చంద్రబాబు నమ్మించి మోసం చేశారు

Gade Venkat Reddy Comments On Chandrababu - Sakshi

ప్రజలు, కార్యకర్తలు, నేతల విశ్వాసాన్ని ఆయన కోల్పోయారు 

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి.. కుమారుడితో కలసి సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీలో తనకు గౌరవం దక్కలేదన్నారు. బాగా అవమాన పడ్డానని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో గాదె వెంకటరెడ్డి, ఆయన కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డి, టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి సీఎం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  

వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు బంధువులు 
సీఎం జగన్‌ చేస్తున్న రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకునే ఉద్ధేశంతో వైఎస్సార్‌సీపీలో చేరామని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దగ్గరి బంధువులు శిద్దా హనుమంతరావు, శిద్దా సూర్యప్రకాశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం వారు సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top