breaking news
eating food
-
ప్లాస్టిక్‌మయం..వ్యాదుల భయం
నిద్రలేచింది మొదలు పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో చేసిన వాటినే అందరూ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్‌లనే అధికంగా వాడుతున్నారు. వేడి వేడిగా పెట్టిన ఆహారం ప్లాస్టిక్ బాక్స్‌ల్లో పెట్టిన కొన్ని గంటలకే రసాయనాలు ఆహారంలో కలిసి క్యాన్సర్ మహమ్మారికి దారితీస్తున్నాయి. ఇంత ప్రమాదకరమని తెలిసినా ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్‌లనే కొనుగోలు చేసి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావడంలో విద్యా, వైద్యశాఖలు విఫలమవుతున్నాయి.తిరుపతి సిటీ : రంగు రంగుల డిజైన్లు, కార్టూన్ క్యారెక్టర్స్, గ్లిట్టర్ ఎఫెక్ట్స్‌తో పిల్లలను ఆకట్టుకునే విధంగా ప్లాస్టిక్ బాటిళ్లు, లంచ్ బాక్స్‌లు మార్కెట్‌ను ముంచెతు్తతున్నాయి. ప్రతి విద్యార్థి బ్యాగుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్‌లు దర్శనమిస్తున్నాయి. విద్యార్థులను తమ వైపు తిప్పుకునే విధంగా ఆకర్షణీయంగా ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. వీటి అమ్మకాలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. పలు రకాల వెరైటీలు, తక్కువ ధర, బరువు తక్కువగా కనిపించే ప్లాస్టిక్ బాటిళ్ల వైపే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆకర్షితులై ప్రాణాంతకమైన రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.అనారోగ్యం, పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిసినా విద్యావంతులు, ఉన్నత వర్గాలు సైతం వీటి వినియోగాన్ని వదలకపోవడం గమనార్హం. ప్లాస్టిక్ వినియోగం మనిషి జీవితంలో భాగమైపోయింది. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా, పెద్దలు విధులకు హాజరు కావాలన్నా టిఫిన్, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్‌వే వాడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం ప్లాస్టిక్ బాక్సులలో ప్యాక్ చేసిన ఆహారం మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసే సమయానికి ఆహారంలో చాలా తేడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రసాయనాలు కరిగి విషపూరితం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులతో ప్రమాదమని తెలిసినా మార్కెట్లో దొరికే పలు రకాల డిజైన్లు చూసి విద్యార్థులు అటు తల్లిదండ్రులు మోజుపడి కొనుగొలు చేసి వాడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేస్తే రోగాలను కొనుగోలు చేసినట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరిగించిన వాటర్‌ను, అత్యంత శీతలమైన పదార్థాలను ప్లాస్టిక్ పాత్రలలో నింపితే సుమారు 90శాతం కెమికల్స్ అందులో కరిగి ఆ పదార్థాలను విషపూరితం చేస్తాయి.దీంతో రోగాలు శరీరాన్ని కబళిస్తాయి. అలాగే ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలు భూమిలో కరగాలంటే కనీసం 450 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి వినియోగం ఆరోగ్యానికే కాక పర్యావరణానికి ప్రమాదకరం. పాఠశాలలు, కళాశాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సామాజిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉందని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్‌తో ప్రాణాంతక వ్యాధులు ప్లాస్టిక్‌లో బిస్ఫినాల్–ఏ (బీపీఏ), మైక్రో ప్లాస్టిక్స్ అనే రసాయనం అధికంగా ఉండటంతో కొద్ది మోతాదులోనైనా శరీరంలో చేరే ప్రమాదం ఉంది. దీంతో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. శరీరంలోని గ్రంథులపై ప్రభావం చూపి వాటి పనితీరును మందగిస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. అతిశీతలం, అధిక వేడి పదార్థాల కోసం వీటిని వినియోగిస్తే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ మహమ్మారి కాటేసే ప్రమాదం ఉంది.