మళ్లీ పెళ్లి! | Priyanka Chopra, Mindy Kaling’s film on Indian weddings to be shot in Delh | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లి!

Apr 21 2019 12:17 AM | Updated on Jun 4 2019 6:34 PM

Priyanka Chopra, Mindy Kaling’s film on Indian weddings to be shot in Delh - Sakshi

ప్రియాంకా చోప్రా

‘ప్రియానిక్‌’ (ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌) వెడ్డింగ్‌ అంటే తెలియనివాళ్లు ఉండరేమో? తన వెడ్డింగ్‌తో టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌ అయ్యారు ప్రియాంక చోప్రా. రాజస్థాన్‌లో బాయ్‌ఫ్రెండ్‌ నిక్‌ జోనస్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పెళ్లి ప్రస్తావన ఎందుకంటే లేటెస్ట్‌గా మరోసారి పెళ్లి సందడి చేయడానికి రెడీ అయ్యారు ప్రియాంక.

ఈ సందడి స్క్రీన్‌ మీద. ప్రియాంక నటిస్తున్న లేటెస్ట్‌ హాలీవుడ్‌ చిత్రం వెడ్డింగ్‌ కామెడీ జానర్‌లో ఉండబోతోందట. దేశీ వెడ్డింగ్స్‌ ఎలా జరుగుతాయో ఇందులో చూపించనున్నారట. అందుకోసం రాజస్థాన్, న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకూ ఎవ్వరూ షూట్‌ చేయని లొకేషన్స్‌లో షూటింగ్‌ జరపాలనుకుంటున్నారట చిత్రబృందం. నవంబర్‌ నుంచి సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి మిండీ కలింగ్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement