వహించగా... 2022 బరి్మంగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. -
ఒత్తిడి లేకుండా ఆడటమే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత రైఫిల్ షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ‘కోటా’ను అందించిన షూటర్లలో అతనూ ఒకడు. అయితే దురదృష్టవశాత్తూ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ట్రయల్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో సందీప్ సింగ్ చేతిలో ఓడి పారిస్ ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. ఇది అతనిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపించింది. దాని నుంచి కోలుకోవడానికి అతనికి కొంత సమయం పట్టింది.‘ఆ సమయంలో నేను చాలా బాధపడిన మాట వాస్తవం. కొద్దిరోజుల పాటు అదే వేదనలో ఉండిపోయాను. నాకంటే ఎక్కువగా నా ఆటను దగ్గరి నుంచి చూసిన సహాయక సిబ్బంది, తల్లిదండ్రులు బాధపడ్డారు. అయితే కొద్ది రోజుల తర్వాత నేను సాధారణ స్థితికి వచ్చాను. ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ ద్వారా మాత్రమే భారత జట్టును ఎంపిక చేస్తారనేది వాస్తవమని అర్థమైంది. సెలక్టర్లను ఒప్పించేందుకు నా ప్రయత్నం నేను చేశాను కానీ నిబంధనలు ఉన్నాయి. ఏం చేస్తాం’ అని రుద్రాంక్ష్ వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత అతను మళ్లీ తన ఆటపై దృష్టి పెట్టాడు.బ్యూనస్ ఎయిర్స్లో గురువారం ముగిసిన సీజన్ తొలి వరల్డ్ కప్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకంతోపాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆర్య బోర్సేతో కలిసి రజతం గెలుచుకున్నాడు. మానసికంగా దృఢంగా మారేందుకు సైకాలజిస్ట్‌ల సహాయం కూడా తీసుకుంటున్నాడు. ‘టోర్నమెంట్లు జరిగే సమయంలో ఎలాంటి ఒత్తిడి దరి చేరనీయకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను.అలాంటి స్థితిలో నిలకడగా రాణిస్తూ నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నా. ప్రతీ రెండు నెలలకు ఒకసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. 0.1 పాయింట్ తేడాతో వెనుకబడిపోవచ్చు. ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి సాంకేతికంగానే కాకుండా మానసికంగా కూడా మెరుగ్గా ఉండటంపై దృష్టి పెట్టాలి. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్ ముందున్నాయి. నాపై నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఎంచుకున్న దారిలో నిలకడ కొనసాగిస్తే మంచి ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని బ్యూనస్ ఎయిర్స్లో వివరించాడు.