ప్లాస్టిక్‌ను ఇలానే వినియోగిస్తే 2030 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మంది క్యాన్సర్ బారీన పడే ప్రమాదం ఉందని నిపుణులు, మేధావుల గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 25 ఏళ్ల లోపు పిల్లలు, యువతలోనూ ప్లాస్టిక్ వినియోగంచడంతో కలిగే అనర్థాలు ప్రాణాంతక వ్యాధులకు గురి చేస్తున్నాయి. గత 10 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వినియోగం అధికమవడమే ఇందుకు ప్రధాన కారణంగా వైద్యులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి పిల్లలకు టిఫిన్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రమాదమే. వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాలలో ఉంచడం ద్వారా రుచి, వాసన కోల్పోడంతో పాటు కొన్ని రకాల విష పదార్థాలు ఏర్పడతాయి. ఇవి చిన్నారుల అవయవాలపై ప్రభావం చూపుతాయి. నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉండే వాటర్ బాటిళ్లు, లంచ్ బ్లాక్స్లు వాడటంతో అందులోని కెమికల్స్ పొరలుగా ఆహారంలో కలిసి ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. – డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్న పిల్లల వైద్యనిపుణులు, తిరుపతి పేరెంట్స్ మీటింగ్‌ల్లో అవగాహన కల్పించాలి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో పేరెంట్స్ మీటింగ్‌లంటూ హడావుడి చేస్తుంటారు. కానీ అందులో విద్యార్థులకు అవసరమైన విషయాలను తల్లిదండ్రులతో చర్చించడం లేదు. తల్లిదండ్రులకు గేమ్స్ ఏర్పాటు చేసి, టీలు, కాఫీలు ఇచ్చి సంతోషపెట్టి పంపుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై యాజమాన్యాలు శ్రద్ధ చూపకపోవడం ఆశ్చర్యమేస్తోంది. పిల్లల ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని, నివారణా చర్యలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలేదు. విద్య, వైద్య శాఖాధికారులు దీనిపై దృష్టి పెట్టాలి. – రాజశేఖర్‌రెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు, తిరుపతి స్టీలు, రాగి వస్తువుల వినియోగం శ్రేయస్కరం ఆధునిక యువత, చిన్నారుల ఆరోగ్యం పెను ప్రమాదంలో పడింది. నిద్రలేచిన మొదలు పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో చేసిన వాటినే వినియోగిస్తున్నారు. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులతో పాటు దీర్ఘకాలిక సమస్యల చిన్న వయస్సు నుంచే వెంటాడుతున్నాయి. ప్లాస్టిక్ బాక్సులలో ఆహారం భద్రపరిచి కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఆరగించడంతో అదికాస్త విషంగా మారుతోంది. పలు పరిశోధనలలో ఈ విషయం బయటపడినా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం దారుణం. – ప్రశాంతి, ప్లాస్టిక్ వినియోగం–అనర్థాలపై పరిశోధన చేస్తున్న విద్యారి్థని, తిరుపతిక్యాన్సర్ విజృంభించే ప్రమాదం సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు ప్లాస్టిక్ భూతం చుట్టుముట్టింది. తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పూరీ్వకులు పాటించిన నియమాలు, అలవాట్లలో ఎంతో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని నేటి తరం అనుసరించాలి. ప్లాస్టిక్ బాటిళ్లు, లంచ్ బాక్సుల వినియోగంతో కాన్సర్ మహమ్మారి దగ్గరవుతోంది. దీన్ని నుంచి బయట పడాలంటే ప్లాస్టిక్ వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పరంగా పలు రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య వంతులను చేయడం జరిగింది. – కే. భానుప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి, తిరుపతి -
పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!
