breaking news
Indian wedding
-
పెళ్లి బాజాలు ఇక లంకలో..
భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు దుబాయ్, ఒమన్, టర్కీ వంటి పశ్చిమాసియా దేశాలు సంపన్న భారతీయ కుటుంబాల పెళ్లిళ్లకు ప్రధాన వేదికలుగా ఉండగా. ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రీలంక, వియత్నాం,థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలు వేగంగా ఆక్రమిస్తున్నాయి. భారత్‌కు దగ్గరగా ఉండడం, ప్రయాణ సౌలభ్యం, విలాసవంతమైన హోటళ్లు, తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ అనుభూతి లభించడం వంటి కారణాలతో 2025లో భారతీయుల పెళ్లిళ్లకు ఆగ్నేయాసియా దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్న విదేశీ వెడ్డింగ్ డెస్టినేషన్ల గమ్య స్థానంగా మారినట్లు వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ ’వెడ్ మి గుడ్’ నివేదిక వెల్లడించింది. 2025లో ఒక్క శ్రీలంకలో భారతీయ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు డిమాండ్ 25% పెరిగిందని వచ్చే కొన్నేళ్ల పాటు ప్రతి ఏడాది 20–25% వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధవాతావరణం కారణంగా అక్కడి వెడ్డింగ్ మార్కెట్‌పై కొంత ప్రభావం కనిపించినప్పటికి విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే భారతీయుల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి శ్రీలంక, ఇతర దేశాలు వేగంగా ఎదుగుతున్నప్పటికీ పర్యాటకంగా భారతీయుల తొలి ఎంపిక మాత్రం థాయ్‌లాండే. 2025లో దాదాపు 25 లక్షల మంది భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. ఏడాది ప్రాతిపదికన 16% పెరుగుదల నమోదైంది. పెళ్లితోపాటు అనుభవం కూడా ముఖ్యం. ఇప్పటి తరం జంటలు పెళ్లి కేవలం వేడుక కోసం కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మరుపురాని అనుభవాన్ని సృష్టించేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే పెళ్లి వేడుకులు కూడా గతంతో పోలిస్తే ఎక్కువ రోజులు కొనసాగుతున్నాయి. కరోనాకు ముందు సగటున 1–2 రోజులు జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇప్పుడు మూడు, నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారీగా పెరిగిన బడ్జెట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు భారతీయులు చేసే ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. దేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు సగటు బడ్జెట్ రూ.58 లక్షలు అయితే విదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్ సగటు బడ్జెట్ రూ.1.5 కోట్లు పైమాటే. అయినా లగ్జరీ పెళ్లిళ్ల మార్కెట్ మరింత విస్తరిస్తోందని ముందు ముందు ఇది మరింత పెరుగుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది.సంక్షోభంతో మారుతున్న ఎంపిక పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నెలకొన్న భద్రతా పరిస్థితులు, విమాన చార్జీలు పెరుగుదల, హోటళ్ల టారిఫ్‌లు అమాంతం పెరిగిపోవడం కూడా భారతీయుల పెళ్ళి ప్రణాళికలను ప్రభావితం చేశాయి. అయితే విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మాత్రం భారతీయ సంపన్న కుటుంబాలు మార్చుకోవడం లేదని కేవలం దేశాన్నే మార్చుకుంటున్నాయి. భద్రత, ప్రయాణ సౌలభ్యం, అతి«థులకు కూడా సులభమైన వీసా విధానం ఉన్న శ్రీలంక, ఇండోనేíÙయా దేశాలపై ఇప్పుడు ఎక్కువ మంది దృష్టి పెడుతున్నాయి.టాప్ విదేశీ వెడ్డింగ్ గమ్యస్థానాలు థాయ్‌లాండ్, బాలి (ఇండోనేషియా) వియత్నాం, మలేషియా ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్ భారత్‌లో ఇవీ... దేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌లో డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, సిమ్లా, జిమ్ కార్బెట్ తొలి ఐదు స్థానాల్లో ఉండగా, ఉదయ్‌పూర్,జైపూర్,జైసల్మేర్,జో«ద్‌పూర్, గోవా కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. శ్రీలంకకు భారతీయుల వెల్లువ శ్రీలంక టూరిజం డెవలప్మెంట్ అథారిటీ గణాంకాల ప్రకారం 2023లో 3 లక్షల మంది భారతీయ పర్యాటకులు ఆదేశాన్ని సందర్శించగా 2024లో 4.17 లక్షలు, 2025లో అది 5.30 లక్షలు దాటింది. భారత్ ప్రస్తుతం శ్రీలంకకు అతిపెద్ద విదేశీ పర్యాటక మార్కెట్. ఈ పెరుగుతున్న పర్యాటక ప్రవాహమే డెస్టినేషన్ వెడ్డింగ్ రంగానికి ఊతమిస్తోంది. ఇది లగ్జరీ హోటళ్లు, విమానయాన సంస్థలు, ట్రావెల్ కంపెనీలు, డెకరేషన్, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్, క్యాటరింగ్, టూరిజం రంగాలకు కూడా కోట్లాది వ్యాపారాన్ని సృష్టిస్తున్న భారీ పరిశ్రమగా మారుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మటన్ నల్లీ వివాదంలో నలిగిన పెళ్లి!
