breaking news
during
-
ప్రయాణికుల నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ వాహనాలు బీసీ బంద్‌ను భారీగా సొమ్ము చేసుకున్నాయి. దీపావళి వేడుకలు, వరుస సెలువుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన నగరవాసుల పైన దారిదోపిడీకి పాల్పడ్డాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలపైన రెట్టింపు వసూలు చేశాయి. బంద్ సందర్భంగా సిటీబస్సులతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు సైతం నిలిచిపోయాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. మహాత్మాగాం«దీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అప్పటికే బస్స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికులు ఏదో ఒకవిధంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో క్యాబ్‌లు, టాటాఏస్‌లు, మ్యాక్సీక్యాబ్‌లు, తదితర వాహనదారులు అడ్డగోలుగా దోచుకున్నాయి. గత్యంతరం లేకపోవడంతో ఎక్కువ చార్జీలను చెల్లించి వెళ్లాల్సి వచి్చంది. బీసీ బంద్ దృష్ట్యా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే సుమారు 3500 బస్సులు స్తంభించాయి. మరోవైపు నగరంలోని 25 డిపోల్లో మరో 2850 కి పైగా సిటీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. వీకెండ్ కావడంతో వివిధ అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వచ్చిన జనాన్ని ఆటోవాలాలు దోచుకున్నారు.సెవెన్ సీటర్ ఆటోలు, శేర్ ఆటోల్లో సైతం రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఇష్టారాజ్యంగా వసూళ్లు... ఓలా, ఉబెర్, ర్యాపిడీ వంటి సంస్థలతో అనుసంధానమయ్యే క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను బంద్ దృష్ట్యా జిల్లాలకు మళ్లించారు. మరోవైపు పలు ఐటీ సంస్థలకు వాహనాలను నడిపే ట్రావెల్ ఏజెంట్లు సైతం దీపావళి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు రోడ్డెక్కాయి. ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఆరాంఘర్, బీఎన్‌రెడ్డినగర్, తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించాయి. ప్రయాణికుల రద్దీకనుగుణంగా వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ క్యాబ్‌లు బారులు తీరాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి హన్మకొండ వరకు ఆర్టీసీ లగ్జరీ బస్సుల్లో రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ రూట్లో రాకపోకలు సాగించే క్యాబ్‌లు సైతం ఈ చార్జీలను వసూలు చేస్తాయి. కానీ బంద్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని క్యాబ్‌వాలాలు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేయడం గమనార్హం. ఎల్బీనగర్ నుంచి విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట్, నల్లగొండ, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ఇదేవిధంగా క్యాబ్‌వాలాల దారిదోపిడీకి గురయ్యారు. మెట్రోలు ఫుల్... బీసీబంద్ దృష్ట్యా మెట్రో రైళ్లు కిక్కిరిశాయి. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–ఎంజీబీఎస్ రూట్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు మెట్రోలను ఆశ్రయించారు. మరోవైపు ఆటోరిక్షాలకు సైతం డిమాండ్ పెరిగింది. ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటోల్లోనూ చార్జీలు అమాంతంగా పెరిగాయి.బంద్ కారణంగా ఆసుపత్రులకు వెళ్లే వారు, అత్యవసర పనులపైన బయటకు వెళ్లిన వాళ్లు పెద్ద మొత్తంలోసమరి్పంచుకోవాల్సి వచి్చంది. బంద్‌లో పలువురు నేతలుబీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు మద్దతుగా అన్ని పారీ్టలు, ప్రజాసంఘాలు, బీసీ సంఘాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రజారవాణా స్తంభించినప్పటికీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. సీపీఎం, సీపీఐ, సీసీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, తదితర వామపక్ష పారీ్టలు, ప్రజా సంఘాలు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం, తదితరులు నారాయణగూడ వైఎంసీఏ నుంచి కాచిగూడ చౌరస్తా, కోఠీ , సుల్తాన్ బజార్, రామకోఠీ, బొగ్గులకుంట మీదుగా అబిడ్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క, సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ , సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సీపీఐఎల్ ఎల్ మాస్ లైన్ హన్మే‹Ù, గదేగోని రవి, తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి అంత్యక్రియల్లో శునకం
