పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయొద్దు 

Dont hold private practice between 9am 4pm doctors told - Sakshi

వైద్య కళాశాలల అధ్యాపకులకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ వైద్యకళాశాలల అధ్యాపకులు పనివేళల్లో ప్రైవేట్‌ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు ఇచ్చింది.

టీచింగ్‌ ఫ్యాకల్టీలు వారి పనివేళల్లో అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాక్టీస్‌ చేయొద్దని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పనివేళల్లో ఎవరైనా వైద్యులు ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు గుర్తించినట్లయితే, అది వైద్య నైతిక నియమావళిని ఉల్లంఘించినట్లుగా భావించి, వారి రిజిస్ట్రేషన్ నంబర్లను తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ మెడికల్‌ రిజిస్ట్రీ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top