‘పెళ్లి బాజాలు మోగాయి.. తలంబ్రాలు పడాల్సిందే.. కానీ, ఇంతలోనే పన్నీర్ ముక్క ప్లేట్లో పడలేదు! మటన్ నల్లీ కనబడలేదు! ఇంకేముంది.. అప్పటి వరకు సందడిగా కనిపించిన వివాహ వేదిక.. ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. ఫైనల్‌గా పెళ్లి క్యాన్సిల్. ఒక్కటి కావాల్సిన జంట చెరోదారిన వెనుదిరిగింది. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఈ మధ్యకాలంలో ఇలాంటి అనూహ్యమైన విచిత్రాలు, ఊహించని వివాదాలు తరచుగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు..మటన్ నల్లీ వివాదం.. తెలంగాణలో జరిగిన ఈ సంఘటనలో వధువు తరఫు వారు ఏర్పాటు చేసిన నాన్ వెజ్ మెనూలో మటన్ బోన్ మ్యారో లేకపోవడమే గొడవకు ప్రధాన కారణం. దీనిని తమకు అవమానంగా భావించిన వరుడు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో జీవితాంతం ఒక్కటిగా ఉండాల్సిన బంధం పెళ్లిపీటల దగ్గరే తెగిపోయింది.మటర్ పన్నీర్లో ‘పన్నీర్’ ఏది?సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ సంఘటనలో మటర్ పన్నీర్ కూర ఘర్షణకు దారితీసింది. అతిథులు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ డిష్‌లో అసలు పన్నీర్ ముక్కలే కనిపించకపోవడంతో వివాదం మొదలైంది. వధువు, వరుడి తరఫు బంధువుల మధ్య చిన్నగా ప్రారంభమైన మాటల యుద్ధం కాస్తా .. దాడిచేసుకునే వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది.స్నేహితుల మాటతో పెళ్లి క్యాన్సిల్స్నేహితుల సలహాతో వధువు తన వివాహాన్ని రద్దు చేసుకున్న విచిత్ర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతికి ఆమె కుటుంబ సభ్యులు 30 ఏళ్ల మేనబావతో వివాహం నిశ్చయించారు. అయితే తన స్నేహితులతో చర్చించిన అనంతరం, ఈ సంబంధం సరికాదని భావించిన వధువు పెళ్లిని రద్దు చేసుకుంది.డబ్బులు లెక్కించలేదని!ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో డబ్బులు లెక్కపెట్టలేని వరుడిని చూసి వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. వివాహ తంతు జరుగుతుండగా వరుడి ప్రవర్తనపై పూజారికి అనుమానం వచ్చి వధువు కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. సందేహంతో వరుడికి కొన్ని కరెన్సీ నోట్లు ఇచ్చి లెక్కపెట్టమనగా, అతడు లెక్కపెట్టలేక నిలబడిపోయాడు. దీంతో వరుడి మానసిక స్థితి సరిగ్గా లేదనే నిజాన్ని అతని కుటుంబం దాచిపెట్టిందని గ్రహించి వధువు వివాహాన్ని రద్దు చేసుకుని పెళ్లిపీటల నుంచే వెళ్లిపోయింది.డ్యాన్స్ వద్దనడంతో..పెళ్లి ఊరేగింపులో వధువు డ్యాన్స్ చేయడాన్ని వరుడు నిరాకరించాడని.. పెళ్లిని రద్దు చేశాడు వధువు తండ్రి. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో చిన్న విషయంలో మొదలైన వివాదం పెళ్లి ఆగిపోయేలా చేసింది. పెళ్లి వేడుకలో భాగంగా ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు డ్యాన్స్‌లు చేస్తుండగా.. వధువరులిద్దరినీ డ్యాన్స్ చేయాల్సిందిగా వారి స్నేహితులు కోరారు. దీనికి వరుడు నిరాకరించడంతో పాటు వధువు డ్యాన్స్ చేయడాన్ని కూడా వరుడు నిరాకరించాడు. దీంతో వధువు తండ్రి పెళ్లిని రద్దు చేశాడు. విందులో వంటకాల పట్ల వచ్చిన చిన్నపాటి అసంతృప్తులు హాస్యంగా అనిపించినప్పటికీ, పెళ్లి సంబంధాల్లో పారదర్శకత లోపించడం, నిజాలు దాచడం వంటి విషయాలు పీటల మీద పెళ్లిళ్లు ఆగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. -
24 గంటల్లో రూ.20 లక్షలు ఖాళీ!
భారతదేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే కార్యక్రమం మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు కలిసి జరుపుకునే పెద్ద వేడుక. మన దేశంలో వివాహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే.. చాలామంది తమ పెళ్లిని జీవితంలో గుర్తుండిపోయేలా ఎంతో ఘనంగా నిర్వహించాలని కోరుకుంటారు. దీనికోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.ప్రస్తుతం భారతీయ పెళ్లిళ్ల విషయంలో రెండు రకాల ఆలోచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది పెళ్లిని ఎంతో వైభవంగా నిర్వహించాలని భావించి భారీగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. మరికొందరు మాత్రం అవసరానికి మించి ఖర్చు చేయకుండా.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆచరణాత్మకంగా పెళ్లి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.ఇలాంటి పెళ్లి ఖర్చులపై.. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం చర్చకు దారితీసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.20 లక్షల బడ్జెట్ ఎలా ఖర్చైపోతుందో ఆమె వివరించారు.మీనల్ గోయల్ లెక్కల ప్రకారం.. సాధారణంగా రూ.20 లక్షల బడ్జెట్ ఉన్న ఓ పెళ్లిలో ఎక్కువ మొత్తం ఆహారం, వేదిక, అలంకరణ వంటి వాటికే ఖర్చు అవుతోంది. సుమారు రూ.6 లక్షలు భోజనాల కోసం, రూ.5 లక్షలు పెళ్లి వేదిక కోసం, రూ.3 లక్షలు అలంకరణ కోసం ఖర్చవుతాయని తెలిపారు. ఇక ఫోటోగ్రఫీకి రూ.2 లక్షలు, వినోద కార్యక్రమాలు లేదా డీజే కోసం మరో రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని, మిగిలిన రూ.2 లక్షలు ఇతర చిన్నచిన్న ఖర్చులకు వెళ్తాయని వివరించారు.అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసినా ఆ వేడుకలు కొన్ని గంటలు మాత్రమే ఉంటాయని మీనల్ గోయల్ చెప్పారు. కేవలం 24 గంటల్లోనే రూ.20 లక్షలు ఖర్చైపోతాయని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.