కోరుట్లరూరల్: ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా.. ఎక్కడి నుంచో వచ్చిన శునకం అతడి శవయాత్రలో నడిచి వచ్చి చితిపక్కన పడుకొని ఏడ్చింది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత బంధువులతో కలిసి ఇంటికి చేరుకుని అక్కడ కూడా ఏడ్వడం ఆ గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని యెఖీన్పూర్కు చెందిన గాంధారి కిశోర్ (42) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. అప్పటివరకూ గ్రామంలో కనిపించని ఓ శునకం అకస్మాత్తుగా కిశోర్ శవయాత్రలో దారిపొడువునా నడిచింది. అతడి చితిపక్కన పడుకొని కొద్దిసేపు ఏడ్చింది. అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటి వరకు వెళ్లి కిశోర్ మృతదేహాన్ని ఉంచిన స్థలం వద్ద పడుకొని ఏడ్వటం ఆశ్చర్యానికి గురి చేసింది. కిశోర్ 14ఏళ్ల వయసులో అతడి తండ్రి మృతి చెందాడు. ఇప్పుడు కిశోర్ కుమారుడికి కూడా 14 ఏళ్లే. కిశోర్ తండ్రి హన్మాండ్లు ఆత్మ శునకం రూపంలో వచ్చి ఉంటుందని గ్రామస్తులు చర్చించుకున్నారు. -
Celebrities In Face Masks: కరోనా టైమ్‌లో మాస్క్‌లు ధరించిన నటీనటుల ఫోటోలు మళ్లీ వైరల్ (ఫొటోలు)
-
పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ వైద్యకళాశాలల అధ్యాపకులు పనివేళల్లో ప్రైవేట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు ఇచ్చింది. టీచింగ్ ఫ్యాకల్టీలు వారి పనివేళల్లో అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాక్టీస్ చేయొద్దని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పనివేళల్లో ఎవరైనా వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించినట్లయితే, అది వైద్య నైతిక నియమావళిని ఉల్లంఘించినట్లుగా భావించి, వారి రిజిస్ట్రేషన్ నంబర్లను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
గాలిలో స్పృహ కోల్పోయి, గుడ్లు తేలేసి, తల వాల్చేసి.. నవ్విస్తున్న పారాగ్లైడర్
సోషల్ మీడియాలో తాజాగా పారాగ్లైడింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒక విదేశీయునికి సంబంధించినది. అతను పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. అతను గాలిలో స్పృహతప్పి పోయాడు. స్పృహలోకి రాగానే ఏం చేసాడో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. ఈ 15 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కనిపిస్తాడు. అతని పరిస్థితి చూస్తే అతను పారాగ్లైడింగ్‌ని పూర్తిగా ఆస్వాదించడం లేదని మనకు అర్థం అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో అతని నోరు తెరిచి ఉంది. మెడ కూడా వేలాడుతోంది. వెనుకనున్న పారాగ్లైడింగ్ శిక్షకుడు అతని పరిస్థితి చూసి నవ్వుతున్నాడు. భయం లేదా అమిత ఉత్సాహం కారణంగా వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అతనిని చూసిన గైడ్ అతన్ని నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి స్పృహ వచ్చిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలెడతాడు. ఈ వీడియోను సెప్టెంబర్ 13న @Enezator అనే వినియోగదారు Xలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘అతను ఉత్సాహం ఎక్కువై మూర్ఛపోయినట్లు నాకు అనిపించడం లేదని’ రాశారు. మరొకరు ‘భయంతో స్పృహతప్పిపోయాడు’ అని రాశారు. ఈ వీడియోను చూసిన కొంతమంది ‘తాము నవ్వు ఆపుకోలేకపోతున్నామని’ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05 — Enezator (@Enezator) September 13, 2023 -
జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన మంత్రి