న్యూయార్క్: న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ ఏం చేసినా ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు తాపీగా కూర్చుని పప్పన్నం తిన్నా సరే అమెరికా రాజకీయనేతలు తీవ్రంగా తప్పుబట్టడం ఇప్పుడు కొత్త వార్తాంశంగా నిలిచింది. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మమ్దానీ భోజనం చేస్తూ కనిపించారు. ఒక చిన్న ప్లేట్లో అన్నం, పప్పు చేత్తో కలుపుకుని కడుపారా తిన్నారు. ‘‘ ప్రపంచాన్ని చూసే దృక్కోణాన్ని నేను అభివృద్ధి చెందుతున్న(థర్డ్ వరల్డ్) దేశాల నుంచే నేర్చుకున్నా’’ అని అన్నారు. అయితే ఈ వీడియోను ‘ఎడ్ ఓక్నెస్’ అనే ‘ఎక్స్’ ఖాతాలో ఒకతను పోస్ట్‌చేసి మమ్దానీ తీరును తప్పుబట్టారు. ‘‘ అన్నాన్ని చేత్తో తింటూ ఆయన తనకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అని చెబుతున్నారు’’ అని ఆ నెటిజన్ వ్యాఖ్యానించారు. దీనికిఅమెరికా దిగువసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ యువనేత బ్రాండన్ జీనీ గిల్ సైతం మద్దతు పలికి మమ్దానీని తప్పుబట్టారు. Civilized people in America don’t eat like this.If you refuse to adopt Western customs, go back to the Third World. https://t.co/TYQkcr0nFE— Congressman Brandon Gill (@RepBrandonGill) June 30, 2025‘‘ అమెరికాలో ఉంటూ అనాగరికంగా తింటున్నారు. మీకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అయితే ఆ థర్డ్ వరల్డ్‌లోనే బతకండి. అక్కడికి వెళ్లిపొండి’’ అని ఒక క్యాప్షన్ పెట్టారు. ‘‘ రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే ఆయన ఇలా చేత్తో తింటున్నారు. సాధారణంగా ఆయన చేత్తో కాకుండా చెంచాలు, ఫోర్క్‌లతో తింటారు’’ అని కొందరు నెటిజన్లు విమర్శించారు. మ్యాన్‌హాట్టన్ జిల్లా అటార్నీ రేసులో ఉన్న రిపబ్లికన్ నాయకురాలు మాడ్ మరూన్ సైతం విమర్శించారు. అయితే మరికొందరు మాత్రం మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ఆయన చక్కగా చేత్తో కలుపుకుని తిన్నారు. తినడం అనేది ఆయా వ్యక్తుల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లకు సంబంధించిన అంశం. ఇది పూర్తిగా జాత్యహంకారమే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే సత్తాలేక ఆయన వ్యక్తిగత అలవాట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చేత్తో తినని వాళ్లకే అమెరికా చెందుతుందని రాజ్యాంగంలో రాశారా?. చేత్తో తింటే అనాగరికం ఎలా అవుతుంది?’’ అని మరికొందరు మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ టాకూస్, ఫ్రెంచ్ ప్రై, బర్గర్, పిజ్జా, లేస్ ప్యాకెట్ ఎలా తింటారు?. చేత్తోనేకదా తినేది. మరి అలాంటప్పుడు పప్పన్నం హాయిగా చేత్తో కలిపి తింటే తప్పేంటట?’’ అని మరికొందరు వాదించారు. ‘‘ అమెరికాలో అన్నం చేత్తో తినడం కూడా తప్పేనా?. అమెరికా ఎటు పోతోంది?’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. -
Viral Video: అగ్నిప్రమాదమా? అయితే మాకేంటి ముందు పొట్టనిండాలి!