పెళ్లిళ్లు చేసుకోవద్దని లేదా వేడుకలను తగ్గించుకోవాలని మీనల్ గోయల్ ఉద్దేశ్యం కాదు. కానీ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ఖర్చు చేయాలని సూచించారు. పెళ్లి అనేది కేవలం ఒక రోజు జరిగే వేడుక మాత్రమే కాదని.. దాని తర్వాత ప్రారంభమయ్యే కొత్త జీవితానికి ఆర్థిక భద్రత కూడా ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.పెళ్లిని ఘనంగా జరుపుకోవడం కంటే, పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా, ప్రశాంతంగా సాగడం ముఖ్యం. ఒక రోజు జరిగే వేడుక కోసం అధికంగా ఖర్చు చేసి ఆర్థిక ఒత్తిడిని తెచ్చుకోవడం కంటే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. View this post on Instagram A post shared by Meenal Goel | Finance (@ca.meenalgoel) -
9 మంది అతిథులతో ఇటలీలో గ్రాండ్ వెడ్డింగ్, ఫోటోలు వైరల్
ప్రస్తుతం కాలంలో పెళ్లి అంటే పెద్ద హంగూ ఆర్బాటం. ప్రీవెడ్డింగ్ షూట్, మెహిందీ, సంగీత్, బారాత్, వందలకొద్దీ అతిథులు, విందు భోజనాలు అబ్బో ఈ లిస్ట్ చాలా పెద్దదే. కానీ అలాంటివేమీ లేకుండానే కేవలం 9 మంది అతిథుల సమక్షంలో, ఎలాంటి వెడ్డింగ్ ప్లానర్ సహాయం లేకుండా ఒక భారతీయ వధువు తన డ్రీమ్ వెడ్డింగ్‌ను ఇటలీలోని ప్రసిద్ధ 'లేక్ కోమో' (Lake Como) తీరాన అద్భుతంగా ప్లాన్ చేసుకుంది. గత ఏడాది జరిగిన ఈ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి.కింజల్ పటేల్, హెరిత్ వచ్హానీ జంట చేసుకున్న ఈ వివాహం... 'బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్'కి భిన్నంగా, . విలాసవంతమైన పెళ్లి అంటే ఖర్చు, హడావుడి మాత్రమే కాదు, అది మనసుకు నచ్చిన వారితో గడిపే ఒక ప్రశాంతమైన అనుభూతి అని నిరూపించింది.అంతేకాదు ఈ పెళ్లిలోని అసలైన విశేషం ఏంటంటే.. ఇంతటి లగ్జరీ వెడ్డింగ్‌ను వధువు కింజల్ సొంతంగా డిజైన్ చేసింది. ఏ వెడ్డింగ్ ప్లానర్‌ను పెట్టుకోకుండా, ప్రదీ వెండర్‌తో ఆమె స్వయంగా మాట్లాడి ప్లాన్ చేసుకుంది. View this post on Instagram A post shared by House On The Clouds (@thehouseontheclouds)ఇటాలియన్ వైభవం.. పూల పరిమళాలుప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ 'హౌస్ ఆన్ ది క్లౌడ్స్' తీసిన పెళ్లి ఫోటోలు ఒక అందమైన పెయింటింగ్‌లా ఉన్నాయి. ఇటలీలోని చారిత్రాత్మక 'విల్లా బాల్బియానో' (Villa Balbiano) లాన్‌పై, ఆల్ప్స్ పర్వతాల నీడలో, లేక్ కోమో సరస్సు పక్కన వీరి పెళ్లి వేడుక జరిగింది.ప్రశాంతత, ఆత్మీయత, ఒక పెద్ద SUV కార్లో సరిపోయేంత మంది అతిథులతో వారు తమ పెళ్లిని జరుపుకున్నారు.