భోపాల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అపశృతి చోటుచేసుకుంది. జెండా వందనం చేసే క్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి డా. ప్రభురామ్ చౌధరి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయారు. అటు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా వేడుకల సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో కుప్పకూలారు. एमपी विधानसभा के अध्यक्ष गिरीश गौतम को मऊगंज में स्पीच देते हुए आया चक्कर, सुरक्षाकर्मियों ने संभाला @NavbharatTimes #NBTMP #MPNews pic.twitter.com/4VGlyux9Nc — NBTMadhyapradesh (@NBTMP) August 15, 2023 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'హర్ గర్ తిరంగ అభియాన్' కార్యక్రమంలో భాగంగా సోమవారం తివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు, పోలీసులు, అధికారులతో సహా ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభురామ్ చౌధరి స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. నేడు రాష్ట్ర ప్రజలందరికి మంత్రి ప్రభురామ్ చౌధరి శుభాకాంక్షలు తెలిపారు. తివర్ణ జెండాను ఎగురవేసి, చురుకుగా వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కిందపడిపోయారు. దీంతో మంత్రిని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలోనే ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు.. స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. रायसेन में परेड सलामी के दौरान चक्कर खा कर गिरे MP के स्वास्थ्य मंत्री Dr. Prabhuram Choudhary। #PrabhuramChoudhary #IndependenceDay2023 #IndependenceDay #raisen #Madhyapradesh #flaghosting @DrPRChoudhary pic.twitter.com/jsLsVYACfk — New India Live (खबर सातों पहर) (@Newindialive24) August 15, 2023 ఇదీ చదవండి: వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే.. -
అందమైన భామలను తడిమి చూసి వదిలేసిన ఎలుగు.. తెలివితో తప్పించుకున్నారిలా!
ఎలుగుబంటి ఎంతో శాంతస్వభావం కలిగినదని చెబుతుంటారు. అయితే అది ఒక్కోసారి రెచ్చిపోయినప్పుడు దానిని ఆపడం ఎవరితరమూ కాదని కూడా అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా అడవిమార్గం గుండా వెళ్లినప్పుడు ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలో తెలుసా? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా? సోషల్ మీడియాతో తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో అందమైన భామలు తాము ఎలుగుబంటి నుంచి ఎలా తప్పంచుకున్నదీ ఒక వీడియోలో చూపించారు. ఎలుగు ముంగిట చిక్కి, ఆపదలో ఉన్నవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడేలా ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు యువతులు రోడ్డుపక్కన ఉండటాన్ని గమనించవచ్చు. ఇంతలోనే వారి దగ్గరకు ఒక నల్లని ఎలుగుబంటి రావడాన్ని చూడవచ్చు. అది వారి దగ్గరకు వచ్చి, వారిని పట్టుకుంటుంది. అయితే ఆ యువతులు ఏ మాత్రం కంగారు పడకుండా కదలకుండా నిలుచునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ఆ ఎలుగుబంటి ఆ అందమైన యువతుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదని భావించి, అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్లో @CCTV IDIOTS పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు క్యాప్షన్‌గా ‘ఎలుగుబంటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి.. శాంతంగా, స్థిరంగా నిలుచోండి’ అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 269.4కేకు పైగా వీక్షణలు దక్కాయి. 3వేలకు పైగా లైక్స్ దక్కాయి. ఒక యూజర్ తన కామెంట్లో ఒకవేళ ఆ ఎలుగుబంటికి ఆ యువతుల స్మెల్ నచ్చకపోయి ఉంటే ఏమయ్యేదోనని అనగా, మరొకరు ఆ ఎలుగుబంటి వారిని కావలించాలనుకుంటోంది అని రాశారు. ఇది కూడా చూడండి: పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో! How to survive a bear attack… stand still and stay silent pic.twitter.com/zyE17dTbSv — CCTV IDIOTS (@cctvidiots) August 13, 2023 -
రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు రువ్వుకుంటూ..