రుచికరమైన భోజనం చేస్తున్న సమయంలో పక్కన ఏం జరిగినా పట్టించుకోరు కొంతమంది. అయితే అటువంటి ఓ ఘటన మహారాష్ట్రలోని భీవండిలో చోటు చేసుకుంది. భీవండిలోని అన్సారీ ఫంక్షన్హాల్లో ఆదివారం ఓ వివాహం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వివాహనికి వచ్చిన అతిథులు, బంధువులు భోజనాలు చేస్తున్నారు. అదే సమయంలో ఫంక్షన్ హాల్లో ఓ చోట భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చదవండి ఒకే వేదికపై ఇద్దరు ఎంపీలు.. హుషారైన స్టెప్పులతో రచ్చ.. అయితే వాటిని గమనించని కొంతమంది అతిథులు మాత్రం.. భోజనం టెబుల్ మీద కూర్చొని తింటూ కనిపిస్తారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘వెనుక అగ్ని ప్రమాదం బాబాయ్‌లు.. భోజనం ఆపి పరుగెత్తండి!’.. ‘భోజనం ముందుంటే.. అగ్ని ప్రమాదం కనిపించదా?’ ‘అగ్నిప్రమాదమా? అయితే మాకేంటి ముందు పొట్టనిండాలి!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
‘తిట్టే నోరే కాదు, అతిగా తినే నోరు కూడా ప్రమాదకరమే’
తిట్టే నోరే కాదు, అతిగా తినే నోరు కూడా ప్రమాదకరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కేవలం ఉపవాసం మంచిదనే ఉద్దేశంతో క్రమపద్ధతి లేకుండా చేసే ఉపవాసాలు ఆరోగ్యం కన్నా చేటు ఎక్కువ కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యుక్త వయసుకు వచ్చే కొద్దీ ఉపవాసాలు, తినే తిండి తదితర అంశాలపై సరైన అవగాహన లేక చాలామంది అసంబద్ధ ఆహార అలవాట్లు చేసుకుంటారు. దీంతో వారిలో మానసిక ఒత్తిడి, తమపై తమకు నమ్మకం లేకపొవడం, బలవంతంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, హార్మోన్ల అసమతుల్యత, జన్యువులలో అసంబద్ధ ఉత్పరివర్తనాలు, సమాజంలో కలవలేకపోవడం వంటి దుష్ప్రభావాలు వస్తుంటాయి. అసంబద్ధ ఆహార అలవాట్లు క్రమంగా ఈటింగ్ డిజార్డర్లకు దారితీస్తాయి. వీటివల్ల శారీరకంగా కడుపులో మంట, అజీర్తి, కడుపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సంబంధ సమస్యలతో సతమతమవ్వడం, శరీరానికి తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల చర్మం పొడిబారడం, చేతులు, పాదాల గోళ్లు పెళుసుబారడం, జుట్టురాలిపోవడం వంటివి కనిపిస్తాయి. చదవండి: ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’.. వధువు వరస మారుతోంది! స్త్రీలలో ఈటింగ్ డిజార్డర్ ఉంటే నెలనెల వచ్చే పిరియడ్స్ సక్రమంగా రావు. అనోరెక్సియా నెర్వోసా అనే డిజార్డర్ కారణంగా ఈ వ్యాధి ఉన్న వారు తగినంతగా ఆహారం తినరు. క్యాలరీలను దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని పూర్తిగా తగ్గిస్తారు. ఫలితంగా వారు బరువు తగ్గిపోతారు. దీంతో వారు చూడడానికి బక్కపలచగా కనిపిస్తారు. బులిమియా నెర్వోసా కారణంగా ఇది ప్రాణానికి హాని కలిగించే రుగ్మత అని చెప్పవచ్చు. చదవండి: పిల్లలకు ఇవి తినిపించండి... ఆస్తమాకు దూరంగా ఉంచండి ఈ పరిస్థితి ఉన్న వారు అతిగా తింటారు. తిన్నదానిని అరిగించుకోకుండా వాంతిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల కడుపులో మంట, చేతుల వెనక క్యాలస్ ఏర్పడుతుంది. బింగే ఈటింగ్ డిజార్డర్ వల్ల అతిగా తిని ఇబ్బంది పడుతుంటారు. అంతేగాక తాము ఆహారపు అలవాట్ల గురించి సిగ్గుపడుతుంటారు. ఈ లక్షణాల్లో ఏ కొన్ని ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. మెడిటేషన్, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్ల ద్వారా ఈ సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. -
ప్రాణాలు తీసిన పుచ్చకాయ!