సాంప్రదాయక భారీ వూడెన్ మండపానికి బదులుగా.. లావెండర్, పెరివింకిల్ రంగుల హైడ్రాంజియా పూలు, ఆరెంజ్ జెర్బెరాస్, బర్డ్ ఆఫ్ పారడైజ్ వంటి విదేశీ పూలతో కిందనే అద్భుతమైన పూల బాటను డిజైన్ చేశారు. ఆకాశం నుండి చూస్తే, ఈ జంట కోసం ఆ తోటలోనే పూలు పూశాయా అన్నట్లుగా ఆ డెకరేషన్ మెరిసిపోయింది.పింక్ శారీలో మెరిసిన వధువువధువు కింజల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన సెలెరియల్ పింక్ కలర్ లెహంగా స్టైల్ శారీని ఎంచుకుంది. ఇటలీ ఆకాశం కింద ఆమె దుస్తులపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్, వెనుకకు సాగిపోతున్న నెట్ వేల్ (veil) ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి. వరుడు హెరిత్ క్రీమ్ కలర్ షేర్వాణీలో హుందాగా కనిపించాడు. వారు పరస్పరం పూలమాలలు మార్చుకునే (వర్మాల) క్షణాలు ఎంతో ప్రశాంతంగా, మనోహరంగా సాగాయి.లేక్ కోమో నేపథ్యంలో క్రీమ్ కలర్ షేర్వాణీలో హుందాగా వరుడు హెరిత్ చిరునవ్వుతో వెనక్కి వంగడం, కింజల్ అతనికి దండ వేయడం...ఎలాంటి హడావిడి, గందరగోళం లేకుండా ప్రశాంతమైన, ఆనంద క్షణాలను ఆస్వాదించారు. ఇదీ చదవండి : ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?9 మంది అతిథులు మాత్రమే!గత ఏడాది అక్టోబర్‌లో 'వోగ్ ఇండియా' (Vogue India) మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట తమ నిర్ణయాన్ని పంచుకున్నారు. "పెళ్లి హడావుడిలో మాకు మే ఎక్కడో తప్పిపోవాలని అనుకోలేదు. మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే అత్యంత ఆత్మీయుల మధ్య, మేం ఎలా ఉంటామో అలాగే ప్రశాంతంగా ఈ క్షణాలను ఆస్వాదించాలనుకున్నాం" అని వారు చెప్పారు.కేవలం 9 మంది కుటుంబ సభ్యులతో ఈ పెళ్లి జరగడం వల్ల వందల మంది అతిథుల మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, మూడు రోజుల అలసట వంటి ఒత్తిళ్లేవీ వారికి లేకుండా పోయాయి. పెళ్లి తర్వాత వారంతా 'పాసాలాక్వా' (Passalacqua) అనే చారిత్రాత్మక హోటల్లో ఒకరినొకరు చూసుకుంటూ, హాయిగా మాట్లాడుకుంటూ ప్రైవేట్ డిన్నర్‌ను ఆస్వాదించారు. కృత్రిమమైన భారీ బ్యాక్‌డ్రాప్‌ల కంటే కోట్లాది సంవత్సరాల నాటి ఆల్ప్స్ పర్వతాలు, లేక్ కోమో సరస్సే తమ పెళ్లికి గొప్ప వేదిక అని ఈ జంట నిరూపించింది.అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రశాంతంగా భోజనం చేస్తూ పెళ్లిని ఆస్వాదించడం అంటే ఇవాల్టి రోజుల్లో అరుదైన విలాసమని చెప్పవచ్చు. ఒక వెడ్డింగ్ ప్లానర్ ఇవ్వలేని గొప్ప తృప్తిని, విజయాన్ని తన కలల పెళ్లిని తానే స్వయంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా సాధించానని కింజల్ గర్వంగా చెప్పింది.ఇదీ చదవండి: బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్ తీసుకొని ప్రియుడితో పరార్ -
మీరు రాకుంటే కామెంట్లు ఎవరు చేస్తారు.. ?