చంఢీగర్: హరియాణాలోని మేవాత్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్‌లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నాసిర్, జునైద్ హత్య కేసులో మోనూ మానేసర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే.. బివానీ జిల్లాలో బొలేరో వాహనంలో మోనూ మానేసర్ సంచరించాడనే ఈ అల్లర్లు మొదలైనట్లు తెలుస్తోంది. భజరంగ్ దళ్ కార్యకర్తలు శోభా యాత్రలో పాల్గొనాలని మోనూ మానేసర్ కోరినట్లు తెలుస్తోంది. అనంతరం సోమవారం ఉదయం యాత్ర ప్రారంభమైన వెంటనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ ఈ ఘటనపై స్పందించారు. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు యాత్ర కోసం అనుమతులు పొందినట్లు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఇతర వర్గాల ప్రజలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. మేవాత్ ప్రాంతంలో పోలీసులను మోహరించినట్లు స్పష్టం చేశారు. అల్లర్లను అదుపు చేయడానికి ఆగష్టు 2వరకు ఇంటర్నెట్ను నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం.. -
‘హజ్’లో సైతాన్ను రాళ్లతో ఎందుకు కొడతారు? దీని వెనుక చరిత్ర ఇదే..
హజ్ యాత్ర జూన్ 26న ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో భాగంగా ప్రపంచంలోని నలుమూలల నుంచి లక్షలాది ముస్లింలు సౌదీ అరబ్‌లోని మక్కా చేరుకుంటారు. ఈ యాత్రలో ఒక అంశం ఎంతో ప్రధానమైనది. అదే సైతాన్ను రాళ్లతో కొట్టడం. ఈ ప్రక్రయ వెనుకనున్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైతాన్ను రాళ్లతో కొట్టడం వెనుక.. ‘హజ్’లో సైతాన్ను రాళ్లతో కొట్టే ప్రక్రియ ‘హజ్’లోని మూడవ రోజు జరుగుతుంది. ఆ రోజునే బక్రీద్ జరుపుకుంటారు. బక్రీద్ నాడు హజ్ యాత్రికులు ముందుగా మీనా పట్టణం చేరుకుంటారు. అక్కడ వారు సైతాన్ను మూడు సార్లు రాళ్లతో కొడతారు. మీనా పట్టణంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో నిర్మితమైన వివిధ స్థంభాలను రాళ్లతో కొడతారు. దీనిలోని మొదటి స్థంభం జమ్రాహె ఉక్వా, రెండవది జమ్రాహె వుస్తా, మూడవ స్థంభం జమ్రాహె ఉలా. ఎందుకు ఇలా చేస్తారంటే.. ఇస్లాంలో పేర్కొన్న వివరాల ప్రకారం ‘హజ్’లో పాల్గొన్నవారు రాళ్లతో మూడు స్థంబాలను కొడతారు. ఒకానొకప్పుడు హజ్రత్ ఇబ్రహీం సైతాన్ను పారదోలేందుకు ఈ స్థంభాలను రాళ్లతో కొట్టారని చెబుతారు. ఆ సమయంలో హజ్రత్ ఇబ్రహీం తన కుమారునికి కుర్బానీ ఇచ్చేందుకు వెళుతుండగా సైతాన్ అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. హాజీ ఈ స్థంభాలను సైతాన్‌కు ప్రతీకలుగా భావించి రాళ్లతో కొట్టారట. మొదటి రోజు హాజీ కేవలం మొదటి స్థంభాన్ని మాత్రమే కొట్టారు. తదుపరి రెండు రోజుల్లో మిగిలిన రెండు స్థంభాలను కొట్టారని చెబుతారు. హజ్ యాత్ర నియమనిబంధనలివే.. హజ్ యాత్ర చేసే ముస్లింలు పలునిబంధనలు పాటిస్తారు. ఈ యాత్ర చేసేవారు తప్పనిసరిగా ముస్లింలు అయివుండాలి. ఈ యాత్రలో పాల్గొనేవారు ఎర్హమా ధరించాల్సి ఉంటుంది. ఈ యాత్రలో మహిళలు పాల్గొన్నట్టయితే వారు తల నుంచి పాదాలవరకూ కప్పివుండే దుస్తులు ధరించడం తప్పనిసరి. ఇది కూడా చదవండి: స్టార్‌షిప్ మరో ప్రయోగంపై ఎలన్ మస్క్ అప్డేట్ -
ఇదెక్కడి వర్క్ ఫ్రొం హోమ్ రా మామ...
-
డిస్కౌంట్ల పండగొచ్చింది..!
న్యూఢిల్లీ: పండుగల సమయాల్లో డిస్కౌంట్ సేల్స్ నిర్వహించడాన్ని చూశాం. కానీ, ఈ విడత పండుగలకు ముందే ఆఫర్ల విక్రయాలు మొదలయ్యాయి. కన్జ్యూమర్ గూడ్స్ అయిన టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, వస్త్రాలు, నిత్యావసర ఉత్పత్తులను సైతం తగ్గింపు ధరలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. బిస్కెట్లు, పప్పులపైనా ఈ తగ్గింపు ధరలు అమలవుతుండడం విశేషం. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరుగుదల ప్రభావంతో అధిక వ్యయాలను అధిగమించేందుకు, కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ వచ్చాయి. ఇది డిమాండ్‌పై ప్రభావం చూపించింది. ఈ విడత పండుగల నాటికి విక్రయాలు జోరందుకుంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, సోనీ టీవీల ధరలు గత కొన్ని వారాల్లో 5–8% వరకు తగ్గాయి. మధ్య శ్రేణి నుంచి అధిక ధరల ల్యాప్‌టాప్ ధరలను సైతం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు కంపెనీలు తగ్గించి విక్రయిస్తున్నాయి. ఇక స్మార్ట్ఫోన్లపై కంపెనీలు 4–5% డిస్కౌంట్ ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నూనెలు సైతం.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా దిగి వస్తుండడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. వంట నూనెల ధరలు 15–20 శాతం వరకు తగ్గాయి. పెద్ద బిస్కెట్ ప్యాక్‌ల ధరలపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు 15–20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. ‘‘తయారీ వ్యయాలు తగ్గినందున ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ఆగస్టు 15 నుంచి మా బిస్కెట్ ప్యాక్‌లపై 10–15 శాతం తగ్గింపు ఇస్తున్నాం’’అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. మరికొంత కాలం పాటు ముడి సరుకుల ధరల తీరును గమనించిన తర్వాత, అన్ని రకాల ఉత్పత్తులపై ధరల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, సెమీకండక్టర్లు, ఓపెన్ సెల్ ధరలు ఇటీవలి కాలంలో చెప్పుకోతగ్గ మేర తగ్గాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సైతం తయారీ వ్యయాలు 15 శాతం వరకు శాంతించాయి. ధరలు తగ్గించినప్పటికీ, ఇప్పటికీ ఉత్పత్తుల ధరలు కరోనా మహమ్మారి ముందు నాటితో పోలిస్తే అధికంగానే ఉండడం గమనించాలి. దీనికి కారణం కంపెనీలు గత రెండేళ్ల కాలంలో ధరలను గణనీయంగా పెంచాయి. -
రేప్ చేయబోతే...
లక్నో: తనపై అఘాయిత్యానికి తెగబడిన వ్యక్తిపై ఓ బాలిక సివంగిలా విరుచుకుపడింది. కత్తితో బెదిరించి అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తినుంచి ఆ కత్తినే లాక్కుని... అతని ప్రయివేట్ పార్ట్స్ పై దాడి చేసింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. 17 ఏళ్ల దళిత బాలిక పై రాయిస్ (23) అత్యాచారానికి ప్రయత్నించాడు. ఇంచోలి ఏరియాలో ఉన్న అడవిలోకి వెళ్లిన ఆ బాలికపై అదును చూసి దాడి చేశాడు. కత్తితో బెదిరించి మరీ ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. శక్తినంతా కూడ దీసుకుని అతని దగ్గర్నుంచి కత్తిని లాక్కుంది. అంతే....క్షణం ఆలోచించకుండా అతని మర్మాంగాలను కోసి పారేసింది. అనంతరం అక్కడినుంచి తప్పించుకుంది. అయితే అతని అరపులు విన్న గ్రామస్తులు.. సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలిక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బాలిక, నిందితుడు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో ఈ చర్యలు చేపట్టామన్నారు. -
పెద్దాపురంలో జోరుగా కోడిపందేలు