రామగుండం: ఎలుకలు కొరికిన పుచ్చకాయ తినడం ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విసంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. విసంపేట గ్రామానికి చెందిన దారబోయిన కొమురయ్య, సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.. వృద్ధాప్యం కారణంగా పెద్ద కొడుకు శ్రీశైలం, కోడలు గుణవతి వద్ద ఉంటున్నారు. శ్రీశైలం దంపతులకు ఇద్దరు కుమారులు శివానంద్ (12), శరణ్ (10) ఉన్నారు. గత సోమవారం గ్రామానికి వచ్చిన వ్యక్తి వద్ద పుచ్చకాయలు కొనుగోలు చేశారు. సాయంత్రం కుటుంబ సభ్యులంతా సగం పుచ్చకాయ తిన్నారు. మిగతా సగం ఇంట్లోని సెల్ఫ్‌లో ఉంచారు. అదేరోజు రాత్రి కొమురయ్య ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని తవుడులో విషం కలిపి పెట్టాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు మిగతా సగం పుచ్చకాయ తినగా, కొమురయ్య మాత్రం తినలేదు. ఆ రోజు ఇంట్లో ఎల్లమ్మ పూజలు చేసుకోవడంతో మాంసాహారం తిన్నారు. కాగా, సాయంత్రం నుంచి పుచ్చకాయ తిన్న వారికి మాత్రమే వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. తొలుత మాంసాహారంతోనే అస్వస్థతకు గురైనట్లు భావించి స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నారు. ఎల్లమ్మ పూజల నేపథ్యంలో శ్రీశైలం కుటుంబంతోపాటు అతని సోదరులు కనకరాజు, ప్రభాకర్ కుటుంబాలు సైతం భోజనం చేశాయి. వారికి ఎలాంటి అస్వస్థత లేకపోగా, శ్రీశైలం తండ్రి కొమురయ్య సైతం ఆరోగ్యంగా ఉండడంతో, పుచ్చకాయతోనే అనారోగ్యం బారిన పగినట్లు గుర్తించారు. విషం తిన్న ఎలుకలు పుచ్చకాయను కొరకవడంతో అది విషపూరితమైనట్లు భావిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారి పరిస్థితి క్షీణిస్తుండడంతో గురువారం ఉదయం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో శివానంద్, శరణ్‌లను చేర్పించారు. శ్రీశైలం, గుణవతి మరో ఆస్పత్రిలో చేరారు. చిన్నారుల పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి శివానంద్, శుక్రవారం వేకువజామున శరణ్ మృతిచెందారు. శ్రీశైలం, గుణవతిలకు శ్వాస సంబంధ సమస్య తీవ్రం కావడంతో బంధువులు వారిని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. శ్రీశైలం తల్లి సారమ్మ సైతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని తెలిసింది. -
అతిగా తింటే ఈ రోగాలు తప్పవు!
టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా ఈటింగ్ డిజార్డర్స్ కనిపిస్తాయి. కొందరు పిల్లలు అతిగా తినడం, కొందరేమో అసలేమీ తినకుండా ఎండుకుపోతుంటారు. టీనేజ్‌లో అడుగుపెట్టే సరికి అందం, శరీర ఆకృతిపై శ్రద్ధ పెరగడం సహజమే! కానీ ఇందుకోసం అతిగా తినడం లేదా పూర్తిగా మానుకోవడం పలు రకాల శారీరక ఇక్కట్లను తీసుకువస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్ ఉందని గుర్తించడానికి కొన్ని లక్షణాలుంటాయి. ఉన్నట్టుండి బరువు పెరగడంలేదా తగ్గడం, తమ శరీర ఆకృతి, బరువుపై ఎక్కువగా దృష్టిపెట్టడం, ఎక్కువ సార్లు అద్దంలో చూసుకోవడం, కొద్దిగా ఆహారం తీసుకోవడం లేదా పూర్తిగా తినడం మానేయడం, ఒంటరిగా కూర్చోని తినడానికి ఇష్టపడడం, ఆహారం తీసుకునేటప్పుడు సాధారణం కంటే అతిగా నమలడం, అతిగా వ్యాయామం చేయడం, భోజనం తరువాత విరేచనం సాఫీగా అయ్యే మాత్రలు తీసుకోవడం, బరువు పెరగకుండా ఉండేందుకు తిన్న తర్వాత వాంతి చేసుకోవడానికి ప్రయత్నించడం, వారికి వారే అతిగా డైటింగ్ చేయడం. ఇందులో భాగంగా పంచదార, కార్బొహైడ్రేట్స్, డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండడం, ఎక్కువగా మూడ్ స్వింగ్స్ కలిగి ఉండడం, శరీరంలో శక్తిలేక త్వరగా అలిసిపోవడం, ఎప్పుడూ డిమ్‌గా లేదా డల్‌గా ఉండడంవంటివి కనిపిస్తే ఈటింగ్ డిజార్డర్‌గా అనుమానించవచ్చు. ఈ లక్షణాల వల్ల క్రమంగా కడుపులో మంట, అజీర్తి, కడపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సంబంధ సమస్యలతో సతమవ్వడం, శరీరానికి తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల చర్మం పొడిబారడం, చేతులు,పాదాల గోళ్లు పెళుసుబారడం, జుట్టురాలిపోవడం వంటివి కనిపిస్తాయి. బలవంతంగా వాంతులను ప్రేరేపించడం ద్వారా వేళ్ల జాయింట్ కీళ్లపై క్యాలస్ ఏర్పడుతుంది. తరచూ వాంతులు చేసుకోవడం వల్ల దంతాల రంగు మారిపోతుంది, స్త్రీలలో ఈటింగ్ డిజార్డర్ ఉంటే నెలనెల వచ్చే పిరియడ్స్ కూడా సక్రమంగా రావు. ఈ అసహజతలకు కారణాలు.. ► మానసిక ఒత్తిడి, తమపై తమకు నమ్మకం లేకపోవడం ► బలవంతంగా ఆహరపు అలవాట్లు మార్చుకోవడం ► హార్మోన్ల అసమతుల్యత ► వంశపారంపర్యత, జన్యువులలో అసంబద్ద ఉత్పరివర్తనాలు, ► గతంలో ఎదురైన దుర్ఘటనలు ► సమాజంలో కలవలేక పోవడం ► ఉద్యోగరిత్యా ఎదురయ్యే ఒత్తిడి వలన ఈటింగ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లక్షణాల్లో ఏ కొన్ని ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. భౌతికంగా లక్షణాలు కనిపించకపోతే రక్తపరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. మెడిటేషన్, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు ద్వారా ఈ సమస్యను కొంతవరకు నిరోధించవచ్చు. సాధారణంగా కనిపించే ఈటింగ్ డిజార్డర్స్ మూడు రకాలు. అవి.. అనోరెక్సియా నెర్వోసా.. ఈ వ్యాధి ఉన్న వారు తగినంతగా ఆహారం తినరు. కేలరీలను దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని పూర్తిగా తగ్గిస్తారు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. దీంతో వారు చూడడానికి బక్కపలచగా కనిపిస్తారు. బులిమియా నెర్వోసా.. ఇది ప్రాణానికి హానీ కలిగించే రుగ్మత అనిచెప్పవచ్చు. ఈ పరిస్థితి ఉన్న వారు అతిగా తింటారు. తిన్నదానిని అరిగించుకోకుండా వాంతిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల కడుపులో మంట, చేతుల వెనక క్యాలస్ ఏర్పడుతుంది. బింగే ఈటింగ్ డిజార్డర్.. ఈ రుగ్మత కలిగిన వారు అతిగా తిని ఇబ్బంది పడుతుంటారు. అంతేగాక తమ ఆహారపు అలవాట్లు గురించి సిగ్గుపడుతుంటారు. -