మా ఇంట పెళ్లి.. మీరంతా రావడం మా కల.. పెళ్లి పందిరి నవ్వాలి కిలకిల. మీరాక మాకెంతో శుభదినం.. ఇలా కదా పెళ్లి పత్రిక రాస్తారు.. కానీ ఈ కుటుంబం వేసిన పెళ్లి ఆహ్వాన పత్రిక చూసి నెటిజన్లు అబ్బా.. ఏం రాసిర్రు భయ్యా అంటూ నవ్వుతూనే.. కామెంట్లు సైతం పెడుతున్నారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొద్దీ సమయానికే లక్షదాటిన వ్యూస్.. దీంతో ఇదిప్పుడు వైరల్ ఐంది. సాధారణ సంప్రదాయానికి భిన్నంగా ఉన్న ఈ పెళ్లి పత్రిక చూసి పలువురు నవ్వుకుంటూనే.. మొత్తానికి అన్నీ నిజాలే రాసారు అని కామెంట్లు చేస్తున్నారు. మీరు పెళ్ళికి రాకుంటే ఎలా ? భోజనాల గురించి కామెంట్లు ఎవరు పెడతారు.. అది అలా ఉంది.. ఇది ఇలా ఉందని ఎవరు చెబుతారు ? కాబట్టి మీరు తప్పనిసరిగా రావాల్సిందే అని అందులో పేర్కొన్నారు. వధువు, “శర్మాజీకి లడ్కీ” (శర్మాజీ గారి కుమార్తె ) “మంచి తెలివైన అమ్మాయి" అని రాశారు. వరుడు, “గోపాలజీ కా లడ్కా” (గోపాలజీ గారికి కుమారుడు ) అంటూనే ఈయన బీటెక్ పూర్తి చేసినప్పటికీ, ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడని వివరించారు. జనవరి ఐదోతేదీ నాటికి తమ పిల్లలతోబాటు, బంధువుల పిల్లల పరీక్షలు కూడా ముగుస్తున్నందున ఆరోజు పెళ్లి చేస్తే బావుంటుందని ముగ్గురు పురోహితులు కలిసి ముహుర్తాన్ని ఖరారు చేసారని పేర్కొన్నారు. వియ్యాలవారి మధ్య చిన్నచిన్న కయ్యలు ఉంటాయి...వాటిని పట్టించుకోవద్దు అని చెబుతూనే పెళ్లి వేదికమీదకు వధూవరులు ఆలస్యంగా వస్తారని, అంత వరకు ఓపిక పట్టాలని రాసారు. అసలే వివాహవేదిక చాలా ఖరీదుపెట్టి డెకరేట్ చేయించాం. అందుకే అక్కడ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.. అదేం మీ పిల్లలు ఆదుకునే అట స్థలం కాదు కదా.. అని గుర్తు చేశారు ఫుడ్ చాలా కాస్ట్లీ.. ఒకసారే తినండి పెళ్లికోసం బుక్ చేసిన భోజనం చాలా ఖరీదైంది.. ఒక్కో ప్లేట్ భోజనం రూ. 2000 కాబట్టి.. కాస్త తక్కువ తినండి. లేదా ఒకసారి మాత్రమే తినండి. వివాహ వేదిక మీకు తెలుసుగా మన దూబే గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది కదా.. అక్కడే ఈ పెళ్లి కూడా అని రాశారు. కానుకలు వద్దు.. క్యాష్ కొట్టండి పెళ్లిలో ఇచ్చే కనుకలగురించి కూడా వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఇంట్లో ఆల్రెడీ 20 ఫోటో ఫ్రేమ్స్.. బోలెడు డిన్నర్ సెట్లు ఉన్నాయి కాబట్టి.. క్యాష్ కొట్టండి. లేదా గూగుల్ పే చేయండి అని గుర్తు చేసారు. బంధుమిత్రులగురించి చెబుతూ వాళ్లంతా ఎప్పట్లానే బోరింగ్ బ్యాచ్ అని రాశారు.. ఇంకా భారీగా కానుకలు ఇస్తారు కాబట్టి.. తాతయ్య పేరును పత్రిక పైన రాశామని సరదాగా చెప్పారు. మామ.. అత్తయ్యలను గురించి వివరిస్తూ ఇంట్లో గొడవలను తీర్చే స్పెషలిస్టులుగా వివరించారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ పత్రికను దాదాపు 1.94 లక్షల మంది చూశారు. అయ్యో నేను ఈ కార్డు ముందే చూసి ఉంటె మా అబ్బాయి పెళ్ళికార్డును కూడా ఇలాగె ప్రింట్ చేయించేవాడిని అని ఒకాయన కామెంట్ చేయగా.. వామ్మో మరీ ఇంత నిజాయితీగా రాసేశారు.. బంధువులు ఏమనుకుంటారో అని ఇంకో అయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ పోస్ట్ కింద వందలాది ఎమోజీలు కూడా వచ్చాయి. సిమ్మాదిరప్పన్న -
ఏటా రూ.10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారతీయులు వివాహానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియనది కాదు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుక కోసం ఎంత ఖర్చుకైనా సరే తగ్గేదే లేదంటున్నారు. వివాహాల కోసం భారతీయులు ఏటా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తెలిపింది. అది కూడా విద్యపై చేసే వ్యయం కంటే వివాహాల కోసం చేస్తున్నదే రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. వ్యయాల పరంగా ఆహారం, గ్రోసరీ (ఎఫ్ఎంసీజీ) తర్వాతి స్థానంలో పెళ్లిళ్లు ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇంకా ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. భారత్‌లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయి. అదే చైనాలో ఏటా 70–80 లక్షలు, అమెరికాలో 20–25 లక్షల వరకు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అమెరికాలో వివాహాల కోసం అక్కడి వారు చేస్తున్న వార్షిక వ్యయం 70 బిలియన్ డాలర్లు (రూ.5.81 లక్షల కోట్లు) కంటే భారతీయుల వ్యయం రెట్టింపుగా ఉంది. ఇక చైనాలో ఏటా జరిగే పెళ్లి వేడుకలు భారత్ కంటే 20 శాతం మేర తక్కువే ఉన్నప్పటికీ.. భారతీయుల కంటే 50 శాతం అధికంగా 170 బిలియన్ డాలర్లు (రూ.14.11 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వినియోగంలో భారత్‌లో రిటైల్ వినియోగ విభాగంలో వివాహాలది రెండో స్థానం. ఆహారం, గ్రోసరీలపై చేస్తున్న 681 బిలియన్ డాలర్లు (రూ.56.52 లక్షల కోట్లు) తర్వాత వివాహాలకే ఎక్కువ కేటాయిస్తున్నారు. వివాహం అంటే ఎన్నో రకాల కొనుగోళ్లతో ఉంటుందని తెలిసిందే. ముఖ్యంగా బంగారం ఆభరణాలు, వస్త్రాలు, వేడుక నిర్వహణ కేంద్రాలు, హోటల్ బుకింగ్‌లు, అలంకరణలు, ఆహారంపై భారీగా వ్యయం చేయాల్సి వస్తుంది. వివాహాలు పరోక్షంగా ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లకూ మద్దతునిస్తాయి. ప్రాంతం, మతం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెళ్లిళ్లపై చేసే వ్యయాలు కూడా ఆధారపడి ఉంటాయని తెలిసిందే. ‘‘ఏటా 8–10 మిలియన్ల వివాహాలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంటోంది. రిటైలర్ల సమాఖ్య సీఏఐటీ అంచనా ప్రకారం చూస్తే దీని పరిమాణం 130 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. యూఎస్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు. కీలక వినియోగ విభాగాలకు వివాహాలు ఊతమిస్తున్నాయి. విలువలకు ప్రాధాన్యమిచ్చే భారతీయ సమాజంలో వివాహాలపై ఖర్చు చేసేందుకు ఇష్టపడుతుంటారు. వారి సంపద, ఆదాయ స్థాయిలకు అనుగుణంగా ఈ వ్యయాలు ఉంటాయి. ఆర్థిక తరగతులతో సంబంధం లేకుండా అధిక వ్యయం చేసే ధోరణి కూడా నెలకొంది’’అని జెఫరీస్ నివేదిక వివరించింది. ఒక్కో పెళ్లికి రూ.1.25 లక్షలు ఒక్కో వివాహంపై చేసే ఖర్చు సగటున 15,000 డాలర్లు (రూ.1.25 లక్షలు సుమారు)గా ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ‘‘ఇది తలసరి ఆదాయం కంటే రెట్టింపు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యపై చేసే ఖర్చు కంటే రెండు రెట్లు అధికంగా ఒక జంట వివాహంపై వెచి్చస్తోంది. అదే యూఎస్‌లో వివాహంపై చేసే సగటు ఖర్చు విద్యలో సగమే ఉంటోంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఖరీదైన ఆతిథ్యాలు, భారీ మెనూతో కూడిన ఆడంబరమైన కేటరింగ్, స్టార్ చెఫ్‌లు రూపొందించిన మెనూలు, నటులు, సెలబ్రిటీల ప్రదర్శనలను భారత్‌లో ఖరీదైన వివాహాల్లో చూ డొచ్చని పేర్కొంది. ‘‘వివాహ మార్కెట్ పరిమాణం దృష్ట్యా చూస్తే భారత్‌లో ఆభరణాలు, వ్రస్తాలు, కేటరింగ్, ప్రయాణాలు తదితర రంగాల్లో డిమాండ్‌కు ఇది మద్దతుగా నిలుస్తోంది. పరోక్షంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెయింట్స్‌కు సైతం డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది’’అని వివరించింది. -
మళ్లీ పెళ్లి!
‘ప్రియానిక్’ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్) వెడ్డింగ్ అంటే తెలియనివాళ్లు ఉండరేమో? తన వెడ్డింగ్‌తో టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యారు ప్రియాంక చోప్రా. రాజస్థాన్‌లో బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనస్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పెళ్లి ప్రస్తావన ఎందుకంటే లేటెస్ట్గా మరోసారి పెళ్లి సందడి చేయడానికి రెడీ అయ్యారు ప్రియాంక. ఈ సందడి స్క్రీన్ మీద. ప్రియాంక నటిస్తున్న లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం వెడ్డింగ్ కామెడీ జానర్లో ఉండబోతోందట. దేశీ వెడ్డింగ్స్ ఎలా జరుగుతాయో ఇందులో చూపించనున్నారట. అందుకోసం రాజస్థాన్, న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకూ ఎవ్వరూ షూట్ చేయని లొకేషన్స్‌లో షూటింగ్ జరపాలనుకుంటున్నారట చిత్రబృందం. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటి మిండీ కలింగ్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. -
వివాహాల్లో ఊహించని అపశ్రుతులు
-
వివాహాల్లో ఊహించని అపశ్రుతులు
ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి మరుపురాని మధురానుభూతి. అందుకే పెళ్లి వేడుకను ప్రతి క్షణాన్ని ఫొటోలోనూ, వీడియో కెమెరాలో బంధిస్తాం. అడుగడుగునా ఆ మధురానుభూతుల్ని చూసుకొని మురిసిపోతాం. జీవితంలో ఎంతో కీలకమైనది కావడంతో పెళ్లి కోసం ఎంతో ముందుగానే పక్కా ప్రణాళికలు వేసి.. పర్ఫెక్ట్గా నిర్వహించేందుకు తపిస్తాం. కానీ ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా పెళ్లిళ్ల సందర్భంగా కొన్ని ఊహించని అపశ్రుతులు దొర్లుతుంటాయి. అప్పటికప్పుడు జరిగిపోతుంటాయి. బంధుమిత్రులు, ఎవరో తెలియని కొత్తవారి ముందు జరిగే ఈ ఊహించని పరిణామాలు అప్పటికప్పుడు చికాకు కలిగిస్తాయి. జీవితంలోని కీలక సమయంలో జరిగిన ఈ అనుకోని అపశ్రుతులు కొందరికీ షాక్ కూడా మిగిలిస్తుంటాయి. పెళ్లిల్లో జరిగిన ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు ఇప్పుడు ఒక వీడియోరూపంలో హల్చల్ చేస్తున్నాయి. అనుకోకుండా జరిగిన ఈ అపశ్రుతులు అప్పటికప్పుడు కొంత చికాకు కలిగించినా.. వీటిని చూసినవారికి మాత్రం ఒకింత నవ్వురాక మానదు. పెళ్లి సందర్భంగా ఏడడుగులు వేస్తుండగా వరుడి పంచె వధువు పొరపాటున కాలుపెట్టడంతో వరుడి పంచె ఊడిపోవడం, తాళి కడుతుండగా వరుడి ముఖం నిండా నురగతో నింపడం, వరుడికి పూలమాల వేయబోతూ వధువు కిందపడిపోవడం, గుర్రం మీద నుంచి వరుడు పడిపోవడం వంటి అనుకోనివిధంగా దొర్లిన అపశ్రుతులు ఇప్పుడు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు.


