breaking news
gade venkat reddy
-
మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
పర్చూరు (చినగంజాం): సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి (87) శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు సతీమణి వీరాంజనేయమ్మ, కుమారులు గాదె మధుసూదన్‌రెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా)లోని ఇంకొల్లు మండలం పావులూరులో 1938 నవంబరు 30న గాదెవెంకటరెడ్డి జన్మించారు. ఎల్ఎల్బీ చదివిన ఆయన కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు.సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంకాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గాదె వెంకటరెడ్డి 1967 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972, 1978, 1983, 1985, 1989 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీచేశారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో, 1994 సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ విజయం తరువాత నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో పర్చూరు నుంచి పోటీచేసిన ఆయన.. 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. బాపట్ల శాసనసభ్యుడిగా గెలిచిన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో దేవదాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1967లో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానంలో 2009 వరకు పోటీలో ఉండడం విశేషం. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తొలిసారిగా నిర్వహించిన ఎన్నికల్లో ఆయన పోటీచేయలేదు. 2016లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 2020లో వైఎస్సార్సీపీలో చేరారు. న్యాయవాదిగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ఉన్నతస్థాయి నాయకుడి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు అందరినీ పేరుతో ఆప్యాయంగా పిలిచేవారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా చెప్పేవారు. కాగా, హైదరాబాద్‌లో గాదె వెంకటరెడ్డి భౌతికకాయానికి సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, డీకే సమరసింహారెడ్డి, మైసూరారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు నివాళులరి్పంచారు. వెంకటరెడ్డి భౌతికకాయాన్ని శనివారం మధ్యాహా్ననికి ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరుకు తీసుకొస్తామని ఆయన పెద్ద కుమారుడు, వైఎస్సార్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగుతూ ప్రజలకు సేవలందించిన గాదె వెంకటరెడ్డి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో గాదె వెంకటరెడ్డికి ఎంతో సన్నిహిత అనుబంధం ఉందని వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్‌తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గాదె వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. -
గాదె వెంకటరెడ్డి మృతిపై YS జగన్ సంతాపం
-
చంద్రబాబు నమ్మించి మోసం చేశారు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీలో తనకు గౌరవం దక్కలేదన్నారు. బాగా అవమాన పడ్డానని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో గాదె వెంకటరెడ్డి, ఆయన కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డి, టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి సీఎం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలోకి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు బంధువులు సీఎం జగన్ చేస్తున్న రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకునే ఉద్ధేశంతో వైఎస్సార్సీపీలో చేరామని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దగ్గరి బంధువులు శిద్దా హనుమంతరావు, శిద్దా సూర్యప్రకాశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం వారు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువరానర్..కాదు కాదు.. అధ్యక్షా..!
సాక్షి, గుంటూరు: న్యాయ శాస్త్రం చదివి కోర్టులో కేసులు వాదించాల్సిన జిల్లాకు చెందిన అనేక మంది న్యాయవాదులు రాజకీయాల్లో ప్రవేశించి చక్కగా రాణిస్తూ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తమదైన గుర్తింపు పొందారు. జిల్లాకు చెందిన సుమారు 20 మంది న్యాయవాదులు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రిగా పదవులు అలంకరించి జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. 