కలుషిత ఆహారంతో 60 మంది విద్యార్థినులకు అస్వస్థత
నిడమనూరు: కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నల్లగొండ జిల్లా నిడమనూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో 237 మంది విద్యార్థినులు చదువుతుండగా.. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో 140 మంది విద్యార్థినులు ప్రస్తుతం పాఠశాలలో ఉన్నారు. శనివారం విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో బీరకాయ కూరను వడ్డించారు. అయితే భోజనం చేసిన తర్వాత సుమారు 60 మంది విద్యార్థినులు ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం తినడం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస సమరద్ తెలిపారు. కొందరు పిల్లలు గ్యాస్ ప్రాబ్లమ్‌తో అస్వస్థతకు గురయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ చెప్పారు. -
తినే తిండి మూడ్‌ను నిర్ణయిస్తుంది
‘‘వీడేంట్రా.. మిరపకాయలు తిన్నట్టు ధుమధుమ లాడుతున్నాడు’’ ఈ డైలాగ్ ఎప్పుడో ఒకప్పుడు మీరూ వినే ఉంటారు. ఏదో సామెత కొద్దీ చెప్పుంటారులే అనుకుని ఉంటారు కూడా. అయితే ఇందులో ఎంతోకొంత నిజం లేకపోలేదు... అంటోంది బింగ్హాంటన్ విశ్వవిద్యాలయం. అంతేకాదు మనం తినే తిండి ప్రభావం యువకులపై ఒకలా ఉంటే, వయసు మీదపడ్డ వారిపై ఇంకోలా ఉంటుందని వీరు ఒక సర్వే ద్వారా నిర్ధారించారు. న్యూరో కెమిస్ట్రీ, బయాలజీల ఆధారంగా రూపుదిద్దుకున్న ప్రశ్నలతో కూడిన ఈ సర్వేలో యువకులు తినే తిండి కారణంగా వారి మెదళ్లలో చేరే రసాయనాలు వారి మూడ్‌ను ప్రభావితం చేస్తున్నట్లు తెలిసింది. తరచూ మాంసం తింటూ ఉంటే.. వారి మెదళ్లలో సెరటోనినన్, డోపమైన్ వంటి రసాయనాల ఉత్పత్తి ఎక్కువవుతుందని, వ్యాయామం ద్వారా కూడా ఇలాంటి ఫలితాలే ఉంటాయని ఈ సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారంలో మూడు కంటే తక్కువసార్లు మాంసం తినేవాళ్లు.. వ్యాయామం పెద్దగా చేయని యువకుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని బెగ్డాచే అనే శాస్త్రవేత్త చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం.. మితాహారం వంటి కారణాల వల్ల వయసు మళ్లిన వాళ్లలో ఒత్తిడికి సంబంధించిన సమస్యలు కొంతవరకూ తగ్గుతాయని అన్నారు. -
అన్నమే అతని ప్రాణాన్ని తీసింది!
మదంపల్లి (నల్లగొండ): బంధువుల ఇంట్లో విందు ఉందని పిలిస్తే వెళ్లాడు. విందు భోజనమని తొందరతొందరగా తిన్నాడో.. లేక ముద్ద గొంతు దిగలేదో కానీ.. తినే అన్నమే ఆయన ప్రాణాన్ని తీసింది. అన్నం గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస ఆడలేదు. విందుకొచ్చిన బంధువులందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా మదంపల్లి మండలం గొలబండకంద గ్రామంలో చోటుచేసుకుంది. గొర్రెల కాపరి అయిన బాలోతు చినపీట్ల నాయక్ బంధువుల ఇంట్లో అన్నం తింటూ ప్రాణం వదిలాడు. అన్నం గొంతులో ఇరుక్కుపోవడంతో తుదిశ్వాస విడిచాడు. చినపీట్ల నాయక్‌కు భార్య, కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.