20 మందిలో ఏడుగురు ఎంపీలుగా గెలిచారు. వీరిలో ఒకరిద్దరు కేంద్ర మంత్రులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మిగతా 14 మంది ఎమ్మెల్యేలుగా... వీరిలో కొందరు రాష్ట్ర మంత్రులుగా కూడా పని చేశారు. - నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి లా చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ మొట్టమొదటిసారిగా ఫిరంగిపురం నుంచి ఎమ్మెల్యేగా రెండు దఫాలు ఎన్నికయ్యారు. అనంతరం నరసరావుపేట అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఏడేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఈయన కేంద్ర హోం శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానమైన ఏఐసీసీ అధ్యక్షునిగా కూడా పని చేసి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. - బాపట్ల నియోజకవర్గానికి చెందిన గాదె వెంకటరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. ఈయన న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. - మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు కూడా గురజాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి 2004, 2009 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. - టీడీపీకి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా చేశారు. - దుగ్గిరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అనంతరం మంత్రిగా పనిచేసిన ఆలపాటి ధర్మారావు సైతం న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. - వేమూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా యడ్లపాటి వెంకట్రావు మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. ఈయనా న్యాయవాద వృత్తి నుంచి వచ్చినవారే. - బాపట్ల నియోజకవర్గానికి చెందిన కోన ప్రభాకరరావు న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రమంత్రిగా, శాసనసభ స్పీకర్‌గా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. - కొత్త రఘురామయ్య గుంటూరులో న్యాయవాదిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో అనేక శాఖల్లో మంత్రిగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. - సలగల బెంజిమెన్, సింగం బసవపున్నయ్య, ఎస్.వి.ఎల్.నరసింహారావు, ముప్పలనేని శేషగిరిరావు, నిశ్శంకరరావు వెంకటరత్నం, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి న్యాయవాద వృత్తి నుంచి ఎంపీలుగా గెలుపొంది నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యాన్ని కనబర్చారు. - జిల్లాకు చెందిన గాదె వీరాంజనేయశర్మ, గంగినేని వెంకటేశ్వరరావు, నల్లపాటి వెంకటరామయ్య, అంబటి రాంబాబు, నక్కా ఆనందబాబు, మర్రి రాజశేఖర్ కూడా న్యాయవాదులుగా కొనసాగుతూ రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. -
'వరుస ఎన్నికలతో అందరికీ ఇబ్బందే'
వరుస ఎన్నికలతో అంతా ఇబ్బందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మున్సిపల్, జిల్లా పరిషత్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వరుసగా నిర్వహించడం వల్ల ఓటర్లు, అభ్యర్థులు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడేంతవరకైనా మున్సిపల్, జిల్లా పరిషత్ ఫలితాలను నిలిపేయాలని ఆయన కేంద్రం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఫలితాలను వాయిదా వేసేందుకు మార్గం చూడాలన్నారు. అయితే ఉన్నఫళంగా స్థానిక ఎన్నికలు రావడం పార్టీలకు ఇబ్బందే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తెలిపారు. టిక్కెట్ ఆశించే అభ్యర్థులు ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్‌కు మరింత ఇబ్బంది తప్పదని ఆయన పేర్కొన్నారు. -
'గడప గడపన సీమాంధ్ర ముగ్గులు వేయండి'
అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిపై దాడి అప్రజాస్వామికమని ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి అన్నారు. గాదెపై దాడిని ఆయన ఖండించారు. శనివారం చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గడప గడపన సంక్రాంతి పండగ సందర్భంగా సీమాంధ్ర ముగ్గులు వేయాలని ఆయన కోస్తా, రాయలసీమా వాసులకు సూచించారు. బిల్లుపై ఓటింగ్ జరిగే రోజు శాసనసభ్యులందరు పాల్గొని బిల్లును ఓడించాలని ఆయన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు. -
'తెలంగాణపై నిర్ణయంతో కాంగ్రెస్ తప్ప చేసింది'
-
'తెలంగాణపై నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ తప్ప చేసింది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఎవరితో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుని పెద్ద తప్పు చేసిందని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్‌లో అన్నారు. రాష్ట విభజనపై రెండోఎస్సార్సీ వేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై గతంలో కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరో సిఫార్సును అమలు చేయాలని ఆయన యూపీఏ సర్కార్‌కు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేదే తమ అత్యంత ముఖ్యమైన డిమాండని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీరు నిరంకుశంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో ప్రజా ఉద్యమాన్ని ఆపాలంటే ఏదో ఓ చర్య తీసుకోవాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి ఈసందర్భంగా హితవు పలికారు. సీమాంధ్ర ప్రజల సమస్యలు పరిష్కరించాకే అందరి ఆమోదంతో తెలంగాణ ఏర్పాటు చేయాలని గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్టంలో ప్రాంతాల వారీగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని ఆయన పేర్కొన్నారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి షిండే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు అభిప్రాయాలు వెల్లడించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కోరితే... తాను మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని అఖిల పక్ష సమావేశంలో సూచించానన ఈ సందర్భంగా గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు.


